2015 కు స్వాగతం ! 
జయించేందుకు మనకో ప్రపంచం ఉంది !!
మారనిది మార్పు ఒక్కటే 
నిరంతరం పురోగమిద్దాం 

ప్రతి అనుభవమూ ఓ పాఠమే
ప్రతి పాఠమూ కొందరికి ఉపయోగమే

మనిషికి ఓ మనసు ఉంటుంది
ప్రతి మనసూ అభిప్రాయాలను కలిగి ఉంటుంది

అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం
కించపరుస్తూ గొంతునొక్కాలనుకునే ధోరణులు దుర్మార్గం

వందపూలను వికసించనిద్దాం
వేయి భావాలను సంఘర్షించనిద్దాం

జ్ఞానోన్మాదం - మతోన్మాదం మనుషులకు హాని చేసేవే
అతిగా వాదించే జ్ఞానులకన్నామితంగానైనా సహకరించే సంప్రదాయ, సాదాజీవులే మిన్న

జ్ఞానముండీ చేయూతనివ్వలేని ముసుగు వీరులు మనకు శత్రువులు
స్పందనతో తోచింది ఆచరించి, ఆదరించే అల్పజ్ఞానులే మన మేలుకోరే మిత్రులు

జయించేందుకు మనకో ప్రపంచం ఉంది
అందరికీ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు


అవసరమైన అన్నింటా అందరిలో మార్పు రావాలని కోరుకుంటూ... బ్లాగు అంటే ఏమిటో సరిగా తెలీకుండా 2011 జూన్ లో బ్లాగుల లోనికి ప్రవేశించి అనేక ప్రయోగాలు చేసి బ్లాగులపై కనీస అవగాహన పెంచుకునేందుకు ఇప్పటి దాకా ఓపికగా సహకరించిన తెలుగు బ్లాగర్లందరికీ ధన్యవాదములు. ఈ ఏడాది నా వెబ్‌పోర్టల్ 'పల్లెప్రపంచం' ను మంచి బ్లాగుల సరసన నిలిపేందుకు కృషి చేయడమూ ఓ సబ్ గోల్ గా పెట్టుకున్నాను. ఎప్పటిలాగే మీ అందరి సహకారం ఆశిస్తున్నాను.
 పల్లా కొండల రావు,  పల్లె ప్రపంచం,  బోనకల్.
Reactions:

Post a Comment

  1. ముందుగా కొండలరావుగారు మీకు,మీ బ్లాగు ద్వారా బ్లాగు మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    "అతిగా వాదించే ఙానులకన్నా మితంగానైనా సహకరించే సాంప్రదాయ సాదా జీవులే మిన్న".బాగుంది.మీరు వ్రాసినవన్నీ అంగీకరించే సత్యాలే. కానీ అంగీకరించేవారెవరు?ఆచరించే వారేరి?ఏనాటి నుండీ చదువుకుంటున్నాం,"సొంతలాభం కొంత మనుకు పొరుగువారికి తోడు పడవోయి"అని ఎంతవరకూ ఆచరిస్తున్నాం.పక్కనవాడికి సహకరించకపోఇనా పరవాలేదు,కీడు తలపు చేయకుండా వుంటేచాలనుకునే రోజుల్లో బతుకుతున్నాం.కాదంటారా?

    ReplyDelete
    Replies
    1. అంగీకరించేవారూ, ఆచరించేవారూ ఉన్నారనడానికి సాక్ష్యం ఈ పోస్టుకు మీరుంచిన కామెంటే. " స్వార్ధమే ఈ అనర్ధదాయకం - అది మాపుకొనుటే క్షేమ దాయకం " అన్నాడు శ్రీ శ్రీ ఓ సినిమా పాటలో. మానవ సహజంగా ఉండే కొద్ది స్వార్ధాన్ని సైతం లేకుండా చేసే మానవ సమాజ వ్యవస్థ ఏర్పడే వరకూ ఈ అవస్థలు తప్పవు. కీడు చేయకూడదనే తలంపునుండి ఒక్కరి కోసం అందరూ...అందరికోసం ఒక్కరూ అంటే ఒకే కుటుంబం-ఒకే సమాజం ఉండే ప్రపంచం ఏర్పడేలా మనుషులంతా కలసి నిరంతరం ప్రయత్నించాల్సి ఉంది. అందుకు మనవంతు సహకారం అందిద్దామండీ అవసరమైనప్పుడల్లా ఉడుతా భక్తిగా. ముందుగా హేపీ న్యూ ఇయర్ చెప్పిన మీకు ధన్యవాదములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు లక్ష్మీ'స్ మయూఖ గారు.

      Delete
  2. నూతనహూణవత్సరశుభాకాంక్షలు!
    అన్నట్లు, "ప్రజ అందరికీ" అనకూడదండీ, "ప్రజ లందరికీ" అనాలి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు శ్యామలీయం గారు. ప్రజలందరికీ లేదా ప్రజకు అనవచ్చనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు సరిచేశాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
    2. ప్రజ అని జాత్యైకవచనంగా చెప్పినప్పుడు 'ప్రజ యంతటికీ' అనాలి. అందరికీ అని బహువచనంలో చెప్పేటప్పుడు దానిముందు ప్రజలు అని బహువచన రూపమే వాడి 'ప్రజ లందరికీ' అనాలి. 'ఇద్దరు తమ్ముళ్ళకి' అంటాం కాని 'రెండు తమ్ముళ్ళకి' అనం‌ కదా, అలాగన్నమాట.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top