మతమార్పిడులకు కారణాలేమిటి?
ఇటీవలి కాలంలో సామాజిక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గమనించారు. 20 వ శతాబ్దాన్ని భావజాలము సిద్ధాంతాలు ప్రధానంగా ఉండిన శతాబ్దం (The century of Reason) అనీ, 21 వ శతాబ్దాన్ని సంస్కృతి, మతం ప్రధానంగా మారిన శతాబ్దమనీ (Century of Religion) వ్యాఖ్యానించారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి మార్క్స్‌ భావజాలం, రష్యాలో విప్లవం, లెనినిజం, స్టాలినిజం, చైనా విప్లవం, ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ ఒక వైపు. మరోవైపు సామ్రాజ్యవాదం. కోల్డ్‌ వార్‌ పరిస్థితులు- ఇవన్నీ భావజాలంతో ముడిపడిన అంశాలు కోల్డ్‌వార్‌ ముగిసే సమయానికి ప్రపంచమంతటా శాంతి వెల్లివిరుస్తుందని కొందరు భావించారు. కానీ చరిత్ర మరోరకంగా మలుపు తిరిగింది.

సుమారు సంవత్సరాల క్రితం Huntington అనే అమెరికన్‌ రచయిత "The Clash of Civilizations'అనే ప్రముఖ పుస్తకాన్ని రాశారు. ప్రపంచ దేశాలు వాటి మూల సంస్కృతుల ఆధారంగా దగ్గరకు వస్తున్నాయని ఆయన గమనించాడు. 10వ శతాబ్దం నుండి పాశ్చాత్య సంస్కృతికీ, అరబిక్‌ దేశాల సంస్కృతికి మధ్య జరిగిన ఘర్షణలు కొత్త రూపంలో పునరావృతం కావడం ఆయన విశ్లేషించాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థికరంగమే కాకుండా సంస్కృతి, మతం ప్రపంచీకరణ కావడం ఒక ముఖ్య పరిణామం. ప్రపంచంలో పెత్తనం చెలాయించడానికి ఏ ఏ దేశాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయని ఈయన వివరంగా రాశారు. మతం ఒక ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పారు.
పాశ్చాత్యదేశాల్లో జరుగుతున్న మార్పుల్ని చూస్తే వివాహవ్యవస్థ, కుటుంబవిలువలు బలహీనం కావడం, నాస్తికవాదం పెరగడం గమనించగలం. ఇంతకన్నా ముఖ్యంగా యూరోపియన్‌ దేశాలకు వలస వెళ్లిన ఇస్లాం మతస్తుల సంఖ్య పెరగడం పాశ్చాత్యదేశాలకు ఆందోళన కలిగించే విషయం. దివంగత లిబియా అధ్యక్షుడు గడాఫీ ఒకానొక సందర్భంలో ఇలా అన్నాడు- ‘మనం ఒక సైనికుడిని పంపకుండా, ఒక బుల్లెట్‌ కాల్చకుండా మరికొన్ని సంవత్సరాల్లో యూరోపును ఆక్రమించుకోగలం’. రాబోయే 25 సంవత్సరాలలో యూరోపు ఖండంలో ఇస్లాం మతస్తులు మెజారిటీ సంఖ్యలో ఉంటారని జనాభా విశ్లేషకుల అంచనా. ఇట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మనం మతమార్పిడుల పట్ల ఎంత ఆందోళన చెందుతున్నామో అలాంటి ఆందోళన పాశ్చాత్యదేశాల్లో కూడా చెందుతుండడం వాస్తవం. పైకి ఎంతో నిబ్బరంగా కనిపిస్తున్నా పైన చెప్పిన పరిస్థితిని నివారించడానికీ, ఇస్లాం దేశాలను బలహీనపర్చడానికీ, భారతదేశం లాంటి బలహీనదేశాల్లో తమ సంఖ్యను పెంచుకోవడానికి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈ విధంగా మతమార్పిడి అనే అంశం రాజకీయంతోనూ సామ్రాజ్యవాదంతోనూ ముడిపడిన విషయంగా మారింది. Monotheism and Imperialism  (ఏకవాదం మరియు సామ్రాజ్యవాదం) అనే విషయంపై మనం ఇంటర్నెట్‌లో వెతికితే ఈ రెండింటి మధ్య సంబంధం గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యూహాల్లో భాగంగా అంతర్యుద్ధం, మారణకాండలతో మనకన్నా ఎక్కువ నష్టపోతున్న దేశాలు ఇస్లామిక్‌ దేశాలే.

