Name:KIRAN KUMAR 
E-Mail:deleted  
Subject:విలువలు - మోరల్ పోలిసింగ్ 
Message:మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేఖంగా బహిరంగ చుంబన ప్రదర్శన తప్ప వేరే అవకాశం లేదా..... లిప్ స్టిక్ లు రాసుకొని, ఆడ - మగ, ఆడ - ఆడ, మగ - మగ ముద్దులు పెట్టుకుంటే మోరల్ పోలిసింగ్ కి నిరసన వ్యక్తం చేసినట్టా.... 
Reactions:

Post a Comment

 1. చీకటి నుంచీ వెలుతురుకు రావడానికి కొంత మంది ఆడవాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇంకొంతమంది ఆ చీకటే తమకు వెలుతురూ అనుకుంటున్నారు!
  ఇక్కడ చీకటి అంటే చాల మంది జీవిత భాగస్వాములు!

  ఉమ్మడి కుటుంబాలు వద్దు అనే మగవాళ్ళు ఆడవాళ్ళు, ఉమ్మడి కుటుంబం ఇలా ఉండాలి అన్నట్టు కొత్త నిర్వచనం ఇచ్చే వారు ఉన్నంత కాలం వ్యభిచారం ఆగదు!

  ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం వద్దు అని ఆడవాలు మగవాళ్ళు ఎందుకు అనే వారంటే సమానత్వం ఉండదు అనే అభిప్రాయం!

  మరి ఇప్పడు ఆడవాళ్ళు మగవాళ్ళు కోరుకుంటున్నారు ఉమ్మడి కుటుంబాలు, కానీ ఈ ఉమ్మడి కుటుంబాలలో ఎవరు ఉండాలి అంటే తనతో ప్రక్రుతి కార్యం కానిచ్చిన వాళ్ళు, ఇంకా అవకాసం ఉన్న వాళ్ళు!

  ఇక్కడ ఎవరినీ కించ పరచట్లేదు, కేవలం మనిషి ఇంకో మనిషిని వస్తువుగా చూస్తూ ఉన్నాడు తప్పించి ప్రేమించట్లేదు అని!

  దీన్ని బలపరిచే కొంతమంది కుహానా వాదులు వ్యభిచారం కి ఈ విచ్చలవిడి తననానికి తేడా చెప్పగలరా?

  ReplyDelete
  Replies
  1. బహిరంగ ప్రదేశాలలో ముద్దు పెట్టుకోవడం సభ్యత కాదు, నిజమే. కానీ హిందూత్వవాదులు ఆడవాళ్ళు గడప దాటకూడదనే భావంతోనే ఈ ముద్దులని వ్యతిరేకిస్తున్నారు తప్ప నిజంగా సభ్యతని పరిరక్షించడానికి కాదు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరం కాదు కానీ బహిరంగంగా సెక్స్ చెయ్యడం మాత్రం నేరమే.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. *హిందూత్వవాదులు ఆడవాళ్ళు గడప దాటకూడదనే భావంతోనే *

   పసలేని విశ్లేషణలు చేయకు. కమ్యునిస్ట్ పార్టిల కన్నా బిజెపి పార్టి ఎంతో మిన్న. మహిళలను ఉద్దరించామని డప్పుకొట్టుకోకుండా, పెద్ద హడావుడి చేయకుండా గుజరాత్ కి ఒక మహిళా ముఖ్యమంత్రిని ఎన్నుకొన్నారు. నీ విశ్లేషణ నిజమైతే, మహిళలు కనుక వాళ్లు ఇంట్లో కుచొని ఉండాలి. అంతేకాదు బిజెపి లో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు, ఎంతో మంది కేంద్ర మంత్రులు గా ఉన్నారు.
   ముప్పై ఏళ్లు గా బెంగాల్, కేరళా, త్రిపుర రాష్ట్రాలను పాలించిన వామపక్ష వాదులు, వారికి వంత పాడే స్రీ వాదులు మహిళల సమస్యలు అంట్టూ పుస్తకాలు రాయటం మినహ, వారి ప్రభుత్వాలలో మహిళలకొరకు అధికారంలొ ఎంత వాట ఇచ్చారు? ఇప్పించగలిగారు?

   Delete
  4. భాజపా ఎన్నడూ తాము స్త్రీలని ఉద్ధరిస్తామని చెప్పుకోలేదు. "సోనియా గాంధీ ప్రధాన మంత్రి అయితే గుండు గియ్యించుకుని తెల్ల చీర కట్టుకుంటాను" అని శపథం చేసిన సుష్మా స్వరాజ్ భాజపా నాయకురాలే కానీ కమ్యూనిస్త్ కాదు. భర్త చనిపోయిన స్త్రీల గురించి చీప్‌గా మాట్లాడేవాళ్ళు స్త్రీలని ఉద్ధరిస్తారట!

   Delete
  5. నేనడిగిన దానికి నీ వద్ద ఎమైనా జవాబు ఉందా? కమ్యునిస్ట్లు, వారి భావజాలానికి మద్దతు గా చెక్కభజన చేసే స్రీ వాదులు , స్రీలకు రాజ్యాధికారంలో బిజెపి పార్టి కన్నా ఎంతమేరకు అవకాశం ఇచ్చారు? ఇప్పించగలిగారు?

   Delete
  6. స్త్రీవాదంపై కమ్యూనిస్త్‌ల విశ్వసనీయత గురించి భాజపావాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. విదేశీ పెట్టుబడుల కోసం స్వేచ్ఛా వాణిజ్యం పేరు చెప్పుకుంటూ ఇంకో వైపు జనానికి వ్యక్తిగతంగా అభివృద్ధి నిరోధక నమ్మకాలని బోధించే భాజపావాళ్ళకా మేము సమాధానం చెప్పేది?! కేవలం బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకునేవాళ్ళు కనిపిస్తేనే "శివశివా, కలికాలం వచ్చేసింది" అనుకునేవాళ్ళు తమకంటే కమ్యూనిస్త్‌లు ఉన్నత భావజాలాన్ని నమ్ముతున్నారా లేదా అని విచారించడం ఏమిటి?

