సైబర్ నేరగాళ్లను ఎదిరించాలా? వారి బెదిరింపులకు లొంగిపోవాలా?

Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:సైబర్ నేరస్తుల్ని ప్రోత్సహించకండి 
Message:

సైబర్ నేరగాళ్ళని ప్రోత్సహించకండి. కొంత మంది perverts అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీదియో తీసి, ఆ వీదియోని Youtubeలో పెడతామని బెదిరించి, తమ కోరికలు తీర్చమంటారు. అలాంటివాళ్ళకి భయపడి వాళ్ళ కోరికలు తీర్చకండి. అలా కోరికలు తీరిస్తే, వాళ్ళు మరి కొంత మంది స్త్రీలని కూడా అలాగే బెదిరించి వాళ్ళతో ఆడుకుంటారు. 

వాళ్ళు Youtubeలో ఆ వీదియో పెడితే మీ కుటుంబ పరువు పోతుందని భయపడుతున్నారా? వైజాగ్‌లో నేను ఎవరినో మా పక్క ఇళ్ళలో ఉండే రెండు కుటుంబాలకి మాత్రమే తెలుసు. నేను ఒక అమ్మాయితో పడుకుంటున్నట్టు morphed photos సృష్టించి, వాటిని Cable TVలో నగరమంతా ప్రచారం చేసినా, దాని గురించి నాకు తెలిసిన ఆ రెండు కుటుంబాలవాళ్ళు తప్ప ఎవరూ పట్టించుకోరు. అవి morphed photos అని ఆ రెండు కుటుంబాలవాళ్ళనీ నేను నమ్మించగలను. ఊరిలో మిగితావాళ్ళకి నేను ఎవరినో తెలియదు కాబట్టి నా ప్రవర్తన ఎలాంటిది అనే విషయం వాళ్ళు పట్టించుకోరు. 

Youtubeలో అశ్లీల వీదియోలు చూసేవాళ్ళలో మనకి తెలిసినవాళ్ళు ఎంత మంది ఉంటారు? ఒక ఆకతాయి మన ప్రమేయం లేకుండా పెట్టిన వీదియో ఆధారంగా మన గురించి ఎవరైనా చెడుగా అనుకుంటారా? ఆకతాయిలు ఎవరైనా అలా వీదియోలు పెడితే వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింత్ ఇవ్వాలి. ఆ ఆకతాయిలు ఉద్యోగస్తులైతే జైలుకి వెళ్ళడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. పోలీస్ కంప్లెయింత్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా భయపడతారు. 

--------------------------------------------------------


ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.

*republished
Reactions:

Post a Comment

 1. ప్రశ్నను ఇలా మారిస్తే అర్ధవంతమైన చర్చ జరుగుతుంది, ప్రజలకు కొత్త వస్తువు మీద అవగాహన లేనంత వరకూ మంచిగా దానికి దూరంగా ఉంటారు, ఆ వస్తువు మీద అవగాహన పెరిగాకా సమాజానికి కీడు చెయ్యడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళను ఎలా ఆపాలి, వాళ్ళకు ఆ వస్తువు ఎలా ఉపయోగించాలి అన్న విషయం మీద అవగాహన ఉండాలా లేదా అది నిజమైన అవసరానికి మాత్రమె ఎలా ఉపయోగించాలో అవగాహన ఉండాలా?

  ReplyDelete
 2. ఆడవాళ్ళు hotel గదుల్లో స్నానం చెయ్యకపోయినా, వాళ్ళు స్నానం చేస్తున్న చిత్రాలు దొరక్కపోయినా, adobe photoshop ద్వారా వాళ్ళ తలల్ని nude models చిత్రాలకి అంటించి బ్లాక్‌మెయిల్ చెయ్యగలరు. వీళ్ళకి లొంగేవాళ్ళు ఒక్కరు కూడా లేకపోతే వీళ్ళు బ్లాక్‌మెయిల్ చేసే ధైర్యం చెయ్యరు.

  ReplyDelete
  Replies
  1. ఇలాంటి నేరాలపై ఇప్పుడున్న చట్టాలు ఏమిటి ప్రవీణ్ గారు?

   Delete
 3. నేను వకీలుని కాదు, క్రిమినల్ చట్టాల గురించి నాకు తెలియదు. సైబర్ నేరస్తులకి రూపాయి కూడా ఇవ్వకూడదని మాత్రం చెపుతాను. వాళ్ళు ఒకరిని బ్లాక్‌మెయిల్ చేసి సఫలమైతే తరువాత మరి కొందరిని బ్లాక్‌మెయిల్ చేస్తారు.

  ReplyDelete
  Replies
  1. చట్టాలపై అవగాహన పెంచితే కూడా ఉపయోగం ఉంటుంది కదా? మీకేమైనా తెలుసునేమోనని అడిగాను. లాయర్లకే అన్ని తెలియాలని లేదనుకుంటాను.

   Delete

  2. ప్రవీణు ఉవాచ :! - నేను వకీలుని కాదు, క్రిమినల్ చట్టాల గురించి నాకు తెలియదు

   అబ్బాయి ప్రవీణు కి తెలియని విషాయాలు కూదా ఉంటాయా!!

   హాశ్చర్యముస్మీ !!

   (జెకె!)
   జిలెబి

   Delete
  3. It is easy to get information about cyber laws if we search on Google. This discussion is not about law and therefore I didn't think about the rigidity or flexibility of cyber laws.

   Delete
 4. Lawyers should be aware about every law. I am not a lawyer. I may be ignorant about law but I am aware about society. Therefore I can suggest what society should do.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top