ఈ రోజు అవీ - ఇవీ - అన్నీ అనే బ్లాగులో ఈ పోస్టులో ప్రజ బ్లాగు గురించి చర్చించారు. ఈ బ్లాగు ఎవరిదో తెలీదు. ఇంతక్రితం కూడా వేరే బ్లాగులోనూ ప్రజ గురించి ఓ పోస్టు చూశాను. కొందరు పనిగట్టుకుని నా పై కొన్ని కామెంట్లు వ్రాయడం అప్పుడపుడు చూశాను. నాకైతే వీరెవరూ శతృవులు కారు. నేను వీటన్నింటినీ పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. ప్రజలో ఏ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వీలయితే తెలుపగలరు. ఇప్పటికంటే ప్రజ మెరుగ్గా ఉండేందుకు మీ సూచనలు కోరుతున్నాను. అవీ-ఇవీ-అన్నీ బ్లాగులో నేనుంచిన కామెంటుని ఇక్కడ యథాతధంగా ఉంచుతున్నాను.

" ఈ పోస్టు ఉద్దేశం మాత్రం నాకు అర్ధం కాలేదు. నా సమాధానం ప్రజ బ్లాగు ద్వారానే ఇస్తాను. ఈ పోస్టులో చెప్పినట్లు ప్రజ ఉద్దేశం మంచిదే. అదే విధంగా ఇక్కడ చెప్పిన పరిష్కారంగా ఫోరంగా నడిపే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. కనుక మళ్లీ ఆ ప్రయత్నం చేసే ఉద్దేశం లేదు. కామెంట్ల పరంపరను ఆశించో ఈ బ్లాగులో కొంతమంది ప్రవర్తనకో ప్రజ ఉద్దేశానికీ సంబంధించినది కాదు. మాలికలో కామెంట్ల విషయం నాకు అసలు మాలికలో కామెంట్లవల్ల ఇబ్బంది పడుతున్నట్లు ఒకరు ఆరోపిస్తే తెలిసింది. బోనగిరి గారు చెప్పినట్లు ప్రజ - శంకరాభరణం వంటివాటిని ఓ పక్కన ఉంచితే మంచిదేమో. అది నా పరిధిలోనిది కాదు. ఏమైనా ప్రజ గురించి ఇతరులు ఇబ్బంది పడుతూ వ్రాసిన రెండో పోస్టు ఇది. నేను నా పరిధిలో ఏమి చేయగలనో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. మీరు పాజిటివ్ గా వ్రాశారా? నెగెటివ్ గా వ్రాశారా? నాకు తెలీదు గానీ నేను మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నాను. ఈ బ్లాగులోనే కాదు ఏ బ్లాగుకీ అందరూ వెళ్లి రెగ్యులర్ గా కామెంట్లు ఉంచరనే అనుకుంటున్నాను. ప్రజను ఇప్పటికంటే మెరుగ్గా ఎలా నడపవచ్చో ఫోరం గా కాకుండా ఎవరైనా సూచనలు ఉంటే తెలుపగలరు. "

ఈర్ష్య తోనో దురుద్దేశంతోనో కాకుండా మీరు పాజిటివ్ నెగిటివ్ అంశాలను మీ అభిప్రాయంగా నిర్మొహమాటంగా తెలుపగలరు.
Reactions:

Post a Comment

 1. ఈ విషయంపై నా స్పందన మాస్టారి బ్లాగులో ఉంచాను.

  http://syamaliyam.blogspot.in/2014/11/blog-post_16.html

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ చూశాను. అర్ధవంతంగా ఉందది. అయితే అది శ్యామలీయం గారి నిర్ణయానికి సూచనగా ఉన్నది. ప్రజకు కొంత మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ప్రజ బ్లాగుని క్లోజ్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఎవరో ఆరోపించినట్లు ప్రజ వేలాదిమందికి ఇబ్బందిగా ఉందని అనుకోవడంలేదు. చర్చలు మరింత అర్ధవంతంగా ఎలా నడపాలి? అనేదానికి నాకు తగు సమయం లేక మాత్రమే ప్రజను క్లోజ్ చేద్దామనుకుంటున్నాను. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు నడిపితే వారిమీద నాకు సరైన నమ్మకం కలిగితే వారికి ఈ బ్లాగుని ఇచ్చేద్దామనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు.

   Delete
  2. నేను శ్యామలీయం మాస్టారుకు సలహా ఇచ్చేంత వాడిని కాను. ఆ ముసుగులో నా అభిప్రాయం చెప్పింది మీకేనండీ!

   కెసిఆర్ అంటే మీకు ఇష్టం కాదు కానీ ఆయన అన్న "గమ్యం ముద్దాడిన వాడే సిపాహీ" వాక్యం మీకు నచ్చవచ్చు.

   ఒక లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు ఎన్నో ఉడుదుకులు రావొచ్చు అంచేత బేల పడతామా? మనం తప్పు చేయనప్పుడు చిన్న చిన్న అవాంతరాలకు బెదిరి పలాయనం చిత్తగిస్తే తెలంగాణా వచ్చేనా ముమ్మాటికీ రాదు.

   మీకు ఇష్టమయిన శ్రీశ్రీ మాటలలో చెప్పాలంటే "ఏదీ తనంత తానె నీ దరికి రాదు, శొదించి సాదించాలి, అదియే ధీరగుణం"

   PS: నిన్ననే అమెరికా నుండి తిరిగి వచ్చాను, జెట్లాగ్ ఇంకా తగ్గలేదు. ఆ అలసటలో తప్పు మాటలు రాస్తే లేదా హద్దు మీరితే క్షమించగలరు

   Delete
  3. జై గారు, నాకు కే.సీ.ఆర్ అంటే ప్రత్యేకమైన కోపం లేదు. ఉంటే తగ్గించుకుంటానని మన శ్రీకాంత్ చారి గారికిచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాను కూడా. నేను కే.సీ.ఆర్ పై ఏయే విషయాలలో పాజిటివ్ గా ఉంటానో చాలామందికి తెలీదు. వీలయితే ఓ పోస్టు వ్రాయాలని ఉంది. కే.సీ.ఆర్ మాటలలో ఎంత దూల ఉంటుందో స్పూర్తి కూడా అంతే ఉంటుందనేది నిజం. లేకుంటే ఆయన తెలంగాణా ఉద్యమాన్ని మిగతావారెవరూ ఊహించనంత మిగతావారెవరికంటే ప్రజలను నమ్మించగలిగేంత సక్సెస్ చేయగలిగి ఉండేవారు కాదు. నేను సమైక్యవాదిని + కే.సీ.ఆర్ ఆచరణపై అనుమానాలున్నవాడిని కనుక అందరికీ ఆ అనుమానాలు రావడం అత్యంత సహజం.

   నేను శ్రీ శ్రీ సాహిత్యం ఒక్క పుస్తకం కూడా చదవలేదు. నాకు శ్రీ శ్రీ గురించి పెద్దగా తెలీదు. శ్రీ శ్రీ కొటేషన్లు కొన్ని తెలుసు అంతే.

   మీ కే.సీ.ఆర్ (తప్పుగా అంటే క్షమించాలి :))) లేదా మన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ చెప్పిన గమ్యాన్ని ముద్దాడిన వాడే సిపాయి అన్న దానిని స్పూర్తిగా తీసుకోవడానికి నాకభ్యంతరం లేదు. పైగా ప్రస్తుత సందర్భంలో ఈ కొటేషన్ డెఫినెట్ గా స్పూర్తివంతంగానే ఉంటుంది. గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

   గమ్యాన్ని డెఫినెట్ గా ముద్దాడి నేను కూడా నా లక్ష్యాన్ని చేరుకునే చూపించాలని అనుకుంటున్నాను. మీ కామెంట్ తరువాత మరింత పట్టుదల పెరిగింది. ఎలా అనేది కొద్ది రోజులలో ప్రకటిస్తాను.

   నాకు కొత్త ఉత్సాహాన్ని నింపిన మీ కామెంటుకు ధన్యవాదములు జై గారు.

   Delete
  4. ఇప్పటికి కెసిఆర్ శ్రీశ్రీ వగైరాలు వాళ్ళ మీద మీ మా అభిప్రాయాలు అప్రస్తుతం కనుక వదిలేద్దాం.

   మీరు మీ ధైర్యంతో, సహజ పోరాట పటిమతో, అకుంటిత దీక్షతో కోరుకున్న లక్ష్యాన్ని ముద్దాడుతారని నా కోరిక, నమ్మకం కూడా! All the best sir.

   Delete
 2. కొండలరావు గారికి, నా బ్లాగు అవి..ఇవి.. అన్నీ.. లో ఉంచిన కామంట్ చూసాను . అక్కడే సమాధానం ఇచ్చేకంటే మీ బ్లాగులో ఇస్తే అర్ధవంతంగా ఉంటుందని ఇక్కడ ఇస్తున్నాను .
  ఈ బ్లాగు ఎవరిదో తెలీదు అని వ్రాసారు .. నాదే .! మీతో నాకు పరిచయం లేదు . మనందరం బ్లాగుల ద్వారానే పరిచయస్తులం . కనుక ఒక సాటి బ్లాగర్ గా మా కష్టం మీతో చెప్పడానికి ఎవరైనా ఒకటే .నాగురించి నా గత టపాలోనే వ్రాసాను చూడండి . నాకు శని, ఆది వారాల్లోనే ఖాళీ ! అప్పుడే ఎలా బ్లాగు టపాలు వ్రాస్తుంటాను .
  ఇక టపా ఉద్దేశ్యం అర్ధం కాలేదు అన్నారు . ఇంతవరకూ అర్ధంకాకనే మీరు ఈ బ్లాగు నడుపుతున్నారని భావించాలా ?
  ఒకసారి ఎరుపురంగు మార్క్ చేసిన మీ ప్రశ్నలు ( నా టపాలో ) చూడండి .అవి సమాజానికి ఎలా ఉపయోగపడతాయో చెప్పండి . మీ బ్లాగు సమాజానికి ఉపయోగపడితే మంచిది .మీకు ఉపయోగపడితే పర్వాలేదు . కానీ మీకూ , సమాజానికీ ఉపయోగపడక , ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఎంతకాలం ఇలానే వ్రాస్తూ పోతారు ?
  కాకపొతే నేను నా టపాను ఒక మంచి ఉద్దేశ్యంతో వ్రాసాను . మీరు పాజిటివ్ గా తీసుకోవాలనే వ్రాసాను . అలా తీసుకున్నందుకు సంతోషం . ఫోరం అయిడియా ఎందుకు/ఎప్పుడు ఫెయిల్ అయిందో నాకు తెలీదు ! ప్రచారం లేక అయి ఉంటుంది .
  ప్రజ బ్లాగు ముఖ్య ఉద్యేశ్యం నెరవేరితే ముందుగా ఆనంద పడేది నేను కూడా ! మీరు మంచి ప్రశ్నలు అడుగుతున్న టపాలు లేవనికాదు . కానీ వాటికి స్పందన శూన్యం. అవునా ? మీరు ఎప్పుడైతే అప్రయోజనకర రాజకీయ ప్రశ్నలు అడుగుతున్నారో అప్పుడు సదరు రాజకీయ కామెంటేటర్లు రెచ్చిపోతున్నారు .మీరు ప్రజ బ్లాగును ఏ 15 మంది కోసమే నడుపుతున్నారన్నట్లుగా ఉంది . ఈ విషయమై ఇంతకూ ముందు మీ బ్లాగులో నేను కొన్ని విమర్సతో కూడిన సలహాలు చేసిన మాట మరిచారా ? నాకు మీపై ఈర్ష్య లేదు , కోపం అంతకంటే లేదు .మీ ప్రయత్నం అభినందనీయం .. మీ ఆలోచన అద్భుతం .. కానీ ఆచరణలో విఫలం అవుతున్నారు . ఎందుకో ప్రస్నించుకోండి.
  చివరిగా -
  1. గొట్టిముక్కల వారికి ఇచ్చిన సమాధానంలో మీరు ప్రజ నడిపే విషయంలో నిర్ణయం తీసుకోలేక అస్తిరత్వంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది .అందరికీ ఉపయోగకర నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా సలహాలు ఆహ్యానించడం ఆచరణీయం.. అభినందనీయం
  2. ఇప్పటి వరకూ మీ బ్లాగు ద్వారా తిట్టుకొని .. ఆనందపడినవారు ఇప్పుడు ఏమైనా ఒక సలహా ఇస్తారా అనేది అనుమానాస్పదం .