   Delete
  7. పాయింట్ సరిగా అర్థం చేసుకొన్నట్లు లేదు. స్వేచ్ఛా వాణిజ్యం ఈ మధ్య మొదలైంది. అది మొదలు కాక ముందు నుంచి కమ్యునిస్ట్ లు ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. వారితో పాటుగా స్రీవాదులు ఎప్పటి నుంచో వారి వాదనను వినిపిస్తున్నారు. మరి వాళ్లు రాజకీయ అధికారంలో వాట కొరకు వామపక్ష ప్రభుత్వాలను కోరారా? పోని వామపక్ష రాజకీయ నాయకులు మహిళలకు వారి పార్టీలలో ఎంత ప్రాధన్యత నిచ్చారు? బిజెపి ని తీసుకొంటే లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరాని, నిర్మలా సీతారమన్, నజ్మా హెప్తుల్లా, విజయ రాజే సింధియా, వసుంధరా రాజ సింధియా, ఆనందిని బెన్ ఇలా ఎంతో మంది కి అవకాశం ఇచ్చింది. స్మృతి ఇరాని, నిర్మలా సీతారమన్, ఆనందిని బెన్ (స్కుల్ టీచర్) వీరంతా మధ్య తరగతి కుటుంబాలనుంచి వచ్చిన వారు. సాధారణ గృహిణులు.
   కమ్యునిస్ట్ పార్టి లో ఒక్క బృందా కారత్ పేరు తాప్పించి ఇంకెవ్వరి పేరు పెద్దగా వినిపించదు. నువ్వన్నట్లు హిందూత్వవాదులు ఆడవాళ్ళు గడప దాటకూడదనే భావం ఉంటే ఇంతమంది మహిళలను ఇంట్లో కుచొని పెట్టుండాలి. కాని అలా జరగలేదు. మహిళా అభ్యుదయం గురించి మాటలలో ప్రేమ ఒలక బోస్తూ లెక్కలేనన్ని కాల్పనిక కథలు, వ్యాసాలు, పుస్తకాలు రాసేవారు, వారికి నచ్చిన పార్టి అధికారం లో ఉన్నపుడు ఎమి చేశారు? ఎన్ని పదవులు మహిళలకు ఇప్పించ గలిగారు? ప్రభుత్వం సంగతి సరే కనీసం కమ్యునిస్ట్ పార్టి పదవులలో కూడా మహిళల ప్రాతినిద్యం మొదటినుంచి లేదు. ఎందుకని? మహిళల పట్ల ఏ పార్టిలో వివక్షత ఉందో తెలియటంలేదా? ఇది మీరు గురించపోయినా ప్రజలకు తెలుసు. అందుకే సో కాల్డ్ అభ్యుదయ వాదులు ఫేస్ బుక్ లో , సోషల్ మీడీయాలో బిజెపికి ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ఆ పార్టి పూర్తి స్థాయి మేజారిటి తో అధికారం లోకి వచ్చింది. అదే సమయంలో కమ్యునిస్ట్ పార్టిల బలం ఎప్పుడు లేనంతగా విపరీతం గా క్షీణించి పోయాయి.
   పదునైన గోళ్లు గల ఎండ్రకాయలు శక్తినంతటిని కూడ దీసుకొని చెరువులోనుంచి పాకుతూ పైకి రావటానికి ప్రయత్నించినా అవి తిరిగి చెరువులోకే జారిపడుతూంటాయి. కమ్యునిస్ట్ పార్టిలు కూడా అంతే అవి ఎంత తీవ్ర విమర్శలు హిందువుల మీద, వారి సంస్కృతి మీద చేసి అధికారంలో కి రావలనుకొన్నా , ఎండ్రకాయలవలే చెరువులోకి జారిపడతాయి. భారతదేశంలో ఉండే మిగతా మతాలలో కనీస స్థాయిలో సంస్కరణలు లేకపోయిన పల్లెత్తు మాట అనరు. అది అభ్యుదయవాదుల నిజాయితీ. వీరి సంగతి ప్రజలకి బాగా తెలుసు. అందుకే ఎన్నికలలో చాలాచోట్ల మట్టికరచారు.

   Delete
  8. కాలేజిలకు పోయేది చదుకొనటానికి. ముద్దులుపెట్టుకోవటానికి అంత దూరం పోనవసరంలేదు. ఆ పని వాళ్ల ఇళ్ల దగ్గరే చేసుకోవచ్చు. పెళ్లిళు, పేరంటానికి పిలిచినట్లు కుటుంబ సభ్యులను,బంధుమిత్ర సపరివార సమేతంగా అందరిని అహ్వానించి, వారితో పాటుగా మీడియావారిని పిలిపించుకొని ముద్దుల ఫంక్షన్ జరుపుకోవచ్చుగా!
   ప్రజలు చదువుకొన్న వారి నుంచి ఆశించేది ఎంతో కొంత క్రమశిక్షణ. చదువులేని వారికన్నా హీనంగా ప్రవరించటం కాదు. వారి ప్రవర్తన విచక్షణ లేకుండా ఎక్కడంటె అక్కడ, వీధుల్లో, పార్కులో ముద్దులు పెట్టుకొంట్టూ అతి చేస్తే ప్రజలకి తిక్కరేగుతుంది. వీడియో చూడు.
   https://www.youtube.com/watch?v=rsw0F2gDWsA
   ఈ రోజు దేశంలో పెద్ద చదువులు చదివిన వారు, డబ్బులున్నా వారు, మధ్యతరగతి ప్రజలు పాటించే ప్రతినియమాన్ని (ట్రాఫిక్ రూల్స్ మొదలు కొని ) అతి తెలివి ఉపయోగించి ఉల్లంగిస్తూ, వాళ్ల తప్పులను హక్కులు, వ్యక్తిగత స్వేచ్చా అనే ముసుగులో కవర్ చేసుకోవాలను కొంట్టున్నారు. వీరి ఆటలు ఇకపైన చెల్లవు.

   Delete
 2. ముద్దులు పెట్టుకోవడాన్ని అంతగా తప్పు పట్టాల్సిన పనిలేదు. అసలు మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకించాల్సిందే. ముద్దులు పెట్టుకోవడం తప్పు కాదు. ఆడ-ఆడ, మగ-మగ ముద్దులు పెట్టుకోవడం కూడా తప్పుకాదు. ఒక వేల పబ్లిగ్గా అలాంటివి చేయకూడదు అనుకుంటే, దానికోసం ఏదైనా చట్టం చేయడం, దాన్ని అమలు పరచేలా చూడడం వంటి పనులు చేయాలి కానీ దాడులు చేయడం ఎందుకు? మొదట వారు మోరల్ పోలీసింగు అనేది వదిలి చట్ట ప్రకారం చర్యలు తిసుకుంటే, ఈ బహిరంగ ముద్దులు "కిస్ ఆఫ్ లవ్వుల"ను తరువాత నిరసించొచ్చు. అక్కడ వీరేమో వారిని చావబాది, తరువాత నిరసన తెలియజేయొద్దంటే మాత్రం కష్టం.

  అందుకే ఇద్దరికి ఇష్టమై ముద్దులు పెట్టుకుంటే, అందులో తప్పేముంది, దాడులు చేసే హక్కు వీరికెవరు ఇచ్చారు అని ప్రశ్నించాలి కానీ, ముద్దులెందుకు పెట్టుకుంటున్నారు అని కాదు గదా?

  ఇంకో విషయమేమిటంటే, మోరల్ పోలీసింగ్ అంటే అంతా ఆడవారిని అణచివేయడం అనే అభిప్రాయనికి వచ్చేస్తారు కానీ ఈ మోరల్ పోలీసింగులో మగవారు కూడా బలవుతున్నారని మర్చిపోతున్నారు. ఇదే మోరల్ పోలీసింగ్ మగవారి పట్ల చేస్తే అడిగే నాధుడుండదు. మొన్నామధ్య బెంగలూరులోని పబ్బులో అమ్మాలియపైనే కాదు, అబ్బాయిల మిద కూడా దాడి చేశారు కానీ దన్ని ఎవరూ పట్టించుకోలేదు. కేవలం అమ్మాయిలను కొట్టింది మాత్రమే హైలెట్ అయ్యింది. ఇదే ఛాందసులు, అక్కడ అమ్మాయిని మాత్రం గౌరవించి వదిలేసి, అబ్బాయిని పట్టుకుని తన్నింటే .. ఇంత గొడవ జరుగుండేదా? వారు చేయాల్సిందంతా ఒక్కటే, ముద్దు అనేది బహిరంగంగా పెట్టుకుంటే, దాన్ని వద్దు అని చెప్పే బాధ్యత అబ్బాయిదే అని ఒక స్టేట్‌మెంటు ఇస్తే చాలు. ఇన్ని గొడవలు జరగవు.

