Name:Srikanth Chari 
E-Mail:deleted  
Subject:కొత్త రాజధాని నిర్మాణానికి అసలు \\"30,000 ఎకరాల భూమి\\" ఎందుకు కావాలి? 
Message:
a) ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం చిహ్నమయిన \'భారతీయ పార్లమెంటరీ భవనం\' కేవలం 9.8 ఎకరాల మొత్తం ప్రాంగణంలో కేవలం 6 ఎకరాలలో నిర్మించబడింది.
b) అగ్రరాజ్యం అమెరికాలోని \'వైట్ హౌస్\' కుడా కేవలం 18 ఎకరాలలో నిర్మించబడింది.
c) హైదరాబాద్ లోని అసెంబ్లీ, సెక్రటేరియట్, MLA క్వాటర్ మరయు ఇతర అభికారుల భవానాలు అన్ని కలిపి కేవలం 250 ఎకరాలలో నిర్మించబడ్డాయి.
వీటినిబట్టి, కొత్త రాజధాని నిర్మాణానికి అసలు \"30,000 ఎకరాల భూమి\" ఎందుకుకావాలి..??
30,000 ఎకారాలంటే, సుమారు 121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత.
బెంగుళూరు లోని విధాన్ సౌధా, MLA క్వాటర్ మరయు రాజ్ భవన్ అన్ని కలిపి కేవలం 1.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణతలో నిర్మించబడ్డాయి.
మరి, కొత్త రాజదానికి 30,000 ఎకారాలు (121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత) భూములు అవసరమా.??
30,000 ఎకారాలు (121 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణత) అంటే, అది విజయవాడ-గుంటూరు రెండు నగరాలను కలపగా వచ్చే విస్తీర్ణత కంటే ఎక్కువ!
దేనికోసం అంత భూమి.??
దానికి తోడు, ఆ పొలాల్లో నాలుగు పంటలు పండుతాయి.
ఆ భూముల్లో 20 అడుగుల్లోనే నీరు ఉంటుంది.
ఐదేళ్లుగా వర్షం పడకపోయినా, ఆ భూముల్లో బంగారం లాంటి పంటలు పండుతున్నాయి.
ఇటువంటి అమూల్యమైన వ్యవసాయ భూములను, రైతులనుండి లాక్కొని, వారికి నష్టం కలిగించేలా, వారి జీవనోపాధి దూరంచీసి, వారి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపార-బిల్డర్లకు కట్టబెట్టడం, \'ధర్మమా\'..??

Original Author: Harsha Gajjarapu (https://www.facebook.com/harshagajjarapu

Post a Comment

 1. 30,000 ఎకరాలలో రాజధాని అనగానే, 30,000 ఎకరాలలో అసెంబ్లీ నిర్మాణం అని అనువాదం చేసిన మేధావులకి నా జోహార్లు. వారు తమ మేధా సంపత్తిని ఇండియాకు కాకుండా, పక్కనున్న పాకిస్తానుకీ, చైనాకి ఉపయోగించి తద్వారా మన దేశానికి ఎనలేని సేవ జేయాలని కోరుకుంటున్నాను.

  ఇక రాజధాని విషయానికి వస్తే .. రాజధాని అంటే, భవనాలు, నాలుగు రోడ్లు కాదని, ప్రజలు అక్కడే నివసించేందుకు కావలసిన అన్నిసౌకర్యాలూ ఉన్న ప్రాంతంగా, పెట్టుబడులకీ, అభివృద్దికీ కేంద్రంగా మారాలనీ (కనీసం ఒక బిందువుగా మారాలనీ) చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు. ఏవో నాలుగు బిల్డింగులూ కట్టుకొని, అందులో పనిచేసే ఉధ్యోగులు, రోజూ తమ ఊర్లనుండీ షటిల్ సర్వీసులు చేస్తూ ఉంటే చూడాలన్న కోరిక తెలంగాణా వారిగా మీకుండడం మేము అర్థం చేసుకోగలం. మా పక్కన ఉన్న కొంత మంది తెలివిలేని వారికి కూడా అటువంటి కోరిక ఉండొచ్చు. దానికి కారణం తమ ప్రియతమ మహా"మేత" అధికారములోకి రాకపోవడం అన్నది అందరికీ తెలిసిందే. ఇలా మేము నాషనమయితే చూడాలని కలలు కనే వారు, తమకు అధికారం దక్కలేదని ఏడ్చేవారు తప్ప, మిగిలిన వారు మంచి నగరం కావాలని కోరుకుంటున్నారు. దానికోసమే 30,000 ఎకరాలు. నిజానికి అది ఒక లక్ష ఎకరాలు అయ్యుంటే ఇంకా బావుండేది. కానీ అంత స్థలం దొరకడమంటే మాటలు కాదు కదా. కాబట్టీ దీనితోనే అడ్జస్ట్ అవుతున్నామన్న మాట.

