(from : andhrajyothy daily)

క్రిస్మస్ రోజే వాజిపేయీ జన్మదినం కూడా కావడం విశేషం. వాజిపేయీ జన్మదినాన్ని సుపరిపాలనా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన వాజ్‌పేయికి అభినందనలు తెలుపుతున్న క్రిస్మస్ తాత - ఈ కార్టూన్ నాకు నచ్చింది. RSS నేపథ్యం ఉన్న వాజ్‌పేయీ జన్మదినo క్రిస్మస్ రోజు కావడం, క్రిస్మస్ రోజు కావాలనే సుపరిపాలనాదినంగా ప్రభుత్వం ప్రకటించిదన్న విమర్శల నేపథ్యంలో ఈ కార్టూన్ భిన్నత్వంలో ఏకత్వమున్న మనదేశ భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నట్లనిపించింది.

భారత రత్నాలు


మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయికి, స్వాతంత్య్ర సమరయోధులు మదన్‌ మోహన్‌ మాలవ్యాకు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నేడు వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా పుట్టిన రోజు కానుకగా ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పటికే డిసెంబర్‌ 25ను 'సుపరిపాలన దినం'గా ప్రకటించిన విషయం విదితమే. కేంద్రంలో ఎక్కువ కాలంపాటు ప్రధానిగా వున్న కాంగ్రెసేతర వ్యక్తి వాజ్‌పేయి. ఇక మదన్‌ మోహన్‌ మాలవ్య విషయానికొస్తే ఆయన స్వాతంత్య్ర సమరయోధుడే కాకుండా విద్యావేత్త కూడా. భారతరత్న అవార్డులు ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 43 మందికి ఈ పురస్కారం లభించింది. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపకుల్లో ఒకరైన మాలవ్య1861 డిసెంబర్‌ 25న జన్మించారు.. 1909 నుంచి 1918 వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పని చేశారు.

మాలవ్య వాజ్‌పేయి జాతికి చేసిన సేవలకు తగిన గుర్తింపు ఈ అవార్డులని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. భారత దేశం ఇదివరకు ఎన్నడూ ఎరుగని గొప్ప అనుసంధాన కర్త వాజ్‌పేయి అని, ఆగ్నేయాసియాలో సుస్థిర శాంతి స్థాపనకు అంకితమైన మహానేతగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అభివర్ణించారు. బిజెపి నేతలు, ఎంపీలు, మురళీమనోహర్‌ జోషి తదితరులతోపాటు ఎన్‌డిఎ భాగస్వామి శివసేన వాజ్‌పేయికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.

వాజ్‌పేయిని వికాస్‌ పురుషునిగాను, దార్శనికునిగాను బిజెపి, ఆరెస్సెస్‌లు శ్లాఘించినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగు వేసుకున్న నేత అన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. భవిష్య దృష్టి కలిగిన గొప్ప విద్యావేత్తను మదన్‌మోహన్‌ మాలవ్యను బిజెపి భావిస్తున్నది. మదన్‌మోహన్‌ మాలవ్య సమకాలికుల్లో కొందరు ఆయనకన్నా విశిష్ట సేవలు దేశానికి అందించారు. వారిని వదిలి మాలవ్యను మాత్రమే దీనికి ఎంపిక చేయడం మోడీ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

భారత రత్న అవార్డులకు సంబంధించి రాష్ట్రపతికి నేరుగా ప్రధాని మోడీయే సిఫార్సు చేశారు. గత ఏడాది మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు, శాస్త్రవేత్త సిఎన్‌ఆర్‌ రావుకు భారత రత్న అవార్డులను అప్పటి యుపిఎ ప్రభుత్వం బహూకరించినప్పుడు దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను కాంగ్రెస్‌ విస్మరించిందని బిజెపి ఆనాడు విమర్శించింది.

అవార్డులు, పురస్కారాల విషయంలో అధికారంలో ఉన్నవారి ముద్ర కనపడుతూనే ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారి ముద్రలా కాకుండా భవిష్యత్తులో ఈ విషయమై మన నేతల ఆలోచనలు పరిణితి చెందాల్సిన అవసరమున్నది.
Reactions:

Post a Comment

 1. This comment has been removed by the author.

  ReplyDelete


 2. క్రిస్మస్ కానుకగా వాజపేయీ కి భారత రత్న ! రిటర్న్ కానుక క్రిస్మస్ తాత కి 'సుపరిపాలనా దినం !!