  ReplyDelete
  Replies
  1. *ఒక వేల పబ్లిగ్గా అలాంటివి చేయకూడదు అనుకుంటే, దానికోసం ఏదైనా చట్టం చేయడం, దాన్ని అమలు పరచేలా చూడడం వంటి పనులు చేయాలి*
   పబ్లిసిటి కోసం చేసే ఇటువంటి చేష్టలకు మళ్లీ చట్టమొకటి ప్రత్యేకంగా చేయాలా? వాటికి పోలిసులు, కోర్ట్, లాయర్లు అంట్టూ వారి సమయాన్ని వృథా చేయటం. ప్రతి దానికి చట్టం చేసుకొంట్టూ పోతే దానికి విలువ ఉండదు, అది సాధ్యమయ్యే పనికాదు. కోర్ట్ లో ఎన్నో లక్షల కేసులు మూలుగుతున్నాయి. వాటి పరిష్కారానికి వందల సంవత్సరాలు పడతాయని అంచనా వేసినవారు ఉన్నారు. న్యాయం కోసం సామాన్య మానవులు కాళ్ళరిగేలా వాటి కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ, చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. కోర్ట్ వ్యవహారాలు తెలియని వారు, అనుభవం లేనోళ్లు ఇలాంటి ఉచిత బోడి సలహాలు ఇస్తారు.

   Delete
  2. @UG Sriram
   మరి పబ్లిసిటీ కోసం చేసే ఇలాంటి వాటిని నిలువరించడానికి ఏమి చేయాలి? కొన్ని "మూకలను" ఉసిగొల్పి దాడులు చేయించాలా? ఆ "మూకలు" దాడులు చేసేది కూడా పబ్లిసిటీ కోసమే కదా? అసలు ఒక అమ్మాయి-అబ్బాయి, లేదా అమ్మాయి-అమ్మాయి, అబ్బాయి-అబ్బాయి వారిద్దరికీ ఇష్టమై ముద్దులు పెట్టుకుంటున్నారు అంటే దాన్ని వ్యతిరేకించాల్సిన పనేమిటి? ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. ప్రతీదానికీ మోరల్ పోలీసింగులేనా? అసలు ఇది తప్పు అనో, మన సంస్కృతి కాదు అనో నిర్ణయించడానికి వీరెవ్వరు?

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
  4. *ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. *

   మీకు బహిరంగ ప్రదేశాలలో జరిగే చుంబన దృశ్యాను చూసి సొల్లు కార్చాలాంటే వేరే ఏర్పాట్లు చేసుకొండి. ఎలాగు ఇంటర్నెట్ ఉంది గదా! అక్కడ గూగిలిస్తే ఎన్నో ఉంటాయి.
   ఇక కాలేజిలకు తల్లిదండృలు పంపించేది చదువు కోవటానికి. అది గాలికి వదిలేసి అన్ని విషయాలు నెత్తినకెత్తుకొవటం సరైనపద్దతికాదు. ఆ పోటోలలో వారిని చూస్తే,ఏ చీకు చింతా లేని కుటుంబాల నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. అటువంటి వారికి చదువుకన్నా ఇతర అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంట్టుంది. ఈ ముద్దు ముచ్చట్లు కాలేజి లో నే ఎందుకు? ఆ చేసేపనేదో వారి అపార్ట్ మెంట్ల ముందర బంధుమిత్ర సపరివార సమేతంగా కుటుంబ సభ్యులందరిని ఆహ్వానించి, ముద్దుల పండగ ని వేడుకగా చేసుకోమనండి. ఎవరు వద్దన్నారు?

   *అసలు ఒక అమ్మాయి-అబ్బాయి, లేదా అమ్మాయి-అమ్మాయి, అబ్బాయి-అబ్బాయి వారిద్దరికీ ఇష్టమై ముద్దులు పెట్టుకుంటున్నారు అంటే దాన్ని వ్యతిరేకించాల్సిన పనేమిటి?*

   ఇప్పటివరకు మనసమాజం లో, భారత సంస్కృతి మీద గౌరవం గల ప్రజలు చదువుకి, చదువుకొనే వారికి విలువ ఇచ్చారు. దానిని నిలుపుకోవలసిన భాధ్యత చదువుకొనే వారు, చదువుకొన్న వారి పైన ఉంది. బహిరంగ ప్రదేశాలలో మా జీవితాలు మా యిష్టం. మేమైనా చేస్తాం అనటానికి ఒక హద్దు ఉంది. ఎడ్డెమంటే తెడ్డేంగా అడ్డుగోలువాదన చేస్తే పరిణామాలు వేరేవిధంగా ఉంటాయి. ఈ క్రింది వీడీయో చూడండి. సామాన్య ప్రజలు, మహిళలు ఎంత విసిగిపోయి ఉన్నారో అర్థమౌతుంది. రేపు కాలేజిలో, కాలేజిల ముందర ఇదే కామన్ సీన్ అవ్వదని గేరంటి ఎమిటి? ఆ కాలేజి దారినపోయే వారందరు తలలు వచ్చుకొని పోవాలా?

   https://www.youtube.com/watch?v=rsw0F2gDWsA

   ఈదేశంలో 99.9999% చదువుకొనే వారు, తల్లిదండృల సంపాదన తో చదువుకొంట్టున్నారు. అమేరికాలో వలే, స్వశక్తితో హోటల్స్ లో పనిచేస్తూ డబ్బులు సంపాదించుకొని చదవటం లేదు, వ్యక్తిగత స్వేచ్చ,స్వాతంత్రాల గురించి అతిగా ప్రతిస్పందిస్తూ, ఉపన్యాసాలు ఇవ్వటానికి. పార్క్ లో చేసే వెధవ పనులు, ఇప్పుడు కాలేజి ల లో చేస్తున్నారని, అడ్డుకొన్నవారిని అతి తెలివి వాదనతో ఇబ్బంది పెడుతున్నారని అర్థమైతే, పేద, మధ్య తరగతి తల్లిదండృలు పిల్లలకు చదువుసంధ్యా ఎమి అవసరం లేదని, ఇంట్లో కూచొపెడతారు. అలా ఇంట్లో కుచునే వారు ఎక్కువగా ఆడపిల్లలే అవుతారు.

   Delete
  5. వారు ముద్దు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు అని (ఇండైరెక్టుగా)చెప్పానే కానీ, వారిని చూసి సొల్లు కార్చుకుంటానని మీరు ఎందుకు అనుకున్నారు? నేనూ ఒకమ్మాయిని చూసుకుని ముద్దు పెట్టుకుంటానేమో? ముద్దు పెట్టుకోవడాన్ని తప్పు పట్టడం ఎందుకు? కాలేజీ ఆవరణలో ముద్దులు పెట్టుకోకూడదు అనే రూలు పాస్ చేస్తే తప్పులేదు. ఎందుకంటే, కాలేజీలలో సిగరెట్లు, గుట్కాలు, మధ్యం వంటివి నిషేధం. కానీ, సిగరెట్లు, మధ్యం తాగడం అన్నిచోట్లా నిషేధం కాదు కదా?

   మన సంస్కృతి ప్రకారం చాలా జరగడం లేదు. అసలు సముధ్రాలు దాటడం కూడ తప్పు అని విన్నట్టు గుర్తు. అయినా అంతా ఎంచక్కా, విదేశాలకు వెలుతున్నారు కదా? ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే కాన్సెప్టు బాగానే ఉన్నా, మోరల్ పోలీసింగులు చేసి, వారి మీద దాడి చేయడం అనే కాన్సెప్టు బాగలేదు. ఇప్పుడు ఇది, మరో రోజు ఇంకోకటి. రేపు మీరు కూరగాలయకోసం వెలుతూ దారిలో ఒక టీ తాగారనుకుందాం, ఏవడొ ఒక వెధవాయ్, అలా దారిలో టీ తాగడం తప్పు, ఇంట్లోనే తాగాలని నలుగురిని వెంటేసుకుని కొడతాడు. ఏమంటే, దారిలో తాగే "టీ" వలన బోలెడన్ని రోగాలు వస్తాయి, ఆ రోడ్ల మీద ఉన్న కాలుష్యం, పొగ వంటిని ఆ టీ లో కలుస్తాయి, మీకోసమే చెబుతున్నాను అంటారు. ఇదంతా జరగడానికి కావలసింది కేవలం అలా భావించే ఒక "గుంపు", ఆ "గుంపు"కు ఒక రాజకీయ అండ అవసరం అంతే.