  ReplyDelete
  Replies
  1. శుక్రాచార్య గారు,

   రాజాధాని లోని అసెంబ్లీ, రోడ్లు, సెక్రెటేరియట్, ఇతర భవనాలు, పార్కులు, జూలు, మ్యూజియం లు వగైరాలకు వెయ్యి ఎకరాల భూమి చాలు. ఆ భూమితో ప్రభుత్వం సర్వాంగ సుందరమైన రాజధానిని నిర్మించ వచ్చు.

   లక్ష ఎకరాలు కాకపొతే రెండు లక్షల ఎకరాల్లో కట్టుకోండి రాజధానిని. ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాని లక్ష ఎకరాల రాజధాని నిర్మించడానికి లక్ష ఎకరాలను సేకరించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఎన్ని లక్షల ఎకరాల రాజధాని అయినా ప్రభుత్వ భవనాలు, క్వార్టర్ల మొత్తానికి కలిపి 1000 ఎకరాల కంటే ఎక్కువ స్థలం అవసరం లేదు. రోడ్లు, పార్కులు, వగైరాలకు ఇంకో వెయ్యి ఎకరాలు సరిపోతుందేమో. అప్పుడు మిగతా భూమి ప్రజల వద్దనే వుంటుంది. ప్రజలే దాన్ని అభివృద్ది చేసుకుంటారు. ప్రజలే భవనాలు కట్టుకుంటారు. ప్రజల వద్ద భూములు కొనుక్కుని వ్యాపార భవనాలు కట్టుకుంటారు పెట్టుబడి దారులు. ప్రజలకు న్యాయమైన ధర లభిస్తుంది.

   30000 ఎకరాలు సేకరించినా దానిలో మొత్తం భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని నమ్మలేం. ప్రభుత్వం ఆ మాట చెప్పడం లేదు కూడా. రోడ్లు, డ్రైనేజీలు వేయడం మినహా మిగతా భూమిని తిరిగి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకే అమ్ముతుంది చివరికి. అటువంటప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రభుత్వం చేసేకన్నా ఎవరి భూమితో వారే వ్యాపారం చేసుకోనివ్వ వచ్చు కదా? అక్కడి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అందుకోసం ఉద్యమాలు కూడా మొదలవుతున్నాయి. ఇంత భూమిని ప్రజల వద్దనుండి బలవంతంగా లాక్కోవడం అవినీతి కోసం కాదా? గతంలో మీ మహామేత చేసిన పని అదే కదా? మీ ఇప్పటి నేత కూడా అదే పని చేయాలని ఎందుకు కోరుతున్నారు?

   అంతే కాక స్థల నిర్ణయంలోని అభ్యంతరాల మాటేమిటి?

   రాజధాని నిర్మాణానికి పంటభూములను పాడు చెయ్యాల్సిన అవసరం ఏమిటి? పంటలు పండని చోట నిర్మిస్తే అదీ అభివృద్ధి చెందుతుంది కదా?

