రాజులు పోయారు - రాజ్యాలూ పోయాయి  ప్రజాస్వామ్యం వచ్చింది.  ప్రజలే తమకిష్టం వచ్చిన వారిని రాజులుగా ఎంచుకుంటున్నారు. అయితే పైకి ప్రజాస్వామ్యమని ఎంత చెపుతున్నా రాజకీయంతో పాటు వివిధ అంశాలు కొందరి చేతులలోనే తరతరాలుగా బందీ అవుతున్నాయి. దానిలో భాగంగానే కళామతల్లి కూడా బందీగానే ఉంటోంది అనడానికి తెలుగు సినిమా హీరోలను చూడవచ్చు. అన్ని రంగాలలో మాదిరిగానే సినిమా రంగంలో కూడా వారసత్వంగా హీరోలుగా చలామణీ అవుతున్న వారే ఎక్కువ.

ఒక సారి మనం తెలుగు సినిమా హీరోల పరంగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ హీరోలదే ప్రస్తుతానికి రాజ్యం. అడపా దడపా దాసరి,  రాఘవేంద్రరావు, విశ్వనాధ్, S.V కృష్ణారెడ్డి ప్రస్తుతం రాజమౌళి లాంటివాళ్లు అప్పుడప్పుడు హీరోలు లేకుండా మెరుపులు మెరిపించినా మొత్తమ్మీద చూస్తే అది చాలా తక్కువే అని చెప్పవచ్చు. గతంలో ఎన్.టీ.ఆర్ తో మొదలైన స్టార్డం కృష్ణ వరకూ ఒక తరంగా - తరువాత తరంలో చిరంజీవి, ప్రస్తుతం మహేష్ బాబు వరకు అంతా ఇండస్ట్రీలో ఏదో ఒక అండతో, వారసత్వంతో దున్నుతున్నవారే. అసలు టేలంట్ లేదని కాదు కానీ టేలంట్ ను తొక్కేస్తున్నారనేది నిజం. ఇంతకంటే మంచి టేలంట్ ఉన్నవాళ్లు ఎదిగే పరిస్తితి ఇక్కడ మాత్రం అంత ఈజీ కాదనే చెప్పాలి.

స్టార్డం ఏర్పడ్డాక మొదటి తరంలో ఎన్.టీ.ఆర్ పెద్దాయన. ఆయన చెప్పిందే వేదం. ఒక్క కృష్ణ మాత్రమే డేషింగ్ గా వెళ్లేవాడని అంటుంటారు. మిగతా అంతా ఎన్.టీ.ఆర్ ను ఎదిరించడానికి భయపడేవారని, ఒకానొక దశలో ఇండస్ట్రీ ఎన్.టీ.ఆర్ - కృష్ణ ల మధ్య ప్రచ్చన్న వర్గపోరుతో సాగిందనీ అంటారు. అల్లూరి సీతారామరాజు - కురుక్షేత్రం - దేవదాసు లాంటి చిత్రాల సమయం లో కృష్ణకూ, ఎన్.టీ.ఆర్ కు మధ్య విభేదాలున్నాయంటారు. అయితే వీరిరువురూ ఎక్కడా స్థాయికి తగ్గట్టుగానే వ్యవహరించారనే చెప్పాలి. కృష్ణకు కొన్నాళ్లు బాలసుభ్రహ్మణ్యం లాంటి గాయకుడు పాటలు పాడని సంఘటనలూ నడిచాయి. సినిమా రంగంలో కృష్ణ ఇలాంటి రాజకీయాలను చాలా సాహసంతో ఎదుర్కున్నాడనే  చెప్పాలి. రాజకీయంగా కూడా ఎన్.టీ.ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణ కాంగ్రెస్ వైపు ఉండి ఎన్.టీ.ఆర్ పై వ్యంగ్య సినిమాలు తీసినప్పుడు కోట శ్రీనివాస రావు లాంటి వాళ్లు ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. ఇవెలా ఉన్నా ఎన్.టీ.ఆర్ తన అభిమాన నటుడని కృష్ణ చెపితే, కృష్ణ సీతారామ రాజు చూసి ఎన్.టీ.ఆర్ ఇక తాను ఆ సినిమా తీయనని కృష్ణను అభినందించిన సందర్భాలున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక కూడా కృష్ణ సినిమాలను ఎన్.టీ.ఆర్ అభినందించేవారు. 

