"న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అన్న "మను నినాదం" లోనే  "ప్రతి స్త్రీ రక్షణ మర్హతి" అనేది దాగి ఉన్నది! ఒకప్పటి 'కంపు' ఇప్పుడు జనులకు ఇంపు కాదు అనేది సత్యం. పూర్వకాలంలో 'కంపు' అంటే సుగంధం అని అర్దం. కాని ఇప్పుటి పరిబాషలో 'కంపు' అంటే దుర్గందం అంటే అర్దం. ఇలా ఒక పదం అర్దం మారడమనేది ఒక్క రోజులో జరిగింది కాదు. కాలాంతరం చేత పరిణామక్రమంలో జరిగింది. అలా పరిణామక్రమం అనేది కేవలం జీవ జాతుల పరివర్తనకే కాదు, సమాజంలోని  అంశాలకు కూడా  ముడిపడి ఉంటుంది. అలా ఒకప్పుడు స్త్రీల రక్షణ కోసం  'మనువు' చెప్పిన  విధానం, ఇప్పుడు వివాదాస్పదం అయింది. 

ఆదర్శం వేరు, వాస్తవం వేరు. ఆదర్శం మనం కోరుకుంటున్నది. వాస్తవం మనం ఆచరిస్తుంది. స్త్రీలు  పురుషునితో పాటు అన్ని విషయాల్లో సమానమనేది ఆదర్శమే కాని వాస్తవం కాదు. ముఖ్యంగా లైంగికత విషయంలో. ఒకవేళ వాస్తవమే అయితే వారికి ప్రత్యేక రక్షణ చట్టాలు చేయవలసిన అవసరం లేదు. మనువు కాలం నుండి నేటి వరకు స్త్రీల రక్షణ కోసం అనేక విధానాలు చెప్పబడ్డాయి. మనదేశంలో స్త్రీల రక్షణలో లేటేస్ట్ పరిణామం "నిర్భయ" చట్ట సవరణలు పొందుపర్చడం. ఇవికూడా మనువు చెప్పిన స్త్రీ రక్షణ విధానానికి నేటి పరిణామరూపంగానే భావించాలి. అంతేకాదు, 'స్త్రీలు పురుషులతో పాటు లైంగికంగా సమానం' అనే బావనకు ఇది తప్పకుండా వ్యతిరేకం. ప్రాశ్చ్యాత్య పద్దతి అయిన "బాయ్ ప్రెండ్" సంస్కృతి కూడా మనదేశంలో 'మను భావన'ను బలపరచేదే. అంటే ప్రతి స్త్రీ తన లైంగికపరమైన అవసరాలు, రక్షణ కొరకు ఎవరో ఒక పురుషుడు మీద ఆదారపడక తప్పదు. కాకపొతే మనువు అట్టి రక్షణ బాద్యతను కుటుంబంలోని పురుషులకు కంపల్సరి చేస్తే, నేటి స్త్రీలు కొంతమంది ఆ బాద్యతను తమకు నచ్చిన బాయిప్రెండ్ లకు అప్పచెపుతున్నారు. అంతే  తేడా!

స్త్రీలు చిన్నప్పుడు తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్దాప్యంలో కొడుకు రక్షణలో ఉంటూ ఎల్లప్పుడు కుటుంబానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం లేనిదిగా ఉంటుంది అని చెప్పటం జరిగింది. అంతేకానీ, సమాజానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోల్పోతుంది అని చెప్పలేదు. స్త్రీల రక్షణ విషయంలో పురుషులు స్వాతంత్ర్యం కలిగినవారు అని చెప్పలేదు. స్త్రీ రక్షణ అనేది కుటుంబ పురుషుల ప్రధమ కర్తవ్యాలలో ఒకటి చేసి వారికి కూడా స్వాతంత్ర్యం లేకుండా చేశాడు. ఈ  విదానం సహజ ప్రేమానురాగాలచేత ఏర్పడే కుటుంబ వ్యవస్థలో ఎంతో విజయవంతమయి, స్త్రీలకు సహజ రక్షణ ఇచ్చినట్లయింది. సమాజంలో స్త్రీ పురుష సంబంధాలలో ఆరోగ్యకరమైన విదానంగా గుర్తించబడింది. సమాజంలో భర్తలను బార్యలను సమానంగా గౌరవించి స్త్రీ పురుషులు ఇరువురూ సమానమే అనే ఆదర్శాన్ని కుటుంబంలో కాకపోయినా కనీసం సమాజంలో అయినా నిజం చేశారు. రాను,రాను ఇదే విదానం కొన్నిశక్తులు అంటే విదేశి దురాక్రమణలు, స్త్రీలను చెరపట్టడం లాంటి దుశ్శ్చర్యల వలన, స్త్రీ రక్షణ సమస్య అధికమై, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి దురాచారాలు ప్రబలడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అలా ఒక స్త్రీ రక్షణ కోసం ఏర్పడిన విదానం,  చివరకు స్త్రీలు కడగండ్లకు గురి అయ్యేలా చేసింది. ఈ పరిణామాన్ని మనం బ్రష్టు పట్టిన బౌద్ద బోధనలతో పోల్చవచ్చు. అహింసా పరమోధర్మ: అన్న బౌద్ధం ఏవిదంగా తుపాకులతో కాల్చుకునే స్థాయికి దిగజారిందో, "మనువాదం" కూడా అంతే. 