  ReplyDelete
  Replies
  1. మీ పోస్టుని నేను పాజిటివ్ గా తీసుకున్నట్లే మీరూ ఈ కామెంటుని పాజిటివ్ గా తీసుకోండి సాయి కుమార్ గారు. మీతో నాకు ఎక్కువ పరిచయం లేదు. మీరింతకుముందు ఏ విషయాలపై వాదించినదీ గుర్తుకు రానందుకు క్షమించాలి.


   సమాజానికి రాజకీయ చర్చల వల్ల ఉపయోగం లేదని తీర్మానించడం తప్పు. ఎవరికి ఏది ఆసక్తో అది చర్చిస్తారు.

   మంచి ప్రశ్నలకు కామెంట్లు రావడం లేదనేది ఎంత నిజమో మీలాంటివాళ్లు కూడా అక్కడ కామెంట్లు పెట్టడం లేదనేది అంతే నిజం. అలాంటప్పుడు ఒక వేలు మనం చూపితే మూడు వేళ్లు మనలను చూపుతాయనేది నిజం కదా? మీరు డిస్కషన్ లో పాల్గొనకుండానే ఎలా ఎదుటి బ్లాగులపై విమర్శ చేస్తారు.

   మీ పోస్టులో నాకు అర్ధం కానిది వేలాది మందిని ప్రజ బ్లాగు ఇబ్బంది పెడుతున్నదని మీరెలా చెప్పగలరు? అంతమంది మీతో మొర పెట్టుకున్నారా? అది అసాధ్యం కదా? అంతే గాక కేవలం రాజకీయ బ్లాగుల వల్లనే తెలుగు బ్లాగర్ల సంఖ్య తగ్గుతున్నదనేది సత్యం కాదనేది నా అభిప్రాయం. నిజానికి రాజకీయ బ్లాగుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నది. అనవసరమైన సోది కంటే అర్ధవంతమైన చర్చలున్న బ్లాగుల సంఖ్య తెలుగులో ఇంకా పెరగాలానేది నా అభిప్రాయం.

   మీ పోస్టులో ప్రజని ఇంప్రూవ్ చేయాలనే పాజిటివ్ సూచనలు మాత్రమే నేను తీసుకుంటున్నాను. మిగతా మీ అభిప్రాయాలన్నీ ఏకీభవించాల్సిన లేదా మే అభిప్రాయాన్నే సంపూర్ణంగా నిజమని అంగీకరించాల్సిన అవసరం నాకు లేదు కదా!

   కొందరు రెచ్చిపోయి అసందర్భంగానూ, అనవసరంగానూ కామెంట్లు చేస్తున్న విషయాన్ని అంగీకరిస్తాను. అయితే ఓ చర్చావేదికలో ఇలాంటివి సహజం. దానికి ఏ బ్లాగు ఓనరూ బాధ్యులు కాలేరు. ఏ ఒక్కరు సమాజంలోని భిన్న మనస్తత్వాలున్న వారిని ఏకపక్షంగా మార్చలేరు. అలా మార్చాలనుకోవడమే మూర్ఖత్వమవుతుంది. అయితే వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతనుండి మాత్రం నేను తప్పించుకోకూడదు. దానికి నేను సమాధానం చెపాల్సిన అవసరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మీ పోస్టుకంటే ముందే నేనా విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకున్నా అది నిజం.

   నా బ్లాగులో చక్కగా చర్చలు చేసేవారిలో గొట్టిముక్కలగారు ఒకరు. కామెంట్లు ఇచ్చినవారిలో సలహాలూ ఇస్తారు మీరు చూస్తూ ఉండండి. నాకా నమ్మకం ఉన్నది.

   Delete
  2. "1. గొట్టిముక్కల వారికి ఇచ్చిన సమాధానంలో మీరు ప్రజ నడిపే విషయంలో నిర్ణయం తీసుకోలేక అస్తిరత్వంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది .అందరికీ ఉపయోగకర నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా సలహాలు ఆహ్యానించడం ఆచరణీయం.. అభినందనీయం"

   సాయి కుమార్ గారూ, మీరు నన్ను ప్రస్తావించారు కనుక జవాబు ఇవ్వాల్సి వస్తుంది. నాయొక్క వ్యాఖ్యలలో దేన్ని ఆధారం చేసుకొని మీరలా అన్నారో తెలిపితే అర్ధం చేసుకుంటాను. నాకు గుర్తున్న కాడికి నేను ఎప్పుడూ అలా అనడం కానీ సూచించడం కానీ చేయలేదు.

   సాటి బ్లాగరుగా మీ కష్టం అన్నారు అదేమిటో కాస్త అర్ధం అయ్యేట్టు చెబితే బాగుండేది. I fail to understand why anyone should be disturbed by anything that goes on in some one else's blog.

   ప్రస్తుతం సుదీర్ఘ ప్రయాణ బడలికలో (jetlag) ఉన్నాను, 1-2 రోజులలో విపులంగా స్పందిస్తాను

   Delete
  3. సాయి కుమార్ గారూ ! ప్రజలో మీకు తెలిసిన , నచ్చిన ప్రశ్నలకు మీ అభిప్రాయాన్ని పంచడం మొదలుపెట్టండి.. అపుడు మీరు అంటున్న ఆ పది పదిహేను మంది వంద - రెండొందలు ఆటోమేటిక్ గా అవుతారు

   Delete
  4. మీ సూచన బాగుంది శ్రీనివాస్ గారు. ఒక్క ప్రజకే గాక, శాయికుమార్ గారికే గాక మిగతా తెలుగుబ్లాగులు బాగుపడాలనుకునేవారందరికీ మీ వ్యాఖ్య మంచి సూచన. కేవలం వ్యక్తిగతంగా హేళన చేసేవి తప్ప తప్పుగానైనా తమ అభిప్రాయాలను వాదించేవారి గొంతు నొక్కకూడదు. నిజంగా మనమెవరినైనా మార్చాలనుకుంటే వాదించడం ద్వారా అది చేయవచ్చు. నేను అలా నేర్చుకుని మార్చుకున్నవి ప్రజ బ్లాగు ద్వారా చాలా ఉన్నాయి.

   Delete
 3. కొండలరావు గారికి నమస్కారాలు!మీరు నడుపుతున్న బ్లాగ్ ఉద్దేశ్యం బాగుంది,కామెంట్స్ అంటే అన్ని రకాల వారు ఉంటారు,మంచి చెడు రెండూ ఉంటాయి,మంచి చర్చ కు కామెంట్స్ రాలేవని మీ ప్రయత్నాన్ని ఆపెయవద్దు,మనం national,ఇంటర్నేషనల్ టీవీ డిబేట్స్ చూస్తుంటాము,వాళ్లు పిచ్చి పిచ్చి గా మాట్లాడతారు,అంత మాత్రాన చర్చించవలసిన విషయం కాదు అని అనుకుంటారా?ఉదేశ్యం మంచిదైనపుడు అది ఎదో ఒక రోజు కచ్చితంగా ఫలితాన్నిస్తుంది

  ReplyDelete
  Replies
  1. నా ప్రయత్నం మాత్రం ఆపనండీ. ఎలా? అనేది మాత్రం పునరాలోచించుకోవాలి.

   కేవలం ఎవరో పోస్టు వ్రాశారని కాదు. నాకే కొంత అసంతృప్తిగా ఉన్నది.

   ప్రజ బ్లాగుగా నడపాల్నా వేరే నా బ్లాగులో ఓ శీర్షికగా నడపాలా అనేది ఆలోచిస్తున్నాను. నా నిర్ణయాన్ని అందుకు గల కారణాలను మీ అందరికి తెలియజేసే ప్రజను కొనసాగించడం లేదా క్లోజ్ చేయడం లేదా ఎవరైనా ఆసక్తిగలవారికి బదిలీ చేయడం చేస్తాను.

   మీ కామెంట్ నాకు కొంత ధైర్యాన్నిచ్చింది. సూచనలకు స్పందనకు ధన్యవాదములండీ.

   Delete
 4. కొండలరావు గారు,

  నేను గమనించినంత వారకు మీ బ్లాగులో వివాదాస్పద చర్చలు జరుగుతున్నది మూడు విషయాల మీద.

  1. ఆంధ్ర, తెలంగాణా మధ్య రాజకీయాలు.

  తమ సమైక్య భావనలకు వ్యతిరేకంగా తెలంగాణా సాధించుకున్నారన్న అక్కసు కొంతమందికి ఇప్పటికీ తగ్గలేదు. అందుకని ఏ చిన్న ఛాన్సు దొరికినా కెసీఆర్‌నో, తెలంగాణా ప్రజల పైనో విపరీతమైన కామెంట్లు చేయడం వారికి అలవాటుగా మారింది. అందుకు సమాధానాలు కూడా ధీటుగా రావడంతో యుద్ధాలు పెద్దవవుతున్నాయనేది నా భావాన.

  ఉదాహారణగా రెండు వ్యాఖ్యలు చెపుతాను. గత వారంలో ప్రచురించిన రేవంతరెడ్డి ప్రివిలెజ్ మోషనుకి సంబంధించిన ప్రశ్నలో రెండు కామెంట్లను గమనించండి.

  శ్యామలీయంNovember 15, 2014 at 7:25 PM
  Yes, he should be.
  so, KCR should alsi be, I opine.

