Name:Srikanth Chari 
E-Mail:deleted  
Subject:ప్రతిరోజూ రేవంత రెడ్డి మాట్లాడేదంతా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయోగిస్తున్న అవాస్తవపు కథనాలేనా? 
Message:https://www.youtube.com/watch?v=nCPjP5Ycq-o

ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తోంది?

గతంలో రాజశేఖర్ రెడ్డిని ప్రజలు గెలిపించారు కాబట్టి తమ పార్టీ కూడా అబద్ధాలతో అధికారం లోకి వచ్చామని రేవంతరెడ్డి చెపుతున్నాడు.

పనిలో పనిగా రాజకీయ నాయకులకు అసలు ఫిలాసఫీయే వుండదనీ, ప్రజలు ఎటువైపు మొగ్గుతుంటే వారూ అదే స్వీకరిస్తారనీ అంటున్నాడు.

ఇలా ప్రజలకు అవాస్తవాలు చెప్పడాన్ని సమర్థించుకోవడం ఆమోదయోగ్యమేనా?

అయితే ప్రతిరోజూ రేవంత రెడ్డి మైకు ముందుకు వచ్చి మాట్లాడేదంతా వారి పార్టీ ఫిలాసఫీకి అనుగుణంగా కాక, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయోగిస్తున్న అవాస్తవపు కథనాలేనా?

రాజశేఖర్ రెడ్డి అవాస్తవాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని వీరెలా చెప్పగలరు? పైగా దాన్నే ఆదర్శంగా తీసుకోవడంలోని హేతుబద్ధత?

తాము బురదలో వున్నట్టు చెప్పుకోవడమే కాక నరేంద్ర మోది తో సహా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారిలో ఎవరికీ ఎలాంటి సిద్ధాంతాలు లేవని ఎలా సూత్రీకరించ గలరు? 
Reactions:

Post a Comment

 1. రేవంత్ రెడ్డి చంద్రబాబు కీ ఇస్తే మాట్లాడే బొమ్మ. మోత్కుపల్లి రిటైర్ అయ్యినట్టు ఉన్నాడు తద్వారా ఖాళీ అయిన చోటు ఈయన తీసుకున్నాదేమో? అంచేత ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం దండుగ.

  ReplyDelete
  Replies
  1. జైగారూ, ప్రస్తుతరాజకీయపార్టీల్లో అంతర్గతప్రజాస్వామ్యం నేతిబీరకాయల్లో నేతి చందమే అని అందరకూ తెలుసును కదా. అన్ని రాజకీయపార్టీలకూ అధినేతలుంటారు. పార్టీ కొక్కరు మాత్రమే అధినేత ఉండి మిగతావారంత అధినేతగారి ఆదేశం మేరకు నడుచుకుంటారు. నిజానికి ఈ సంస్కృతి కాంగ్రెసు సంస్థలోనే జాతిపితగారితోనే చక్కగా మొదలయ్యింది. పట్టాభి ఓటమి నా ఓటమి అని ఆయన అనగానే ఎన్నికైన బోసుగారి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ మధ్యన మరొకటి చదివాను. హెచ్చు మంది పటేల్ ప్రథాని కావాలని కోరినా, నెహ్రూగారు తాను మరొకరి క్రింద పనిచేయను అని తేల్చి చెప్పారనీ, దానితో నెహ్రూని ఎన్నుకోమని గాంధీగారు ఆదేశించారనీ. అప్పట్లోనే అధినేత మాట అన్నదే చెలామణీ. దానిని నెహ్రూ అమలు చేసారు, ఇందిర మరింత పటిష్టపరిచారు. ఆవిడ కుటుంబం అంది పుచ్చుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఇతర పార్టీలన్నీ ఆ తాను ముక్కలవంటివే కావటం వలన అధినేత సంస్కృతి బాగానే వర్థిల్లుతోంది. కమ్యూనిష్టులు ఎలాగూ ప్రజాస్వామ్యం అనేదాన్ని ఒప్పుకోరు. ప్రజలకోసం నియంతృత్వం అంటారు.

   ఏతావత్ చెప్పేది ఒక్కటే. అందరు రాజకీయ నాయకులూ అధినేతల చేతుల్లో కీ-బొమ్మలే. ఎవరినీ ప్రత్యేకించి మనం వేరుగా వేలెత్తి చూపనవసరం ఉండదేమో అని.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top