   Delete
  2. అదేమిటండి, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా సాగు భూమి పాడవుతుంది అని, ఆ రోజు ప్రత్యెక రాష్ట్రం కావాలి అని అడిగినప్పుడు కొంతమంది చెప్పినది ఏమిటంటే మమ్మల్ని మేము పాలించుకుంటాం, మీరు రాజధాని నిర్మించలేదు పైగా హైదరాబాదు అన్ని వసతులు ఉన్న రాజధాని అని అన్నారు! మీరు కొత్త రాజధాని నిర్మించుకోండి అన్నారు!
   నేను ఆ రోజూ అన్నాను ఈ రోజు కూడా అంటున్నాను, పూర్వం రాజధాని నిర్మాణం రాళ్ళు రప్పల మధ్య నీటి లభ్యత ఉన్న ప్రదేశం లో జరిగింది తప్ప అది పుట్టగానే రాజధాని కాలేదు!
   పైగా రాజధానికి నీటి కొరత వస్తుంది అనే భయంతో రాజ్యం స్థాపించే ముందే అక్కడ చెరువులు తవ్వించారు, ఇప్పుడు అదే చెయ్యాలి అని అనుకున్నారు, కానీ కుదరట్లేదు, ఎందుకంటే మీకు మీ రాజ్యం నుంచీ మేము ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది, దాంతో ఎక్కడ నీటి లభ్యత ఉందొ ఆ ప్రదేశంలో రాజ్య నిర్మాణం తలపెట్టారు! మీరు ఇంకో ౨౦ సంవత్సరాలు తరువాత మీ రాజధాని లో కి వెళ్ళచ్చు అంటే రాయలసీమ రాజధాని అయ్యేది!
   మీరు ఇంకో ౨౦ సంవత్సరాలు మా రాజధాని నిర్మాణం అయ్యేవరకూ ఆగండి, అప్పుడు పంట పొలాలు నాశనం కానివ్వం!
   మాకు బాధగానే ఉంది పంట పొలాలు పోతున్నాయి అని, అది ౧౦౦ అవ్వొచ్చు ౧౦౦౦ అవ్వొచ్చు ౩౦౦౦ వేలు కావొచ్చు! మీరు మేము రాయలసీమ లో రాజధాని నిర్మాణం అయ్యే వరకూ వెళ్ళిపొండి అనొద్దు, అప్పుడు మేము కూడా మోకాలు అడ్డు పెడతాం!

   Delete
  3. రాజధానిలోని భూములతో ప్రభుత్వం ఏం చేయబోతోంది? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? లేక వాటిని పరిశ్రమలికి ఇవ్వబోతోందా? రెండింటిలో ఏది చేసినా ఆభూమి ఇచ్చిన రైతులకు వాటా ఎంత? రాజధాని అనేది ఇదివరకే అభివృద్ది చెందిన విజయవాడకు - గుంటూరుకు దగ్గరగా ఉండడం వలన లాభం ఏమి? ఎక్కడో దిక్కూ మొక్కూలేని చోట పెట్టడం వలన వచ్చే నష్టమేమి?

   రాజధాని అనేది మేధావులంత కలిసి తీసుకున్న నిర్ణయం. కొంత మంది భావించినట్టు అందులో కొంత స్వార్థం కూడా ఉండొచ్చు కాదనం. కానీ, ఎక్కడో ఒక చోట పెట్టాలి. అక్కడ కూడా భూసేకరణ జరపాలి. ప్రతీ చోటా ఇదే తంతే ఉంటుంది. ఆ భూములు పండేవి అయినా, కాకపోయినా. ఎందుకంతే డిమాండు ఉంటుంది కాబట్టి.

   ప్రజల అభ్యంతరాలంటారా? తెలంగాణా రావడం తెలంగాణా వారందరికీ ఇష్టమా? లేదే? మరి వారిని పట్టించుకున్న వారు ఎవ్వరు? కొంత వ్యతిరేకత సహజం. దాన్ని అధిగమిస్తాం అంతే.

   అయినా మరికొన్ని రోజులు పోతే మీకే తెలుస్తుంది కదా రాజధాని అక్కడుండడం అనేది ఎంత అడ్వాంటేజో. తొందరెందుకూ వెయిట్ అండ్ సీ..!!

   Delete
  4. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,

   మీ సమాధానంలో అనవసర ప్రసంగమే ఎక్కువగా వుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, వీలైంత తొందరగా, అంటే పదిసంవత్సరాలకన్నా ముందే రాజధానిని మార్చడానికి చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆ ప్రసంగం అనవసరం.

   రాజధానికి పంట పొలాలు కాకుండా త్రాగు నీటి లభ్యత ఉన్నది దొరకడం లేదా?
   రాజధాని నిర్మాణానికి 30000 ఎకరాలు సేకరించాలా?
   రైతులనుండి సేకరించి రియల్ ఎస్టేట్ల వ్యాపారులకు కట్టబెట్టడం ఏమేరకు సమంజసం?

   ఇవీ ప్రశ్నలు.

   PS: వీటి ఒరిజినల్ author (Harsha Gajjarapu) సీమాంధ్ర సోదరుడే, I just re-printed the question.

   Delete
  5. శుక్రా చార్య గారు,

   >>> తొందరెందుకూ వెయిట్ అండ్ సీ..!!

   30000 ఎకరాలు అంటే అది కనీసం 10000ల మంది రైతుల సమస్య. మామూలు సమస్య కూడా కాదు, అది వారి ఆస్తులను కొల్లగొట్టి పెత్తందార్లకు పంచిపెట్టె సమస్య. అంతేకాక అది వారి హక్కుల సమస్య.