అలా NTR తరంలో ఎన్.టీ.ఆర్ - అక్కినేని నాగేశ్వర రావు - కృష్ణ - శోభన్ బాబు - కృష్ణంరాజు లు పంచ పాండవులుగా ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో సినిమాలు తీసే వాళ్లు . ప్రధానంగా హీరోలుగా ఎన్.టీ.ఆర్ - కృష్ణ మధ్య పోటీ ఉన్నా ఎన్.టీ.ఆర్ ఉన్నంత వరకూ ఆయనే సూపర్ స్టార్. తరువాత కొంత కాలం కృష్ణ నంబర్ వన్ గా నిలిచారు. అయితే రాజకీయ రంగ ప్రవేశం , చిత్రాల ఎంపికలో పొరపాట్ల తో కృష్ణ కెరీర్ దెబ్బతినడంతో చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేసి మెగాస్టార్ గా రాణించారు. గమ్మత్తేమిటంటే ఖైదీ సినిమాని ముందు కృష్ణకు వినిపిస్తే ఆయన ఒప్పుకోక పోవడం తో అప్పుడే వర్ధమాన నటుడిగా ఎదుగుతున్న చిరంజీవి చేశారు. అది ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. వెంకటేష్ కూడా కృష్ణ డేట్స్ కుదరనందున హీరోగా మారినవాడే. కృష్ణ నటన పరంగా కంటే వ్యక్తిగత ఇమేజ్ తోనే రాణించాడని చెప్పవచ్చు.నటన కంటే హీరోయిజం అనేది డామినేటెడ్ గా ఉండడం కళకు ఆటంకమే.

చిరంజీవికి ప్రధానం గా బాలయ్య సమానమైన పోటీ ఇచ్చాడు. NTR తరువాతి తరంలో చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ లు ప్రధాన హీరోలుగా నిలిచారు. ఇందులో చిరంజీవి ఎదగడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అల్లు గారి అల్లుడు కావడం + కష్టపడే తత్వం ఉండడం తో మెగాస్టార్ గా ఎదిగాడు. నిజంగా టేలెంటుతోటే అయితే చిరంజీవి ఎదగడానికి అంత టైం పట్టకూడదు. శోభన్ బాబు కు వారసుడిగా తన కొడుకును సినిమా ఫీల్డుకు తీసుకు రానని చెప్పాడు. అలాగే ఉంచారు. కృష్ణంరాజుకు కొడుకులు లేరు. కానీ ప్రభాస్ ఆయన వారసుడిగా కొనసాగుతున్నారు. ఇక ఎన్.టీ.ఆర్ వారసుడిగా బాలకృష్ణ , అక్కినేని వారసుడిగా నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడి కుమారిడిగా వెంకటేష్ లు హీరోలుగా రాణించారు. 

ఆ తరువాత ఇప్పుడు కృష్ణ వారసుడిగా మహేష్ ప్రస్తుతం నంబర్ వన్ రేసులో ఉన్నాడు. నందమూరి ఫామిలీ నుండి జూనియర్ ఎన్.టీ.ఆర్ ఉండగా చిరంజీవి ఫామిలీనుండి పవన్ కళ్యాణ్ , రాం చరన్ తేజ , అల్లు అర్జున్ ఉన్నారు. మోహన్ బాబు కుమారులు విష్ణు,మనోజ్ లు హీరోలుగా పని చేస్తున్నారు. వీరు కాక కృష్ణ పెద్ద కొడుకు రమేష్ హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం నిర్మాతగా మారాడు. చిరంజీవి ఫామిలీలో అల్లు శిరీష్ కూడా తెరంగ్రేట్రం చేయబోతున్నాడు. అక్కినేని కుటుంబం నుండి సుమంత్-నాగచైతన్య-శశాంక్ ప్రస్తుతం అఖిల్ కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నందమూరి ఫామిలీ నుండి యువతరంతో బాలయ్య ఇంకా పోటీ పడుతుండగానే కళ్యాణ చక్రవర్తి , తారకరత్న లు కూడా ప్రయత్నిస్తున్నారు. రామానాయుడు మనవడు దగ్గుబాటి రాణా ఉన్నారు. ఇలా వారసులు హవా చేస్తున్నారు. వీల్లకి టేలంట్ లేదు అనలేము గానీ టేలంట్ ఉన్న చాలామందికి వీరికున్నంత అవకాశం ఉండడం లేదనే చెప్పాలి.

