Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:బూతు పురాణంలో \\"సాక్షి\\"వాళ్ళు \\"ఆంధ్రజ్యోతి\\"వాళ్ళని మించిపోతున్నారా? 
Message:వరంగల్ జిల్లాకి చెందిన ఒక మహిళా ఎస్.ఐ. కరీమ్‌నగర్ జిల్లాకి చెందిన ఒక సి.ఐ.తో ఒక లాజ్‌లో దొరికిపోయిందని సాక్షి చానెల్‌వాళ్ళు దానికి రెండు రాష్ట్రాలలో పబ్లిసితీ ఇచ్చారు. అసెంబ్లీ భద్రత కోసం వచ్చిన ఆ సి.ఐ. తనకి కేటాయించిన లాజ్ గదిలో కాకుండా ఒక మహిళా ఎస్.ఐ. ఉన్న గదిలో ఉండడంతో ఆమె భర్తే వాళ్ళిద్దరినీ అబిద్స్ పోలీసులకి పట్టించాడు. ఆ అక్రమ సంబంధం ఆ సి.ఐ., ఎస్.ఐ.ల కుటుంబాలకి మాత్రమే సంబంధించిన సమస్య. రెండు కుటుంబాల సమస్యకి రెండు రాష్ట్రాలలో పబ్లిసితీ అవసరమా?

ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ ఒక సినిమా విలన్‌ని \"మీకు నిజంగా రేప్ చెయ్యాలనిపించలేదా?\" అని అడిగినప్పుడు అదో బూతు చానెల్ అని విమర్శించినవాళ్ళు ఈ విషయంలో ఎందుకు నోరు మూసుకున్నారు? పోలీస్ అధికారులు కూడా మనుషులే. వాళ్ళు సెక్స్ చెయ్యడం విచిత్రం కాదు. దానికి రెండు రాష్ట్రాల్లో పబ్లిసితీ ఇవ్వక్కరలేదు. ఆమెకి అక్రమ సంబంధం వల్లే భర్త విడాకులు ఇచ్చాడని తెలిస్తే ఆమెకి రెండో పెళ్ళి సంబంధం దొరకడం కష్టమవుతుంది. మసాలా వార్తల కోసం ఒక ఆడదాని జీవితంతో ఆడుకోవడం అవసరమా? 
Reactions:

Post a Comment

 1. ప్రవీన్,
  మీ ఆదర్శం అనన్య సామాన్యం. చలమే కనుక బతికి ఉండుంటే మిమ్మల్ని చూసి గర్వించేవాడు. అఫ్ కోర్స్, రంగనాయకమ్మ గారికి మీ విషయం తెలిస్తే బహుషా ఆవిడ కూడా అలాంటిపనే ఏదో ఒకటి చేస్తారనుకోండి. మీరు ఇలాగే చలాన్ని, రంగనాయకమ్మనూ తలదన్నే ఆదర్శాన్ని ప్రదర్శించండి. మగవారు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు వార్తా ఛానెల్లలో వారిని చూపించడము తప్పుకాదు. వారి భార్యలు, మరికొంత మంది ప్రజలు వారిని చెట్టుకో, స్థంభానికో నగ్నంగా/ అర్ధనగ్నంగా కట్టేసి కొట్టినప్పుడు .. కామ పిశాచికి బుద్ది చెప్పిన భార్య అని హెడ్డింగులు పెట్టి వార్తలు వేయడం కూడా తప్పు కాదు. కానీ స్త్రీలు అలాంటి పనులు చేస్తున్నప్పుడు చూపించడం పాపం, నేరం, బూతుల మయం. ఆమెకు రెండో పెల్లి జరగడం కష్టమవుతుంది అన్నది నిజం. మగాడిదేముంది పెళ్ళైనా కాకపోయినా ఒకటే. వారిని నగ్నంగా కట్టేసి కొట్టినా పెద్దగా పోయేదేం లేదు. ఆడర్శాన్ని పాటించడం ముఖ్యం. ఆదర్శం అంటే స్త్రీలను గౌరవించడం. అందులో పురుషుల గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి, వారిని తగలేసినా ఆదర్శానికి వచ్చే నష్టం ఏమీ లేదు. చలం, రంగనాయకమ్మ, ఆదర్శములో వారిద్దరినీ మించిన మీరు మీలాంటి వారి సమర్ధనకు పాతృలైనటువంటి "స్త్రీలకు" ఎటువంటి నష్టం కలగకుంటే చాలు. వారు అక్రమ సంబందం పెట్టుకున్నా సరే, మరేం చేసినా సరే. ఒకటి మాత్రం నిజం ప్రవీన్, భవిశ్యత్తులో నా పిల్లలకి ప్రవీన్ లాంటి సంఘ సంస్కర్త బతికిన రోజుల్లో మేమూ ఉన్నాం అని చెప్పుకొనే అవకాశం నాకు దక్కినదుకు ఆనందంగా ఉంది. I am very happy.

