''ఆర్భాటాన్ని అటక పైకి ఎక్కించండి.. ఆరోగ్యంగా జీవించేందుకూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకూ సైకిల్‌ తొక్కండి.. నడవండి.. సైకిల్‌ యాత్రలు చేయండి.. మోటారు వాహనాల వాడకాన్ని తగ్గించండి.. వారానికో రోజు వాటికి పూర్తి విశ్రాంతి నివ్వండి'' అని నినదిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తోంది విజయవాడకు చెందిన 'యాక్టివ్‌ బైక్యులర్స్‌ అసోసియేషన్‌. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి వి.సత్యనారాయణ ఏడేళ్లుగా సైకిల్‌ యాత్రలు నిర్వహిస్తూ తన వంతుగా పర్యావరణంపై యువజనుల్లో అవగాహన కలిగిస్తున్నారు.

ప్రస్తుతం పర్యావరణానికి జరుగుతున్న హానిపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు కనీస అవగాహన కలిగించడానికీ, దానితో పాటు నేటి హడావిడి జీవనంలో ఆరోగ్యంగా ఉండటానికీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తు న్నాయి. ఎంతో విస్తృతమైన, అతి ముఖ్యమైన ఈ కృషిలో తాము సైతం అంటూ ముందుకొస్తోంది - 'యాక్టివ్‌ బైక్యులర్స్‌ అసోసియేషన్‌'. విజయవాడకు చెందిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి వి. సత్యనారాయణ ఏడేళ్లుగా సైకిల్‌ యాత్రలు నిర్వహిస్తూ పర్యావరణంపై యువజనుల్లో అవగాహన కలిగిస్తున్నారు.

విజయవాడకు చెందిన వి.సత్యనారాయణ గతంలో యువజన సంఘాల్లో పనిచేసేవారు. ప్రారంభం నుంచీ ఆయనకు సైకిల్‌ తొక్కడమంటే ప్రాణం. నిత్య జీవితంలో ఏ పని మీద ఎక్కడకు వెళ్ళాలన్నా ఆయన 99 శాతం సైకిల్‌నే వినియోగిస్తుంటారు. ''యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా'' (ఈ సంస్థను కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ, నెహ్రూ యువ కేంద్రం గుర్తించాయి) నాలుగు దశాబ్దాలుగా హిమాలయాలకు ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ నిర్వహిస్తోంది. ఇందులో తానెందుకు పాల్గొనకూడదూ అని ఆలోచన చేశారాయన. యోచన వచ్చిందే తడవుగా యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఎఓఐ)ని సంప్రదించారు. దాంతో ఆ సంస్థ సత్యనారాయణను తమ బృందంలో చేర్చుకుంది. 2006లో జరిపిన ట్రెక్కింగ్‌లో సత్యనారాయణకు స్థానం కల్పించింది. ఈ సంస్థే 2007లో నిర్వహించిన సైక్లింగ్‌లోనూ ఆయన పాల్గొన్నారు. లడక్‌ నుంచి లుమా యోరా (శ్రీనగర్‌ రూటులో) వరకూ 200 కి.మీ. దూరం సైక్లింగ్‌లో పాల్గొన్నారు.

2008లో ట్రెక్కింగ్‌, 2009లో సైక్లింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈసారి సైక్లింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూమనాలి నుంచి జమ్ము కాశ్మీర్‌లోని కరుతుంగల వరకూ జరిగితే అందులోనూ సత్యనారాయణ పాల్గొన్నారు. అయితే సత్యనారాయణ ఇక్కడో విషయం గమనించారు. ఉత్తినే సైకిల్‌ యాత్ర చేసొస్తే ఉపయోగమేమిటీ? పర్యావరణ పరిరక్షణ కోరుతూ వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ యాత్ర చేస్తే ప్రజల్లో అవగాహన కలిగించినవారమవుతాము కదా అని గుర్తించారు. ఆ విషయమే వైహెచ్‌ఎఓఐకి చెప్పడం.. వారు దాన్ని అంగీకరించి, ఆమోదించడం జరిగాయి. అప్పటి నుంచి ఈ సంస్థ ఎప్పుడు సైక్లింగ్‌ తలపెట్టినా పర్యావరణ పరిరక్షణ కోరుతూ ప్రచారం చేస్తూ యాత్ర నిర్వహిస్తోంది.