   అయినా, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు అనగానే దాడులు చేయడం ఏ సంస్కృతి? బహిరంగంగా ముద్దులు పెట్టుకుఓవడం తప్పని మీరు భావిస్తే, నిరసించేందుకు వేరే పద్దతి చూసుకోవాలి కానీ, దాడులు చేయడం ఎంత వరకు సబబు? ఇక పోతే మన సంస్కృతి అంటారా? సర్వ నాషనం అవ్వనివ్వండి, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఏమిటి? పరిరక్షించి ఏం బావుకున్నాం ఇప్పటి వరకు?

   Delete
  6. మీరు ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటికి వీలు చూసుకొని సమాధానం ఇస్తాను. ఇక సముధ్రాలు దాటడం కూడ తప్పు అని మీరేక్కడ విన్నారో నాకు తెలియదు. అది సన్యాసులకు అయి ఉండవచ్చు. సమాజంలో అందరికి కాదు. బ్రిటిష్ వాడు రాక ముందే మన నౌకా బలం ఎంతో ఉచ్చస్థితిలో ఉండేది. సముద్రం దాటకుండా వాంకోవర్ లలో హిందూ దేవాలయాలు ఎలా ,ఎవరు పోయి నిర్మించారు?

   Delete
 3. రాజ్యంగా పరంగా చూస్తె బహిరంగ ప్రదేశాలలో ఇలాంటివి చెయ్యడం నిషిద్దం, తరువాత ఇంకో విషయం ముద్దు పెట్టుకోవడం ప్రేమను చూపడం క్రింద చూస్తారు ఈ తరం, కానీ ప్రేమను వ్యక్త పరచడానికి ఒక నవ్వు చాలు, వాళ్ళు ఇంట్లో ఏదో పందెం వేసుకుని బయట ముద్దు పెట్టుకోలేదు అని అనుకోకూడదు
  ఇక మీరు అన్న రెండవ విషయం ఆలోచిస్తే మీరు చెప్పిన మొదటి దానికే వ్యతిరేకం చెబుతున్నారు!

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. గెల్లి గారు,

  భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్/క్లాజ్ ప్రకారం “బహిరంగ ప్రదేశాలలో ఇలాంటివి చెయ్యడం నిషిద్దమో” తెలియచేస్తారా?

  ReplyDelete
 6. Kissing, Hugging, Women wearing "skimpy" Western Clothing, Live-in Relationships are all Obscene??? They OFFEND your sentiments.
  Religious Conservatives and their shitty sense of morality & ethics (& I'm not just talking of Hindus but everyone else including those depraved hypocrites who hate Sanghis but have a soft corner for bearded men who hang atheists & homosexuals and stone women to death)
  Let me tell you what's really Obscene & Offensive.
  * People recklessly littering, spitting & urinating on the streets, that's Obscene & Offensive
  * Boorish, Uncouth & Perverted men steering, stalking & some even groping females as young as 8 & as old as 80. That's Obscene & Offensive
  * So much poverty & hunger on the streets. People forced to beg after beggar mafias chop off their limbs. Thousands defecating in the open because over 60% of Indian people either can't afford or don't have access to modern sanitation facilities, some because of their "Caste". That's Obscene & Offensive.
  * Corporal Punishments inflicted by Teachers & Ragging of Freshers in educational institutions. That's Obscene & Offensive
  * Our big metropolitan cities being some of the most polluted cities in the world, that's Obscene & Offensive.
  * A Prime Minister who proudly denies Climate Change and instead, endorses Pseudo-Science, that's Obscene & Offensive.
  # Caste & Religion based Apartheid in many interiors of the country, that's Obscene & Offensive.
  But strangely, two or more consenting Adults expressing LOVE to each other Openly or wearing whatever they find comfortable or having pre-marital sex, those are much bigger problems and they make you lose your sleep.
  If only uou were even half as OFFENDED by all the Obscene facts that I listed
  Instead, most of you contribute to all this Obscenity.

  - Author Sushant Taing (https://www.facebook.com/sushant.taing)

  ReplyDelete
 7. Morals need policing at the social level because all social goods and bads are products of police departments everywhere in the world.

  ReplyDelete
  Replies
  1. But even in all those countries, policing did happen at the state level. What is granted and has been warranted at the social level is the right of criticism but not action.

   Delete
 8. కిరణ్ గారి ప్రశ్నలో తిరకాసుంది. అసలు మోరల్ పోలీసులు అవసరమా అన్న ముఖ్య విషయానికి జవాబు రాకుండా నిరసన ఎలా చూపాలి అన్న చిన్న విషయానికి రాలేము.

  ReplyDelete
  Replies
  1. ఏమో జై గారు....నాకు అంతా అవగాహన లేదు... కానీ, మోరల్స్ కు భంగం వాటిల్లినప్పుడు మాత్రమే మోరల్ పోలిసింగ్ వెలుగు లోకి వస్తుందేమో.... నిరసన తెలిపిన విధానం మాత్రం కొంచం జుగుప్సాకరం గానే వుంది.... ఒకవేళ మన ఇంట్లో ఆడబిడ్డలు అలాంటి కార్యక్రమానికి వెళ్తే మనం ఒప్పుకునే పరిస్థితులలో వుంటామా????

   Delete
  2. @ KIRAN KUMAR

   << ఒకవేళ మన ఇంట్లో ఆడబిడ్డలు అలాంటి కార్యక్రమానికి వెళ్తే మనం ఒప్పుకునే పరిస్థితులలో వుంటామా???? >>

   మగపిల్లలయితే ఫర్వాలేదా!?

   Delete
  3. చట్టాల పరంగా చూస్తే డబ్బు మార్పిడిని రుజువు చేసే వ్యవహారాలు మాత్రమే వ్యభిచార సంబంధిత వ్యవహారాలుగా పోలీసులు కల్పించుకోదగినవిగా వుంటాయి.లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టవచ్చు! ఆ ప్రదేశానికి దగ్గిర్లో వున్న ప్రాంతవాసులు పెడితే తప్పనిసరిగా పోలీసులు ఆపగలుగుతారు.

   అసలు యెందుకు మోరల్ పోలీసింగుకి వ్యతిరేకంగా ఇంత గట్టిగా మొండిగా ఈ కుర్రాళ్ళూ అమ్మాయిలూ ఇలా తెగబడుతున్నారు?యెవరయినా వెనక వుండి స్పాన్సర్ చేసి వీటిని వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారా?నేను చార్లీ "చాప్లిన్ ట్రాంప్ - రాజ్ కపూర్ ఆవారా" పోష్టులో ప్రతి నగరంలోనూ ఒక లవర్స్ పార్క్ వుందటం గురించి రాసాను.ఆ నిర్వాహకులు తమ లాభం కోసం ఇదంతా చేయిస్తున్నారా?ఈ ఆడా మగా పిల్లలే వాళ్ళ కస్తమర్లు గదా!

   ధిక్కారం సరయిన దానికోసం సరయిన పధ్ధతిలో వుంటే చాలా చక్కగా సమర్ధించవచ్చు.లోకంలో యెన్నో అన్యాయాలు జరుగుతున్నాయి.రేషన్ షాపుల దగ్గిర్నుంచి పైరవీలతో మిలియన్ దాలర్ల కాంట్రాక్టులు రాబట్టుకోవటం వరకూ వేటిమీద ప్రతిస్పంచటాని కయినా ఈ బహిరంగ ముద్దుల వికృతత్వం పనికొస్తుందా?కేవలం బహిరంగంగా ఈ పనులు చెయ్యాలి, పైగా ఘనకార్యం చహెసినట్టు చప్పట్లు కొట్టించుకోవాలన్న దురద తప్ప యే అన్యాయాన్ని ధిక్కరించటానికి పనికొస్తాయి ఈ పిచ్చి పనులు?