ప్రపంచం మొత్తంలో క్రైస్తవం మొదటి స్థానంలోనూ, ఇస్లాం రెండవ స్థానంలోనూ, బౌద్ధమతం మూడవస్థానంలోనూ ఉండగా హిందూమతం నాలుగవస్థానంలో ఉంది. మిగతా మతాలతో పోలిస్తే హిందూమతంలో ఎలాంటి సంస్థాగత నిర్మాణం. ప్రచార యంత్రాంగం ఎంతో బలిష్టంగా ఉన్నాయి. ‘‘ప్రపంచాన్నంతా మా మతంలోకి మార్చాలని మా దేవుడి ఆజ్ఞ. మాపై ఆ భారం ఉంది’’ అంటూ ఈ రెండు మతాలూ ప్రపంచదేశాలన్నింటిలోనూ అనుసరిస్తున్న విధానమే భారతదేశంలో కూడా అనుసరిస్తున్నాయి. హిందూమతంలో దేవుడు అలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు. పై పెచ్చు ఇతర దేవుళ్లను ఎవరిని పూజించినా నన్ను పూజించినట్లే అన్నాడు కృష్ణుడు. మీరు ఏ పార్టీలో ఉన్నా ఫరవాలేదు మంచి పనులు చేయండి అన్నట్లు మన సిద్ధాంతం. దీని ఫలితంగా హిందూ మేధావుల్లో ఉదారవాదం, ఇతరుల వ్యూహాల్ని తెలుసుకోలేకపోవడం. దాని ఫలితంగా హిందూ సమాజం క్రమేణా తగ్గడం జనాభా అంకెల్లో గమనించవచ్చు. ఇదే సందర్భంలో చైనాలోని కమ్యూస్టు పార్టీవారు "Evangelism is a disease to be cured ' అని చెబుతూ మత మార్పిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఒక దేశాన్ని మరొకదేశం అదుపులోకి తెచ్చుకోవాలంటే రెండు పద్ధతులు. ఒకటి దాడిచేసి వశంలోకి తెచ్చుకోవడం, రెండవది ఆ దేశంలోని అంతర్గత వ్యవస్థనూ, ఆ దేశ సంస్కృతినీ బలహీనపరిచి, తమ సంస్కృతిని, మతాన్ని వ్యాపింపచేసి ఆ దేశంలో తమ అనుయూయులు ఉండేట్లుగా చూసుకొని తోలుబొమ్మ ప్రభుత్వాలని నడుపుతూ పెత్తనం చెలాయించడం. పాశ్చాత్యదేశాలు ప్రపంచంలోని అనేక చిన్న దేశాలపై ఇలాంటి పెత్తనమే చేయడం గమనించగలం. భారతదేశం చూడడానికి పెద్దదేశమే అయినా బలహీన రాజకీయ వ్యవస్థ ఉండటం వల్ల ఇతరులు తమ వ్యూహాల్ని వీలైనంత తీవ్రంగా అమలు పరుస్తూ ఉన్నారు. మనదేశ మేధావుల్ని ఆకర్షించడం. వారి ద్వారానే మన సంస్కృతికీ, దేశభద్రతకూ ప్రమాదం కలిగించే రచనలు చేయించడం ఈ వ్యూహంలో భాగం. భారతదేశాన్నీ, సంస్కృతినీ విమర్శిస్తూ మాట్లాడేవారు, పుస్తకాలు రాసే వారు పాశ్చాత్యదేశాల నుండి సత్కారాలు పొందడం చూడవచ్చు. అలాంటివారు ఆ సంస్కృతుల తప్పుల్ని దాచివేయడం సహజం.

సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన "Breaking India'' అనే పుస్తకంలో పాశ్చాత్య వ్యూహకర్తలు భారతదేశాన్ని బలహీనపరచడానికీ, మతాల ఆధారంగా విడగొట్టడానికీ ఎలాంటి వ్యూహాల్ని ఆలోచిస్తున్నారు అన్న విషయంపై అనేక ఉదాహరణలు చూడగలం. పుస్తక రచయితల భాషణలు యూట్యూబ్‌లో వినగలం. మతాన్ని బలహీనపరచడం ద్వారా దేశాన్ని ఎలా బలహీనపరచవచ్చు. వీలైతే విడగొట్టవచ్చు అనేది ఇందులో విషయం. మన మేధావులు పొందిన సత్కారాల గురించి కూడా ఇందులో వివరించారు. ఒక ప్రఖ్యాత చరిత్రకారిణికి ఒక మత సంస్థ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు రాసినా, ఆ రచయిత్రి దాన్ని ఖండించలేదు. దేశ భద్రత గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఇంటర్నెట్‌ ఫలితంగా ఈ గ్రంథ రచయిత రాజీవ్‌ మల్హోత్రా ప్రసంగాల్ని యూట్యూబ్‌లో వినవచ్చు.

మతం అంటే మనమెవరూ చూడని దేవుడు. స్వర్గం-నరకం మొదలైన విషయాలపై ఒక సమాజానికున్న కొన్ని నమ్మకాలు. సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో ఎవరూ చూడని విషయాలపై మాదే సరైన వాదం అంటూ దాన్ని విస్తరించేవాళ్ల ఉద్దేశాలు కేవలం మతవిశ్వాసమే అనడానికి వీళ్లేదు. సామ్రాజ్యవాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

భారతదేశంలో మెజారిటీ అనుకునే హిందూ సంస్కృతి ప్రపంచస్థాయిలో మైనారిటీలో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర సంస్కృతులు ఎంతో బలంగా చొచ్చుకురావడం రోజురోజుకూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనదేశం కనీసం ఇప్పుడున్న స్థితిలోనైనా సమగ్రంగా ఉండాలా వద్దా అన్నది మన ముందు ఉన్న ప్రశ్న. మత విస్తరణను సామ్రాజ్యవాదానికి అనువైన ఆయుధంగా ఇతరులు వాడుకోవడం మన దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ అర్థం చేసుకోవాలి.

మతం అంటే మనమెవరూ చూడని దేవుడు. స్వర్గం-నరకం మొదలైన విషయాలపై ఒక సమాజానికున్న కొన్ని నమ్మకాలు. సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో ఎవరూ చూడని విషయాలపై మాదే సరైన వాదం అంటూ దాన్ని విస్తరించేవాళ్ల ఉద్దేశాలు కేవలం మతవిశ్వాసమే అనడానికి వీళ్లేదు. సామ్రాజ్యవాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
(ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసమిది)
source :


మతమార్పిడుల వెనుక సామ్రాజ్యవాదమున్నదన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?
Reactions:

Post a Comment

 1. మతమార్పిడుల వెనుక సామ్రాజ్య వాదముంది అనడానికి ఉన్న ఒకే ఒక్క ఉదాహరణ చెపుతాను. బాబర్ సంగతి మనకు తెలియదు కానీ అద్వానీ ని మనం మన కళ్ళారా చూసాం. రధ యాత్ర తో మొదలుపెట్టి నిన్నటి ఘర్ వాపసీ కార్యక్రమం దాకా హిందువుల లక్ష్యం కేవలం హిందూత్వ వ్యాప్తి మాత్రమే కాదు నియంతృత్వ పోకడలని ప్రజలూ అంగీకరిస్తున్నారు. చైనా వాళ్ళు నియంతృత్వాన్ని వదులుకుని ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే మనం ప్రజాస్వామ్యాన్ని వదులుకుని నియంతృత్వాన్ని కోరుకుంటున్నాము అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. రాజుల కాలం మళ్ళీ రాబోతుంది అనడానికి ఇవి సూచికలేమో అన్న అభిప్రాయం కలుగుతోంది.
  - Niharika Nayudu