  జిలేబి

  జిలేబి

  ReplyDelete
 3. oye.vajpay ki christmas valana raledu. ayana birthday valana vachchindi.

  ReplyDelete
 4. blagulalo neelanti nastikulu perigi hindu mathaanni brashtupattinche prayanam chestu charchalu pedutunaru. ivi apandi. ne pranteeyavadam chalu
  http://saveindiansnow.blogspot.com/2014/12/blog-post_25.html

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. ఎవరి బైలైనూ కోట్ చేయలేనందున ఈ వ్యాసం మీరు సొంతంగానే రాసారనుకుంటున్నాను.. మీ వ్యాఖ్యానం మీ ఇష్టం అనుకోండి... దాన్ని ఎవరూ ఆపలేరు... అయితే చిన్న సందేహం...

  ''మదన్‌మోహన్‌ మాలవ్య సమకాలికుల్లో కొందరు ఆయనకన్నా విశిష్ట సేవలు దేశానికి అందించారు.'' ... ఆ కొందరిలో భారతరత్నకు అర్హులని మీరు భావిస్తున్న ఓ నలుగురైదుగురు పేర్లు చెబుతారా....

  ReplyDelete
  Replies
  1. గత సంవత్సరం సచిన్ కు భారతరత్న ఇచ్చినపుడూ పోస్టు ఉంచాను. అపుడూ భిన్న అభిప్రాయలను ఇచ్చాను. ఇపుడూ ఉంచాను. నేను వాజ్‌పేయీకి ఇవ్వడాన్ని తప్పుపట్టడానికీ పోస్టు ఉంచలేదు. వివిధ పత్రికలలో వచ్చిన సమాచారం మేరకు పాజిటివ్-నెగిటివ్ అన్నీ కలిపి మేటర్‌ని సంకలనం చేశాను. నా అభిప్రాయం మాత్రం కార్టూన్‌పైనది మరియూ చివరిలో పురస్కారాలు ఇచ్చేటపుడు రాజకీయముద్ర పడకుండా ఉండేందుకు మన నేతలకు పరిణితి పెరగాలనేదే. వాజ్‌పేయీకి ఇచ్చినపుడు పీ.వీ కి ఇవ్వాలనే డిమాండ్ సహజంగానే వస్తుంది. అది వాజిపేయిని అవమానించినట్లు కాదు. అలాగే వాజిపేయిని RSS వాడనే విమర్శలూ సహజం. విమర్శలూ ప్రశంసలూ సహజం. వాజిపేయీకి కాంగ్రెస్ వారు ఇస్తారా? పీ.వీకి బీ.జే.పీ వారు ఇస్తారా? చూద్దాం బీ.జే.పీ వారు ఇస్తారేమో! ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ వారు కూడా పీ.వీ కి ఇచ్చే అవకాశం లేదు. అది వారి అంతర్గత రాజకీయం. బీ.జే.పీకి ఇచ్చే అవకాశం ఉన్నది. వాజిపేయి భారతరత్నకు అనర్హుడు అనే అభిప్రాయం వ్యక్తిగతంగా నాకు లేదు.

   Delete
  2. @ puranapandaphani గారు,

   << ''మదన్‌మోహన్‌ మాలవ్య సమకాలికుల్లో కొందరు ఆయనకన్నా విశిష్ట సేవలు దేశానికి అందించారు.'' ... ఆ కొందరిలో భారతరత్నకు అర్హులని మీరు భావిస్తున్న ఓ నలుగురైదుగురు పేర్లు చెబుతారా.... >>

   మంచి ప్రశ్న. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ .... వీరిలో ముఖ్యంగా భగత్‌సింగుకు ఇప్పటి వరకూ ఇచ్చిన వారిలో ముందు వరుసలో ఇవ్వాల్సినవాడు కాదంటారా?

   క్రికెట్ ఫిక్షింగులో మౌనంగా ఉన్న సచిన్ భారత రత్న అవుతాడు కానీ భగత్ సింగ్ కాడా? మాలవ్యాకి ఇచ్చినప్పుడు భగత్ సింగ్ కు ఇవ్వరా?