   Delete
  4. నా స్పందన "పోలీసింగ్ - మోరల్ పోలీసింగ్ మధ్య తేడా ఏమిటి? సమాజాన్ని పరిరక్షించడంలో వీటి పాత్ర - పరిధి ఎలా ఉంటున్నది? ఎలా ఉండాలి?" అనే నూతన టపాలో రాస్తాను

   Delete
  5. @జై గారు,

   రెండేళ్ల క్రితం డిస్కవరి చానల్ లో గోవా గురించి చూపారు. అక్కడ టురిజం పెరిగి పెద్దదైన తరువాత విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ధరించే ద్ బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకోవటం గురించి ఉంది. రాను రాని వీరి సంఖ్య పెరిగి, బీచ్ కూ దూరంగా ఉండే ఇళ్ల దగ్గర కూడా చేరుకొన్నారు. దీనివలన ఆ ఇంట్లో నివసించే వారు ఎంతో అసౌకర్యానికి గురౌతూ, వారి బాధను వెళ్ల గక్కారు. ఐదో తరగతి లోపు చదివే చిన్నపిల్లలు పర్యాటకుల చుంబన దృశ్యాలు అర్థం కాక పెద్దలను అడగటం, పెద్దలకు ఎమి చెప్పాలో, ఎలా చెప్పాలో పాలుపోక పోవట్లేదంటు బాధను వెళ్ల గక్కింది. అంతే గాక పిల్లలు పర్యాటకులు బహిరంగ ప్రదేశాలలో చేసే వెకిలి చేష్టలు నిశితంగా పరిశిలిస్తున్నారని. కొన్ని సార్లు స్కుల్ ముందరగా వదిలితే, ఇంటికి రాకుండా దారిలో వీరూ చేసే చేష్టలను చూస్తూ కుంచుంట్టున్నారని, అది వారి మానసిక పరిస్థితి పైన ప్రభావం చూపుతున్నాదని, ఆ పిల్లల తల్లి దుష్ప్రభావాలన్నిటిని ఏకరువు పెట్టింది. టురిజం వలన ఆయా ప్రదేశాలలో నివసించే స్థానికుల జీవితాలు పెనుమార్పులకు లోనౌతాయి.

   మోరల్ పోలిసింగ్ అవసరమా అంటే? ఏది అవసరమనేది పరిస్థితులను బట్టి ఉంట్టుంది. ఇక్కడ వీరి అభ్యంతరం కాషాయ జెండావారు చేశారనే! వారు చేయకపొయినా, సమయం వస్తే బాధితులు, స్థానిక మహిళలే ముందుకు వచ్చి ఆ మోరల్ పోలిసింగ్ చేస్తారు. మహిళలు ఎందుకు చేస్తారు? అంటే అది వారి పిల్లల పైన ప్రభావం చూపుతుంది కనుక. ఈ వ్యతిరేకించే వారే దానిని అప్పుడు ఉప్పొంగిన మహిళా చైతన్యం అని పొగుడుతారు. ఈ విడియో చూడండి. గృహిణులు ఎంత విసుగెత్తి పోయి ఉన్నారో! ఆ విడీయో లో పోలిసులు మేము మానిటర్ చేస్తున్నామని చెప్తున్నా,పార్క్ లో ఆ సంఘటనలు ఆగటం లేదు. అవి ఆగాలంటే పోలిసులకు, ప్రజల సహాయం అవసరం.

   https://www.youtube.com/watch?v=rsw0F2gDWsA

   Delete
  6. మోరల్ పోలీసింగ్ ఎందుకు లీగల్ పోలీసింగ్ ఉండగా?

   Delete
  7. మీరు రాసే టపా కోసం ఎదురు చూస్తూంటానండి.

   Delete
  8. *యెందుకు మోరల్ పోలీసింగుకి వ్యతిరేకంగా...యెవరయినా వెనక వుండి స్పాన్సర్ చేసి వీటిని వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారా?*
   I do not know about other states. In Delhi The All India Students' Association (AISA), Students Federation of India (SFI) and the All India Students' Federation (AISF) were the student groups participated in the protest

   Read more at: http://indiatoday.intoday.in/gallery/kiss-of-love-reaches-delhi-protests-rss-kerala-kolkata/7/13360.html

   Delete
  9. *మోరల్ పోలీసింగ్ ఎందుకు లీగల్ పోలీసింగ్ ఉండగా?*
   Kissing in public is not illegal. Having xxx in public is illegal. Anyway, BJYM and VHP activists have no right to take law into their hands.

   Delete
  10. What a joke. Now, you are talking about law and legality, without answering my above questions.

   Delete
  11. పాచిపళ్ళ పాటలకి నేను సమాధానాలు చెప్పడం ఒకటి!

   Delete
  12. పాచిపళ్ళ పాటలకి నేను సమాధానాలు చెప్పడం ఒకటి!

   Delete
  13. హా హా హా ! నీదగ్గర సమాధానాలు ఉంటే కదా చెప్పటానికి. నువ్వు చదివిన పుస్తకాలలో ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాసి ఉండరు. అందువల్ల నీ దగ్గర రాయటానికి సమాచారం లేదు.

   Delete
  14. పార్క్‌లలో ముద్దు పెట్టుకునేవాళ్ళని చూసి "శివశివా" అనుకునేవాళ్ళకి నేను సమాధానం చెప్పేదొకటి! భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే ఒక సనాతన ధార్మికురాలిని కేంద్ర మంత్రిని చేసిన పార్తీ అభిమానుల ముందు నేను శంఖం ఊదడమా! నా లెవెల్ ఎక్కడా, వీళ్ళ లెవెల్ ఎక్కడ?

   Delete
  15. *నా లెవెల్ ఎక్కడా, వీళ్ళ లెవెల్ ఎక్కడ?*
   మీరన్నది నిజమే మీ లేవెల్ కి ఎవరు దిగజారలేరు. మీ అథమ స్థాయి ప్రశ్నలకి సమాధానాలు శ్రీకాంత్ ఒక్కడే ఇవ్వగలడు. నా సంగతి వదిలేయ్, నిన్ను మీ కమ్యునిస్ట్ అభిమానులు కూడా మందలిస్తారు. దాని గురించి కనీసం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోరు. హిందువు సంస్కృతి అంటే సరిపడని నువ్వు, మీడియాలో ఇటువంటి సంఘటనలను హీరోయిజం లా ప్రపగండా చేసే ఆదర్శవాదులు, స్రీ పురుషుల సమానత్వం, వ్యక్తిగత స్వేచ్చా సిద్దాంతాలను ఆధారం చేసుకొని వాదించుకొంట్టూ పోతే, ఈ కాలపు ఉత్తమ మహిళ గా సన్నిలియోన్ తేలుతుంది. మరి మీలాంటి వ్యక్తిగత స్వేచ్చ పిపాసులు సన్ని లియోన్ ఆదర్శం గా తీసుకొమ్మని జనంలొ ప్రచారం చేయగలరా?

   Delete
  16. ఆ శ్రీకాంత్ (ఆకాశరామన్న)కి కమ్యూనిజం అంటే ఏమిటో కూడా తెలియదు. స్త్రీలు నిక్కర్ వేసుకోకూడదని చెప్పేవాళ్ళందరూ కమ్యూనిష్టులు అంటూ నా బ్లాగ్‌లో వ్యాఖ్య వ్రాసింది అతనే. కమ్యూనిజం అంటే ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యడం. స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది కేవలం ఒక ఉపరితలాంశం అని కూడా తెలియని వ్యక్తి నాకు సమాధానం చెప్పగలగడమా?