  ReplyDelete
 2. హిందూ మతం పూర్తిగా అంతరించినా నాకు వచ్చే నష్టం లేదు. హిందూ సమాజంలో స్త్రీల పరిస్థితి ఏమీ ముస్లిం సమాజంలోని స్త్రీల పరిస్థితి కంటే మెరుగ్గా లేదు. విజయనగరం జిల్లాలో ఒక మహిళ రైల్వే గేత్ కీపర్‌గా పని చేస్తే "మగోళ్ళు చేసే పనులు ఆడది చేస్తున్నాది" అని సాటి మహిళలే ఆమె గురించి చెడుగా అనుకున్నారు. ఆడవాళ్ళు doctor, teacher లాంటి ఉద్యోగాలు మాత్రమే చెయ్యాలని బోధించే అరబ్ ముల్లాలకీ, హిందువులకీ మధ్య తేడా ఏమీ లేదు.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్ గారు మీరు మార్క్సిస్టు-లెనినిస్ట్ అని పేరు పెట్టుకుంటారు. దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తారు. అలా చేయడం తప్పు కాదా?

   హిందూమతం అంతరించాలని మార్క్సిజం లేదా లెనినిజం ఎక్కడ చెప్పింది? ఏ మతమైనా మతం మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఏంగెల్స్ చాలా క్లియర్‌గా చెప్పారు కదా? హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తే మిగతా మతాలు మంచివనా మీ ఉద్దేశం. ఏ మతంలో ఏవి సమాజ ప్రయోజనాలకు ఆటంకంగా ఉన్నాయో ఆయా అంశాలను విమర్శిస్తే బాగుంటుంది. ఏ మతస్తులు ఎక్కడ మతోన్మాదాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారో వాటిని విమర్శిస్తే ప్రయోజనం ఉంటుంది.

   హిందూ మతం కంటే ముస్లిం, ముస్లిం కంటే క్రిస్టియన్ లేదా అన్నింటికంటే హిందూ మతంలో కొన్ని కొన్ని విషయాలు ప్రోగ్రెసివ్ గా కనిపించవచ్చు. ఏ మతమైనా ఆ మతనియమాలు నచ్చినవారు వారి వ్యక్తిగత జీవనంలో పాటించుకుంటారు. అలా కాక సమాజంలో బలవంతంగా వాటిని వృద్ధి చేయాలని, పాటించాలని మోరల్ పోలీసింగ్ లేదా మతోన్మాద చర్యలు చేస్తుంటే, లేదా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఆ అంశాలపై పోరాడవచ్చు. అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.

   శ్రీకాకుళంలో ఉదాహరణలే ప్రపంచమంతా ఉంటాయా? మతం మీద, మత విశ్వాసాలపైనా దాడి చేయడం మార్క్సిస్టు లక్షణం కాదని మీకు తెలియదా? మతానికీ-మతోన్మాదానికీ తేడా లేదా?

   భారత్ లో హిందూ మతం మెజారిటీగా ఉన్నా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నది, ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజంతో పోల్చితే హిందూ మతోన్మాదం చాలా తక్కువ. ఇప్పటివరకూ చూస్తే హిందూమతోన్మాదులైనా సామ్రాజ్యవాదధోరణిలో లేరు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలని లేదా మతమార్పిడులని అరికట్టాలని, మతం ఆధారంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఈ వైఖరి హిందువులందరిలో కూడా లేదు. మెజారిటీ హిందువులు మతాన్ని రాజకీయాలతో కలిపి చూడడం లేదు. అందుకు ఉదాహరణ క్రిస్టియన్లయిన సోనియా, రాజశేఖరరెడ్డి, జగన్ వంటివారికి ఆదరణ ఇవ్వడం.

   హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి మైనారిటీలను బుజ్జగించేలా ఉండే వైఖరి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? మతానికీ-మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాపై మీ వైఖరి ఏమిటి?

   Delete
 3. జెర్మనీలో హిందూ మతం లేదు. హిందూ మతం ఉండాలా, వద్దా అనేది మార్క్స్, ఎంగెల్స్ ఎలా చెపుతారు? కొన్ని మూడవ ప్రపంచ దేశాలలో మత నాయకుల నాయకత్వంలో జాతుల విముక్తి పోరాటాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. హిందూ మతం ఎక్కడైనా జాతుల విముక్తిని సపోర్త్ చేస్తుందా? అది after all కుల వ్యవస్థ పునాదుల మీద ఏర్పడిన మతం. మన దేశంలో అతి పెద్ద హిందూత్వ పార్తీ అయిన భాజపాయే అమెరికాని విమర్శిస్తే మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావని భయపడిపోయే పిరికిపందలా వ్యవహరిస్తోంది, ఇక ఈ మతం పేరు చెప్పుకుని ఎవరిని ఉద్ధరిస్తారు?