   అటువంటప్పుడు అంట మొత్తంలో పంట భూమిని సేకరించడం సరైనపనా కాదా అన్న విషయం తేలాలి కదా? అది తేలకుండా వెయిట్ అండ్ సీ అంటే చేతులు కాలిన తర్వాత చేయగలిగినదేముంది?

   Delete
  6. అక్కడ భూములు వారినుండి దౌర్జన్యంగా తీసుకుని, వారికి నష్ట పరిహారం అనేది ఇవ్వకుండా వెల్లగొట్టడం లేదు. వారి దగ్గరనుండి చట్ట ప్రకారమే తీసుకుని, నష్ట పరిహారం ఇచ్చి, తరువాత ఆ భూమిలో వచ్చే ఆదాయములో వాటాలు, గట్రా గట్రా ఇస్తామని ఒప్పందం చేసుకుని తీసుకుంటున్నారు. మీరు చెప్పిన వారిలో నిజంగానే వ్యతిరేకించేవారు లేరనను, కానీ ఇంకాస్త ఒత్తిడిచేస్తే మరికొంత పరిహారం వస్తుంది అని వెయిట్ చేసేవాల్లు, ఇదివరకే ఒప్పుకున్నవాల్లూ కూడా ఉన్నారు. వారే అధిక శాతం. కాబట్టి, వెయిట్ అండ్ సీ అనడములో తప్పులేదు.

   Delete
  7. నేను ఒక్క అనవసర ప్రసంగం కూడా చెయ్యలేదు, చంద్రబాబు ౧౦ సంవత్సరాల కంటే ముందే మార్చడానికి ప్రయత్నించడానికి కారణం ౧౦ సంవత్సరాలు కూడా ఉమ్మడి రాజధాని గురించి ఒప్పుకోక పోవడం!
   ఇక ఎక్కడైనా చంద్రబాబు ఆ భూమి పెట్టందార్లకు ఇస్తాను అని అన్నాడా?
   ఆయన ప్రతీసారి ఆ భూమిలో ౪౦ శాతం అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు వెళుతుంది అన్నాడు!
   నేను ముందే చెప్పాను భూమి వెతికే సమయం కూడా లేకుండా ఉమ్మడి రాజధాని ౫ సంవత్సరాలు కూడా ఉండకూడదు అని గొడవ చేసింది ఎవరు? అది అప్రస్తుతం అనుకొవొచ్చు, కానీ అది ఇక్కడ విషయం, ఇంట్లో నుంచీ వెళ్ళిపో అని అంటే ఇల్లు కట్టుకోవాడానికి తక్కువ ఖర్చుతో ఇల్లు దొరికే చోటకే ప్రయత్నం చేస్తాం! కానీ అసలు ఇల్లు కట్టడానికి కన్నా ముందు చెరువు తవ్వుకోవాలి తరువాత ఆ చెరువు నీటితో కళకళ లాడే వరకూ వేచి ఉండాలి, తరువాత ఇల్లు కట్టుకోవాలి అంటే ఎలా?
   ఇక్కడ నేను చంద్రబాబు ను సమర్ధించట్లెదు, కేవలం మనిషి ఆలోచనా పరిమితి గురించి చెబుతున్నాను!
   ఉమ్మడి రాజధానిగా ౨౦ సంవత్సరాలు ఒప్పుకొండి నేను చంద్రబాబు ను అడుగుతాను ఈ ప్రక్రుతి విపత్తు ఆపమని!

