చిన్న వయసు నుండి టీనేజ్ వయసులోకి వచ్చే పిల్లల శరీరంలో హార్మోన్లు ఎక్కువగా తయారవుతాయి. ఈ హార్మోన్లు తయారు కావడానికి శరీరంలో కొన్ని గ్రంథులు వుంటాయి. దీని ప్రభావంతో కాళ్ళు చేతులు, శరీరంలోని కండరాలు అన్నీ పెరుగుతాయి. శరీరంలో మార్పులు వస్తాయి. అందువల్ల పిల్లలు టీనేజ్ వయసులో అడుగుపెట్టక ముందునుంచే వీరికి పోషకాహారాన్ని తల్లిదండ్రులు అందించాల్సి వుంటుంది. అలా పోషకాహారం వుంటేనే శరీరంలోని పలు క్రియలు సక్రమంగా జరిగి టీనేజ్ పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు.

 • టీన్ అనే పదంతో మొదలయ్యే వయస్సు కాబట్టి దీనిని టీనేజ్ అని అంటారు. ఈ వయసులో శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. 
 • ఆడపిల్లల్లో అనేక శారీరక మార్పులు కనిపిస్తుంటాయి. పీరియడ్స్ మొదలు కావడం, సడెన్ గా పొడవు పెరగడం. ఇలా అవయవాల్లో మార్పులు జరగడం జరుగుతుంది. 
 • భవిష్యత్ లో ఆడపిల్లలు గర్భ ధారణకు అనువైన పరిస్థితులను శరీరం ఈ వయసులో సమకూర్చుకుంటుంది. కొందరిలో పెరుగుదల తొందరగా వస్తుంది. కొందరిలో ఆలస్యంగా వస్తుంది. 
 • అయితే పోషకాహార లోపంతో అనారోగ్యం ఏర్పడుతుంది. అనారోగ్యంతో పెరుగుదల కుంటుపడుతుంది. దీనికోసం సరైన ఆహారం తీసుకోవడం అవసరం. దీంతోపాటు వ్యాయామం కూడా అంతే ముఖ్యం. ఆహారం, వ్యాయామం కలిస్తే శరీర సౌష్టవం కలుగుతుంది. జన్యుపరమైన అభివృద్ధికి ఇవి రెండూ అవసరమే. 
 • మనదేశంలో అపరిశుభ్రమైన వాతావరణంలో నివసించే కుటుంబాల్లోని పిల్లలకు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాక పోషకాహార లోపం, విటమిన్ లోపాలు, ఎనీమియా లోపాలు మన దేశంలో ఎక్కువగా వుంటున్నాయి. ఇవన్నీ పిల్లల శరీర ఎదుగుదలకు అవరోధాన్ని కలిగిస్తాయి.
ఈటింగ్ డిజాస్టర్

 • యుక్త వయసులో ఎక్కువగా వచ్చే సమస్య ఈటింగ్ డిజాస్టర్. తిని బాధపడే వారు కొందరు, తినకుండా బాధపడేవారు కొందరు. 
 • ఈ వయసులో సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం వుంటుంది. ఎత్తు పెరగడానికి ఇది అవసరం. శరీర మార్పులను తట్టుకోవడానికి కూడా ఇది ఆవశ్యకం. 
 • జంక్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు తో తమ శరీరాలను పెంచుకుంటున్నారు. జంక్ అంటే పోషక పదార్థాలు ఏమీ లేని పదార్థాలని అర్థం. 
 • సౌందర్య స్పృహతో ఉన్న అమ్మాయిలు సన్నగా, నాజూగ్గా కనిపించాలనే ఉద్దేశంతో, తగినంత ఆహారం తీసుకోకుండా డైటింగ్ చేస్తారు. టీనేజ్ లో ఖచ్చితంగా పోషకాహారం తీసుకోవాల్సి వుంటుంది. కానీ దీనికి భిన్నంగా వారు ప్రవర్తిస్తూ తిండి పట్ల అశ్రద్ధ వహిస్తూ వుంటారు. 
 • ఈ వయసులో శరీర పెరుగుదలతోపాటు హార్మోన్లు పెరుగుతాయి. టీనేజ్ లో ఆడే ఆటలు మానసికోల్లాసానికి తోడ్పడతాయి. ఆనందంగా పెరగాల్సిన వయసులో చదువు టెన్షన్ పెరుగుతోంది. 
 • తల్లిదండ్రులు పిల్లలపై తమ ప్రేమనంతా ఆహారాన్ని అందించడంతోనే చూపిస్తారు. ప్రస్తుతం నూటికి 50 శాతం మంది ఆడపిల్లలు డైటింగ్ చేస్తున్నారు. అధిక బరువున్న వాళ్ళలో బులీమియా డిజాస్టర్ వుంటుంది. దీంతో వారు తిన్న ఆహారాన్ని బలవంతంగా బయటికి పంపించేయడం జరుగుతోంది. 
 • టీనేజి పిల్లలకు సరైన వ్యాయామం వుండాలి. జంక్ ఫుడ్ తినకూడదు. ఆటలు ఆడుకునేందుకు సమయమివ్వాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది. 
 • యుక్తవయసులో శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. జననేంద్రియాలు పెరుగుతాయి. గడ్డాలు, మీసాలు వస్తాయి. గొంతు మారుతుంది. ఆడవారిలో అయితే ఆకృతి మారుతుంది. ఋతుస్రావం మొదలవుతుంది. 
 • ఆడ, మగ మధ్య ఆకర్షణ మొదలువుతుంది. ఈ వయసులో సినిమాలు, ప్రకటనల ద్వారా వచ్చే విషయాలకు వీరు ఎక్కువగా ఆకర్షితులవుతూ వుంటారు.

పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన

 • టీనేజి పిల్లలున్న తల్లిదండ్రుల్లో కొంత టెన్షన్ వుంటుంది. పిల్లలు తమ మాట వినడం లేదనే చిరాకు కలుగుతుంది. 
 • టీనేజి లోకి వచ్చే పిల్లలు తల్లిదండ్రుల కంటే తమకే ఎక్కువ తెలుసునని ఫీలవువుతూ ఘర్షణ పడే మనస్తత్వం కలిగి వుంటారు. 
 • తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొని, స్నేహ పూరితంగా వారితో మెలగాలి. దీనివల్ల పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకొనే వీలుంటుంది. 
 • సహజంగా టీనేజీలో నేను అనే స్వీయ గుర్తింపు ఏర్పడుతుంది. సమాజంలో వారు గుర్తింపు కోరుకుంటారు. దీన్ని అర్థం చేసుకొని వారిని సరైన మార్గంలో నడపాల్సింది తల్లిదండ్రులే. వారిని ప్రేమతో గెలవాలి. 
 • చదువులో గోల్స్ పెట్టాలి. ఓటమి అనేది గెలుపుకు మరో మెట్టు అని అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లల ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి. 
 • పెళ్ళి, ప్రేమ అనే విషయాలను సరైన సమయంలో పిల్లలతో చర్చించాలి. ప్రతీ చిన్న సమస్యలకు టీనేజర్స్ ఎక్కువ ఫీలవుతారు. కాబట్టి వారి మనస్తత్వాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.

పింపుల్స్ - పరిష్కారాలు

 • టీనేజ్ పిల్లలను ఎక్కువగా వేధించే సమస్య పింపుల్స్. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కొద్దిగా ఎక్కువగా వుంటే పింపుల్స్ వస్తాయి. 
 • టీనేజర్స్ తమ మొహాన్ని శుభ్రంగా ఎక్కువ సార్లు కడుక్కోవడం మంచిది. అసహ్యంగా కనిపిస్తున్నాయని పింపుల్స్‌ని గిల్లడం చేయకూడదు. దీనివల్ల మచ్చ పడే అవకాశం వుంటుంది. 
 • శరీరంలో జరిగే మార్పులకనుగుణంగా పింపుల్స్ వాటంతట అవే సమసి పోతాయి. వాటిని ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్లే టీనేజర్స్ లో మానసిక ఆందోళన పెరుగుతుంది. 
 • ఆయిలీ స్కిన్ వున్న వారిలో ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ వున్న వారు మైల్డ్ సోప్స్ వాడి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. లూజుగా వుండే బట్టలు ధరించాలి.

పిల్లలను తల్లిదండ్రులు ఎలా గమనించాలి?

 • పిల్లలు విరామ సమయంలో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ వుండాలి. తాము అన్నీ కొనిస్తే వారు చదువుతారని భావించడం సరికాదు. 
 • పిల్లలు వ్యాయామం చేసేందుకు, ఆటలు ఆడేందుకు తగిన సమయాన్ని కేటాయిస్తూ, వారి మానసికోల్లాసానికి ప్రోత్సాహం అందించాలి. 
 • పిల్లలను గెలిపించిన తల్లిదండ్రులకే సమాజంలో సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి.ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనంలో వుంచుకొని కేవలం 8 గంటలు మాత్రమే పిల్లల చదువుకు సమయాన్ని కేటాయించాలి. మిగతా సమయం వారి మానసికోల్లాసానికి కేటాయించాలి. 
 • ఎమోషనల్ ప్రెషర్ పెట్టకూడదు. పిల్లలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్ టీనేజ్ ల పరిమితిని పెంచుతాయి. 
 • అయినా వారికి లేనిది తల్లిదండ్రులకు వున్నది అనుభవం ఒక్కటే. ఈ అనుభవంతోనే వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.

( Republished post ) , Source : 10tv 
Reactions:

Post a Comment

 1. ఈ వ్యాసాన్ని మరెక్కడినుంచో తెచ్చామన్నారు. అందులో ఎన్ని ఇంగ్లీషు మాటలున్నాయంటారు? వాటికి సరియైన మాటలు మనకు లేవా? మరి మీరుకూడా ఇటువంటివాటిని యధాతధంగా పెట్టడం.........

  ReplyDelete
  Replies
  1. శర్మగారు, మీరన్నట్లు చేస్తే మంచిది. కానీ నేను వ్రాయాలన్నా నిజంగా అన్ని తెలుగుపదాలు నాకు తెలియవు. వ్రాసేవారికీ, చదివేవారికీ అన్ని తెలుగు పదాలు తెలిసే రోజులు వస్తే మంచిది. అలా రావాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తెలుగు సమాజంలోని వారందరూ వాడకంగా కూడా తెలుగు పదాలను పలుకుతుంటేనే సాధ్యం. అలాగే కొన్నింటికి తెలుగులో పదాలే లేవు. ఉదాహరణకు రైలు, ట్రైన్, బస్సు లాంటివి. దీనిపై పల్లెప్రపంచంలో ప్రయత్నం జరుగుతున్న విషయం మీరు చూసే ఉంటారు. నేను వ్రాసేవాటిలో వీలయినంతమేరకు తెలుగుపదాలను ఎక్కువుగా వాడడానికి ప్రయత్నిస్తాను. కత్తిరింపులు చేసిన పోస్టులను యధాతధంగానే ఉంచుతాను. అన్నింటికంటే ముఖ్యం విషయం అర్ధం కావడం. దాని తరువాతే భాషాభిమానం. రెండూ కలసి ఉంటే మరీ మంచిది. కానీ అది ఒక్కరోజులో సాధ్యం కాదు. నా వంతుగా మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాను. సూచనకు ధన్యవాదములు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top