(image courtesy : The Hindu)

హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఢిల్లీ సీ.ఎం పీఠానికి ఇద్దరు అభ్యర్ధులనిచ్చిందా!?
అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఒకరు అరవింద్ కేజ్రీవాల్ - ఆం ఆద్మీ పార్టీ పెట్టి కొద్ది రోజులు ఢిల్లీ సీ.ఎం గా పనిచేశారు. మరొకరు కిరణ్ బేడీ - హఠాత్తుగా బీ.జే.పీ తరపున సీ.ఎం అభ్యర్ధి అయ్యారు. ఒక ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు నేతలు ఇలా భిన్న ధృవాలుగా ఒకే పదవి కోసం పోటీ పడడం విశేషం. కేజ్రీవాల్ హిందుత్వ బీ.జే.పీకి వ్యతిరేకంగా నడక సాగిస్తుంటే, కిరణ్ బేడీ ఏకంగా ఆ పార్టీలోనే చేరిపోయారు. అయితే ఒకేసారి ఆమెను బీ.జే.పీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం స్థానిక బీ.జే.పీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంపై అనేకులకు చాలా భ్రమలున్నాయి. బహుశా ఇప్పుడా భ్రమలు తొలగి ఉంటాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి దిగి కొత్త పార్టీ పెట్టి జనలోక్‌పాల్ కోసం ప్రయత్నిద్దామన్నప్పుడు వ్యతిరేకించిన కిరన్‌బేడీ ఇప్పుడు ఒక రాజకీయపార్టీ తరపున సీ.ఎం అభ్యర్ధిగా పోటీ చేయడం ఎంతమేరకు నీతివంతమైన రాజకీయం? ఇలాంటి నేతల లోగుట్టు అవినీతిపై ఉద్యమం చేస్తున్నప్పుడు వారు పలికే చిలుకపలుకులవల్ల సామాన్యులకు తెలీదు. కాస్త దూరదృష్టితో ఆలోచిస్తేమాత్రం వీరు ఎవరికోసం పనిచేస్తున్నారో అవగతం అవుతుంది. హజారే మాత్రం బీ.జే.పీలో చేరడం గురించి కిరణ్ బేడీ తనను సంప్రదించలేదని చెప్తున్నప్పటికీ, మోడీని పొగడంతో ఆయన కూడా బీ.జే.పీకి అనుకూలంగా ఉన్నారణే ఆరోపణలు వినవస్తున్నాయి. బీ.జే.పీకి వ్యతిరేకంగా ఉన్న కేజ్రీవాల్ - బీ.జే.పీలో చేరిన బేడీ ఎవరు నీతివంతులు? ఎవరు జన్‌లోక్పాల్ కోసం నిజాయితీగా పనిచేస్తారు? 

Reactions:

Post a Comment 1. హస్తిన రెంటికీ చెడిన రేవడి కాకుంటే అదే 'పదిహేను' వేలు !!
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఐదువేలు(ళ్లు) కలిపారెందుకు?

   Delete
 2. http://blog.marxistleninist.in/2015/01/blog-post.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top