   Delete
  8. శ్రీకాంతాచారిగారూ...
   30 వేల ఎకరాల భూమి అవసరమే. ముందస్తు అవసరాల కోసమైనా ప్రభుత్వానికి రాజధానిలో ఆ మాత్రం భూమి కావాలి. ఇంకా చెప్పాలంటే శుక్రాచార్య గారు చెప్పినట్టు లక్ష ఎకరాలైనా మంచిదే. దాహం వేసినప్పుడు బావి తవ్వేవాడు మూర్ఖుడు. చంద్రబాబు బేసిగ్గా మూర్ఖుడు కాడు. అందుకే మరీ లక్ష ఎకరాలు అడక్కుండా 30 వేల ఎకరాలతో సరిపెట్టాడు. పెత్తందారులకు కట్టబెట్టడం.. అనే కాన్సెప్టుకు కూడా సమాధానం ఉంది. అరవయ్యేళ్లు రాజధానిగా ఉన్న తర్వాత, సీమాంధ్రులు కట్టిన పన్నుల ‘భాగస్వామ్యం’తో (తె.వాదులూ.. భాగస్వామ్యం అని మాత్రమే అంటున్నా. మొత్తం మేమే అభివృద్ధి చేశామని చెప్పట్లేదు) అభివృద్ధి అయిన రాజధానిలోంచి తన్ని తరిమేశాక వేల కోట్ల రెవెన్యూలోటుతో ఏపీ తన ప్రస్థానాన్ని మొదట్నుంచీ ప్రారంభించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చాక భవనాలు కట్టడానికి ఇక ఏమీ ఉండదు. అందుకే ఈ విధానం. ఇందులో భాగంగా.. 30 వేల ఎకరాలు సేకరించి అందులో 15 వేల ఎకరాలను మౌలిక సదుపాయాలకు ఇస్తారు. రోడ్లు, పార్కులు, డ్రైనేజీ, మైదానాల వంటివాటికి. మిగతా 15 వేల ఎకరాల్లో 60:40 ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆలోచన. రైతులు 60 శాతం తమకు ఇమ్మంటున్నారు. వారి డిమాండ్ సహేతుకం. దాని గురించి ఆలోచించవచ్చు. ఇక, ప్రభుత్వం వాటాకు వచ్చే భూమిని, మౌలిక సదుపాయాల కోసం వదిలిని 50 శాతం భూమిలో కొంత భూమిని మీరన్న పెత్తందార్లకు (సామాన్యజనాల దృష్టిలో డెవలపర్లు) ఇస్తారు. వారు అక్కడ ప్రభుత్వం కోరిన భవనాలు, డ్రైనేజీ వ్యవస్థలు, పార్కుల వంటివాటిని నిర్మించి ఇస్తారు. అతి తక్కువ ఖర్చుతో అన్నివర్గాలూ లాభం పొందే పథకం ఇది. అన్యాయమైన విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు ఒక మంచి రాజధానిని నిర్మించుకోవడానికి ఇంతకు మించి మంచి మార్గం లేదు. దీనికి మించింది మీ దగ్గర ఇంకేమైనా మంచి ప్రతిపాదన ఉంటే చెప్పండి. బొక్కలెతకడం చాలా ఈజీ. బొక్కలు పూడ్చడం కష్టం.

   అన్యాయమైన విభజన అన్నమాటకు నా వివరణ:
   ఇప్పటికీ చాలా సంస్థల హెడ్డాఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయినా.. కేవలం విభజన చట్టంలో లేదు కాబట్టి హైదరాబాద్ ఆదాయంలో పైసా ఇవ్వరంట. కేవలం విభజన చట్టంలో ఉంది కాబట్టి కరెంటు మాత్రం తెలంగాణకు సగానికిపైగా కావాలట. ఇది నైతికంగా ఎంతవరకూ సమంజసమో..(ధర్మంగా అయితే హైదరాబాద్ ఆదాయంలో ఈ పదేళ్లపాటూ ఏపీకి వాటా ఇవ్వాల్సిందే. కానీ, చట్టంలో లేదు కాబట్టి ఇవ్వబోమంటున్నారు. అలాగేకానివ్వండి) మీరే ఆలోచించుకోండి.

   ఇక ఏపీ సర్కారు కేంద్రంతో కలిసి తెలంగాణపై కుట్ర చేస్తోందన్నంత హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు. తొమ్మిది, పదో షెడ్యూల్లో ఉన్న న్యాక్, నిథమ్ వంటి వాటిని అన్యాయంగా సొంతం చేసేసుకుని, వాటి నిధులు తమ ఖాతాల్లోకి మళ్లించుకుని, ఏపీ అధికారులు ఆ భవనాల్లోకి వస్తే వెళ్లగొట్టిన తెలంగాణ సర్కారు.. కార్మిక శాఖ నిధుల విషయంలో ఏపీ అదే పని చేస్తే గగ్గోలు పెడుతోంది. ఇప్పటికి కూడా చంద్రబాబుకు సిగ్గు లేదు కాబట్టి, తెలంగాణలో పార్టీని బతికించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి.. తెలంగాణ మీద అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్నాడు. కేంద్రానిదీ అదే పరిస్థితి. తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు చూసుకుంటోంది. కాబట్టే తెరాస నేతల అబద్ధాల ప్రచారాలకు ఇంకా నూకలున్నాయి. ఇటీవలికాలంలో ప్రజలోనే ఎక్కడో చూశాను.. పీపీఏలు చెల్లవని ఏపీఈఆర్సీ చెప్తేనేమో అదో పవిత్రమైన తీర్పట. మరి, కృష్ణా బోర్డు చెైర్మన్ శ్రీశైలంలో విద్యుత్ ఆపాలని తెలంగాణకు చెబితే సన్నాసట. ఆయన్ని చంద్రబాబు మచ్చిక చేసుకుని అలా తీర్పు చెప్పించాడట. ఈ లెక్కన ఏపీఈఆర్సీ చైర్మన్ని కూడా కేసీఆర్ కొనేశాడనుకోవాలా?
   ఇలా రాసుకుంటూ పోతే పేడ తక్కెడ.. ఇసుక తక్కెడ. కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్పేసి పోతున్నా. మళ్లీ చర్చించను.