  ReplyDelete
 2. అసలు విషయం వదిలేసి ఇంకేదో మాట్లాడుతున్నావు. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నది నీ పక్కింటి అప్పారావు & ఎదురింటి సుబ్బాయమ్మ అయ్యుంటే "వాళ్ళు ఎలా పోతే నాకేంటి?" అనుకునేవాడివి కదా. అయినా పోలీస్ అధికారులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒక పెద్ద వార్తా? అక్రమ సంబంధం పెట్టుకున్నవాళ్ళకి రెండు నెలలు కారాగార శిక్ష పడుతుంది, అంతే. ఆ చిన్న నేరానికి రెండు రాష్ట్రాలలో పబ్లిసితీ ఒకటి!

  ReplyDelete
 3. ప్రవర్తన అనేది హోదాని బట్టి మారదు. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నది మహిళా ప్రధానమంత్రి అయినా నేను పట్టించుకోను. మీరు ఇంకా మహిళా ఎస్.ఐ. అక్రమ సంబంధం పెట్టుకుంటేనే "రామ రామ, కలికాలం వచ్చేసింది" అనుకునే స్థాయిలో ఉన్నారు.

  ReplyDelete
  Replies
  1. అవును ప్రవీన్, నువ్వు చెప్పింది నిజమే. నేను అసలు విషయం వదిలేసి ఏదేదో చెప్పాను. కాని తప్పు పూర్తిగా నాది కాదు. నీ అభ్యుదయ వాదం చూసినప్పుడల్లా నేను మైమరచిపోతుంటాను. ఆడ మగ ఇద్దరూ తప్పు చేసి దొరికిపోతే, అక్కడ కేవలం ఆడవారి మీద సింపతీ చూపించాలేకానీ మగవారి గురించి పట్టించుకోకూడదన్న విషయం నేను మర్చిపోయాను. ఆదర్శవాదములో మొదటి పాయింటు అదే కదా? ఒక చోట ఆడా మగా ఇద్దరికీ దెబ్బలు తగిలాయనుకోండి, ఆడవారికి మాత్రమే మందు రాసి కట్టుకట్టాలి. మగవారి గురించి పట్టించుకోకూడదు. అలా పట్టించుకోవడం అంటే టాపిక్ నుండి డైవర్ట్ అవ్వడమేనన్న సాధారణ మార్క్సిస్టు/ లెనినిస్టు పాయింటును నేను మర్చిపోవడం నా తప్పే. అక్రమ సంబధం పెట్టుకోవడాం వార్త కాదు. ఒక వేల మగవాడు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అతని భార్య పట్టుకుని వాడ్ని నాలుగు తంతే అప్పుడు అది న్యూసు అవుతుంది. వెరైటీ ఏమిటంటే అక్రమ సంబధం అనేది దాదాపుగా ఆడా - మగల మధ్యే ఉంటాయి (కొన్ని కేసులు ప్రత్యేకమైనవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం) కాని ఫోకస్ అనేది మగవారి మీద ఉంటే అది వార్త. ఫోకస్ అనేది పొరపాటున ఆడవారిమీదకు వచ్చినా, లేక ఆడా మగా ఇద్దరి మీదకూ వచ్చినా అది తప్పే అవుతుంది, అప్పుడూ దాన్ని వార్తగా పరిగణించలేం. నీ ఆదర్శం సూపరు ప్రవీన్.

   <<< మీరు ఇంకా మహిళా ఎస్.ఐ. అక్రమ సంబంధం పెట్టుకుంటేనే "రామ రామ, కలికాలం వచ్చేసింది" అనుకునే స్థాయిలో ఉన్నారు.
   ఉన్న ఫలంగా మీ అంతటి ఆదర్శం అందరికీ రావాలంటే ఎలా వస్తుందండీ? మీరు కాస్త ఓపిక పట్టాలి. అందరూ మీ అంత షార్ప్ కాదు.

   Delete
  2. మీకు ఇంకా అర్ధం కాలేదు ఇక్కడ ప్రశ్న STD లు ఆడవాళ్ళ వస్తే తప్పు లేదు కానీ మొగవాళ్ళ వల్ల వస్తే తప్పు అని.