   బీ.జే.పీ వారికి హిందుత్వ ఎజెండా ఉన్నవారికి ఇస్తారు. కాంగ్రెస్ వారు సచిన్ కు ఇస్తారు. తె.రా.సా వారు పీ.వీని ప్రతిపాదిస్తారు. టీ.డీ.పీ వారు ఎన్.టీ.ఆర్ ని ప్రతిపాదిస్తారు. మరి వీరెవరికీ భగత్ సింగ్ ఎందుకు గుర్తుకు రాడు? భారత రత్నాలు రాజకీయ రత్నాలు కాకుండా మన నేతలు పరిణితి చెందాలని నా అభిప్రాయం.

   భగత్ సింగుకు భారతరత్న ఇవ్వాలా? వద్దా? భారత రత్నాలను ప్రకటించడంలో రాజకీయం జరుగుతుందా? లేదా? మీ అభిప్రాయం ఏమిటి?

   Delete
  3. భలే వారండీ !

   భగత్ సింగ్ కి ఇచ్చి ఉంటె మాలవీయ కి ఎందుకు ఇవ్వలేదు అని ఉండే వారేమో ?
   (కాకుంటే , ఝాన్సీ కీ రాణీ గారి కి ఎందుకు ఇవ్వలే దని అని ఉందురు !!))

   :):

   జిలేబి

   Delete
  4. కొండలరావు గారు,
   భగత్ సింగ్ విషయంలో ఆయనకు ఉరిశిక్షపడినపుడు గాంధీ గారు కూడా దానిని రద్దు చేయాలని/ ఆపాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరలేదు. ఆ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన ఉంది. ఆయనకి భారత రత్న ఇస్తారని ఎలా అనుకొంటారు?

   Delete
  5. *పి.వి కి బి.జే.పీ వారు ఇస్తారా? *

   తప్పక ఇవ్వాలి. ఇస్తారని అనుకొంటాను. చాలా మంది బిజెపి వారు వాజ్ పాయ్ కి అవార్డ్ వచ్చినా అందరు పివి కి ఇవ్వాలని కోరారు. ఏ అవార్డ్ అయినా మనుషులు బ్రతికి ఉన్నపుడు ఇస్తేనే బాగుంట్టుంది. పివి మన మధ్య ఎలాగూ లేరు. బ్రతికి ఉన్న వాజ్ పాయ్ కి మొదట ఇవ్వటం సమంజసం. రానున్న రోజుల్లో పివి కి తప్పక ఇవ్వాలి.

   Delete
 7. వాజపేయీ గారికి భారతరత్న ఇవ్వడానికి క్రిస్మస్ కి సంబంధం ఏంటో ఆ కార్టూనిస్ట్ కే తెలియాలి.

  ReplyDelete
  Replies
  1. ఆ కార్టూన్లో తప్పేమి ఉంది శర్మగారు. క్రిస్మస్ రోజు వాజిపేయి జన్మదిన కావడం యాధృచ్చికం. క్రిస్మస్ తాత బహుమతులు ఇస్తాడనే సాంప్రదాయమున్నది కనుక ప్రజలమన్నన పొందిన వాజిపేయికి బహుమతి ఇస్తున్నట్లు కార్టూన్ వేశాడు. మనదేశం మతసామరస్యానికి ప్రతీక గనుక దానిని పాజిటివ్‌గా తీసుకోవాలనేది నా అభిప్రాయం.

   Delete
 8. లేదు శర్మ గారూ
  వీడొక కమ్యూయనిస్ట్ నాస్తీకుడు

  ReplyDelete
  Replies
  1. @ SivaKumarGV , నేను ఏ మతానికి వ్యతిరేకిని కాదు. ప్రాంతీయవాదిని అసలే కాదు. మతోన్మాదం ఎంత దరిద్రంగా ఉంటుందో నీ కామెంట్లు చూస్తే అర్ధమవుతుంది కదా. అందుకే మతోన్మాదాన్ని నేను తప్పక వ్యతిరేకిస్తాను.

   Delete
 9. మదన్ మోహన్ మాలవీయ స్వాతంత్ర్యం కంటే ముందు మరణించారు. స్వాతంత్ర్యం మునుపే పోయినవారికి భారత రత్న అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి.

  ReplyDelete
  Replies

  1. జై గొట్టి ముక్కలు వారు,

   ఎందులో అయినా మేమే ఫస్ట్ !

