ఇంకా కనండి!
 • ఒకరిద్దరు ఎక్కువైనా పర్లేదు
 •  రాను రాను జనాభా తగ్గిపోతోంది
 •  పెళ్లిళ్లకు దూరంగా విద్యావంతులు
 •  ఎంజాయ్‌ చేద్దామంటూ మరికొందరు
 •  అందుకే జపాన్‌లో అంతా ముసలాళ్లే
 •  ఇప్పుడు పిల్లలను కనాల్సిన టైమొచ్చింది
 •  ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు

ఏలూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పిల్లల్ని కనండి.. మరింత మంది పిల్లల్ని కనండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు పిల్లలను కనకపోతే.. భవిష్యత్తులో సంపదను సృష్టించినా దానిని అనుభవించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పాదయాత్రకు వచ్చిన ఆయన శెట్టిపేట, తాళ్లపాలెంలలో ప్రజలనుద్దేశించి 
మాట్లాడారు. ‘‘రాను రాను జనాభా సంఖ్య తగ్గిపోతోంది. నేను కూడా ఒక అబ్బాయితోనే సరిపెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనాభా తగ్గిపోతోంది. చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడం లేదు. చదువుకున్నవాళ్లు అయితే మరీ పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎందుకొచ్చిన పిల్లలు.. వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేద్దామని అనుకొని కొంతమంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తుంటే..మరో తొమ్మిది లక్షల మంది పుడుతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే చనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. పుట్టే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు మన ఊళ్లో అంతా ముసలివాళ్లే కనిపిస్తారు. ఈరోజు జపాన్‌లో అదే జరిగింది. ఆ దేశం అంతా ముసలివాళ్లే. దేశం దేశం పూర్తిగా చిన్న పిల్లలు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నాను. వీలయితే ఒకరిద్దరిని ఎక్కువగా పుట్టిస్తే నష్టం లేదు. కానీ, అసలు పిల్లలు లేకుండా ఉండడం మంచిది కాదు..’’ అని వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనాలని, అలాంటి అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. పిల్లలే లేకపోతే సమాజమే లేదని, అందరూ ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు కష్టపడలేరని వివరించారు. అదే జరిగితే, ‘‘ఇప్పుడున్న సంపదను రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ సంపద పెరిగినా, దానిని వినియోగించుకునే అవకాశం ఉండదు’’ అని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థతో పోలిస్తే మన వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పిల్లాపాపలతో అందరూ కళకళలాడడం వల్లే మెరుగైన సమాజానికి అవకాశం ఏర్పడిందని వివరించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘పిల్లల్ని కనండి’ అంటూ వ్యాఖ్యానించినప్పుడు ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వారి నవ్వులను గమనించిన చంద్రబాబు.. పిల్లల్ని కనాలని తాను ఎందుకంటున్నదీ వివరించారు. భవిష్యత్తు తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గమని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో చంద్రబాబు వ్యాఖ్యలే హాట్‌ టాపిక్‌గా మారాయి.

సంపద అనుభవించడానికి పిల్లల్ని కనాలంటున్న బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment


 1. ఆంధ్రప్రదెశ్ ప్రస్తుత జనాభా గణాంకాల వివరాలు, జనన మరణాల రేటు, ఇస్తే తప్ప ఈ విషయంపై అభిప్రాయం చెప్పడానికి వీలుపడదు.

  ReplyDelete
 2. ఆ surplus జనాభాని పోషించడానికి చంద్రబాబు కరెన్సీ కట్టలు ముద్రిస్తాడా? సింగపూర్ జనాభా 50 లక్షలు కనుక విజయవాడలో ఎవరూ వాసెక్తమీ చెయ్యించుకోకపోతే విజయవాడ వెంటనే సింగపూర్ అంత జనాభాకి చేరుకుంటుందనుకుంటున్నాడు. జనాభా పెరుగుదల ఎప్పుడూ ప్రమాదకరమే.

  ReplyDelete
 3. చంద్రబాబు statementకి చెంపపెట్టులాంటి జవాబు (munhtoD zawaab) ఎంబీయస్ అనే పెద్దమనిషి గ్రేటాంధ్రలో ఇచ్చారు.

  ReplyDelete
 4. చంద్రబాబుగారి సలహా "కొందఱి" కోసమే. ముందీ సంగతి గ్రహించండి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top