   Delete
  17. ఇప్పుడు కూడా నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. వ్యక్తిగత స్వేచ్చ సిద్దాంతం, స్రీ పురుష సమానత్వం ఆధారంగా చేసుకొని వాదిస్తే, పేదరికంలో పుట్టి, జీవితకాలం కష్టపడి దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చిన జేసుదాసు ఒక్క పూటలో విలన్ గాను, ఏమాత్రం వ్యక్తిగత పేరు ప్రతిష్టలు లేని , దేశానికి ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు తీసుకురాని, విదేశాలలో ఉంట్టూ ఇక్కడికొచ్చి డబ్బులు సంపాదించుకొనే సన్నిలియోన్, మీడీయా కవరేజ్ ,ఆదర్శవాదుల మద్దతు వలన జీవితంలో అందనంత ఎత్తుకు ఎదిగిన గొప్ప అచివర్ గా కనిపిస్తారు.మరి మీలాంటి వ్యక్తిగత స్వేచ్చ పిపాసులు,ఆదర్శవాదులు సన్ని లియోన్ రోల్ మోడల్ గా తీసుకొమ్మని యువతకు చెప్పగలరా? జనంలో ప్రచారం చేయగలరా?

   Delete
  18. వ్యక్తి స్వేచ్ఛావాది ఫ్రీ సెక్స్ కూడా చెయ్యగలడని చెప్పి బహిరంగంగా ముద్దులు పెట్టుకునేవాళ్ళని నేరస్తులుగా పరిగణించాలని చెపితే కోర్త్ నమ్మదు కదా. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ముద్దుల ప్రదర్శనని అడ్డుకున్నవాళ్ళకి కోర్త్‌లో ఈ సమాధానం చెప్పమనండి చూద్దాం. బహిరంగంగా ముద్దులు పెట్టుకునేవాళ్ళు రేపు సన్నీ లియోన్‌ని ఆదర్శంగా తీసుకుంటారా లేదా అనే వాదన చెల్లదు.

   Delete
  19. This comment has been removed by the author.

   Delete
  20. ఇక ఈ అంశం పై నేను రాసేది ఎమీ లేదు.

   Delete

  21. << ఒకవేళ మన ఇంట్లో ఆడబిడ్డలు అలాంటి కార్యక్రమానికి వెళ్తే మనం ఒప్పుకునే పరిస్థితులలో వుంటామా???? >>
   I won't mind even if my wife goes there. It's not a sin.

   Delete
 9. ఒక నైతిక పరమయిన నియమం వుంది అంటే అందరూ పాటిస్తేనే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది.ఒక సాధారణమయిన పోలిక తీసుకుంటే ఒక శాసన సభకు సంబంధించిన నియోజకవర్గంలో లక్ష వోట్లు వుంటే యే ఇరవయ్ మందో పోటీ చేస్తే 10,000 వోట్లు వచ్చినా సాంకేతికంగా అతడు ఆ లక్షమందికీ ప్రతినిధి అవుతాడు గదా!అతనికి వోటు వెయ్యని వాళ్ళు 90% శాతం వున్నా అతను యెన్నికయ్యాడు గాబట్టి అతన్ని తమ ప్రాంతపు శాసన సభ్యుడుగా గుర్తించి తీరాలి, అవునా?

  నైతికత కూడా అలాగే నడుస్తుంది,అన్ని నైతిక సాంప్రదాయాలూ పెద్దలు అందరికీ చెప్పినప్పుడు ఆ సమాజంలో భాగస్తులుగా వుండాలనుకున్న వాళ్లంతా విధిగా వాట్ని పాటించి తీరాలి.ఇదివరలో ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో కలిసే వుండటం వల్ల వాళ్ళ ద్వారా తెలిసేది పిల్లలకి యేది తప్పు యేది వొప్పు అని.ఆ వెసులుబాటు లేదని చెప్పి అసలు నైతికతను నిర్లక్ష్యం చెయ్యకూదదు కదా?ఈ రకమయిన రౌడీ తరహాలో కాకపోయినా మోరల్ పోలీసింగ్ అనేది యేదో ఒక దశలో(ఇవ్వాళ్టి నైతిక భ్రష్టత్వాన్ని తేలిగ్గా తీసుకునే వాళ్ళు కూడా గుర్తించగలిగేటంత స్పష్టత వచ్చినప్పుడయినా) యెంతో కొంత మేరకు అవసరమే!లేని పక్షంలో పదమూడేళ్లకే బిడ్డతల్లులయ్యే ఆదపిల్లల్ని ఇక్కడ కూడా భరించాల్సి వస్తుంది?!

  ReplyDelete
 10. @ Kondala Rao Palla గారు....
  విలువలు ఎవరికైనా ఒకటే... ఆడ , మగ తేడా లేదు.... విలువలు అంటే మళ్ళీ వస్త్ర ధారణ వైపు వెళ్ళకండి.... నైతిక విలువలు అని నా అభిప్రాయం... మగ బిడ్డ లకు అని కూడా రాద్దాము అని అనుకున్నాను... కానీ, స్త్రీ స్వేచ్చ గురించి కదా ఇంత జరిగేది.... అని ఆడ బిడ్డలు అని రాశాను అంతే.... ఏది ఏమైనా మళ్ళీ ఆంక్షల పట్ల నిరసన వ్యక్తం చేస్తామని ఇంకేదో అశ్లీల, అసభ్యకరమైన ప్రదర్శన చేస్తే ????????

  ReplyDelete
  Replies
  1. బాగా గమనిస్తే అక్కడ జరిగినదానికి స్రీ స్వేచ్చ కి పెద్దగా సంబంధం లేనట్లుంది. ఈ మధ్య జె.యన్.యు. లో ఏ.బి.బి.పి. విజయకేతనం ఎగురవేసింది. అదొక ఎర్ర కోట . అక్కడ హాస్టల్స్ లోవయోవృద్దులు కూడా విద్యార్దుల గా కొనసాగుతూంటారు. ఆ ఎర్రకోటకు బీటలు వారేటప్పటికి,వారికి అసహనం వెల్లువేత్తింది. అందువలన వారి ప్రాబల్యం ఉండే విశ్వవిద్యాలయాల్లో, రాష్ట్రాలలో వారికి తెలిసిన ఇటువంటి సాంస్కృతిక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నట్లు అర్థమౌతున్నాది (శ్రీకాంత చారి గారు లింక్ కు చూసిన తరువాత వెలిగింది). కేంద్రంలో బిజెపి, యునివర్సిటిలలో వారి పరాజయం తట్టుకోలేక కసి బోక మసి పూసుకొన్నట్లు, వాళ్ల కోపాన్ని వెలిబుచటానికి నిర్వహించే కార్యక్రమం. బిజెపి గెలుపును అతని వ్యతిరేకులు తట్టుకోలేకున్నారు. మోడి వ్యతిరేకులు ఇంత డిసప్పాయింట్ కు లోనౌతారని కలలో కూడా ఊహించలేదు. పాపం! పదేళ్లు గా వారు చేసిన అనాలిసిస్ లు అన్ని బోగస్ అని ఈ ఎన్నికలు నిరూపించేటప్పటికి చెప్పలేని బాధవారికి. కమ్యునిస్ట్ మేధావుల నిరాశకు ఇంకొక ప్రధాన కారణం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడు, వీరు వివ్ధ కమిటీలలో సాభ్యులుగా ఉంట్టు, వెనుక కూచొని చక్రం తిప్పుతూండేవారు. ఆ అవకాశం భవిషత్ లో లేదు కనుక డిప్రెషన్ కు లోనౌతున్నరు.