   Delete
  9. నిజంగా నీ పేరు అప్పలనాయుడేనా? బ్లాగ్‌లో సొంత పేరు చెప్పుకోలేక pseudonymగా అలా పెట్టుకున్నావా? మా ప్రాంతంలో పల్లెటూరివాళ్ళు మాత్రమే అప్పలనాయుడు, అసిరినాయుడు లాంటి పేర్లు పెట్టుకుంటారు.

   Delete
  10. ఎకరం జాగాలో 4840 గజాల భూమి వుంటుంది. ఎకరం తీసుకుని 1000 గజాలు రైతుకు తిరిగి ఇస్తామని అంటున్నారు. అంటే భాగస్వామ్యం మీరు చెప్పినట్టు 60:40 కాక 80:20 మారిపోతుంది. అంటే రైతుకు 20% మాత్రమే వస్తుంది. అయితే దీనిలో కూడా అనేక లొసుగులు వున్నాయి.

   30000 ల ఎకరాలలో 1000 ఎకరాలు ప్రభుత్వ భవనాలకు మరో 3000 ల ఎకరాలు రోడ్లు పార్కులు వగైరాల కోసం అనుకున్నా మొత్తం ప్రభుత్వం సేకరించాల్సిన భూమి 4000 ఎకరాలకంటే ఎక్కూవ అవసరం వుండదు. మిగతా 26000ల ఎకరాల్లో ప్రభుత్వం ఏమీ నిర్మించబోదని కచ్చితంగా చెప్పొచ్చు. దాన్ని తిరిగి ప్రైవేటు వ్యక్తులకో, కంపేనీలకో అప్పజెప్ప వల్సిందే. దానిలో రైతుల వాటాగా 6000ల ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చినా మిగతా 20000 ల ఎకరాలు బడా వ్యాపార కంపెనీలకు కట్టబెడతారన్నది సుస్పష్టం.

   ఇక్కడ ప్రశ్నలు:

   1. బడా కంపెనీలకు ఎక్కడ ఇస్తారు? రైతులకు రావలసిన భూమిని ఎక్కడ ఇస్తారు?
   2. సాధారణంగా బడా కంపెనీలు బడా రాజకీయ కాంట్రాక్టర్ల చేతిలోనే వుంటాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నిండా వాళ్ళే వున్నారు. అటువంటప్పుడు మిగులు భూ పంపకాల్లో వారిని కాదని రైతులకు న్యాయం జరిగే అవకాశం వుందా?
   3. బడా కాంట్రక్టర్లకు ప్రధాన్యత కలిగిన భూములు ఇచ్చి, నిజంగా భూమి దాతలైన బక్క రైతులకు వారి వాటాగా అప్రాధాన్యమైన శివారు భూములు ఇవ్వరని గ్యారంటీ ఏమిటి?
   4. ప్రభుత్వం ఎక్కడైనా రైతులకు వారి వాటాకు ఏ భూమి ఇవ్వ బోతుందో ముందే చెప్పే విధంగా తన ప్రణాళిక ప్రకటించిందా?
   5. అభివృద్ధి తర్వాత తనకు ఇవ్వబోయే 1000 గజాల భూమి ఎక్కడ వుంటుందో ప్రభుత్వం ముందే చెప్పకపోతే, నిజాయితీగా తనకు రావలసిన వాటా సరైన చోటనే వస్తుందని రైతు ఎందుకు నమ్మాలి?

   పై ప్రశ్నలకు సరైన సమాధానం లేనప్పుడు, ప్రభుత్వం తనకు కావలసిన 5000 ఎకరాలు మాత్రమే తీసుకుని రోడ్లను, పార్కులను, ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే సరిపోతుంది. మిగతా భూమిని రైతుల వద్దనే వుంచితే వారు తమకు నచ్చిన ధరకు వ్యాపారులకు నేరుగా అమ్ముకుంటారు గదా? మధ్యలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎందుకు?