  Hari Babu SuraneniNovember 15, 2014 at 4:16 PM
  జరుగుతున్న దదేగా!మోదీని సన్నాసి అన్నందుకు లోక్ సభలో ఇలాంతి మోషన్ పెడితే తెలంగానా ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చెయ్యాల్సి వుంతుంది, వొప్పుకుంతారా?


  మొదటి వ్యాఖ్యలో శ్యామలీయంగారు KCR ప్రస్తావన తేనవసరం లేదు. అది ప్రశ్నతో సంబంధంలేని అధిక ప్రసంగమే అవుతుంది. రాజకీయ దూషణలు అనేవి ఏ KCR ఒక్కడికో పరిమితం కావన్న విషయం లోకేష్ దృశ్యంలోకి రావడం తోనే తెలుస్తోంది. వసూల్‌రాజా, దొంగలు, బందిపోట్లు, హిట్లర్, గోబెల్స్ లాంటి అనేక పదాలను ఇంకో తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై అలవోకగా ప్రయోగించడం చూస్తూనే వుంటాం. ఇక్కడ KCR ఒక్కడినే విషయం లోకి లాగాలని చూడడం అక్కసు తీర్చుకోవడమే తప్ప మరొకటి కాదు. అక్కడికీ జై గారు అదే విషయాన్నీ ప్రస్తావిస్తూ సమాధానం చెప్పినా శ్యామలీయం గారు తగ్గలేదు. సమర్థించుకుంటూ మరో ప్రతివ్యాఖ్య చేశారు.

  ఇకపోతే సూరనేని గారి రెండో వ్యాఖ్య. ఇది కూడా KCRపై దాడి చేయడానికి ఉద్దేశించ బడిందే. నిజానికి ప్రధాని అయింతర్వాత మోదిని KCR ఎప్పుడూ సన్నాసి అనలేదు. ఆయన సన్నాసి అన్నది కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ని. అది కూడా "సన్నాసి తీర్పు" అన్నాడు కాని, వ్యక్తిగతంగా సన్నాసి అని అనలే లేదు.

  వీరి వ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి నాలాంటి వాళ్ళు వస్తే మరింతమంది వచ్చి మూకుమ్మడిగా దాడి చేస్తారు. అదొక పెద్ద యుద్ధంగా మారుతుంది. గతంలోని అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఇటువంటి అనేక వ్యాఖ్యలకు నేను స్పందించ దలుచుకోలేదు. కాని ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి వాటిని ఇక్కడ ప్రస్తావించాను.

  2. సంస్కృతి, ఆచార సంబంధమైన ప్రశ్నలు.

  ఈ విషయంలో ప్రవీణ్ ఏవైనా లిబరల్ కామెంట్లు చేయగానే కొన్ని వర్గాల దాడి మొదలై, చివరికి అదొక ఎడతెగని యుద్ధంలా మారుతోంది.

  3. క్యాపిటలిజం vs సోషలిజం సమస్యలు.

  ఒకోసారి మూడోది రెండోది కలగలిసి కూడా వుంటున్నాయి.

  ఇక నా అభిప్రాయం ప్రకారం అయితే మీరు బ్లాగు మూయ నవసరం లేదు. మీ బ్లాగుకు ఉన్న ఆదరణ గురించి వస్తున్న హిట్లు చెప్పనే చెపుతున్నాయి. ఎవరిచేతో ఏదో వ్యాఖ్య ఎదుర్కోవడమనేది రామాయణంలో రాముడికే తప్పలేదు. ఇక మనమెంత? ఇతరుల వ్యాఖ్యలను పరిశీలించి మనం ఆత్మ విమర్శ చేసుకుని తగు సవరణలు చేసుకోవడం వరకు ఫరవాలేదు. కాని మొత్తానికే మూసి వేయాలనేది సరైన స్పందన కానేరదు.

  నేను పైన ఉదాహరించిన మూడు రకాల ప్రశ్నలు వచ్చినపుడు వాటిని ప్రచురించడమా, మానడమా అన్న విషయయంలో తగు నిర్ణయం చేసుకోగలరు. ప్రచురిస్తే వాటివరకు మోడరేషన్ పెట్టడము సరైన పద్ధతి అనుకుంటున్నాను. ఏ వర్గం వారు మరొక వర్గాన్ని టార్గెట్ చేసినా స్పందన ప్రతిస్పందనలు మితిమీరిన యుద్ధాలు తప్పవు.

  నా వరకు నేను ప్రజ బ్లాగులో స్వీయ నియంత్రణ పాటించాలని ఇదివరకే జరిగిన అనుభవాల తర్వాత నిర్ణయించుకున్నాను. ఇక ముందు అవసరమైన మేరకు నా అభిప్రాయాలను చెప్పడం తప్ప వాటిపై జరిగే ఉద్దేశపూర్వక దాడులకు సమాధానం చెప్పడం జరుగదు.

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను. ప్రజ పై మీ వివరణకు ధన్యవాదములు.

   ప్రవీణ్ ని నేను డిలీట్ చేయకపోవడం కూడా కొందరికి నచ్చడం లేదు. నేను ఎవరినీ డిలీట్ చేయకూడదు అనే నా పాలసీకి కట్టుబడ్డాను తప్ప ప్రవీణ్ పై నాకు ప్రత్యేకమైన ప్రేమా లేదా ద్వేషం లేవు.

   నేను ప్రవీణ్ కామెంట్లు పోస్టులనుండి కూడా నేర్చుకున్నవి ఉన్నవి అని చెప్పడానికి సంకోచించ దలచుకోలేదు. కొన్ని విషయాలలో ప్రవీణ్ వైఖరి - ప్రవీణ్ వ్యతిరేకుల వైఖరీ రెండూ నాకు నచ్చడం లేదు. అది నాకు సంబంధం లేకుండా జరుగుతున్నది. నేను ప్రవీణ్ ఒకటే అనుకునేవారూ ఉన్నారు.

   ఉదాహరణకు మీతో కూడా నేను చాలా విషయాలలో విభేదిస్తాను ఇప్పటికీ. కానీ తెలంగాణా అభివృద్ధిపై మీ వాదనలు దానికోసం మీరిచే వివరణలు సమాచార సేకరణ కృషి బాగుంటుంది. వాటన్నింటితో నేను మీతో ఏకీభవించలేకపోయినా మీ కృషిని అభినందించకుండా ఉండలేను. మీనుండి కూడా నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నవి అభిప్రాయాలు మార్చుకున్నవీ ఉన్నాయి. మీరు గమనించారో లేదో మీకు మాటిచ్చాక నేనూ తెలంగాణాపై పోస్టుల సంఖ్య తగ్గించాను. నా టార్గెట్ ను మీరు మరోరకంగా అర్ధం చేసుకుంటున్నందునే అలా చేశాను తప్ప నా అభిప్రాయం మారి కాదు.

   నా వైఖరీ వేమూరి రాధాకృష్ణ వైఖరి ఒకటి కాకూడదనే నేను తెలంగాణా ప్రభుత్వ వైఖరిపై వాదనలు తగ్గించాను లేదా మానేశాను.

   కే.సీ.ఆర్ ప్రభుత్వ వైఖరిపై నా అభిప్రాయం తప్పో రైటో నేను తేల్చుకోవడానికి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉన్నది. ఈలోగా మీలాంటివారు, జై గారి లాంటి వారితో నేనెందుకు ఘర్షణ పడాలి అని మాత్రమే నేనే సైడ్ అయ్యాను. మీ అంచనానే రైట్ అయితే నాకు నష్టం లేదు. తెలంగాణాకు మేలు జరిగితే మంచిదే. పైగా మనస్పూర్తిగా సంతోషించేవాళ్లలో నేను మొదటివాడినని మీకు హామీ ఇస్తున్నాను.

   ఇక ప్రజ బ్లాగును మూసినా ఉంచినా డిష్కషన్ మాత్రం నా గోల్ లో భాగం కనుక తప్పనిసరిగా చర్చావేదిక ఉంటుంది. ప్రశ్నలు - చర్చలు - కామెంట్లు ఎలా? ప్రజ బ్లాగుని క్లోజ్ చేయాల్నా? ఎవరికైనా ఇచ్చి నేను సెపెరేట్ గా నడపాల్నా అనేది మాత్రం సీరియస్ గా ఆలోచిస్తున్నాను.

   సాయి కుమార్ గారు ఎవరు సలహా ఇస్తారో చూడండి అన్నారు. డెఫినెట్ గా మనవాళ్లు సలహాలు ఇస్తారనే అనుకున్నాను. మీలాంటి మిత్రుల సలహాలు అదీ ఇలా అర్ధవంతంగా ఇవ్వడం సంతోషకరమైన విషయం. మీ కామెంటుకు సూచనలకు ధన్యవాదములు శ్రీకాంత్ గారు.

   Delete
  2. ఇక్కడ తెలంగాణా వచ్చిందన్న అక్కసుకన్నా ప్రతీ దానికీ ఆంధ్రా వాల్ల మీద పడి ఏడుస్తున్న వారి మీద చిరాకే ఎక్కువ అందుకే ఈ మాటల యుద్దాలు. తమ ప్రతీ సమస్యకు సీమాంధ్ర మూలాలు వెథకడం తెలంగానా వారికి అలవాటయ్యింది. ఈ పాటికే చాలా మంది సమైక్య వాదులకు విభజన వలన ఆంధ్రాకు కలిగే లాభం అర్థమయ్యింది. నిజానికి విడిపోయిన తరువాత హ్యాపీగా ఫీలవుతున్నది ఆంధ్రావారే.

   కొండల రావుగారూ,
   బ్లాగు మూసేయడం అనేది మీ ఇష్టం మీద మాత్రమే ఆధారపడిన విషయం. బ్లాగుల్లో చర్చలు( ముఖ్యంగా ప్రజలో చర్చలు) ఒక సమస్యకు పరిష్కారం వెతికే దిషగా కన్నా .. రెండు వర్గాలు తల ఒక వైపు నిల్చుని తమను తాము సమర్ధించుకుంటూ ఎదుటివారిపై దుమ్మెత్తి పోస్తూ ఉండేలా ఉంటున్నాయి. దాని వలన ఎలాంటీ ఉపయోగం ఉండదు. కేవలం వ్యక్తులు తమ అహంభావాన్నో లేక తాము రిప్రజెంట్ చేస్తున్న వర్గాన్ని ఏదో ఒక విధంగ సమర్ధించుకోవడానికో పనికొస్తాయి.

