గత సంచికలలో బ్లాగును తయారు చేసుకోవడం మరియు ఉపయోగాలు గురించి తెలుసుకున్నం. గత సంచికలో తెలిపినట్లుగా బ్లాగర్ లో బ్లాగు సదుపాయాల గురించి తెలుసుకుందాం. మొదట బ్లాగర్.కాం లో లాగిన్ అయ్యి, మీ బ్లాగు Overview Tab కు వెళ్ళండి.

 • Posts అనే Tab లో, మీ బ్లాగులో ఇప్పటివరకు మీరు పబ్లిష్ చేసిన పోస్టుల జాబితా వివరంగా ఉంటుంది. వాటిని, తొలగించాలన్నా, మార్పులు చేయాలన్నా, Draft గా మార్చి ఎడిత్ చేసుకోవలన్నా ఈ Tab ద్వారానే!
 • కొత్త పోస్టు తయారుచేయడానికి, Pen గుర్తుపై క్లిక్ చేసి, Post Title దగ్గర టపా శీర్షికను, దానికింద పోస్ట్ సారాశం, పక్కన Labels దగ్గర పోస్టు ఏ కాటగిరీ ఓ సెలక్ట్ చేసుకుని (కొత్త కాటగిరీ అయితే టైప్ చేసి) పైన కనబదే పబ్లిష్ బటన్ ను క్లిక్ చేస్తె సరిపోతుంది. 

 • Pages - మీ బ్లాగులో మొత్తం 20 పేజీలు మాత్రమే క్రియేట్ చేసుకోగలుగుతారు. సాధారణంగా పేజీలను About, Contact Us లాంటి వాటికోసం ఉపయోగిస్తాము.

 • Comments - ఈ టాబ్ లో, బ్లాగు వీక్షకులు మీరు పబ్లిష్ చేసిన టపాలపై ఉంచిన వ్యాఖ్యలను చూసుకోవచ్చు. అభ్యంతరకరంగా ఉన్న కామెంట్లను తొలగించాలన్నా, Spam గా రిపోర్ట్ చెయ్యాలన్నా ఈ టాబ్ లోనే!

 • Google+ - బ్లాగర్ కొత్తగా అమర్చిన ఈ Google+ టాబ్ వల్ల పెద్దగా ఉపయోగం ఎమీ లేదు. ఈ టాబ్ వల్ల, మీ బ్లాగులో పబ్లిష్ చేసిన టపాలను Google+ లో షేర్ చేసుకొవడం, మీ బ్లాగులో Google+ కామెంట్లను ఉపయొగించడానికి ఉపయోగపడుతుంది. 

 • Stats - ఈ టాబ్ లో, మన బ్లాగును వీక్షించిన వారి సంఖ్యను రొజువారీగా/నెలవారీగా/మొత్తంగా చూసుకోవచ్చు. మీ బ్లాగును, ఎక్కడనుండి వచ్చి చూస్తున్నారో, ఈ దేషం నుండి చూస్తున్నారో, ఏ వెబ్ బ్రౌసర్ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. 

 • మీ బ్లాగు Google Adsense Program Policies కి సరిపోతే, మీ బ్లాగును Monetize చేసుకుని, మీ బ్లాగుపై సంపాదించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం Google Adsense తెలుగు భాష ను సపోర్ట్ చేయడం లేదు.

 • Layout - మీ బ్లాగులో ఉన్న భాగాల అమరికను సరిచేసుకోవాలన్నా, కొత్త సదుపాయాలను మీ బ్లాగుకు జతపరచాలన్నా, Layout మరియు Layout లో ఉన్న Gadgets ద్వారా మాత్రమే!

 • Template - మీ బ్లాగు లుక్ ని ఈ Template ద్వారా మార్చుకొవచ్చు. డీఫాల్ట్ గా బ్లాగర్ వారు ఇచ్చిన Templates ఏ కాక, బయటనుండి Download చేసుకుని, ఇక్కడ ఉపయోగించుకొవచ్చు లేదా మీకు HTML, CSS, JS, XML పై అవగాహన ఉంటే, మీరే ఒక కొత్త Template డిసైన్ చేసుకోవచ్చు. 

 • Settings - మీ బ్లాగు URL మార్చుకోవలన్నా, Date & Time మార్చాలన్నా, RSS Feed తదితర వివరాలను మార్చాలన్నా Settings టాబ్ ద్వారా మార్చుకోవచ్చు.

 • Template టాబ్ లోని ఈ Customize ఆప్షన్ ద్వారా, బ్లాగు టెంప్లేట్ అమర్చిన తరువ్వత, రంగులు మరియు తదితర హంగులు మార్చుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
- పల్లా అరవింద్
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top