ఎంతసేపూ ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన వాటిలో పాల్గొనడమే కాదు. విద్యార్థినీ విద్యార్థులనూ, ఔత్సాహికులనూ ఇందులో భాగస్వాములను చేయదలిచారు సత్యనారాయణ. ఇవాళ ఎల్‌కెజి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకూ విద్యాసంస్థల్లో ఆటలు మొక్కబడిగా మారిపోతున్నాయి. ఆటల్లో రాణించే నాలుగురైదుగురిని ప్రోత్సహించి పోటీలకు పంపడం మినహా మిగతా పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని సైక్లింగ్‌కు ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణపై ప్రచారం నిర్వహిస్తే బావుంటుందనుకున్నారాయన. సరిగ్గా ఆదే సమయంలో గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 30 మంది విద్యార్థులు సైకిల్‌ సఫారీ చేయాలని యు.జి.సి ఓ ఉత్తర్వు పంపింది. ఈ ప్రోగ్రామ్‌ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు! ఇది కేవలం ఒక సఫారీ మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ ఈ బృందంలో తానూ పాల్గొంటాననీ, కేవలం సైకిల్‌ యాత్రగా కొనసాగించడం కన్నా.. పర్యావరణానికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలనీ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ యాత్ర సాగాలనీ ప్రతిపాదించారు. దీంతో ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై అవగాహనా సైకిల్‌ యాత్రగా మారింది.

2011లో కూడా పర్యావరణ పరిరక్షణ కోరుతూ విజయవాడ నుంచి ఢిల్లీ వరకూ సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఇది పూర్తిగా సత్యనారాయణ తానే భుజస్కంధాలపై వేసుకున్న కార్యక్రమం. అయితే అంతకుముందు చేసిన యాత్రలకూ దీనికీ తేడా ఉంది. ఇది యాత్రా మార్గంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్లడంతోపాటు ఆ యా నగరాలు, జిల్లా కేంద్రాల్లో ముఖ్య అధికారులను కలుసుకుని ఇలాంటి యాత్రలు చేయించాల్సి ఆవశ్యకతను వారికి చెప్పడం దీని ప్రత్యేకత. మన రాష్ట్ర సచివాలయం మొదలు.. యాత్రా మార్గంలోని వివిధ రాష్ట్రాల్లోగల జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్లను కలిసి వినతిపత్రాలిచ్చారు. ఈ విధంగా తాము చేపట్టిన యాత్రలు ప్రజల్లో కొంతమేరకైనా పర్యావరణపై అవగాహన కలిగించడానికి తోడ్పడ్డాయనీ, అధికారులు కూడా స్పందించి తాము వీటిని ప్రోత్సహించేందుకు అంగీకరించారనీ సత్యనారాయణ తెలిపారు.

సైకిల్‌ యాత్ర ద్వారా పర్యావరణ ప్రచారం ఆషామాషీ కాదు. వందలు, వేల కిలోమీటర్లు వెళ్లాలి. మార్గమధ్యంలో వసతి, భోజనాదులు సమకూర్చుకోవాలి. ఎదురయ్యే కష్టాలనూ ఓర్చుకోగలగాలి. అడ్డంకులను అధిగమించాలి. ''మేమైతే విజయవాడ-డిల్లీ సైకిల్‌ యాత్ర తల పెట్టినప్పుడు ఏ ఊరెళ్లినా ఆదరణ లభించింది. మా సదుద్దేశం మెచ్చుకుని ఎక్కడికక్కడ వసతి, భోజనాదులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయి. అప్పుడు మేము జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లనూ, కలెక్టర్లనూ కలిశాం. వారి సహాయ సహకారాలతో ముందుకు సాగాం. స్థానికంగా మా యాత్రా విశేషాలు పత్రికల్లో రావడంతో మాకు మంచి ఆదరణ లభించింది. ఎక్కడా ఎవరూ ఆదరించని చోట పాఠశాలలకు పోయి పడుకున్నాం'' అని సత్యనారాయణ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన చేస్తున్న అభ్యర్థన ఏమిటంటే.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఎస్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలను సమీప నగరాలు, పట్టణాల్లో ఇలాంటి ప్రచారాలకు ఉపయోగించాలి. వారంలో ఒకరోజు మోటారు వాహనాలకు సెలవు ఇవ్వాలి. ఆ రోజు ఆఫీసులకు సైకిల్‌ లేదా బస్సులపైనే వెళ్లాలి. దీనివల్ల పొల్యూషన్‌ తగ్గడమేగాక, సైకిల్‌ వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆయన మాట. మంచి సలహాయే కదూ!

(ప్రజాశక్తి జీవన డెస్క్ నుండి సేకరించిన ఈ ఆర్టికల్ పాతది. డేట్ గుర్తులేదు. ఒరిజినల్ లింక్ లభ్యం కావడం లేదు. పర్యావరణ, ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికీ ఉపయోగకరమైన స్పూర్తిని ఇచ్చేదే కనుక ఈ పోస్టుని కత్తిరింపులు, పర్యావరణం అనే శీర్షికల క్రింద రీ పబ్లిష్ చేస్తున్నాను)

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top