   ఉదాహరణకి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ తీ.వీ9 ను ఆంధ్రజ్యోతినీ బ్యాన్ చేస్తున్నప్పుడు జరిగిన చర్చలు, రీసెంటుగా కరెంటు విషయములో జరిగిన చర్చలు .. ఇవన్నీ ఏదో రకంగా తాము చేసిన పనులను సమర్ధించుకోవడానికి చేసినవే తప్ప అక్కడున్న సమస్యకు పరిష్కారం చూపే విధంగా జరిగినవి కావు. అహంభావాలు, నువ్వెంతంటే నువ్వెంత అనుకునే తత్వాలు ... వీటివల్ల ఏమీ లాభం లేదు. కానీ తప్పదు, కొన్నింటికి సమాధాన మివ్వాల్సిందే అనిపిస్తుంది. అందుకే కరెంటు గురించి చేసిన చర్చల్లో పాల్గొనాల్సి వచ్చింది.

   మీరు బ్లాగ్ మూసేయాల్సిన అవసరం అయితే లేదనే అనిపిస్తోంది కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడి అది సంస్కృతి అనే వారి విషయములో కాస్త కఠినంగా ఉంటే చాలు. అవి ఆగిపోతే, మిగిలిన వారు కూడా తమ రియాక్షన్ను తగ్గించుకుని .. అర్థవంతమైన చర్చలు చేయడానికి ప్రయత్నిస్తారు.

   Delete
  3. కామెంటుకు సూచనకు ధన్యవాదములు శుక్రాచార్య గారు. మీరు చెప్పినవాటిలో వాస్తవాలున్నాయి. వాటిని పల్లెప్రపంచంలోని ప్రజలో ఆచరణలో చూస్తారనే హామీ ఇస్తున్నాను. ఎప్పటిలాగే మీ సహకారం నా పల్లెప్ర్పంచం బ్లాగుకు అందిస్తారని ఆశిస్తున్నాను.

   Delete
 5. మీరు బ్లాగు మూయనవసరం లేదు.
  కొంతమంది అతివాదుల అర్థం, సందర్భం లేని కామెంట్లు ప్రచురించకుండా ఉంటే చాలు. అలాగే అడిగే ప్రశ్నలు కూడ వీలైనంత constructive గా ఉంటే బాగుంటుంది.
  ఈ గొడవకి చాలా ముందే మీకు ఒక మెయిల్ ఇచ్చాను. మీ బ్లాగులో కామెంట్లు వ్రాయడం కూడ తగ్గించాను.

  ReplyDelete
  Replies
  1. బోనగిరి గారు మీ స్పందనకు ధన్యవాదములు.

   అతివాదులు లేదా మతవాదులు అలాగే మితవాదులు ఇలా విభజించి కామెంట్ మోడరేషన్ చేయడం డిస్కషన్ కు ఆటంకం కలిగిస్తుంది. వ్యక్తిగతంగా కించపరచేలా లేదా టార్గెట్ చేసేలా ఉండేవి, పోస్టుకు సంబంధం లేని కామెంట్లనే మోడరేట్ చేయాలనేది నా ఉద్దేశం లేదా నిర్ణయం. అయితే చాలామంది సలహాలు ఇచ్చే పెద్దలు కొన్ని సందర్భాలలో పోస్టుకు సంబంధం లేకుండా ఇతరుల కామెంట్లకు అనుబంధంగా టాపిక్ డైవర్ట్ అయినవి ఉన్నాయి. కావాలని టాపిక్ డైవర్ట్ చేసినవీ ఉంటున్నాయి.

   ప్రశ్నలు constructive గా ఉండాలనే మీ సూచన సరైనది. కానీ ప్రజ పాలసీ ప్రకారం ఎవరి ఏది తెలుసుకోవాలనుకున్నా ప్రశ్నగా పంపించవచ్చు. ఎంత తప్పుగానైనా వాదించవచ్చు. అయితే తెలుసుకోవడానికై ఉండాలి అని వెల్లడించడం జరిగింది కనుక అలా అన్ని ప్రశ్నలను అనూంతించాను.

   ప్రస్తుతం ఈ విషయం పై మాత్రం పునరాలోచన చేస్తున్నాను. ప్రజ బ్లాగు నడిపితే మాత్రం అన్ని ప్రశ్నలూ ఉంటాయి. కామెంట్ మోడరేషన్ తప్పదు. నేనెవరినీ డిలీట్ చేయకూడదనే పాలసీని మార్చుకోదలచుకోలేదు. ప్రజను ఓ శీర్షికగా వేరే బ్లాగులో నడిపితే మాత్రం ప్రశ్నలు కూడా మీరన్న పద్ధతిలో ఉంటాయని హామీ ఇస్తున్నాను. ఏ పద్ధతి అయితే బాగుంటుందో నేను ఇంకా నిర్ణయించుకోలేదు.

   మీ మెయిల్ కు నేను వెంటనే బదులిచ్చాను. మీరు కామెంట్లు తగ్గించడం ఆ సమస్యకు పరిష్కారం కాదు. పైగా అటువంటి వారికి మనం సమాధానం ఇవ్వలేని వారమవుతామని నా అభిప్రాయం. అందుకే నేను మీ సలహాను పాటించలేదు. మీ సలహాకు సంబంధించిన సమస్య లేదని మాత్రం నేను అప్పుడూ చెప్పలేదు. ఇప్పుడూ చెప్పడం లేదు. చర్చలలో అలాంటివి అత్యంత సహజమైన విషయాలు. వీటికి పరిష్కారాలు ఇవీ అని అన్నివేళలా ఒకేలా చెప్పలేము. మీరు ఎప్పటిలాగే చర్చలలో పాల్గొనడమే మంచిది.

   మీ సూచనలకు కామెంటుకు ధన్యవాదములు.

   Delete
 6. కొండలరావుగారు..మీరు ప్రజను మూయాల్సిన పనిలేదు.నాకు తెల్సి అవి,ఇవి,అన్నీ బ్లాగుగారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.అయితే సొద,బాధ అనే మాటలు కొద్దిగా ఇబ్బంది అనిపించింది.మరొక ముఖ్యవిషయమేమిటంటే మీరూ,శ్యామలీయం గారు కామెంటర్లను రెచ్చగొడుతున్నారని వ్రాసారు.అది నిజమైతే మీ ఆ ఒక్క పద్దతి మార్చండి చాలు.ఇక రెచ్చగొట్టే దోరణి కలిగిన ఇతరుల కామెంట్లను తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం

  ReplyDelete
  Replies
  1. @ K.S. Chowdary గారు,

   ప్రజను మూసివేయాల్సిన అవసరం లేదనేదే నా అభిప్రాయం కూడా. కానీ అర్ధవంతమైన చర్చ నడపాలంటే కావలసినంత ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం వల్లనే నేను నడపలేకపోవచ్చు. ఇతర మిత్రులెవరైనా నడపగలిగే వారుంటే వారికీ బాధ్యతలు అప్పగించాలనేది నా ఉద్దేశం. నిజానికి నేను ఇటీవలి కాలంలో ఆ బాధ్యతను శ్యామలీయం గారికి ఇచ్చాను. ఆయన కొంత కాలం చూశారు. తరువాత తన వల్ల కాదన్నారు. ఇప్పుడైనా ఎవరో ఆరోపిస్తున్నందుకు నేను ప్రజను క్లోస్ చేయాలనుకోవడం లేదు. నేను సరిగా నడపలేక చేద్దామనుకుంటున్నాను. ప్రజ ఉద్దేశం ప్రకారం టైం కేటాయించి నడపగలిగే మిత్రులుంటే నాకు మెయిల్ చేయండి. అలాంటి వారిలో నాకు నమ్మకం అనిపించిన వారికి ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నాను.

   ప్రజ అనే శీర్షికతో మాత్రం నేను టైం కేటాయించి కామెంట్లను నియంత్రించి చేసే శక్తిమేరకు మాత్రం నా బ్లాగులో ప్రజ ఓ శీర్షికగా కొనసాగుతుంది. అదెలా అనేది ఇదే బ్లాగులో ప్రకటిస్తాను. ప్రజ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. చాలామంది తమకూ ఉపయోగముందని నాకు మెయిల్ చేసినవారున్నారు. స్వయంగా మాట్లాడినవారున్నారు. ఇలా ఉపయోగకరంగా ఉన్నదానిని ఎవరి విమర్శలకో భయపడి మాత్రం క్లోస్ చేయాలనుకోవడం లేదు. చూద్దాం ఎవరిచేత ప్రజను కొనసాగించాలో.

   సాయికుమార్ గారి బ్లాగు పోస్టులో సొద బాధ అనే పదాలు ఆయన అభిప్రాయాలు. ప్రజ ఆయనకు సొదలా అనిపించిందనే ఆయన బాధను ఆ పోస్టు ద్వారా తెలిపారు. ఆ పోస్టులో నాకు ఉపయోగపడేవాటివరకూ పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఆయనవల్ల నేను ప్రజను క్లోజ్ చేయాలనుకోవడం లేదు. నేనాలోచిస్తున్న సమయంలోనే ఆయన పోస్టు వ్రాశారంతే.

   నేను కామెంటర్లను రెచ్చగొడుతున్నానే ఆరోపణను అంగీకరించను. ఒక్క ఉదాహరణైనా ఆధారంగా చూపితే ఆత్మవిమర్శ చేసుకోవడానికి వెనుకాడను. ఇంకా చెప్పాలంటే అందరికీ చర్చించే స్వేచ్చనివ్వాలని నేను సరిగా నియంత్రించలేకపోతున్నానేది నా అభిప్రాయం. ఇక శ్యామలీయం గారు కూడా కొన్ని సలహాలు ఇవ్వాలని చూస్తారు తప్ప రెచ్చగొట్టారనుకోను. ఆయన సలహాలు వినేంత విజ్ఞత అవసరమైనవారు ప్రదర్శిస్తున్నారా? లేదా? అనేది మనమెవరమూ బలవంత పెట్టలేము.

   రెచ్చగొట్టే ధోరణి అని అనలేను గానీ రెచ్చిపోతున్నారు, ప్రతివాదనలో అరివీర భయంకరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా చేసేవారు దుర్మార్గంగా చేయడంలేదు. జస్ట్ తమ ఈగోను కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు. నాకు తెలిసి కొంత సమయం తరువాత అనుభవంతో వారే కంట్రోల్ చేసుకుంటారు. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే వారిలో చర్చించే శక్తి ఆసక్తి ఉన్నాయి కనుక తప్పక అనుభవం వారికి విజ్ఞతా పాఠం కూడా చెప్తుంది. ఒడ్డునుండి రాళ్లు వేసేవారికంటే వీరే బెటర్. మోడరేషన్ పరిష్కారంగా ఉన్నా ఓ చర్చావేదికకు అది కూడా తగు సమయం కేటాయించలేకపోతే ఆటంకమే.

   కనుక నాకు తెలిసిన పరిష్కారం తగు సమయం కేటాయించి మోడరేట్ చేస్తూ ప్రజను నడపగలిగే వారికి దీని బాధ్యతలు అప్పగించడం. నేను చర్చిద్దామనుకుంటున్న అంశాలను నా బ్లాగులో నేనే నిర్వహించడం. అలా చేయాలనే దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాను.

   మీ సూచనలకు కామెంటుకు ధన్యవాదములు.