   జిలేబి

   Delete
  2. అదేదో డెటర్జెంటు ఆడులో అన్నట్టు "మొదటిసారి, ఆఖరిసారి కాదు" అవుతుందేమో చూద్దాం :)

   Delete
 10. nastikudu e mataannee nammadu nelaga. bhagavadgeeta pi prasna pettinapude ni hindu vyatirekata telisindi. nivu e devdini nammutavo cheppu. nivu

  ReplyDelete
 11. నేను మీ వ్యాఖ్యానాలను ప్రశ్నించడం లేదు. అది వృథా అని నాకు తెలుసు.

  మదన్ మోహన్ మాలవీయ కంటె విశిష్ట సేవలు అందించిన ఆయన సమకాలికులను వదిలేసి మాలవీయకు ఇవ్వడం రాజకీయం లేదా పక్షపాత ధోరణి అని మీరు రాసినందునే ఆ సదరు సమకాలికులెవరా అని నాకు సందేహం వచ్చింది. పైగా... వాజపేయికి ఇవ్వడాన్ని మీరు తప్పు పట్టకపోయే సరికి, మాలవ్య వాజపేయి కంటె తీసిపోయిన వాడా అని అనుమానం కలిగింది. దహా. సోషలిస్టు భగత్ సింగ్ కి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెసును వదిలిపెట్టిన హిందూమతవాది మాలవ్యకు ఇవ్వడం తప్పు అని మీరు నేరుగా రాస్తే నాకు ఆ సందేహం కలిగుండేది కాదు.

  ఇంక మీరు నాకు బోలెడన్ని ప్రశ్నలు సంధించారు. నిజానికి వాటిని అడగాల్సింది నన్ను కాదు... భారత రత్నలు ప్రకటించేది నేను కాదు కదా..! మీ ప్రశ్నల్లో నేను మాట్లాడగలిగిన కొన్ని అంశాలు మాత్రం చెబుతాను...

  భగత్ సింగ్ విషయానికి వస్తే... ఆయన మదన్ మోహన్ మాలవ్యకు సమకాలికుడు కాదు. భగత్సింగ్ పుట్టిన 1907 నాటికే మాలవ్య స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకస్థాయిలో ఉన్న నేత. 1886 కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనడమే కాదు, ప్రసంగించాడు కూడా. 1909లో అంటే భగత్ సింగుకు రెండేళ్ళ వయసు నాటికి మాలవ్య భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడు. భగత్ సింగు ఉరికొయ్య చనిపోయిన మీద చనిపోయిన 1931 తర్వాత కనీసం 15ఏళ్ళపాటు క్రియాశీలంగా పనిచేసాడు. విశ్వవిద్యాలయ స్థాపన ద్వారా నేటికీ విద్యాదానం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా భగత్ సింగ్ మాలవ్య కంటె వయసులో, అనుభవంలో, కార్యాచరణలో చాలా చిన్నవాడు.

  మాలవ్య కంటె భగత్ సింగే దేశానికి విశిష్ట సేవలు చేసాడా. మాలవ్యది మితవాద మార్గం, భగత్సింగ్ ది విప్లవ మార్గం. ఇద్దరూ తమతమ సంస్థల్లో అందించిన సేవలను పరిమాణాత్మకంగా చూస్తే భగత్ సింగ్ తక్కువే. లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారంగా సాండర్స్ ను హత్యచేసిన భగత్సింగ్ ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత జైలులో ఆందోళనలు మినహాయిస్తే ఉరిశిక్షను ఎదుర్కొనడం తప్ప చేసిందేమీ లేదు. మరోవైపు మాలవ్య తాను మితవాది అయివుండి కూడా, సంఘసేవ కోసం న్యాయవాదవృత్తిని వదిలేసినప్పటికీ చౌరీచౌరా కేసులో బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించిన 177మంది స్వతంత్ర సమర యోధుల కోసం నల్లకోటు మళ్ళీ తొడుక్కున్నాడు, వారిలో 156మందికి ఉరిశిక్ష తప్పించగలిగాడు. (మనలో మన మాట ఒకణ్ణి కాల్చడంలో ఉన్న గ్లామర్, మేన్లీనెస్... వాదనతో వందమందిని రక్షించడంలో ఉండదులెండి. దహా.)

  జస్ట్ ఇన్ కేస్... మాలవ్యకు ఇవ్వకుండా భగత్ సింగ్ కే భారతరత్న ఇచ్చారనుకోండి.. భగత్సింగులో జాతీయతాభావనలను రెచ్చగొట్టి, సాండర్స్ ను కాల్చేలా చేసింది లాలా లజపత్ రాయ్ కదా... మరి భగత్ సింగ్ కంటె ముందు లాలాకు ఇవ్వాలి అంటారా మీరు? టెక్నికల్గా అంతే కదా.

