క్షమాపణ...ఈ పదమే చాలా మందికి మింగుడుపడదు. ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే గుణంలో ఇదొకటి. క్షమాపణ చెప్పడాన్ని తక్కువతనంగా, బలహీనతగా చాలా మంది భావిస్తుంటారు. అది సరైనది కాదు.
క్షమాపణ-చాలా శక్తివంతమైన పదం. పొరపాటు జరిగినపుడు క్షమించమని అడగడం ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారి లక్షణం. 'నేను పొరపాటు చేశాను క్షమించండి', 'నేను మీ పట్ల అలా వ్యవహరించి ఉండకూడదు', 'నేను మీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. అలాచేయడం తప్పని గ్రహించాను' 'మిమ్మల్ని అగౌరపరిచాను. అందుకు బాధపడుతున్నాను' ఇలాంటి మాటలు ఎంతటి కఠిన హృదయులనైనా కరిగించివేస్తాయి. కానీ ఇలా అడగడాన్ని తక్కువతనంగానూ, తాము బలహీనులమని ఎదుటివారు అనుకుంటారని భావిస్తుంటారు. అందుకే తప్పుచేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరు. క్షమాపణ చెప్పడానికి భయపడి, చేసిన తప్పును, పొరపాటును సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తారు. లేదా తప్పును ఇతరులపై నెట్టేయాలని చూస్తుంటారు.
క్షమాపణ చెప్పడానికి దృఢమైన చిత్తంవుండాలి. మానసికంగా శక్తివంతులై ఉండాలి. క్షమాపణ చెప్పినందుకు ఎదుటివాళ్లు తమ గురించి ఏమనుకున్నా పట్టించుకోకూడదు. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పకుంటే మీపైన గౌరవం పోతుంది. ఎవరికైనా క్షమాపణ చెబితే వారి వద్ద మీకున్న గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు.

క్షమాపణకు ఎంతటి శక్తివుందంటే....చంపేయాలి, నరికేయాలి అన్నంత విద్వేషంతో ఉన్నవారు కూడా ఆ మాటతో చల్లబడతారు. ఆలోచిస్తారు. శత్రువులు కూడా స్నేహితుల్లా మారుతారు. కుటుంబ సభ్యులు, మిత్రులకూ అవసరమైన సందర్భంలో క్షమాపణ చెప్పాలి. ఆఖరికి మీకన్నా చిన్నవారైనా, వాటిపట్ల పొరపాటుగా వ్యవహరిస్తే క్షమాపణ చెప్పడంలో తప్పలేదు.

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే మీరు చెప్పే క్షమాపణ, నిజాయితీగా, మనస్పూర్తిగా చెబుతున్నట్లు ఉండాలి. అంతేతప్ప అదేదో మొక్కుబడి కోసం చెప్పినట్లు ఉండకూడదు. అలాంటి క్షమాపణ వల్ల కలిగే ప్రయోజనమూ ఉండదు. పొరపాటు చేసినపుడు క్షమాపణ చెప్పగల మానసిక దృఢత్వం మీలో ఉందో లేదో పరిశీలించుకోండి. లేకుంటే అలవాటు చేసుకోండి. 

(from : prajasakti daily )
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top