   Delete
  11. ఇలా ప్రజల భూమికి ప్రభుత్వం మధ్యవర్తిత్వం వచించడం వల్ల ప్రభుత్వ అవినీతి పెరిగిపోయి క్విడ్-ప్రొ-కో సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు వున్నాయి.

   Delete
  12. కంగ్రెసోల్లకు షాకులివ్వడం అయ్యింది. ఇక తెలంగాణాలో ఉంటూ సొంతంగా ఒక మంచి రాజధాని కట్టుకుంటున్నాం అనగానే ఓర్వలేకపోతున్న "శతృవు"లకు కూడా త్వరలో షాకులిస్తారు రైతులు.

   రైతులకు ఎలాంటి ప్యాకేజీలిస్తారు? వాటాలు ఎలా ఇస్తారు గట్రా గట్రా అన్నీ త్వరలోనే వివరంగా తెలుస్తాయి.Wait and See !!

   రైతులకు ఇది జీవితానికి ఒకసారే వచ్చే అవకాశం. వినియోగించుకుంటే అందలమెక్కుతారు. ఆవిషయం వారు కూడా గ్రహిస్తున్నారు. ఇక పక్కన కూర్చుని దాన్ని చెడగొట్టాలని అనుకునే వారికి మరో సారి తీవ్ర నిరాశ తప్పదని చెప్పేందుకు సంతోషిస్తున్నాం.
   ----------------------

   బాబుని నమ్ముతున్నాం: రాజధానిపై నేతలకు షాక్

   Published: Sunday, November 9, 2014, 12:40 [IST] మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి దీన్ని షేర్ చేయండి వ్యాఖ్యలు మెయిల్ చేయండి హైదరాబాద్/గుంటూరు: రాజధాని విషయంలో తుళ్లూరు గ్రామ రైతులు కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు. రాజధానిని రానివ్వరా? ఐదూళ్ల వారు వద్దంటే ఆగిపోవాలా? అంటూ కాంగ్రెస్ నేతల పైన మండిపడ్డారు. తమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం నాడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, దేవినేని అవినాశ్ తదితరులు తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులను రాజధానికి భూములు ఇచ్చే విషయమై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పలు గ్రామాల రైతులు కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు. చంద్రబాబుపై మాకు నమ్మకం ఉందని, రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, నాలుగైదు గ్రామాలవారు వ్యతిరేకిస్తే అసలు రాజధాని రావడానికే రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎలా అంటారని తుళ్లూరు రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందాన్ని ప్రశ్నించారు.

   ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ నేతలకు నోటమాట రాలేదు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ జరిపాలని నిర్ణయించిన రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, బోరుపాలెం, తుళ్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. పర్యటన అనంతరం వివరాలను తెలియజేయడానికి తుళ్లూరులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి రైతులు కాంగ్రెస్ బృందాన్ని అడ్డుకున్నారు. రామచంద్రయ్య మట్లాడుతూ... భూసమీకరణ విషయంలో భావోద్వేగాలకు గురవుతున్న రైతులకు నమ్మకం కల్గించే దిశగా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులుగానీ ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును రైతులు నమ్మడం లేదని, భూములిచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అనడంతో కొందరు రైతులు అక్కడికి వచ్చి రామచంద్రయ్య బృందాన్ని అడ్డుకున్నారు. బాబుపై తమకు నమ్మకం ఉందని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదంటూ పలువురు రైతులు కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేవలం నాలుగైదు, గ్రామాల్లో రైతులు మాత్రమే వ్యతిరేకిస్తుండగా, 14 గ్రామాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇంతలో పలువురు గుంటూరు కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని మీకు న్యాయం చేయాలని కోరేందుకే కాంగ్రెస్ బృందం ఇక్కడకు వచ్చిందని వారి శాంతింపజేశారు.

   -----
   కాగా, ప్యాకేజీని మరింత పెంచేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భూములిచ్చేందుకు రైతులు కూడా సిద్దమవుతున్నారని అర్థమవుతోందని అంటున్నారు. అయితే, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లో మాత్రం భూములు ఇచ్చేందుకు వ్యతిరేకమని రైతులు చెప్పారు.

   http://telugu.oneindia.com/grapevine/2014/many-farmers-ready-to-give-up-land-146187.html

   Delete
  13. హైదరాబాద్ తప్ప ఏదీ అవసరం లేదని ప్రచారం చేసే సమైక్యవాద పత్రికలు, TV చానెల్‌లు కాంగ్రెస్‌ని ఓడించాయి. ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికై ఈ మీదియావాళ్ళకి మొసలి కన్నీళ్ళు ఎందుకు?