  సచిన్ భారతరత్న అవుతాడు కానీ భగత్ సింగ్ కాడా? -- ఆ ప్రశ్న మన్మోహన్ సింగ్... క్షమించాలి, సోనియాగాంధీని అడగాలి.

  మాలవ్యాకి ఇచ్చినప్పుడు భగత్ సింగ్ కు ఇవ్వరా? -- ఆ ప్రశ్న నరేంద్ర మోదీని అడగాలి. మోదీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కాలేదు, మరో నాలుగేళ్ళు భారతరత్నలు ప్రకటించే అవకాశం ఆ ప్రభుత్వం చేతిలో ఉంది.

  (అన్నట్టు... కమ్నిస్టులకు ఎక్కువ దోస్తులైన కాంగ్రెస్ వాళ్ళు భగత్సింగ్ కు భారతరత్న ఇవ్వనప్పుడు ఈ ప్రశ్న ఎవరూ వేసినట్టు ఎక్కడా చూడలేదు)

  భారతరత్నలను ప్రకటించడంలో రాజకీయం జరుగుతోందా? -- మాలవ్య వరకూ రాజకీయ నిర్ణయం కాదని నేను అన్నాననుకోండి, మీరు ఒప్పుకుంటారా? (ఇది ప్రశ్న కాదు మహప్రభో, మీరు కోరని నాకు తెలుసంటున్నాను)

  అసలు ప్రశ్న... భారతరత్నగా ప్రకటించిన వ్యక్తి దానికి అర్హుడా కాదా? అలా ప్రశ్నించుకుంటే ఆ వ్యక్తికి ముందువాళ్ళకు ఎందుకివ్వలేదు, వెనుక వాళ్ళకు ఎందుకిచ్చారు లాంటి ప్రశ్నలు దాని తర్వాత వస్తాయి. మాలవ్యకు అలాంటి అర్హతలు లేవని మీరు భావిస్తున్నట్టు నాకు అర్ధమైంది. దహా.

  మీరు చివరగా అడిగారు చూడండీ... మీ అభిప్రాయం ఏంటి? అని... అలాంటి ప్రశ్నలతో మీరు శ్రీశ్రీ అనంతంలా ఈ చర్చని ఎన్ని యుగాలైనా సాగదీయగలరు, కానీ మీ అంత ఓపిక నాకు లేదుకాబట్టి... స్వస్తి.

  ReplyDelete
  Replies
  1. భలే వారే మీరు అలా నిలదీస్తే ఎలా? నెహ్రూ,ఇందిరా గాంధి ప్రధానమంత్రులుగా ఉనపుడు వారికి వారే భారతరత్నలుగా ప్రకటించుకొన్నారు. అప్పుడేమైనా కమ్యునిస్ట్ లు విమర్శించారా? :)
   *చర్చని ఎన్ని యుగాలైనా సాగదీయగలరు*
   బ్లాగు పెట్టిందే చర్చించటానికైనపుడు దానిని తప్పంటే ఎలా?

   Delete
  2. శ్రీరాం గారూ.... రామరామ (అన్నట్టు బూతేం కాదు కదా?), నేను నిలదీయడం లేదండీ, వాదన అంటూ మొదలెడితే అది నిలబడేలా ఉందో లేదో సరిచూసుకోవాలని మాత్రమే అంటున్నాను.

   ఈ బ్లాగులోని చర్చలను తప్పు అని నేనేమీ అనడం లేదు. అసలు, నా బ్లాగ్ లోని వ్యాసాన్ని కాపీ పేస్ట్ చేసినప్పుడు కూడా నేనేమీ అనలేదు. సాధారణంగా ఇక్కడి చర్చలను నేను దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను తప్ప దగ్గరకు రాను. ఈసారి ఏదో పొరపాటున దారి తప్పాను. అందుకే అంత జవాబిచ్చుకోవలసి వచ్చింది.

   Delete
  3. మీరు వీలైనంత వరకు చర్చలలో పాల్గొనండి. తెలిసిన నిజాలు చెప్పండి. తెలియనివి తెలుసుకొంటారు. మీ నుంచి నేర్చుకొంటారు:)

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top