   Delete
  3. నిరోధ్ తొడుక్కుంటే గుప్త రోగాలు రావని ప్రచారం చేస్తున్న పాలక వర్గాలని మీరు ఎప్పుడైనా నిలదీసారా? మన తెలుగు బ్లాగర్లలోనే ఒకాయన తన తండ్రి ఆయుర్వేద వైద్యుడనీ, గుప్త రోగాల వల్ల తన తండ్రితో పాటు పట్టణంలోని వైద్యులందరికీ జేబు నిండా డబ్బులు వచ్చాయనీ చెప్పాడు. "అక్రమ సంబంధాలు పెట్టుకోండి కానీ గుప్త రోగాలు రాకుండా జాగ్రత్తపడండి" అని ప్రచారం చేస్తున్నది పాలకవర్గంవాళ్ళే కానీ మేము కాదు.

   Delete
  4. కనీసం వాళ్ళు అలా STD ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు మగాడు మాత్రమె తప్పు చేసాడు ఆడవాళ్ళు తప్పు చెయ్యలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అని ప్రచారం చేస్తున్నారు.

   Delete
  5. కుటుంబ నియంత్రణకి వాడాల్సిన నిరోధ్‌లని గుప్త రోగాల నుంచి కవచంలా వాడేవాళ్ళు మాకు శ్రీరంగ నీతులు చెప్పేదొకటి!

   Delete
  6. నేను వాడలేదు, అలాగని వాడమని ఎక్కడా చెప్పలేదు, నేను చెప్పింది ఒక్కటే అక్రమ సంభంధం అనేదే చెడ్డది, అది రక్షణ కవచం పెట్టుకుని చేసినా పెట్టుకోకుండా చేసినా!
   అయినా నేను శ్రీరంగ నీతులు చెప్పలేదు, నేను పాటించేవే చెప్పాను!

   Delete
 4. అక్రమ సంభందం ఎందుకు పెట్టుకోకూడదు అంటే అది అనవసర చర్చకు దారి తీస్తుంది, అది ఆడ అయినా మగ అయినా, పదోన్నతులైనా పదవిచ్చితులైనా!
  అలాంటి అనవసరపు చర్చలలో ఒకటి, వాళ్లకు పుట్టిన పిల్లలు ఎవరికీ చెందిన వారు?
  ఆ పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆ పుట్టబోయే ఆడపిల్ల జన్యు లోపాలతో పుడుతుంది?

  ఇక అభ్యుదయ వాదులు అనుకునే వారు సమాజంలో నియమాలు ఉండకూడదు అంటారు, అది ప్రకృతిని ధిక్కరించడం అన్న విషయం మరచిపోతారు!
  ఇక ఈ విషయం నాకు తెలియదు ఎందుకంటే నేను సాక్షి అనే అబద్దం చూడను!

  ఇక నీ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు! నేను ఏది చెప్పినా దాంట్లో తప్పు అని అంటావు! ఎందుకంటే నీకు కావలిసింది ఆవు ఎద్దుల సంబంధం తో బ్రతికే మానవ జాతి, అది జరిగితే మానవ జాతి నశించి పోతుంది అని తెలిసినా అదే కోరుకుంటావు కాబట్టి!

  ReplyDelete
 5. ఆ లాజ్‌లో దొరికిపోయినది ఉద్యోగం లేని స్త్రీ అయ్యుంటే అదొక వార్త అయ్యేదా? మహిళా ఎస్.ఐ. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎక్కువ పరువు పోతుంది, ఉద్యోగం లేని స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుంటే తక్కువ పరువు పోతుంది! మన చదువుకున్న పాత్రికేయుల భావజాలం ఇది!

  ReplyDelete
  Replies
  1. బూతు పని చేసి దొరికి పోయినోళ్లకి గూఒడా ఆదవ్వాళ్ళకి పెళ్ళి కాదు గాబట్టి వాళ్లని బయట పెట్టగూదదన్న మాత,గొప్ప తర్కమే?!నువ్వు ఖాళీగానే వున్నావుగా వుత్త జాలి దేనికి ఆవిణ్ణి పెళ్లి చేసుకుని వుధ్ధరించ రాదు.మిగతా వాళ్ళు బూర్జువ్వా సంస్కృతిలో వున్నారు గాబట్టి చేసుకోరు, నీకు అలాంటి అభ్యంతరాలేమీ లేవు కదా?

   Delete
  2. రెండు నెలలు కారాగార శిక్ష పడే నేరానికి రెండు రాష్ట్రాలలో పబ్లిసితీ ఇవ్వడం గోటితో పోయేదాన్ని గొడ్డలితో నరకడం లాంటిది కాదా?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top