బేక్ గ్రౌండ్ లేనివారిలో రాజశేఖర్, సుమన్ లాంటివారి పరిస్థితి దారుణమనే చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ ఇలా మిగతా వాళ్లంతా చిన్నహీరోలుగా మిగలాల్సిందే. ఇది ఎన్నాళు కొనసాగుతుందో చూడాలి. నరసింహరాజు  లాంటి వారు  కూడా కొన్నాళ్లు హీరోలుగా రాణించి తరువాత చిన్న వేషాలు వేసుకోవడం వెనుకా రాజకీయం ఉందనే విమర్శలూ ఉన్నాయి. సినిమా రంగంలో టేలెంటుని తొక్కేసే లేదా తమకు అనుకూలంగా లేకుంటే అవకాశాలు లేకుండా చేయడం కూడా కళకు ద్రోహం చేయడమనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నా కేవలం హీరోయిజం డామినేషన్ ఉన్న వాతావరణంలో వాస్తవాలు అంత తేలికగా వెలుగులోకి రావనే చెప్పాలి.

ఎన్.టీ.ఆర్  - కృష్ణ ల తరువాత చిరు -బాలయ్యల మధ్య కూడా ఈ సినీ రాజకీయం నడిచింది. కొన్ని ప్రాంతాలలో కులపరంగా కూడా అభిమానం దురభిమానంగా మారుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నిర్మాతలు -  పంపిణీ దారులను తెరువెనుక మేనేజ్ చేయడం దియేటర్ లు దొరకకుండా చేయడం కొందరు హీరోల సినిమాలు జనం ఉన్నా కావాలని తీసేయించే కుళ్ళు రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. నేడు కూడా సినిమా రాజకీయాలు తెరవెనుక పెద్దలు నడిపిస్తూనే ఉన్నారు. ఇన్ని రాజకీయాలలో కూడా టేలెంటుని వెలికి తీస్తున్న ప్రోత్సహిస్తున్నవారు అభినందనీయులు.

ఇన్ని కుళ్ళు రాజకీయాల మధ్య టేలంట్ బ్రతికి బట్ట కట్టడమంటే కత్తిమీద సామే మరి. పైకి కలసి ఉన్నామని "మేము సైతం" అంటూ ఎన్ని మాటలు చెప్పినా సినిమా రంగంలో కుళ్ళు రాజకీయాలే ఎక్కువ. ఈ పరిస్తితిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.
- Palla Kondala Rao
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

  1. Replies
    1. అవును శ్రీ గారు, కాంతారావు గారి గురించి ప్రస్థావించలేదు. కాంతారావు తాను విఠలాచార్యవల్ల మోసపోయానని ఓ ఇంటర్వ్యూలొ చెప్పారు. కాంతారావు గారు, ఆర్.నారాయణ మూర్తి, హరనాధ్ , రాం మోహన్ , చంద్రమోహన్ , మాదాల రంగారావు , చలం .... ఇలా చాలామంది గురించి వ్రాయాలి. NTR,ANR కంటే ముందు ఈ స్టార్డం పిచ్చి లేదనుకుంటాను. నాగయ్య, ఎస్.వీ రంగారావు లాంటి వారి నటన హీరోలకంటే బాగుంటుంది. వారి పాత్రల ప్రాధాన్యతరీత్యా సినిమాలు కూడా అలా ఉన్నవీ NTR తరంలో ఆ తరువాత కూడా కొంత కాలం కొనసాగింది. ఈ ఆర్టికల్ కేవలం స్టార్డం చెలరేగి పోవడాన్ని తప్పు పట్టడానికి అతి కొద్ది మేటర్ తో వ్రాసినది అదీ పాతదానిని రీ పబ్లిష్ చేశాను. బుద్ధా మురళీ గారి బ్లాగులో ఆర్టిస్టుల ఉత్థాన పతనాల గురించి కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. కేరక్టర్ ఆర్టిస్టుల స్తితిగతులు నాడూ నేడూ అనేదానిపై అలనాటి నటుల ఇంటర్వ్యూలు టీ.వీ లలో ముఖ్యంగా జెమినీలో వస్తున్నావి కొన్ని బాగుంటున్నాయి. కళ మరియు చిత్రపరిశ్రమ కేవలం కొందరి చేతిలో బందీ కావడాన్ని విమర్శించడానికి చాలా వ్రాయాలి. కానీ నా శక్తి సరిపోదు. ఏదో చిన్న ప్రయత్నమే ఇది. అలాంటివి యూ ట్యూబ్ లో ఉన్నవి వీలైనవి మాత్రం పల్లెప్రపంచంలో అందజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top