  ReplyDelete
  Replies
  1. మార్క్స్ ఏంగెల్స్ లు హిందూ మతం గురించి చెప్పారని నేను చెప్పలేదు. మతం గురించి చెప్పారు. మతం మీద దాడి చేయొద్దని చెప్పారు అంటున్నాను. మతం వ్యక్తిగత అంశంగా చూడాలి అంటున్నాను. మీరు నేను అడిగినదానికి సూటిగా చెప్పకుండ ఇంకేదో చెపితే ఎలా? BJP హిందుత్వపార్టీ అయినా BJP ని హిదుత్వ ఆధారంగా ప్రజలు గెలిపించలేదు. కాంగ్రెస్ అవినీతి కంపును భరించలేక ప్రత్యామ్నయంగా సమర్ధులెవరూ లేక మోడీపై నమ్మకంతో గెలిపించారు. మోడీ పాలన బాగులేకపోతే అతడినీ తిరస్కరిస్తారు. మోడీ లేదా BJP తప్పులకు లేదా మతోన్మాదానికీ, హిందూ మతాన్ని టార్గెట్ చేసి విమర్శించడానికీ తేడా లేదా?

   Delete
 4. మోషే తన జాతివాళ్ళని (ఇజ్రాయెలీయులని) రక్షించినట్టు బైబల్‌లోనూ, కురాన్‌లోనూ కథలు ఉన్నాయి కాబట్టి యూదులు, క్రైస్తవులూ, ముస్లింలూ మోషేని ఆదర్శంగా తీసుకుని జాతీయ విముక్తి పోరాటాలు చేస్తారు. కొన్ని జాతులని అంటరానివి చేసిన హిందూ మతానికి జాతీయ విముక్తిని ప్రభావితం చేసేంత సీన్ ఉందా? ఆంగ్లేయులు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి, ఆర్థికంగా 500 సంవత్సరాలు వెనుకబడేలా చేసారు కనుక ఆంగ్లేయులకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని కులాలూ పోరాడాయి. ఆర్థిక ప్రయోజనం కోసం అయితే అన్ని కులాలూ కలుస్తాయి. సైకలాజికల్‌గా అయితే రెండు హిందూ కులాలు ఎన్నడూ కలిసి ఉండవు. ప్రజల్ని సైకలాజికల్‌గా కలిపే క్రైస్తవ, ఇస్లాం మతాలకీ, కుల విభజనలు ఉన్న హిందూ మతానికీ మధ్య పోలిక లేదు కనుక హిందూ మతం ప్రగతి పాత్ర పోషిస్తుందా, లేదా అనే చర్చ అనవసరం. హిందూ మతాన్ని ఎంత మంది నమ్మినా, నమ్మకపోయినా నా వ్యక్తిగత జీవితంలో నేను ఆ మతానికి దూరంగానే ఉంటాను.

  ReplyDelete
  Replies
  1. మీరు వ్యక్తిగతంగా హిందువుగా ఎందుకుండరని నేనడగలేదు. ఆ అవసరమూ లేదు. మీరు హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తారా? ఏ మతాన్నైనానా? ఒక్క హిందూ మతం అంతరిస్తే సరిపోతుందా? అన్ని మతాలు అంతరించిపోవాల్నా?

   Delete
 5. అన్ని మతాలూ అంతరించినా నాకు వచ్చే నష్టం లేదు. కేవలం ఒక మతం ప్రపంచ జనాభాలో నాలుగవ స్థానంలో ఉందని వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అలాగైతే కొన్ని వేలు లేదా కొన్ని లక్షలు మాత్రమే జనాభా ఉన్న చిన్న మతాలవాళ్ళు ఎంత బాధపడాలి?

