కావ్  కావ్  కాకమ్మా .. 

కాకమ్మ కాకి
కావ్ కావ్ కాకి
ఎక్కడమ్మా నీవెక్కడమ్మా!
నింగిలో నీ విన్యాసాల జాడెక్కడమ్మా !!

కావ్ కావ్ మంటూ
కొమ్మా రెమ్మా తిరుగుతూ
మా ఇంటిచుట్టూ పల్టీలు కొట్టే కాకమ్మా
నీ పలుకరింపులెక్కడ దాచావమ్మా ..!
నీవెక్కడ దాచావమ్మా ..!!

***       ****

కాకి గోల అని
విసుక్కునే నువ్వేనా !
ఎంగిళ్ళు తిని తెగబలిశానని
ఎద్దేవా చేస్తూ ఈసడించుకునే నువ్వేనా !!

కాకి రంగు పాపాలకు , వేదనలకు
ప్రతిరూపం అని దూరం నెట్టే నువ్వేనా !
కాకిలా కలకాలం బతికేకంటే హంసలా బతికితే చాలు
చిన్నబుచ్చేమాటలతో నా మనసులో గునపాలు గుచ్చే నువ్వేనా !!

గర్భగుడిలోనో నట్టింటి లోకో దూరితే
అరిష్టం అని గుండె బాదుకునే నువ్వేనా  !
నేను, తెలీక తలమీద తన్నితే
తప్పదు చావు అని తల్లడిల్లుతూ శాపనార్ధాలు పెట్టే నువ్వేనా  !!

ఛీఛీ .. పాడుకాకులు అని
గొణుక్కుంటూ హుష్ హుష్ అని వెంటబడే నువ్వేనా !
లోకులు పలుకాకులు అంటూ
ఆడిపోసుకునే దాకా నిద్రపట్టని నువ్వేనా! !

మీ పితృదేవతల ఆత్మ శాంతి కోసం తప్ప
నీవెప్పుడు కలవరిస్తావ్ .. నాకోసం పలవరిస్తావ్ ?
నీ పలవరింతలో నీ కలవరింతలో
ఏదో మతలబు ఉండే ఉంటుంది కదూ !!?

  ***             ***

అవును, మిత్రమా అవును
ఆశ్చర్యంగా ఉందా నాదే ఆ పలకరింపు
పిట్టగోడ మీదో..  చెట్టుకొమ్మ మీదో
ఠీవిగా అడుగులేసే నీ జాడ కనుమరుగయ్యాక
కానీ.., తెలియలేదు నీ విలువ ఏమిటో..
నీవు నాకు చేసే మేలు ఏమిటో..

జీతం బత్తెం లేని స్కావెంజర్లా..
పని చేసే నీ జాడ కానరాక
ప్రమాదాల హెచ్చరికలు చేసే అలారంలా..
గగనతలంలో అరుస్తూ గిరికీలు కొట్టే నీ ఆచూకీ లేక
మా ఆవాసాలలో మలిన పదార్ధాలు పేరుకుంటూ
కొత్త రోగాలకు , అంటువ్యాదులకు
అలవాలమై మరుస్థలిగా మారిపోతూ
మృత్యు ఘంటికలు మీటుతూ
ఉంటే, ఇప్పుడు నీరాకకోసం నిరీక్షణ

నీవు ఆలపించే ఐక్యతారాగం
కలసి ఉంటే కలదు సుఖం అనే సందేశం
ఉన్నదాన్ని తోటికి పంచడంలోని ఆనందం
పెంచుకునే ఆత్మీయతానుబంధ బలం
అవలోకిస్తే అవుతోంది అవగతం
నీ రంగు నలిపే కానీ మనసు స్వచ్చం
నిత్యం నీ . నా అని కలహించుకునే మేం
సమైక్యతలోని గొప్పదనం
నిస్వార్ధమైన పరోపకారగుణం
నీదగ్గర నుంచి నేర్చుకోవాలి

అవును, నల్లా నల్లాని కాకమ్మా
నేను నిజమే చెబ్తున్నానమ్మా
నువు సల్లా సల్లగ ఉండాలే
కావు కావు అనే నీ రాగం మేం వినాలే
ఏదీ శాశ్వతం కాని సృష్టిలో నీ పరంపర కొనసాగాలే
నీవు చిరాయువుగా ఉండాలే..
ఉండాల... ఉండాల .. .


వి. శాంతి ప్రబోధ 
5. 7. 2014

(రోజూ మా పక్కింటి మామిడి చెట్టుపై చేరి ఎన్నో రాగాలు ఆలపించే కాకమ్మల స్నేహంతో  )
(Note : Republished post)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top