   Delete
 7. కొందలరావుగారు,
  మీరు బ్లాగు మూసెయ్యాలని ఎవరూ అనరు. పేజీలకొద్ది కామెంట్లు ఆగ్రిగేటర్ ను ఆక్రమించడమూ, వ్యక్తిగతంగా తిట్టుకోవడమూ,పిడివాదమూ చాలామందికి ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవం. ఆ కామెంట్లని మీరు ఆపగలిగితే ఎవరికి బాధ లేదు.

  ReplyDelete
  Replies
  1. sarma గారు,

   మూసివేయాలని ఎవరూ అనలేదు. అలాగే మూసివేయాలని నేనూ అనుకోవడం లేదు. మీరన్న పద్ధతిలో కామెంట్లను నియంత్రిస్తూ నడిపేంత సమయం కేటాయించగలిగేవారికి అప్పగించాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాను. ఎవరికి అనేది తేల్చుకోవలసి ఉన్నది.

   పేజీలకొద్దీ కామెంట్లను మనం నియంత్రించలేము. నిజంగా అది సమస్య అయితే దానికి పరిష్కారం అగ్రిగేటర్ల నిర్వాహకులే నిర్ణయించాలి తప్ప ఏ బ్లాగరూ నిర్ణయించలేడు.

   వ్యక్తిగతంగా తిట్టుకోవడం పిడివాదం మాత్రం కొద్దిమంది చేస్తున్నారు. ఓ రకంగా అది నాకే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. మోడరేషన్ ద్వారా దానిని నియంత్రించడానికి ప్రయత్నించాను. దానివల్ల ఎక్కువ సమయం కంప్యూటర్ ముందుండాల్సి వస్తున్నది. అదే విధంగా రోజూ ఉండడమూ నాకు కుదరదు. కనుక అలా చేయగలిగేవారికి దీని బాధ్యతలు అప్పజెప్పడమొక్కటే నాకు లభించిన పరిష్కారం. అదే చేయబోతున్నాను.

   ఆ కామెంట్లను నేనాపగలను. కానీ మోడరేషన్ కు ఎక్కువ సమయం కేటాయించలేను. ప్రతీ రోజూ కేటాయించలేను. ఇప్పుడైతే కొన్ని పోస్టులను షెడ్యూల్డ్ గా పెడితే ఆటోమేటిక్ గా రోజూ చర్చలు నడుస్తాయి. మనకు వీలున్నపుడు చూస్తున్నాము. మోడరేషన్ అయితే అలా కుదరదు. డెఫినెట్ గా రోజూ కొంత సమయాన్ని కేటాయించకపోతే న్యాయం చేయలేము. నేనంత సమయం కేటాయించడం అయ్యే పనికాదు కనుక ఇతరులకు అప్పగించడమే మంచిది.

   Delete
 8. కొండల రావు గారికి,
  ఇదివరలోనే మీరు ప్రజ చర్చల గురించి అడిగినప్పటి నుంచీ ఆలోచిస్తున్నాను.ఒక రెండ్రోజుల నుంచీ మ్యాతర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను.అది చెప్పే సందర్భం ఇలా వచ్చింది.

  చర్చలు ఆరోగ్యకరంగానే జరుగుతున్నాయి,మీరు ప్రజని మూసెయ్యనక్కర్లేదు.ఒక విషయం గురించి విభేదాలు వున్నప్పుడు మధ్యలో వాడీ వేడీ రావటం సహజమే,టీవీల్లో జరిగే తంతుతో పోలిస్తే ఇవి చాలా మెరుగు.

  నా సూచనలు:యే వ్యక్తి అయినా తను చర్చలో ఇక చెప్పాల్సింది యేమీ లేదనుకుంటే అప్పటి వరకూ తన కామెంట్ల సారాన్ని(వాటికి వచ్చిన విమర్శల్ని కూడా జత చేసి) చెప్పి ఆకరి కామెంటు అని ఒక ముక్తాయింపు ఇస్తే బాగుంటుంది.మధ్యలో కూడా చెయ్యవచ్చు.ఇక ఈ బ్లాగు నడుపుతున్న మీరు ప్రశ్నకు ఒక అర్ధవంతమయిన జవాబు వచ్చిందని అనుకున్నప్పుడు అందరి వాదనల్నీ ఒక చోట పేర్చి ఇంతటితో ఈ చర్చని ముగిస్తున్నాను అని చెబితే బాగుంటుంది.దీనివల్ల ఆ విషయం గురించి ఆసక్తి వున్నవారికీ చర్చలో పాల్గొననై వారికీ ఆ ప్రత్యేకమయిన భాగాల్ని చదివి సారం తెలుసుకునే వీలు వుంటుంది.

  శ్రీకాంత్ చారి గారికి,
  కొండల రావు గారు ఇక్కడ వేసిన కామెంటు ప్రకారమే ఆయనకి కేసీఆర్ పట్ల కొన్ని అనుమానాలు వున్నాయి.కానీ నాకు అవి కూడా లేవు.తను వ్యక్తిగతంగా సమర్ధుడే.ఇది ముఖ్యమంత్రి యెన్నిక సమయంలో మీ బ్లాగులోనే కేసీఆర్ ముఖ్యమంత్రిత్వాన్ని సమర్ధిస్తూ ఒక కామెంటు వేశాను,గుర్తుందా?అసలు యెన్నికల సమ్యంలోనే ఆంధ్రాలో తెదెపా తెలంగాణాలో తెరాసా ప్రభుత్వం యేర్పాటు చెయ్యగలిగితే బాగుంటుంది అని నా బ్లాగులో వేసిన పోష్టులో రాశాను.యెన్నికల ముందు ప్రధాని అవక ముందు అన్నా తర్వాత అన్నా సన్నాసి అని అనాల్సినంత అవసరం యేమొచ్చింది?క్రిషణా రివర్ బోర్డు రెండు ప్రభుత్వాల అనుమతితోనే యేర్పడింది గదా,దానికి అధ్యక్షుడుగా వున్న వ్యక్తి సన్నాసి గానీ అతని తీర్పు సన్నాసి తీర్పు యెలా అవుతుంది?ఆ మాట తప్ప వ్యతిరేకించటానికి ఇంకే మాటా దొరకలేదా?మీరు యెదటి వాళ్ళని సన్నాసి అంటున్నప్పుడు యెదటివాళ్ళు మిమ్మల్ని సన్నాసి అంతే మీకు మాత్రమే నెప్పి కలుగుతున్నదా?మీరు యెదటివాళ్ళ పట్ల అమర్యాదగా మాట్లాడినా యెదటివాళ్ళు మీపట్ల మర్యాదగానే వుండాలనుకోవటం పెత్తందారీ తనం అని తెలియనంత అమాయకులా మీరు?కేసీఆర్ తెలంగాణాని యెలా పరిపాలించినా నాకే వుద్దడమయిన భీబత్సమూ జరగదు.కానీ మీరు యెవరి నయినా సన్నాసి అంటే ఆ అన్నవాడే తిరిగి అనకపోయినా మరొకడు మిమ్మల్ని సన్నాసి అన్నా మీరూ భరించాల్సిందే.
  ఇక్కడి ప్రశ్నకి ఇక్కడ చెప్పాను.నేను పైన చెప్పిన పధ్ధతిలో కరెంటు కష్టాల గురించిన చర్చ దగ్గిర నా ఆఖరి కామెంటులో అక్కడి మీ ప్రస్తావనలకి జవాబు చెప్తాను.

  సాయి కుమార్ గారికి,
  మీ బ్లాగులోనే మోదీఇజం వరమా?శాపమా? అనే ఒక పోష్టు చూశాను.అది సమాజానికి యే విధంగా వుపయోగపడుతుందని మీరనుకున్నారు?వేరొకరి బ్లాగులోని విషయాన్ని యెర్రరంగు లో రాసి ఇవి అవసరమా అని అడిగే హక్కు మీకుందా?మీకు నచ్చిన విషయాలే అందరూ చర్చించాలని గానీ మీకు పనికి రావనిపించిన విషయాల్ని గురించి యెవరూ వాదించుకోగూడదని అనుకుంటున్నారా?వీరికి వున్న బ్లాగులో ఒక్కటీ రాయలేదు అని యెలా తీర్మానిచారు.మొత్తం నలభైకి పైగా పోష్టులు వేస్తే దాదాపు ముప్పయికి పైగా పోష్టులకి కామెంట్లు వచ్చాయి.మీకు కనబడక పోతే లేనట్టేనా?బ్లాగు నడపటంలో యేవరి వుద్దేశాలు వాళ్ళకి వుంటాయి.మీ బ్లాగులోనే కొన్ని మంచి పోష్టుల్లో నాకు నచ్చిన వాటికి కామెంట్లు గూడా వేసిన గుర్తుంది!యెదటి వారి బ్లాగుల్ని సొద అనటం మర్యాదేనా?
  ఇద్దరు సహబ్లాగర్ల పట్ల ఈ రకమయిన వ్యాఖ్యలు చెయ్యడం న్యాయమేనా?

  తప్పులు చెయ్యని వారెవరూ లేదు.వేణు గారి బ్లాగులో బాపు గారికీ రంగనాయకమ్మ చెక్కు పంపడం ఆయన రామ రామ అని తిప్పి పంపడం గురించి వేసిన పోష్టులో నేనే తొందరపడి ఒక తప్పు చేశాను.పోశ్తు వుద్దేశాన్ని అపార్ధం చేసుకుని వేరే బ్లాగులో వేణుగారిని నొప్పించే కామెంటు వేశాను.వేణుగారు యెంత కూల్ గా రియాక్ట్ అయ్యరో తెలుసునా?నాకామెంటుని దిలీట్ చేశేశారు.నేను అడిగితే ఆయన్ జవాబు కూడా నాకు షార్ప్ గానే తగిలింది.వెంటనే నా కామెంటు వున్న బ్లాగుకి వెళ్ళి ఇలా నావల్ల ఒక పొరపాటు జరిగింది.మన సహబ్లాగరు మర్యాదని మనం కాపాడాలి,ఆ కామెంటుని తీసెయ్యమని అడిగాను.ఆ బ్లాగరు నా కోరిక మన్నించారు.వేణుగారికి మళ్ళీ అది చెప్పి ఆ తర్వాతనే చర్చలో కొనసాగాను.నావల్ల జరిగిన పొరపాటును నేను సరిదిద్దుకున్న పధ్ధతి అది.యెంత కోపమొచ్చినా సరే నా నుంచి పొల్లుమాట రానివ్వకూడదనే నా పంతాన్ని నేను యెప్పుడూ నిలబెట్టుకుంటూనే వున్నాను.మరి మీరు యెలా సరిదిద్దుకుంటారు?

