• వెంకటేష్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న తాజా మల్టీస్టారర్ ఫిల్మ్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".
 • ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఇటీవల జరిగింది. కుటుంబ వాతావరణం తలపిస్తూ విభిన్నంగా జరిపిన ఈ ఫంక్షన్ లో అనేక విశేషాలు పొందుపరచేందుకు నిర్మాత దిల్ రాజు తాపత్రయపడ్డాడనిపించింది.
 • అందులో ఒకటి ఆడియో విడుదలకు అతిధులుగా వెంకటేష్-మహేష్ కొడుకులు అర్జున్-గౌతం ల చేతులు మీదుగా జరపడం కాగా 20 ఏళ్ల తరువాత వీరిరువురితో కలిపి సినిమా చేస్తానని దిల్ రాజు ప్రకటించడం.
 • రాజకీయాలు - సినిమాలు ఇవి రెండూ సమాజాన్ని బాగా ప్రభావితం చేసే అంశాలు. వారసత్వం టేలెంట్ ను తొక్కేస్తుందని ఆరోపణలు వినిపిస్తుంటాయి. పూర్తిగా ఇందులో నిజముందని అనలేము గానీ, ఇతరులకంటే తక్కువ ఇంకా చెప్పాలంటే ఏమాత్రం రిస్క్ లేకుండా వారసులకు ఎంట్రీ దొరికిపోతుంది.
 • ఎన్.టీ.ఆర్ , ఏ.ఎన్నార్, కృష్ణ , కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి,మోహన్ బాబు ...... ఇలా ప్రముఖుల కుటుంబాల వారసుల హవా నడుస్తుంది.
 • అయితే టేలెంట్ లేకుండా ఎక్కువకాలం మనజాలరనడానికి కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు, దాసరి,బాబూమోహన్,బ్రహ్మానందం తనయులు ... ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ బేక్ గ్రౌండ్ ఉన్నదానికీ-లేనిదానికీ తేడా ఉందనేది నిజం.
 • వారసత్వం టేలెంట్ ను తొక్కేస్తుందా!? టేలెంట్ లేని వారసత్వాన్ని ప్రజలు ఆదరిస్తారా!? టేలెంట్ కు మాత్రమే గుర్తింపు రావాలంటే సమాజం లో రావలసిన మార్పులేమిటి?
Note : Republished Post
Reactions:

Post a Comment

 1. వారసత్వం టేలెంటును తొక్కేస్తుందా? - తొక్కేస్తుంది!అందుకు నిన్నటి తరం హెరోల ఇవ్వాళ్టి వారసులే సాక్ష్యం.కానీ టేలెంటుని వారసత్వం తొక్కెయ్య లేదు.అందుకు ఆలీ లాంటివాళ్ళు కూడా హీరోలుగా కొద్ది సినిమాల్లోనే అయినా రాణించడమే సాక్ష్యం.రవితేజ మాస్ మహారాజా గా యెదగడం కూడా నిజంగా టేలెంటు వున్నవాణ్ణ్ణి వారసత్వాలు తొక్కెయ్యలేవనేదానికి సాక్ష్యం.

  ReplyDelete
 2. >వెంకటేష్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న తాజా మల్టీస్టారర్ ఫిల్మ్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".
  అర్థం కాలేదు. ఈ సినిమా వచ్చేసి డబ్బుచేసుకుని వెళ్ళిపోయింది కదా ఈ మధ్యనే?

  ReplyDelete
  Replies
  1. @ శ్యామలీయం sir, Note : It Is Republished Post.

   Delete
  2. దయచేసి పోష్టులతో పాటూ అది ప్రకటించబడిన తారీఖు కూడా వచ్చేటట్లు చూడండి.

   Delete
  3. అలాగే సర్. మీ సూచనకు ధన్యవాదములు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top