యాచకుడిలా అర్థిస్తున్నా! ఆడపిల్లను కాపాడండి!!


 • ‘బేటీ బచావో’కు మోదీ శ్రీకారం
 •  ఆమె పుట్టకుంటే బతుకు లేదు
 •  హర్యానాలో మోదీ భావోద్వేగం
 •  భ్రూణ హత్యలు మానసిక దారిద్య్రం 
 •  మగపిల్లలపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లలపై ఉండదేం?: ప్రధాని

పానిపట్‌, జనవరి 22: ఆడపిల్లలను తల్లి కడుపులోనే చంపేయడం మానసిక దారిద్ర్యానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారిని బతకనివ్వాలని యాచకుడిలా అర్థిస్తున్నానని అని ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. భారతదేశంలో ఆడపడచులను బతకనివ్వాలని తాను వేడుకుంటున్నానని మోదీ అన్నారు. హర్యానాలోని పానిట్‌ జిల్లాలో ఆయన ‘బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌’ పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భ్రూణ హత్యలను చేసే జాతి ఇంకా 18వ శతాబ్దంలోనే ఉన్నట్లు లెక్క అని విమర్శించారు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తుంటే.. మనం 21వ శతాబ్దంలో నివసిస్తున్నామని అనుకోలేమని అన్నారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్లు చేస్తున్న డాక్టర్లను విమర్శించారు. భారతీయ సమాజంలో కుమారులను సొంత వారిగానూ, ఆడ పిల్లలను పరాయి వారిగానూ పరిగణించడం సరైంది కాదని ప్రధాని చెప్పారు. కుమారుడు తల్లిదండ్రులను పోషిస్తాడన్నది నిజమైతే.. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగదని చెప్పారు. తల్లిదండ్రులను కుమారుడు పట్టించుకోకున్నా కుమార్తె మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌’ పథకాన్ని ప్రారంభించిన మోదీ.. మగవారికంటే మహిళలు తక్కువగా ఉంటే భవిష్యత్‌ లేదన్నారు. 1000 మంది పరుషులకు 750 మంది మహిళలు మాత్రమే ఉంటే.. 250 మంది బ్రహ్మచారులుగానే ఉండాలని హెచ్చరించారు. హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లాను ప్రస్తావించిన మోదీ.. ఎంతో మంది కల్పనా చావ్లాలు పుట్టకుండా ఆపేస్తున్నారని ఆక్రోశించారు. మగపిల్లలపై చూపే ఆసక్తి, జాలి ఆడపిల్లలపై లేదా? అని ఆయన అడిగారు. గతంలో కురుక్షేత్రలో ఒక బాలుడు బోరుబావిలో పడిపోతే.. దేశం మొత్తం టీవీ చానళ్లలో చూసిందని.. తల్లికడుపులోనే చనిపోతున్న ఆడపిల్లల విషయంలో మనకు కరుణ ఎందుకు ఉండదని మోదీ ప్రశ్నించారు. స్ర్తీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ‘బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌’ పథకాన్ని ప్రారంభించగా, అందులో 12 జిల్లాలు హర్యానాలోనే ఉండడం గమనార్హం. అందుకే ప్రధాని మోదీ ఈ పథకాన్ని హర్యానా నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ పథకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మాధురీ దీక్షిత్‌ కూడా ఆడపిల్లలను బతికించాలని అర్థించారు. జన్‌ధన్‌ యోజన, స్వచ్ఛ్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా కార్యక్రమాల తరువాత ప్రారంభించిన నాలుగో పథకం ‘బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌’ అని మంత్రులు పేర్కొన్నారు. 
ఏమిటీ పథకం
‘బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌’ పథకం కింద గ్రామాలకు ప్రోత్సాహకాలను ఇవ్వటంతో బాటు గ్రామాల్లో భ్రూణ హత్యలు జరగకుండా కేంద్రం ప్రచారం చేస్తుంది. ఆడ పిల్లలను చదివిచడానికి ప్రోత్సాహకాలను ఇవ్వటంతో బాటు ఏ గ్రామంలో ఆడ-మగ సెక్స్‌ నిష్పత్తిలో ఆడపిల్లలు పెరుగుతారో.. ఆ గ్రామానికి కోటి రూపాయల గ్రాంటును కేంద్రం ఇస్తుంది. అలాగే ఆడపిల్లల మీద వేసిన డిపాజిట్లకు ఏటా 9.1 వడ్డీ ఇవ్వడమే కాక, ఇన్‌కం టాక్స్‌ మినహాయింపును కూడా కేంద్రం కల్పిస్తుంది.

బేటీ బచావోను ఓ ప్రధాని యాచకుడిలా అర్ధించాల్సిన స్థితి రావడానికి కారణాలేమిటి? 
మూలాలను నిర్మూలించకుండా ఎన్ని కొత్త పథకాలు వచ్చినా సమస్య పరిష్కారం అవుతుందా?
Reactions:

Post a Comment

 1. ఆర్థిక కారణాలూ, మానసిక కారణాలు ఒకటవ్వవు కదా. ఆడ పిల్లకి ఉద్యోగం ఉన్నా ఆమెని ఉద్యోగస్తునికి ఇచ్చే పెళ్ళి చేస్తారు, అది కూడా కటం ఇచ్చే పెళ్ళి చేస్తారు. ఇరవై వేలు ఖర్చుపెట్టి అబార్షన్ చెయ్యిస్తే భవిష్యత్‌లో పది లక్షలు కట్నం ఇచ్చే అవసరం తప్పుతుంది. ఆడ పిల్ల పుట్టిన వెంటనే నోటిలో గంజాయి పోసి చంపేస్తే ఆ ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదు. నవ్య ఉదారవాద విధానాలతో ఆర్థిక అసమానతలని తీవ్రం చేసే పాలకవర్గంవాళ్ళు అబార్షన్‌లు చెయ్యించుకోవద్దు అని కబుర్లు చెపుతున్నారు.

  ReplyDelete
 2. ఆర్ధికంగా ఉన్నత స్థితి దీనికి సంబంధం లేదు, కేవలం మనిషి యొక్క మూర్ఖత్వం దీనికి కారణం, అబ్బాయి పుడితే తానూ మొగడ్ని అనుకునే రోజులు పోవాలి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top