  ReplyDelete
  Replies
  1. మీ స్పందన వివరణ బాగుంది. మీరు ఎప్పటిలాగే పల్లెప్రపంచంలో ప్రజ శీర్షికలో చర్చలలో పాల్గొనగలరు. కామెంటుకు సూచనకు ధన్యవాదములు. ప్రజ బ్లాగుని నేను నడపడం లేదు. ఇది వేరే వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు. ఎవరూ మెయిల్ చేయలేదు ఇప్పటికి. మరో మిత్రుడు మాత్రం ఎవరూ ముందుకు రాకపోతే ప్రజలో ప్రశ్న ఉంచి డిస్కషన్ మాత్రం ఫోరం లో జరిగేలా చూద్దామంటున్నారు. దానిని గురించి కూడా ఆలోచించాల్సి ఉన్నది.

   Delete
  2. సూరనేని గారు,

   ప్రశ్న ప్రివిలెజ్ మోషను గురించి అయినపుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీటింగుల్లో చెప్పే విషయాలు ప్రివిలెజ్ మోషను పరిధిలోకి రావు. పార్లమెంటు పరిధిలోకి అస్సలు రావు, ఆయన అప్పటికి పార్లమెంటు ప్రతినిధి కాదు కాబట్టి. అందుకని ఇక్కడ కేసీఅర్ ను లాగడానికి సందర్భమే లేదు. అదే చెప్పానని గమనించ గలరు.

   ఇక పోతే నేను మోదినో , ఇంకో చైర్మన్నో సన్నాసి అనడాన్ని సమర్థించడం లేదు. అలాగే చంద్రబాబు వసూల్ రాజా అని, దొంగ అని కూడా ఇష్టమొచ్చినట్టు ప్రత్యర్థులమీద మాటలు విసురుతుంటారు. ఆమాటకొస్తే ఆ విషయంలో బాలన్స్ వున్న రాజకీయ నాయకులు చాలా తక్కువ. అందరినీ వదిలి కేవలం ఒకడినే పదే పదే ఎత్తి చూపాలనుకోవడం వల్ల ప్రశ్నలు ఉదయిస్తాయి.

   Delete
  3. అందరినీ వదిలి ఒక్కడినే ఎత్తి చూపడం అనే మీ వాదన వల్ల నేను పునరాలోచించుకున్నాను. మీరన్నది నిజమే నేను అలాంటివాటిని సమర్ధించను గానీ కే.సీ.ఆర్ నోటిదూల మాత్రమే నాకు ఎక్కువగా కనపడేది. ఎందుకో తెలీదు. మీరు ఇలా గట్టిగా నాతో కూడా వాదించాక నేను ఆత్మపరిశీలన చేసుకుంటే మీ వాదనే కరెక్టని తేలిందీవిషయంలో. కే.సీ.ఆర్ ఒక్కడికే నోటిదూల లేదు. మిగతావారి నోటిదూల కామన్ గానూ కే.సీ.ఆర్ నోటిదూల మాత్రమే ప్రత్యేకంగానూ కనబడడానికి కే.సీ.ఆర్ వాడే పదాలు ప్రత్యేకంగా ఉండడమే అనుకుంటాను. మిగతావారివి కామన్ పదాలు. అయితే ఇక్కడ రివ్యూ చేసుకోవలసింది నోటిదూల గురించి అయితే. ఇది కామన్ గా చాలామంది నేతలకు ఉన్నదే. కే.సీ.ఆర్ ని మాత్రమే నేనూ టార్గెట్ చేశాను.కావాలని కాదు కే.సీ.ఆర్ కే నోటిదూల ఉందని అనుకుని మాత్రమే. ఇప్పుడా అభిప్రాయం మార్చుకున్నాను.

   Delete
  4. కొండలరావు గారు,

   నేను పై వ్యాఖ్య వ్రాసింది మిమ్మల్నుద్దేశించి కాదు, సూరనేని గారి వ్యాఖ్యకు సమాధానంగా.

   అయితే మీరన్నట్టు KCR వ్యాఖ్యలు ప్రత్యేకంగా కనపడడానికి కొంత చారిత్రిక నేపథ్యం వుంది. గత అర్థ దశాబ్దంగా తెలంగాణా భాష పై, వాడే పదాలపై పద్ధతి ప్రకారం జరిగిన దాడి అది. సీమాంధ్ర మీడియా, సాహితీవేత్తలు కూడా ఇందులో ప్రముఖ పాత్రే వహించారు.

   ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దూషించినప్పుడు భావాన్ని కాక, కేవలం భాషని, వాడిన పదాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. అది ఆంధ్ర ప్రాంత మాండలికంలో మాట్లాడితే సరైనది, తెలంగాణా మాండలికంలో మాట్లాడితే మాత్రం ఘోరమైన తప్పు అన్న విధానం అనధికారికంగా అమలులో వుంది. ఆ చట్రం లోంచి బయటికి రానంత వరకూ, భావంలో ఎంత్ర తీవ్రమైన అభ్యంతరం ఉన్నప్పటికీ ఒక ప్రాంతం వారు మాట్లాడినవి మంచిగానూ, వేరొక మాండలికం మాట్లాడినందువల్ల అవి అభ్యంతరకరంగానూ కనిపిస్తున్నాయి.

   ఉదాహరణకు గతంలో ప్రజ లోనే జరిగిన ఒక సంఘటన మనవి చేస్తాను. నేను "కూతలు" అన్న పదం వాడడం శ్యామలీయంగారికి అభ్యంతరకరంగా కనిపించింది. దాని స్థానంలో "దూషణలు" అని వాడితే ఆ అభ్యంతరం వచ్చేది కాదేమో. దీనిలో నేను శ్యామలీయం గారిని తప్పు పట్ట దలుచుకోలేదు. తరాలుగా ఏర్పడిన భావనలనే వారు అక్కడ ప్రకటించారు.

   Delete
  5. నన్నుద్దేశించి కాదని తెలుసండీ. అయినా సందర్భాం వచ్చిందని చెప్పాను. మీరన్నట్లు నేను ఆంధ్రాప్రాంతం పక్కనే ఉండేవాడిని కాబట్టి నేనూ ఆ చట్రంలో ఉన్నాను. మీరన్నది నిజమే. అయితే అది కావాలని చేశారని నేననుకోవడం లేదు. నా ఈ అభిప్రాయమూ కరెక్టో కాదో తెలీదు. ప్రస్తుత అభిప్రాయమైతే అదే. ధన్యవాదములు. కూతలు దూషణలు కూడా నేను గమనించాను. మొత్తానికి ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి. చలాకాలం మీరు పోరాడాల్సిందేననుకుంటాను :)) ( పాజిటివ్ గా తీసుకోండి)

   Delete
 9. కొండలరావు గారూ, వ్యక్తిగత దూషణలు లేనంత వరకు చర్చ ఎంత వాడిగా వేడిగా జరిగినా ఫరవాలేదు. చర్చలు ఆరోగ్యకరంగానే ఉన్నాయన్న హరిబాబు గారి మాట కరెక్టే.

  అయితే ఎన్నో సార్లు (ఇక్కడే కాదు ఇతర బ్లాగులలో కూడా) చర్చ తప్పుదారి పడుతుంది. చర్చా విషయాన్ని దాటి (లేదా పూర్తిగా వదిలేసి) ఎక్కడికో వెళ్తారు కొందరు (దాదాపు అందరు?) వ్యాఖ్యాతలు. బ్లాగు యజమాని జోక్యం చేసుకొని గాడిలో తీసుకొస్తే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. అందరూ అన్ని వేళలా కాదు గానీ , మీరన్నట్లు ఎన్నోసార్లు లేదా కొన్ని సందర్భాలలో అందరూ అని అనవచ్చనుకుంటాను. సలహాలు ఇచ్చేవారు సైతం అలా పక్కదోవ పట్టారు చాలా సార్లు. అయితే కావాలని కాదు లేండి. కొందరేమో ఎన్ని చెప్పినా ఆత్మవిమర్శ చేసుకోరు. ఇతరులను విమర్శించేముందు తమ బ్లాగులలో కామెంట్లలో వారెంతవరకూ కరెక్టుగా ఉంటున్నదీ చూసుకోవాలి. విమర్శ ఎప్పుడూ మార్పుకు కారణం కావాలి తప్ప కోపంతోనో,ఈర్ష్యతోనో, ఫోజు పెట్టడానికో ఉండకూడదనేది నా అభిప్రాయం.కొందరిపై అది నా విమర్శ కూడా. మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను జై గారు. మీరన్న పద్ధతిలో ఇక నా బ్లాగులో కామెంట్ల నియంత్రనకు చర్చ పక్కదోవపట్టకుండా ఉండడానికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. శాయశక్తులా అని ఎందుకంటున్నానంటే నేనూ ఒక్కోసారి చర్చనీయాంశాన్ని దాటి వెళ్లిన సందర్భాలున్నాయి అనవసర విషయాలు కాకున్ననూ.

   Delete
 10. @sreekaant chaari?
  రెందు రాష్ట్రాల వాళ్ళూ తమ మధ్య గొడవల్ని పరిష్కరించుకోవటానికి ఒక సంస్థని మధ్యవర్తిగా యేర్పాటు చేసుకుని ఆ సంస్థ రెందు పక్షాలకేఎ న్యాయం చెయ్యాల్సినప్పుదు తమకు వ్యతిరేకంగా మాట్లాడగానే సన్న్నాసి అని ఆ మనిషిని గానీ తీర్పుని సన్నాసి తీర్పు అని గానీ చహవకబారు మాటల్తో వెక్కిరించటాన్ని కూడా మాండలికం పేరుతో సమర్ధిస్తున్నారు.సంతోషం.సన్నాసి అనే మాట యే మానడలికంలో నయినా ఒక అర్ధాన్నే ఇస్తుంది అని నాకు తెలిసిన తెలుగు వ్యాకరణం చెప్తుంది?కానీ సన్నాసి అనే మాట తెలంగాణాలో గౌరవనీయులకి వాడతారని అనుకోవాలి మీ సమర్ధన ప్రకారం.ప్రివిలేజ్ మోషన్ అనేది ఇవ్వాళ జరుగుతున్నది కాబట్టి నిన్నటి రోజున మీ ముఖ్యమంత్రి అన్న మాటల్ని పట్టించుకోగూడదన్న మాట.

  పది మందిలో నిలబడిన ఒక మనిషి తను సంస్క్రతంలో మాట్లాడినా అందులో యే విధమయిన అసభ్యత లేకపోయినా మిగతా తొమ్మిది మందికి అది అర్ధం కాక తమ నిరసన వ్యక్తం చేస్తే ఆ తొమ్మిదిమంది అభిప్రాయానికి తప్పకుండా విలువ ఇవ్వాలి.అది పాటించటానికి వేదవ్యాసుడు వచ్చి చెప్పనక్కర్లేదు యేసుక్రీస్తు బోధనల్నీ అరువు తెచ్చుకుని పాఠాలు చెప్పనక్కర్లేదు.జస్ట్ మామూలు తెలివి చాలు.ఆ తొమ్మిది మంది యేమనుకున్నా సరే నాకు అనవసరం నాకిష్టమయినట్టుగానే మాట్లాడతాను అని మొండిగా వుండదల్చుకుంటే ఆ తొమ్మిదిమంది నుంచీ మీరు కూడా మర్యాదనీ గౌరవాన్నీ కూడా ఆశించకూడదు.

