అంశం : వస్త్రధారణ
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.


భారతీయులలో వస్త్రధారణలో మార్పులెందుకు జరుగుతున్నాయి?

మహిళలపై అత్యాచారాల నిరోధానికి కారణాలుగా స్త్రీల వస్త్ర ధారణలో మార్పులు కూడా సూచిస్తున్నారు కొందరు. అత్యాచారాలకు వస్త్రధారణే కారణమైతే రేప్ కు గురవుతున్న వారంతా అలాంటివారే కావాలి కదా? అలా అని చెప్పి వస్త్రధారణలో విచ్చలవిడితనాన్నీ సమర్ధించలేం. సినిమాలలో వస్తున్న ధోరణి మన సంస్కృతిని నష్టపరచేలా విశృంఖలంగా తయారయిందనవచ్చు. మన భారతీయ సంస్కృతిలో నిజానికి స్త్రీ పురుషులు ఇరువురికీ డ్రెస్ కోడ్ ఉన్నతంగానే ఉన్నది. అయితే ఇద్దరిలో వస్త్రధారణలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటే అది కొనసాగుతుందనడంలో సందేహం లేదు. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నట్లు వస్త్రధారణలో మార్పులవల్ల సమాజంలో చెడు భావాలు పెరుగుతున్నాయనేదానిలో వాస్తవం ఎంత? వస్త్రధారణ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? డ్రెస్ కోడ్ అనేది ఎలా ఉంటే మంచిదని మీ అభిప్రాయం?
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

 1. మిగతా విషయాల్లో మార్పులు జరిగినట్లు ఇందులోనూ మార్పులు జరుగుతాయి. పురుషులు మాత్రం ప్యాంట్లు ఎందుకు వేసుకోవాలీ? అందువల్లనే అకృత్యాలు జరుగుతున్నాయని నేను అంటాను. పాతకాలంలోగా పురుషులు కూడా ధోవతులూ, పంచెలూ కట్టుకోవాలి. అప్పుడు ఆడవారి వస్త్రధారణ గురించి ప్రశ్నించే నైతిక హక్కు పురుషులకు వుంటుంది. నేనయితే ఆడవారు ఏం వేసుకున్నా, ఏం వేసుకోకపోయినా(?!) సమర్ధిస్తాను.

  ReplyDelete
  Replies
  1. శరత్ గారు,

   ఆడవారయినా - మగవారయినా మానవ జాతి వస్త్రధారణ లేని స్తితినుండే నేటి నాగరిక స్తితికి వచ్చాము. అభివృద్ధి లేదా సంస్కృతి ఏదైనా ఎప్పటికప్పుడు ఉన్న స్తితినుండి ఉన్నత స్తితికే వెళుతుంది. మధ్యలో కొంత ఒడిదుడుకులుంటాయి. సంఘర్షణా తప్పదు.

   ఇప్పుడు మీ కామెంటులో నేనైతే ఆడవారు ఏమి వేసుకున్నా, వేసుకోకపోయినా (?!) అని వ్రాసినది నాకర్ధం కాలేదు. ఆడవారికి మాత్రమే ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేయడానికి అలా అన్నారా? అలా అయితే అర్ధం చేసుకోవచ్చు. లేదంటే, ఏం వేసుకోకపోయినా అంటే మనం మళ్లీ అనాగరికులంగా తయారు కావడానికే ఉపయోగపడుతుందది అని నా అభిప్రాయం.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top