న్యూఢిల్లీ, జనవరి 20: ఒక పక్క మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అరవింద్‌ కేజ్రీవాల్‌! మరో పక్క దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేదీ! వీరిద్దరి మధ్య ఇప్పుడు ఆసక్తికర రాజకీయ పోరుకు తెరలేచింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌ బేదీ, ఆప్‌ నుంచి సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ ..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుండడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే ఉక్కు మహిళ అయిన బేదీ వల్లనే సాధ్యమవుతుందని బీజేపీ వ్యాఖ్యానించింది. బాధ్యతలనుంచి పారిపోయే కేజ్రీవాల్‌ను ఉక్కు మహిళ బేదీ ఓడించడం తథ్యమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర అన్నారు. వారణాసిలో మోదీపై పోటీ చేసిన కేజ్రీవాల్‌ను ప్రజలు గంగలో ముంచేశారని.. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు యమునాలో ముంచేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. కాగా ఢిల్లీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కిరణ్‌ బేదీకి కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. కేజ్రీవాల్‌ సవాలును బేదీ కూడా స్వీకరించారు. అయితే.. ఎన్నికల ప్రచార సందర్భంగా తాను అటువంటి చర్చల్లో పాల్గొననని, ఎటువంటి చర్చ అయినా అసెంబ్లీ వేదికగానే ఉండాలని ఆమె అన్నారు. కాగా.. మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయాలని బయలు దేరిన కేజ్రీవాల్‌.. సమయం మించిపోవడంతో ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కిరణ్‌ బేదీ కూడా బుధవారమే నామినేషన్‌ వేయనున్నారు.
అసెంబ్లీయా?-బహిరంగమా? ఢిల్లీ అభివృద్ధిపై ఏ చర్చ ప్రయోజనకరం!? మీ అభిప్రాయం ఏమిటి?
Reactions:

Post a Comment

 1. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 2. This comment has been removed by a blog administrator.

  ReplyDelete

 3. ఈ ఐ ఆర్ ఎస్ ఐ పీ ఎస్ ల ని గమనిస్తోంటే నాక్కూడా ఆలోచనలు కలుగు తున్నాయి పాలిటిక్స్ లో కి దూకేద్దామని !
  బాబ్బాబు, మీరు సినిమా తీసే పక్షం లో ఐటం సాంగు కి జిలేబి ని వేసుకోండి (వీటికే ఈ మధ్య గిట్టు బాటు ఎక్కువ అని విన్నా హీరోయిన్ల కన్నా!) పాలిటిక్స్ లో డబ్బులు రాలక పోయినా సినిమాలో డబ్బులు వస్తాయి !!

  జిలేబి

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top