  తన ఫాం హవుసు లో మొక్కని సరిగ్గ పాతడం తెలియని పనివాణ్ణి యెదవ అన్నా పదతాడు,యేబ్రాసి పీనుగా అని తిట్టినా పడతాడు.కానేఎ అదే మాటని రెందు రాష్ట్ర్రలూ ఒప్పుకుని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టతంలో తన ప్రమేయం కూడా వున్నాడని తెలిసీ తనకి వ్యతిరేకంగా తీఎర్పు ఇవ్వగానే సన్నాసి తీర్పు అనడం దేన్ని సూచిస్తుంది?ఆ చైర్మన్ యే సభలోనూ ప్రజా పరతింధి కాదు గాబట్టి అతను ప్రివిలేజ్ మోషను ప్రవేసపెట్టే అవకాసం లేదు కాబట్టి గమ్మున వుండిపోయాడు,కదూ!

  మీరు యెదటివాళ్లని సన్నాసి అంటే యెదటివాడు మీరు మీ మాందలికంలో మాట్లాడారు లెమ్మని సర్దుకు పోవాలి,యేమాత్రం నెప్పి ఫీలవగూడదు?కానీ మీ మాటకి ప్రతిగా జవాబు చెప్పటాని కయినా సరే మిమ్మల్ని మాత్రం గౌరవంగానే సంబోధించాలి తప్ప వాళ్ళ మాండలికంలో మాట్లాదగూడదు, మాకన్యాయం జరిగిందని న్యాయపోరాటం చహెసినవాళ్ళు యెదటి వాళ్లతో ప్రవర్తించదంలో పాటించే సమానత్వం ఇలాగే వుంటుందా! మరోసారి అసలయిన పెత్తందారీ తనం ఇదేనని గుర్తు చేస్తూ ఇంతటితో తివిరి ఇసుమున తైలము పిండే వ్యర్ధమయిన పనినించి విరమించుకుంటున్నాను!నిజాము తెలంగాణా వాళ్లని త్రీత్ చేసినట్టుగా మీరు ఆంధ్రోళ్లని త్రీత్ చేద్దామనుకుంతున్నారు,అవునా?

  వసూల్ రాజా అని దొంగ అని అన్నవాళ్ళు మీలాగా తమని అన్న మాతలకి ప్రివిలేజ్ మోషన్లు పెట్టాలని ఆనాడు అనుకోలేదు గనకనే క్లీన్ గా వున్నారు మీరు!

  P.S::మేము తెలంగాణా మాందలికంలో మాట్లాడబట్టే విపరీతార్ధాలు తీస్తున్నారు అనే మీ సమర్ధనకి నా జోహార్లు?!సన్నాసి అనేది యే మాందలికంలో నయినా ఒక్కటే అనేది నాకు తెలుసు,వీళ్ళకి మా మాందలికం గురించి తెలిసి చచ్చునా పెట్టునా అనే ధీమాతో యెదటివాళ్లకి చెవులో పువ్వు పెట్టయినా సరే గెలవాలనుకునే వాళ్ళతో చర్చించి యేమి తేల్చగలమో నాకు తోచి చావటం లేదు.కాబట్టి మీరు చర్చలో పాల్గొంటే ఆ చర్చలో పాల్గొనకపోవదమే మంచిదని నా నమ్మకం!

  ReplyDelete
  Replies
  1. సన్నాసి అనేది సన్యాసి కి మొరటుగా లేదా విక్రుతిగా(?) వాడే పదమనుకుందాం. అది తిట్టడానికి అంతటా తెలుగువారుపయోగిస్తుంటారు. కానీ సన్నాసి అంటే ఏమీ చేయకుండా జీవించేవాడని అర్ధం అనుకుంటాను. అది తిట్టుకాదు. పని చేయకుండా ఉండేవారిని అలా పోలుస్తూ చెప్పేది తిట్టుగా మారిపోయిందనుకుంటాను. ఇది సరయిందో కాదో నాకు తెలీదు కానీ నా అవగాహన చెప్పాను హరిబాబు గారు.

   Delete
  2. సూరనేని గారు,

   మీరు రెండు వేరు వేరు విషయాలను కలిపి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. నేను సన్నాసి అని వాడడాన్ని మాండలికం పేరుతో సమర్ధించడానికి ప్రయత్నించలేదు. నేను "ఇక పోతే నేను మోదినో , ఇంకో చైర్మన్నో సన్నాసి అనడాన్ని సమర్థించడం లేదు." అన్న వాక్యం మీరు గమనించ నట్టుంది.

   నేను అభ్యంతరం చెప్పింది చర్చలో లేని KCRని పట్టుకొచ్చి మోడిని సన్నాసి అన్నాడని వ్యాఖ్యానించడం గురించి. చర్చ ప్రకారం చూస్తే మోడి పార్లమెంటు సభ్యుడుగా వున్నపుడు సన్నాసి అనలేదు. అంతకు ముందు సంగతి నాకు తెలియదు. కృష్ణా బోర్డు చైర్మన్ ని సన్నాసి అన్నా అది ప్రివిలెజ్ మోషను పరిధిలోకి రాదు. కాబట్టి మీ వ్యాఖ్య చర్చతో ఏమాత్రం సంభంధం లేనిది. మరి ఎందుకు అక్కడికి KCRని లాగారు? కేవలం ఆయన మీద ఉన్న అక్కసుతో. అవునా కాదా?

   Delete
 11. కొండలరావు గారు,
  1. మీ బ్లాగులో ఎడతెగకుండా వాదనలు జరుగుతున్నాయని ఆరోపించే వారిలో నిజంలేకపోలేదు. మీ బ్లాగులో ఈ సమస్యను పరిష్కరించ వలసిన అవసరం ఉంది. ఒక అంశం పైన వాదన జరినతరువాత ఒక అర్థవంతమైన ముగింపు ఉండాలి. ఆ వాదనల సారం, భవిషత్ లో జరగబోయే చర్చలకు ఉపయోగపడాలి. లేకపోతే ప్రతి సారి చర్చించిన అంశంపై పదే పదే చర్చలు జరిగే అవకాశం ఉంది. అది చికాకు కలిగిస్తుంది. భవిషత్ లో ఇక్కడ చర్చలో పాల్గొనే వారు ఆసక్తి కోల్పోతారు
  2. ఇక మీ బ్లాగులో వాదించే వారిలో అతివాదులు/ మతవాదులు/మితవాదులు అంట్టూ ఎవ్వరు లేరు. చాలా మంది వారి వారి వాదనలు నెగ్గాలని నూటికి నూరు శాతం ప్రయత్నించిన వారు. అంతే.

  3. కొంతమంది వారు చేసేది చాలా తార్కిక వాదన గాను, వారి వాదనకు ఇచ్చే సమాధానం మాత్రం లిబరల్ విలువల పై దాడిగా భావించటం మాత్రం, దొంగే వచ్చి దొంగా దొంగా అన్నట్లుంది.

  4. బ్లాగులో ఆరోపణలు చేసేవారికి సబ్జెక్ట్ పైన కొంత నాలేడ్జ్ అన్నా ఉండాలి. అది లేకుండా ఆరోపణలు చేసే వారి వ్యాఖ్యలను తొలగించాలి. ఉదాహరణకు ఆ మధ్య ఒకాయన భగవద్గీత గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్య చదివిన వారికి ఆయనకు భగవద్గీత గురించి కాదుకదా, భాతతదేశం గురించి ఎమీ తెలియదని స్పష్టం గా అర్థమౌతుంది. సబ్జేక్ట్ తెలియని ఇటువంటి వారిని వదిలేస్తే, వారు విరివిగా వ్యాఖ్యలు రాస్తూ పాఠకులను తప్పుత్రోవ పట్టిస్తుంటారు. హిందూ మతాన్ని మాత్రమే విమర్శించే వారికి తెలియని దేమిటంటే, మమదేశ చారిత్రక వారసత్వాన్ని స్మరించుకొంట్టూ, భారత రాజ్యాంగ తొలి కాపి లో గురుకుల ఆశ్రమంలో ఋషులు శిష్యులకు విద్య భోదించే చిత్రం, కృష్ణుడు అర్జునకు భోదించే భగవద్గీత, రామాయణంలోని శ్రీరామపట్టాభిషేకం హిందూ మతానికి సంబందించిన పైంటింగ్స్ చాలా ఉన్నాయి. రాజ్యాంగం రచించేటప్పుడు సెక్యులరిజం గురించి ఎంతో చర్చజరిగినా మనదేశాన్ని సెక్యులర్ దేశంగా పేర్కొనబడలేదు. సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఎమెర్జెన్సి సమయంలో ప్రతిపక్షాలు జైల్లోఉన్నపుడు రాజ్యాంగంలో చేర్చారు. సెక్యులరిజం అంటే హిందువుల సంబందిచిన సంస్కృతిని సమూలంగా తీసి పక్కన పడేయటం కాదు.

  5. మీబ్లాగులో రాసిన వ్యాఖ్యలలో అసత్యాలను ఖండించటానికి, నాకు తెలిసిన సమాచారంతో వ్యాఖ్యలు రాశాను. ఇకపైన ఇక్కడ చర్చలలో మునుపటివలే పాల్గొనే ఉద్దేశం లేదు.
  Thanks

  ReplyDelete
  Replies
  1. నేనెలా ఉన్నాననేదే నేను చెప్పగలను. నా బ్లాగులో ఉన్నవారి ప్రవర్తనపై వారి భావాలపై నేను చెప్పలేను. నాకు సంబంధమూ లేదు. వ్యక్తిగతంగా ఎదుటివారిని కించపరచే కామెంట్లను మాత్రం నేను డిలీట్ చేశాను. అది మీకూ తెలుసు. మీరు చెప్పిన కొన్ని విషయాలు నా బ్లాగు పల్లెప్రపంచంలో నియంత్రించాలనే నిర్ణయించుకున్నాను. చెప్పడం కంటే ఆచరణలో చేసి చూపించగలననే నమ్మకం ఉంది. ఇప్పటివరకు సహకరించిన మీకు ధన్యవాదములు. నాకు భారతీయ సంస్కృతిమీదా, భగవద్గీత పైనా, రాముడిపైనా , హిందూ మతం పైనా దురభిప్రాయాలు అసలు లేవు. ఎవరైనా అనుకుంటే అది వాళ్ల తప్పేనని చెప్పగలను.

   Delete
 12. కొండలరావు గారూ, వీరి అభిప్రాయం కూడా చూడండి:

  http://blogillunews.blogspot.in/2014/11/blog-post_18.html

  ReplyDelete
  Replies
  1. శ్రీనివాస్ గారు చక్కగా వ్రాశారు. లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు జై గారు.

