హైదరాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన బీజేపీ నేతలు, ఆర్నెల్లు తిరక్కుండానే తప్పించుకొనే ధోరణి అవలంబిస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని, కేంద్రాన్ని తాము నిలదీస్తామని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రి వెంకయ్య నోట ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని చెప్పారు. ‘ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వెంకయ్య డిమాండ్‌ చేశారు. అన్నీ సాధించామంటూ ఎన్నికల్లో పుస్తకాలు పంచారు. ఇప్పుడు మాట దాటవేస్తారా?’ అంటూ నిలదీశారు. ‘కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను మేం ఒప్పిస్తాం.. బీజేపీ ముఖ్యమంత్రులను మీరు ఒప్పించండి’ అన్నారు. అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం లేదని, మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటే చాలన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలను సాధించుకోవడానికి ప్రజా ఉద్యమం చేపడతామని, ఈ నెల 31న ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 
కరకట్టలపై బీజేపీ కార్యాలయమా?
విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని అనుమతులు లేని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నిర్మించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రఘువీరా చెప్పారు. పర్యావరణానికి హానికరమంటూ పరీవాహక ప్రాంతంలో సామాన్యుల గుడిసెలను తీసేసే ప్రభుత్వాలు.. బీజేపీ కార్యాలయానికి ఎలా అనుమతిచ్చాయని ప్రశ్నించారు. చట్టానికి విరుద్ధంగా, పర్యావరణానికి హాని కలిగేలా బీజేపీ కార్యాలయం నిర్మిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు.
వెంకయ్య రాజీనామా చేయాలి: సీపీఐ 
హైదరాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినమాట నిలబెట్టుకోలేని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు లభించిన హామీలన్నీ తన వల్లే వచ్చినట్లు ఇప్పటివరకు చాటుకున్న వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్రమే ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో ఒక రాషా్ట్రనికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఇతర రాషా్ట్రల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడం విచారకరమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాషా్ట్రనికి తానే ప్రత్యేక హోదా, ప్యాకేజీ తెచ్చానని పుస్తకాలు ముద్రించుకుని, సన్మానాలు చేయించుకుని ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట మార్చడం తగదన్నారు. ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలమైన వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి, తక్షణం మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు

ఏ.పీ కి ప్రత్యేక ప్రతిపత్తిపై BJP మాట మార్చడంపై మీ కామెంట్?
Reactions:

Post a Comment

  1. my heart is burning
    my response:
    http://www.harikaalam.blogspot.in/2015/01/blog-post_25.html

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top