   Delete
 11. Replies
  1. దీన్నే బోడిగు౦డుకి బట్టతలకీ ముడి పెట్టడం అంటారు. బహిరంగ౦ గా మూత్ర విసర్జన చేయడాన్ని ముద్దు పెట్టు కోడానికి లంకె పెట్టడం తో మేధావితన౦లో మార్క్స్ ని మించి పోయారు... మనదేశ౦లో బహిరంగ౦ గా మూత్ర విసర్జన చేయడ౦ చాలా కాలంగా అనాదిగా ఉన్న అలవాటు ..ఒకప్పుడు అది సమస్య కానేకాదు. ఇప్పుడేవరూ అది సరైనదనడ౦ లేదు. కానీ పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల బహిర౦గ మూత్ర విసర్జన సరైనా సౌకర్యాలు లేక ఉన్నా నిర్వహణ సరిగా లేక అవగాహన లేక లా కొనసాగుతున్న దూరాలవాటుగానే అ౦దరు పరిగణిస్తున్నారు..అయితే రే౦డి౦టి నీ ఒకే గాటనకట్టి చూస్తే రెండు తప్పే అవుతాయి కదా....

   Delete
  2. Contageous diseases వస్తే అర్థమవుతుంది, బహిరంగ మల విసర్జన వల్ల ఎంత సమస్యో.

   Delete
  3. బహిరంగ మల మూత్ర విసర్జనలవల్ల సమస్యలున్నట్లే బహిరంగ ముద్దులవల్లా సమస్యలుంటాయనేది నా అభిప్రాయం. ప్రభుత్వం మల మూత్ర విసర్జనలకు తగు ఏర్పాట్లు చేయాలి. మూత్ర విసర్జనను మితిమీరి కంట్రోల్ చేసుకోలేము కనుక. ముద్దు సెక్ష్ అనేవి జీవితంలో లేదా మనిషి అవసరాలలో ఓ పార్ట్. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అభ్యాస వైరాగ్యములు లేదా ఇతర సాంస్కృతిక అలవాట్లు ఏజెన్సీలు ఉన్నాయి. చారిత్రక క్రమంలో ఆ అవసరాల రీత్యా ఏర్పడినదే కుటుంబ వ్యవస్థ లేదా వివాహ వ్యవస్థ అనేవి. అయితే వాటిలో ఉండే లోపాలపై కూడా మార్పులు జరుగుతాయి. ఏ మార్పైనా గతం కంటే బెటర్ గా ఉండేదానికి ప్రజా మద్దతు ఉంటుంది తప్ప. తిరిగి ఆదిమ మానవుడిలా తయారవుతామనడానికి ...... మా ఒళ్లు మా ఇష్టం అన్నట్లు విచ్చలవిడిగా ప్రవర్తించడం ద్వారా ఇదే స్వేచ్చ అనే మూర్ఖపు ఆలోచనలు చేయడానికి సమాజపు మద్దతు ఉండదు. మోరల్ పోలీసిన అనేది మాత్రం శుద్ధ తప్పు. అభ్యంతరకరమైనదే. మోరల్స్ ని పోలీసింగ్ లేదా మోరల్ పోలీసింగుల వల్ల నిలబెట్టలేము. సామాజికి ఏజెన్సీల ద్వారా వ్యక్తుల చైతన్యం పెంచే అనేక చర్యల ద్వారా మాత్రమే కాపాడగలం. అవి అవసరం + ఎప్పటికప్పుడు అవి కూడా అభివృద్ధి చెందుతాయి కూడా. మోరల్ పోలీసింగ్ అనేది ఈ చర్యకు ప్రతిబంధకమైనది మరియు అభివృద్ధి నిరోధక భావాల ముసుగులో జరిగే అభద్రతా భావపు పిచ్చి చర్యలు మాత్రమే. ఏది స్వేచ్చ? ఏది నియంతృత్వం? ఏది నియంత్రణ? ఏది సరైన పోరాట రూపం? ఏది సరైన పోరాట పద్ధతి? ఏది ఎప్పుడు ఎంతమేరకు అవసరం? అనేవి ఆయా పరిస్తితులను బట్టి, ఆచరణలోని అనుభవాలను బట్టి శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలి. ఎవడిమీదనో కోపంతో వాడేదో పిచ్చి పని చేశాడని నేను అంతకంటే పిచ్చ పని చేసి అదే పోరాటమంటానంటే జనం నవ్వు కుంటారు. జనానికి దూరం అవుతారు.

   Delete
  4. "మా ఒళ్లు మా ఇష్టం అన్నట్లు విచ్చలవిడిగా ప్రవర్తించడం ద్వారా ఇదే స్వేచ్చ అనే మూర్ఖపు ఆలోచనలు చేయడానికి సమాజపు మద్దతు ఉండదు. మోరల్ పోలీసిన అనేది మాత్రం శుద్ధ తప్పు"

   అసలు మీరేం రాశారో, మీరు దేన్ని సమర్ధిస్తున్నారో, దేన్ని వ్యతిరేకిస్తున్నారొ మీకెమైనా తెలుస్తుందా? నుందు మీరు మీ confused స్థితినుండి బయటికి రండి. మీ ఆలోచన ధోరణి (శారీరక శ్రమలనిదక్క మేధోశ్రమని గుర్తించని) మార్క్సిజం (మీరు మిమ్మల్ని free thinkerగా ప్రకటించుకున్నట్లు నాకు తెలియదు). కానీ మీరు మంచనిపించుకోవాలంటే ఛాందసాన్ని చూసీచూదనట్లుగా వదిలెయ్యడమేగాక సమర్ధించాలికూడా కాబట్టి మీరు అప్పుడప్పుదు ఇలా మాట్లాడుతుంటారని నా గమనింపు. బాధ శారీరకం. మనోభావాలు గాయపడడం is the purest form of nonsense!. మీ ప్రజ బ్లాగువల్ల కొందరి మనోభావాలు గాయపడ్డాయి. ప్రతిగా మీరు ప్రజను బంద్ చేశారా?

   స్వ్ఛ్ఛ అన్నమాటకు అర్ధం తెలుసుకోండి. స్వ ఇఛ్ఛతో మసలగలగడమే స్వేఛ్ఛ. ఆ మసలడువల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకుంటే ఆ మసలుడు ఒక మంచితనం. కామసూత్రను అందిచిన ప్రపంచానికందించిన దేశంలో, దేవాలయాలమీద రతికళల దృశ్యాలు చెక్కబడిన దేశంలో, తల్లులవంటి దేవతలనుకూడా అంగాంగమూ వర్ణించి తాదాత్మ్యం పొందిన దేశంలో.. ముద్దు ఎలా తప్పయ్యింది? ఇంతటి అసహనం ఎలా వచ్చిపడించి?

   Delete
  5. నా దేహమ్మీద నాకు హక్కులేకుంటే, ఇంకెవరికున్నది? సమాజానికా? ఇక మాత్రానికి మనిషి దేహమెందులకు? సమాజానికే ఒక దేహన్నిచ్చి మనిషిని దేహరహితుడిని చేయవలసిందికదా ఆ భగవంతుడు. మీరు ఉన్నపళంగా శ్వాసించడం మానేయాలని సమాజం శాశిస్తే మీరు మానేస్తారేం!?

   Delete
  6. చట్టం వేరు, నీతి వేరు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం నేరం కాదు, బహిరంగంగా సెక్స్ చెయ్యడం మాత్రం నేరమే. ఈ నిజం మాట్లాడితే మా ఒళ్ళు, మా ఇష్టం అనుకునేవాళ్ళని సమర్థించినట్టు కాదు. బహిరంగంగా సెక్స్ చేసేవాళ్ళని పోలీసులు అరెస్త్ చేస్తారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎక్కడా అనుమతించరు.