  ReplyDelete
  Replies
  1. వీళ్లు అంటే హిందువులందరూ కాదు కదా? కేవలం హిందూ మతోన్మాదులేకదా? మతాన్ని నమ్మేవారిని, మతాన్ని అడ్డంపెట్టుకుని కుట్ర రాజకీయాలు చేసేవారిని ఒకేలా విమర్శించడం తప్పు అవుతుందనే మిమ్ములను అలా అడిగాను. ముందు కులాల ఎక్కువ తక్కువలని, దేవాలయాలలోకి దళితుల ప్రవేశం వంటి పుణ్యకార్యక్రమాలు చేసి ఘర్ వాపసి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. మతమార్పిడులకి ముఖ్య కారణం కుల దురహంకారమని రచ్చబండ బ్లాగులో నేను కామెంట్ పెడితే ఇంకెక్కడి కులాలంటూ వాదించేవారికి ఏమి చెప్పాలి? నేటికీ పల్లెల్లో దళితవాడలు ఊరుకు ఎడంగానే ఉంటున్న సంగతిని వీరు కావాలనే మరచిపోతారనుకుంటాను. గతంతో పోలిస్తే కులం విషయంలో కొంత మాత్రమే ప్రోగ్రెస్ ఉంది తప్ప. కులసమస్య నేటికీ ప్రధానమైనదిగానే ఉన్నది.

   Delete
 6. హిందూ మతం నాలుగవ స్థానంలో ఉన్నందుకే బాధపడేవాళ్ళు మతోన్మాదులె. కొన్ని వేలు మాత్రమే జనాభా ఉన్న చిన్న మతాలు కూడా ఉన్నాయి. కోట్ల జనాభా ఉన్న హిందువులకి బాధ కలిగితే వేల జనాభా ఉన్న ఆ మతాలవాళ్ళకి నరకయాతన కలగాలి కదా!

  హిందూత్వవాదులు "కుల వ్యవస్థ ఈ రోజుల్లో లేదు" అని వాదించినంతమాత్రాన కులం మాయమైపోదు. కులం మీద ఎలాంటి నమ్మకం లేని నేనే వేరే కులంవాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి సంబంధం అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని భయపడుతుంటాను. "ఈ రోజుల్లో కులవ్యవస్థ లేదు" అని వాదించేవాళ్ళు ఒక కులంవాళ్ళు ఉండే వీధికి వెళ్ళి ఆ కులానికి చెందిన అమ్మాయికి లైన్ వేసి చూడాలి, ఆ కులంవాళ్ళు అతని బొమికలు విరగ్గొడతారో, లేదో.

  ReplyDelete
  Replies
  1. బొమికలు విరగగొట్టకపోతే కుల సమస్య పోయినట్లేనా? అమ్మాయిలకు లైన్ వేసి టెస్ట్ చేయకపోతే కులసమస్య ఉన్నదనేది తెలియదా? గతమంత తీవ్రంగా కాకున్నా నేటికీ కులసమస్య ఉన్నది. కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా ఉన్నది. కొన్ని చోట్ల కొంతమేరకు మాత్రమే తగ్గింది. కుల పిచ్చి అగ్రకులాల్లొనే కాదు నిమ్న కులాలలోనూ ఉన్నదనేది నా అభిప్రాయం. కులం అనేది వ్యవస్తీకృతం అవుతున్నది. ప్రజల మధ్య ఐక్యతకు ఇదొక ప్రధానమైన అడ్డంకి.

   Delete
  2. కులం కంటే మతమే పెద్ద మూఢనమ్మకం. మతం దేవుని గురించీ, పరలోకం గురించీ ఆలోచించమని చెపుతుంది కానీ నీకు ఏమి కావాలో నీవు తెలుసుకోవాలని చెప్పదు. వాళ్ళు "కులాన్ని నమ్మక్కరలేదు కానీ మతాన్ని నమ్మొచ్చు" అని అంటే దాని అర్థం "ఒక మూఢనమ్మకాన్ని నమ్మక్కరలేదు కానీ ఇంకో మూఢనమ్మకాన్ని నమ్మొచ్చు" అనే వస్తుంది. ఆ paradoxical వాదనలకి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

   Delete
 7. This comment has been removed by the author.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top