• వాళ్లకేమో యాత్రలకు ఆర్థిక సాయం
 •  మరి తిరుపతికెళ్లే వారికి సాయం చేయరా?
 •  కేసీఆర్‌, బాబుపై తొగాడియా ఫైర్‌

సిద్దిపేట/శంషాబాద్‌, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్‌ రావులు హిందువుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా ఆరోపించారు. చంద్రబాబేమో జెరూసెలం వెళ్లే క్రైస్తవులకు, కేసీఆర్‌ ఏమో హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని విమర్శించారు. అదే తిరుపతి వెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీలైన హిందువులకు ఒక్క రూపాయి అ యినా ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలో సోమవారం వీహెచ్‌పీ ఆధ్వ ర్యంలో జరిగిన విరాట్‌ హిందూ సమ్మేళనం, హనుమాన్‌ చాలీసా కోటి పారాయణ యజ్ఞాల్లో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్ల పేరిట హిందువులకు నష్టం చేస్తున్నారని తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు సురక్షితంగా ఉండాలంటే దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని, అప్పుడే మతమార్పిడులు ఆగిపోతాయని ఆయన అన్నారు. దేశం ఒక్కటే అయినపుడు రెండు రకాల చట్టాలెందుకంటూ. ‘ఉమ్మడి పౌర స్మృతి’ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘లవ్‌జీహాద్‌’ను సహించబోమని హెచ్చరించారు. ‘‘నాలుగు దినాల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, మూడు గంటల్లో ముగ్గురికి తలాక్‌ ఇచ్చే విధానాన్ని ప్రేమ అంటారా’’ అని ప్రశ్నించారు. ప్రేమ అంటే ‘శివ పార్వతు’ల్లా కలిసి ఉండడమని హితవు చెప్పారు. ప్రతి హిందువుకు సురక్ష, సంవృద్ధి, సన్మాన్‌ లభించేలా అందరూ సక్రమ హిందువులుగా సంఘటితంగా మెలగాలని పిలుపునిచ్చారు. అంటరాని తనాన్ని అంతం చేయాలన్నారు. ప్రతి హిందువు నిరుపేద హిందువులను ఆదుకునేందుకు రోజు పిడికెడు బియ్యం, నెలకొక విద్యార్థికి ఫీజు, డాక్టర్లు రోజుకొక రోగికి ఉచిత వైద్యం అందించాలని కోరారు. కశ్మీర్‌కు 4లక్షల మంది హిందువులు తిరిగి వచ్చినపుడే.. లాహోర్‌, రావల్పిండి మొదలైనవి కలిసి అఖండ భారత నిర్మాణం జరిగినపుడే నేను ఉత్సవంగా భావిస్తా’’ అని ఆయన చెప్పారు.

జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు, హజ్ యాత్రలకు వెళ్లే ముస్లింలకు ఆర్ధిక సాయం చేసేవారు 
తిరుపతికి వెళ్లే ఎస్సీ,ఎస్టీ హిందువులకు ఎందుకు చేయరంటున్న తొగాడియా వ్యాఖ్యలను సమర్ధిస్తారా?
Reactions:

Post a Comment

 1. ఒకడు మాదిగోడని తెలిస్తే తిరుపతి పురోహితుడు అతనికి శఠగోపం పెట్టడానికి ఒప్పుకుంటాడా? దళితులకి ఆలయ ప్రవేశమే లేనప్పుడు తిరుపతి, పూరీ, వారాణసీ ప్రవేశాలు ఎలా కల్పిస్తారు?

  ReplyDelete
  Replies
  1. నాకొక డౌట్ ,దళితులు వేదాలు/పూజాదికాలు శాస్త్ర ప్రకారం నేర్చుకొంటే అతనిని పూజారిని చెయ్యగలరా?లేకపోతే పూజారి పోస్ట్ కు మొత్తం పై వర్ణం వాళ్ళకే రిజర్వేషన్లా?

   Delete
  2. పాకీవృత్తిలో కూడా రిజర్వేషన్ ఉంది. ఆంధ్రాలోని పాకీవాళ్ళందరూ రెల్లి, మాదిగ కులస్తులు.

   Delete
 2. దేశమంతా ఒకటే వ్యక్తిగత చట్టం కావాలనడం సరి కాదు. హిందువులు తమ సంప్రదాయాలకు విరుద్దంగా చట్టం వస్తే ఒప్పుకుంటారా?

  శివపార్వతుల గురించి మాట్లాడిన తోగాడియాకు గంగ గురించి తెలీదా?