   Delete
  2. @స్రీకాంత్ చారి
   నేను ఒక్క ప్రివిలేజ్ మోషను గురించే మాత్లాడటము లేదని ముందే స్పష్తం చేశాను.నా ప్రశ్న సూటిగా ఇది:ఒక తెలంగాణా వ్యక్తి తెలంగాణేతరుణ్ణి సన్నాసి అన్నాదు, కొందల రావు గారు సన్నాసి అనేది తిట్టు కాదు అన్నా ,అది పాయింటు కాదు - అవతలి వాడికి అది ఇబ్బందిగా వుంది.అదీ ఒకసారి కాదు పదే పదే అవతలి వాడు యెన్నిసార్లు అభ్యంతరం చెప్పినా సరే అది మా మాండలికంలో చలా సహజమే అంటున్నారు. అంటే మీతో హలో అనాలన్నా యెదటి మనిషి మీ మందలికంలో నిగూఢార్ధా లన్నీ నేర్చుకుని రావాలా? అది బూతు కాకపోయినా సరే యెదటివాడికి ఇబ్బంది కలిగిస్తున్నది అని తెలిసినప్పుదు ఆపాలి అనే మర్యాద మీరు పాటించరు,కానీ మీకు నచ్చని రౌడీ రాజ్యం అని లోకేష్ యెక్కడో అన్న మాటకి మాత్రం భూనభోంతరాళాలు దద్దరిల్లి పోయేతత్ళు హడావిది పడుతున్నారు? అదే మేము ఇమ్మల్ని సమర్ధించుకోలని మాత గురించి నిలదీస్తే మళ్ళీ ఇలాంటి మాటలు అందరూ అంటున్నారూ అని యెన్ తీ ఆర్ కుక్కమూతి పిందెల నుంచీ చరిత్రలు తవ్వేదీ మీరే!ఆ కాడికి మరి మిమ్మల్ని అన్నప్పుదే యెందుకీ హడావిడి అంటే మాత్రం జవాబు రాదు?!నెప్పి యెదతివాళ్ళు మిమ్మల్ని అన్నప్పుదు మీకు మాత్రమే కలుగుతుందా?మీరు మాట్లాడినప్పుదు యెదతివాళ్ళకి కల్గే నెప్పి గురించి మీకక్కర్లేదా?

   మీకు యెదటివాడు నెప్పి తగిలేలా మాట్లాదగూడదు,కానీ మీ మాతలు యెదటివాణ్ణి నొప్పిస్తే అది మీ మాందలికాన్ని అర్ధం చేసుకోకపోవడం యెదటివాడి లోని లోపం, లేదంటే ఒక వ్యక్తి మాట్లాడిన పదాలూ, భావమూ, అర్ధమూ, శబ్ద వ్యుత్పతి,అలంకార శాస్త్రమూ,మాణ్దలిక పదకోసమూ, బహువ్రీహీ కర్మధారయ సమాసాలూ, రెందు విబిన్న విషయాలని కలపదం లాంటి సిధ్ధాంతాలు యెత్తుకోవటం!కేసీఆర్ యెట్లా పరిపాలించినా దాని ఫలితం నాకు తగుల్తుందా?అతన్ని ద్వేషించదానికి నాకేమి దురద?పగయది గల్గెనేని పామున్న ఇంట కాపురముండుట అనే కవివాక్యం నాకు తెలుసు!ద్వేషం యే మనిషిలో వుంటే ఆ మనిషినే కాల్చేస్తుంది,నాకేందు కా గోల!తెలంగాణాలో ఆప్ అనే ముద్రతో వాహనాలు వుందకూదదని కోర్ట్తులతో చివాత్లెట్టించుకునే ప్రతిపాదనల వెనక వున్నది ఆంధ్రా ద్వేషం కాక మరొక గొప్ప ఔన్నత్య శిఖరాలు యెక్కించే భావాలు యేవయినా వున్నాయా?!

   మీలాగా హనుమంతుది తోకలాగా ఇలా కొనసాగించదం నాబోటి సామాన్యుది కెవడికీ సాధ్యపదదు,సారీ!మీతో వాదించటం అనవసరం,వృధా శ్రమ.

   Delete
  3. ఈ మాండలికాలు, భాషల గురించి సుదీర్ఘమైన చర్చే జరిగింది ఇదివరకు, అది కూడా ప్రజలోనే. ఆపోస్టుకు చెందిన లింకు ఇస్తున్నాను చూడండి

   http://praja.palleprapancham.in/2014/10/blog-post_15.html

   దానిలో నేను చెప్పిన దానిలో ఒక పేరా...
   --------------------------
   ప్రపంచములో, అనేక మాండలికాలూ, భాషలు, సంస్కృతులూ ఉన్నాయి. అయినా ఇతరులతో మాట్లాడేప్పుడు, వారిని విమర్శించేప్పుడు గౌరవ ప్రధంగానే అవన్నీ చేసుకునేందుకు కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎవరైనా ఆపద్దతులనే పాటిస్తారు. అలా కాకుండా, మా మాండలికములోనో, మా సంస్కృతిలోనో మేము చేస్తాం. భరించాల్సింది మీరే అంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచములో ఉన్న చాలా దేశాలు నిరంతరం యుద్దాలు (కనీసం మాటల యుద్దాలు) చేసుకుంటూ ఉండేవి. మీ మాండలికం ఏదైనా ఎదుటి వారితో సంభాషించేప్పుడు .. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్నా లేదా? మాండలికాలు, ఆత్మగౌరవాలు ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు అని గుర్తిస్తే బావుంటుంది. ఒకవేల ఏవ్యక్తైనా వీటిని పాటించనపుడు అతన్ని వెనకేసుకు రాకుండా, తప్పును తప్పు అని చెప్పి తప్పుకోవాలి. కానీ, ఇక్కడ అలా జరగ లేదు.
   --------------------------

   ఒక గుంపులో ఉన్నప్పుడు ఒక మాట లేక ఒక చేష్ట మిగిలిన వారికి అభ్యంతరకరమైనప్పుడు పదే పదే ఆ మాటలను మాట్లాడడం చేష్టలు చేయడం ఇతరులను అగౌరవ పరచడమే అవుతుంది. మీ మాండలికాన్నిమీ ఊర్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీ గురించి మీరు మాట్లాడుకునేప్పుడు ఉపయోగిస్తే బావుంటుంది. కానీ, వారు వారు మాట్లాదుకునేప్పుడు ఇటువంటి మాండలికాలుండవ్. చాలా మర్యాదగా ఉంటాయి. కానీ, పక్కవారితో మాట్లాడేప్పుడు మాత్రం "తిట్లొస్తాయ్" దాన్ని మా మాండలికం అని సమర్ధించుకునే "తెలివితేటలొస్తాయి".

   ఇతరులతో మాట్లాడేప్పుడు, ఇతరులను గురించి బహిరంగంగా మాట్లాడేప్పుడు మీ మీ "మాండలికాల్ని" కట్టి కబోర్డులో పడేసి, అందరికీ అమోదయోగ్యమైన, గౌరవనీయమైన భాషలోనే మాట్లాడాలి. లేకపోతే గొడవలే. ఎందుకంటే మీ మాండలికం మీద గౌరవం , ప్రేమ మీకుండొచ్చు కానీ వేరే వారికి ఉండదు. అంతెందుకు, భవిశ్యత్తులో మరొకరు ఎవరో వచ్చి "పచ్చి బూతులు" తిట్టి ... అబ్బో మేము పొద్దున లేచిన దగ్గర్నుండి, రాత్రిపడుకునే వరకూ ఇలానే మాట్లాడుకుంటాం అంటే ఎలా ఉంటుంది?? పైగా అది మా సంస్కృతి అని సమర్ధించుకుంటే ఎలా ఉంటుంది?

   కాబట్టి, మీ సంస్కృతులు ఏవన్నా ఉంటే మీలో మీరు చూపించుకోండి. ఇతరులతోగానీ, ఇతరుల గురించి బహిరంగంగా గానీ మాట్లాడేప్పుడు ఆమోదయోగ్యమైన భాషనే ఉపయోగించండి. మాకు అది రాదు అనుకుంటే.."మాట్లాడకుండా ఊరుకోండి". లేదు అంటారా? అవతలి వాల్లు కూడా అదే మాండలికాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే .. రోములో ఉన్నప్పుడు, రోమనులతో మాట్లాడేప్పుడు రోమనుల్లానే ఉండాలి కదా??

   Delete
  4. సన్నాసి అనేది అంత గొప్ప పదమైతే, అలా అనటంలో ఏ దురుద్దేశం లేకపోతే, వారి కుటుంబంలో ఉన్న రాజకీయా వారసులను, బహిరంగ సభలలో సన్నాసి అని పిలవమనండి. అది విని ప్రజలు ఎలా స్పందిస్తారో, వారి పిల్లలకి అది నచ్చుతుందో లేదో, ప్రజలకి తెలుస్తుంది.

   Delete
 13. హరి బాబు గారు, నమస్తే.... విభజన ప్రక్రియ సమయం లో తెలంగాణ వ్యక్తుల కన్నా, ఆంధ్ర ప్రాంత వ్యక్తులు చాలా దారుణంగా పోస్టింగులు సోషల్ మీడియా లో చేశారు... కోదండ రామ్ , కె.సి. ఆర్. నోటిలో యూరినేట్ చేస్తున్నట్లు వున్న ( ఇది రాయటానికి కూడా నాకు ఎబ్బెట్టు గా వుంది) ఫోటోస్ ఫేస్ బుక్ లో ఎన్నో సార్లు పోస్టు అయ్యాయి... అంతేదుకు... ఎవరో ఒక పేరు అప్రస్తుతం.... తెలంగాణ వచ్చిన తరువాతనే తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం టాపిక్ వస్తే, చని పోయిన వ్యక్తుల గురుంచి ఎంత నీచం గా రాశాడో నేను చూశాను.... మౌనిక పాల్వాయి.... అనే ఒక వ్యక్తి , మొన్న హైదరాబాద్ లో హోటల్ లో పట్టుబడ్డ సి . ఐ. , మహిళా యస్. ఐ. ల ఎపిసోడ్ ను తెలంగాణ తో ముడి పెట్టి “ ఏమి జాతి రా మీది” అని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.... ఎవరో ఇద్దరు వ్యక్తుల కామ వాంచకు మొత్తం తెలంగాణ జాతి కి ముడిపెట్టడం. ఎంత దారుణం... గుండు మధుసూదన్ రావు గారు, ఆయన బ్లాగ్ లో ఏదో రాసుకుంటే... ఎంత నీచంగా ఇతర బ్లాగులల్లో కామెంట్స్ చేశారు.... తెలంగాణ వచ్చిన తరువాత కూడా తెలంగాణ వునికిని ఖచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో కొంతమంది ఓర్వలేకపోతున్నారు...

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top