   Delete
  7. శ్రీనాధ్ గారు నేను మార్క్సిజాన్ని మక్కీకి మక్కీగా అనుకరించను. మార్క్సిజంలో ఉన్న మంచిని స్వీకరిస్తాను. మార్క్సిజం మేధో శ్రమను గుర్తించదనేది తప్పు. మార్క్స్ మేధో శ్రమకు తగిన విలువని ఇచ్చాడు. మేధో శ్రమ కూడా దోపిడీకి గురవుతుందనే చెప్పాడు.

   నా దేహం నా ఇష్టమైతే నేను బట్టలు లేకుండా సభ్య సమాజంలో తిరుగుతాను అంటే సరిపోతుందా? ఇతరులకు ఇబ్బందిని కైగించని రీతిలో కొన్ని పద్దతులకు కట్టుబడితేనే సమాజం మనుగడ సాగించగలుగుతుంది. ఎవరి దేహం మీద వారికిష్టం ఉంటుంది. దానికి పద్ధతులు పరిమితులూ ఉంటాయి. వాటికి మోరల్ పోలీసింగ్ అవసరం లేదంటున్నాను. మోరల్ పోలీసింగ్ వేరు. మోరల్స్ వేరు. మోరల్స్ కూడా సమాజాలలో ఆయాకాలాలను బట్టి మారుతుంటాయి. ఇంతకుమించి ఇందులో వివరించాల్సి ఉంటుందనుకోవడం లేదు.

   Delete
  8. "ఇతరులకు ఇబ్బందిని కైగించని రీతిలో కొన్ని పద్దతులకు కట్టుబడితేనే సమాజం మనుగడ సాగించగలుగుతుంది."


   ఈయొక్క సమాజం నా దయాదక్షిణ్యాలపై ఆధారపడి మనుగడసాగిమంచేది (మీరొప్పుకున్న) నిజమే ఐతే ఐతే, అది నామీద అజమాయిషీ చెలాయించడం నాకు సుతరామూ ఇష్టం లేదు. తనమనుగడకోసం సమాజం నన్ను దెబిరిస్తే నెను కరుణించగలను అంతేతప్ప నాపై అధికారం చలాయించాలనుకుంటే నేను సహించజాలను.

   "మోరల్ పోలీసింగ్ వేరు. మోరల్స్ వేరు."

   మీరు నిజ్జంగా ఈ విషయంపై అవగానతో మాట్లాడుతున్నారని నాకు అనిపించడంలేదు. Could you explain your words please. ఈంఆటనన్న మీరే ఇంకోమాటకూడా అన్నారు. Please continue...

   "మోరల్స్ కూడా సమాజాలలో ఆయాకాలాలను బట్టి మారుతుంటాయి."

   మరప్పుడు ఈ గోల ఎందుకు? మారుతున్న, మారిపోయిన మోరల్స్ ను సమర్ధిస్తూ మీ ంవాదనెందుకు? చలామణీలో ఉన్న మోరల్స్ పై మీ వ్యతిరేకత ఎందూ?

   "ఇంతకుమించి ఇందులో వివరించాల్సి ఉంటుందనుకోవడం లేదు."

   సంజాయిషీ దేనీ పడేగీ! ఇలాంటి మాటలు వల్లేవేసి మీరు సంజాయిషీని దాటవేయలేరు. వివరణెప్పుడూ అవస్యకమే. మీకు వల్లగాకపోయినంతమాత్రాన అనవసరం అనుకుంటే ఎలా?

   Delete
  9. ముద్దులు పెట్టుకోవాలా, వద్దా అనేది మార్క్సిజం చెప్పదు. అయినా ముద్దులు పెట్టుకోవడం తప్పని మార్కిస్త్‌లు ఎవరూ అనుకోరు. మార్క్సిస్త్‌లు దాన్ని కేవలం ఒక వ్యక్తిగత విషయంగా పరిగణిస్తారు. రాజ్యం ఎలా పని చేస్తుంది, చట్టం దేనిని నియంత్రిస్తుంది & దేనిని నియంత్రించదు లాంటి విషయాలు మార్క్సిస్త్‌లు కాని వాళ్ళకి కూడా తెలియాలి. అది తెలియకపోవడం వల్లే కదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవాళ్ళని కొంత మంది సమర్థిస్తున్నారు.

   Delete
  10. కొండలరావు గారు, యూరోప్‌లో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం సామాజికంగా నిషిద్ధం కాదు. అక్కడ మార్క్సిస్త్ కూడా తన ప్రేయసిని బహిరంగంగా ముద్దు పెట్టుకుంటాడు. అరబ్ దేశాలలో పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం కాదు. అక్కడ మార్క్సిస్త్ కూడా తన పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకోగలడు. ఇందియాలో ఆ రెండూ నిషిద్ధం కదా అని ఇందియాలో ఉన్న మార్క్సిస్త్‌లు ఆ రెండిటినీ వ్యతిరేకించాలా? దేశానికి ఒకలాగ మారేదాన్ని మతమనో, విశ్వాసమనో అంటారు కానీ మార్క్సిజం అనరు.

   Delete
 12. కొండలరావుగారూ,

  ప్రవీణ్ అనే మహానుభావుడికి బోధించగలవారు భూమండలంలో పుట్టలేదనే భావిస్తున్నాను. ఇక లాభం లేదు.
  ఇసుమంత చీకాకు ఉన్నా ఈ విధానం ఆలోచించండి, ఉపయుక్తంగా ఉంటుందేమో.

  1. కొందరు నిరంకుశవ్యాఖ్యాతలను దేవిడీమన్నా (black list) చేయండి.
  2. మోడరేషన్ చేయండి వ్యాఖ్యలను.
  3. దేవిడీమన్నా చేయబడిన వారు తప్ప మిగిలిన వారి వ్యాఖ్యలను ప్రకటించండి వీలైనంత తొందరగా.

  ఇలా చేయటం వలన సహేతుకంగా మాట్లాడేవారి వ్యాఖ్యలే అనుమతిస్తారు కాబట్టి, చర్చలు సూటిగా, క్లుప్తంగా అర్థవంతంగా జరిగేందుకు మంచి అవకాశం కలుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ ఒక్కడే కాదు కొంతమందితో రెగ్యులర్‌గా చాలామందితో అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మోడరేషన్ వల్లా ఇబ్బందులు ఉంటున్నాయి. నేను రెగ్యులర్గా కంప్యూటర్ ముందు కూర్చునే స్తితి ప్రస్తుతం లేదు. అయితే ఈ సమస్యలకు ఓ పరిష్కారం కొరకు ఆలోచిస్తున్నాను.

   Delete

 13. అబ్బాయి ప్రవీణు,

  బ్లాగు కామెంట్ల లో 'సెంచురీ కామెంట్లు జూసి చాలా 'సెంచురీలు' అయ్యేయి! ఆ పాత కాలపు సెంచురీ కామెంట్ల పరంపర మరియు నీ విశ్వ రూపం ఒక సారి చూపించ వలె !!


  ఇట్లు
  జిలేబి

  ReplyDelete
 14. చిన్నచిన్న విషయాలలో రాజ్యం (state) జోక్యం చేసుకోదు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేధించడం సాధ్యం కాదు. అలాగని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎక్కడా అనుమతించరు. అలా అనుమతిస్తే ఒకడు ఒక మహిళని రేప్ చేసి "ఆమె ప్రవర్తన మంచిది కాదు కనుకనే నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుని రేప్ చేసాను" అని సమాధానం చెప్పగలడు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top