  ReplyDelete
 3. ముస్లింలలో పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతి ఉంది కనుక హిందువులలో కూడా అలా అనుమతించాలని నేను అన్నప్పుడు హిందూ బ్లాగర్‌లు ఎలా స్పందించారో నాకు గుర్తుంది. కామన్ సివిల్ కోద్ అంటే హిందూ సివిల్ కోద్‌ని ముస్లింలపై రుద్దడం తప్ప ఇంకొకటి కాదు.

  ReplyDelete

 4. కామన్ సివిల్ కోడ్ తప్పక అవసరమే.ఐతే అది ఆధునిక భావాలతో, శాస్త్రీయ పద్ధతిలో రచించబడి అన్ని మతాల,జాతులవారికి అన్వయించాలి.

  ReplyDelete
  Replies
  1. కష్టమండీ, మా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ *అన్ని* మతాల పెద్దలు గగ్గోలు పెడతారు. కొన్ని ముఖ్యమయిన సంస్కరణలను గుర్తించి వాటిని ఆయా మతపరమయిన చట్టాలలో/సంప్రదాయాలలో అమలు చేయడం మధ్యేమార్గంగా బెటర్. ఉ. నమూనా నికానామా అమలు చేస్తే మహర్ మొత్తాన్ని ఒక శాస్త్రబద్దత కలిగిన నియమావళి ప్రకారం చేయవచ్చు. దీని వల్ల ముస్లిం మహిళలకు బద్రత పెంచవచ్చు.

   Delete
 5. ముస్లిము లంతా బీదవాళ్ళనీ,హిందువు లంతా ధనికు లనీ అనుకోవదమే దీనికి కారణం?
  హజ్ యాత్రకి డబ్బివ్వగానే కృతజ్ఞతతో వాళ్ళు గుందుగుత్తంగా వోట్లు వేస్తారు!
  హిందువుల్ని అట్లా సంతృప్తి పర్చడం కష్టం,వీళ్లకి ఆల్రెదీ వున్నాయి గదా మరి!

  ReplyDelete
 6. ప్రభుత్వాలు మతాలతో షరీకవ్వడం. కొన్నిమతాలవారికి (ఇక్కడ ముస్లిములకీ, క్రైస్తవులకీ) సబ్సిడీలిచ్చేస్థాయికి దిగజారడం అత్యంత దురదృష్టకరం. దాన్ని హిందువులకికూడా extend చెయ్యాలన్న వాదన consistentగానే ఉన్నా equally nonsensical.

  నేనుకట్టే పన్ను తిరిగి నాకు సౌకర్యాలను అందుంచడానికి ఉపయోగపడాలేతప్ప, ఎవడో అజ్ఞాని స్వర్గప్రాప్తికోసం, ఎవడిదో ego satisfactionకోసం వాడబడడమేమిటి? అంతగా పేదలకు సహాయం చెయ్యాలనుకుంటే ఆయా మతాలవారే చందాలు ఏకరించుకొని ఆ పుణ్యకార్యాన్ని పూర్తిచేయవచ్చు అంతేగానీ ప్రభుత్వం ఊరసొమ్మును ఖర్చుచెయ్యడమేమిటి? nonsense!!

  ముస్లిములకు హజ్‌యాత్రకు సబ్సిడీలిచ్చాక, క్రైస్తవులకి జెరూసలెంయాత్రకి సబ్సిడీలిచ్చాక, హిందువులకి తిరుపతియాత్రకి సబ్సిడీలిచ్చాక, నాస్తికులకి ఈ ప్రభుత్వం ఏం సబ్సిడీలివ్వాలి? రేపు నేనే ఒక క్రొత్తమతాన్ని స్థాపించి డిస్నీల్యాండ్ యాత్రను mandatory చేస్తే, అప్పుడు నా followersకి కూడా సబ్సిడీ ఇస్తారా?

  ReplyDelete
  Replies
  1. హజ్ యాత్రకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తమ యాత్రకు అవసరమయిన ఖర్చులు భరించగలిగిన ముస్లిములకు మాత్రమె యాత్ర కర్తవ్యం. స్తోమతు లేని వారికి యాత్ర చేయాల్సిన బాద్యత లేదు.

   "And Hajj to the House (Ka’bah) is a duty that mankind owes to Allah, for those *who are able to undertake* the journey": verse 3:97

   Delete
  2. 2012 రఫీక్ షేక్ కేసులో సర్వోత్తమ న్యాయస్థానం హజ్ సబ్సిడీని క్రమక్రమంగా తగ్గిస్తూ పదేళ్ళలో మానేయమని ఆదేశాలు జారీ చేసింది. 2022 తరువాత సబ్సిడీ ఇస్తే అది కోర్టు ధిక్కారం అవుతుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top