   Delete
  14. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌వాళ్ళకి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవలసిన అవసరం లేదు. హైదరాబాద్‌ని ఎక్కువ కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచితే తెలంగాణావాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కాంగ్రెస్‌వాళ్ళు ఆంధ్రాకి కొత్త రాజధాని తొందరగా పెట్టాలనే అంటారు. కాంగ్రెస్ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ప్రచారం చేస్తున్నది తెలుగు దేశాన్ని 2019లో కూడా గెలిపించడానికే.

   Delete
 2. క్షమించాలి. ఈ పై వ్యాఖ్యాతృ మిత్రులు శ్రీకాంత్ చారిగారిని కేవలం ఒక తెలంగాణావాదిగా చూస్తూ కామెంట్లు చేస్తున్నట్లుంది. ఆయన ఒక ఆలోచనాపరుడుగా అడుగుతున్న ప్రశ్నకి సరైన సూటి సమాధానం రావడం లేదు. ఆయన అడుగుతున్నదాంట్లో పాయింట్ ఉంది. రాజధానికి ప్రభుత్వపరంగా 30 వేల ఎకరాలు నిజంగా అవసరమేనా?

  ReplyDelete
  Replies
  1. రాజధాని అన్నది కేవలం భవనాలు,రోడ్ల సముదాయములా ఉండకూడదనీ అది రాష్ట్ర అభివృద్దికి ఆయువుపట్టు కావాలని చెప్పింది అందుకేనండి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్ని వసతులూ ఉన్న ఒక మంచి అంతర్జాతీయ స్థాయి నగరం కావాలి. దానికోసం ఈ తాపత్రయం అని చంద్రబాబు పదే పదే చెబుతూనే ఉన్నాడు. చూద్దాం, చేసేవాన్ని చెడగొట్టడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం.

   Delete
  2. ఒప్పుకుంటాను, కానీ నా అభిప్రాయం ౨౦ సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఒప్పుకుంటే చెయ్యగలం అని చెప్పడం.

   Delete
  3. కట్టింది కట్టినట్తే వుంటుందా?భవిష్యత్తులో పెరగదా?పరిశీలించి వచ్చిన రాష్ట్రాల్లోనూ ఇప్పుదు కట్టిన భవనాలు తక్కువే,కానీ యెందుకు అంత స్థలం తీసుకున్నారు?!హైదరాబాదు 1999-2000 మధ్యన 1.5 సం.లు వున్నాను.అప్పుదే బాగా కిక్కిరిసి పోయినట్టు వుంది.ఓల్ద్ సిటీ కి ఒక్కసారే వెళ్ళాను,మొత్తమ్మీద చూస్తే హైదరాబాదు నోస్టాల్జిక్ గా బాగుంటుంది కానీ రీ మోడల్ చేస్తే ఇంకా బాగుంటుందనిపిస్తుంది! ముఖ్యంగా ట్రాఫిక్ బాగా కంట్రోలు చేస్తే సుఖంగా వుంటుంది.కొత్త రాష్ట్రపు కొత్త రాజధాని అలా కాకుండా భవిష్యత్తులో వచ్చి పడే జనసముదాయాన్ని కూడా తట్టుకునేటట్టు వుండటం మంచిదే కదా!స్థలాన్ని తీసుకుని పాడు పడెయ్యటం లేదు.పార్కులతో గ్రీనరీ కి ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు.పైగా యెటు వైపు నుంచీ నికరమయిన సహాయం లేనప్పుదు ఖర్చు ని ఆదాయంగా మార్చుకోవాలి.పెట్టిన ఖర్చు రాబట్టుకోవటానికి షాపంగ్ మాల్స్ లాంటివి కట్టవచ్చు,యెటూ అమ్మిన రైతుల్ని డబ్బు తీసుకుని పొమ్మనకుండా ఆ భూమి నుంచి వచ్చే ఆదాయం లో కూడా వాటా ఇస్తామంటున్నారు. కొనడం, మళ్ళీ అమ్మినవాళ్ళకే ప్రయోజన కరంగా తిరిగి ఇవ్వడం అనేదాంట్లో ఇలాంటి ప్లానులేవో వున్నాయని నా అభిప్రాయం.

   Delete
 3. http://kattashekar.wordpress.com/2014/11/02/how-much-land-used-for-capital-facilities-in-hyderabad-2/

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top