పోనీ, మనుదర్మం ను త్రుణీకరించిన ఆధునిక భావాలు ఏమైనా స్త్రీలకు మేలు చేస్తున్నాయా? అంటే ఖచ్చితంగా అవి స్త్రీల స్తాయిని దిగజార్చడనికి తప్ప, ఏ మాత్రం రక్షణ పెంపొందించలేక పోయాయి. స్త్రీలను స్వేచ్చా స్వాతంత్ర్యాల పేరుతో  కుటుంబం నుండి బయటకు తీసుకు వెళ్ళిన వ్యాపార సంస్కృతి, వారిని  సాంప్రదాయ సిగ్గు, ఎగ్గులనుండి దూరం చేయగలిగింది తప్ప, వారు సంపూర్ణ మానవ విలువలతో పురుషునితో పాటు సమానమన్న మానవ ఆదర్శాన్ని సాదించలేక పోయింది. పైపెచ్చు, వారిని అర్దనగ్నంగా వీదుల్లో ప్రదర్శించి తన వ్యాపార సంస్కృతి అభివృద్ధికి స్త్రీల నగ్నత్వాన్ని వాడుకుంటుంది. అదే నిజమైన స్త్రీ స్వేచ్చ అని నమ్మిస్తుంది. ఈ  రోజున పదియేండ్ల చిన్నపిల్లవాడి దగ్గర్నుంచి పండుముసలి వాడివరకు ఆదునిక స్త్రీలు వారి అరచేతిలో{స్మార్ట్ పోన్} అంగ ప్రదర్శనలు చేసే బొమ్మలుగా దర్సనమిస్తున్నారు అంటే అదంతా వ్యాపార సంస్కృతి మహిమే. దానివలన పురుషుల ద్రుష్టిలో స్త్రీల స్థానం మనువాద కాలం కంటే ఎన్నో వందల రెట్లు దిగజారిపోయి, వారి రక్షణ సమస్య మరింత అధికమయింది. 

విదేశాలలో "బాయి ప్రెండ్" ఉన్నవారి జోలికి పరాయి మగాడు రాడేమో కానీ, మనదేశంలో మాత్రం 'బాయిప్రెండ్ ' స్త్రీలకు ఏమాత్రం రక్షణ ఇవ్వకపోగా మరింత మంది మ్రుగాళ్ళ ద్రుష్టి ఆమెమీద Focus అవ్వడానికి దోహదం చేస్తున్నాడు. మొన్నటి నిర్భయ నుంచి నిన్నటి అభయ వరకు బలి అయిన స్త్రీల కేసులు పరిశిలిస్తే ఇది అర్దమవుతుంది. కాబట్టి సహజ ప్రేమానురాగాలతో ఏర్పడే కుటుంబ రక్షణ కంటే స్త్రీలకు మెరుగైన  రక్షణ ఇచ్చే వ్యవస్థ ఇంకోటి మన సమాజంలో ఉందని నేను బావించటం లేదు. ప్రభుత్వ రక్షణ కూడా దాని తర్వాతే. పురుషులను అదుపులో పెట్టగలిగినది కూడా  అదే. కాబట్టి మనువాదంలో ఉన్న మంచిని గ్రహించి, దానికి పట్టిన చెడు సాంప్రదాయాలను తొలగిస్తే ఖచ్చితంగా అది మన సమాజంలో స్త్రీలకు రక్షణ ఇవ్వగలదు. స్త్రీలకు విద్యా, ఉద్యోగ ఇతర అన్ని రంగాలలో పురుషునితో పాటు సమానంగా అవకాశాలు ఇస్తూ, లైంగిక హక్కుల విషయంలో మాత్రం కుటుంబ రక్షణ విదానాలకు లోబడి ఉండేలా చేస్తే అటు పురుషులు, ఇటు స్త్రీలు ఒక క్రమ జీవనానికి బద్ధులై, ఏదో ఒకనాటికి స్త్రీ పురుషులు సమానమే అనే బావన సమాజంలో కలుగుతుంది. లేకుంటే కొన్ని పనికిరాని ఆదర్శాల జాబితాలో "స్త్రీ పురుషుల లైంగిక  సమానత్వం" చేరుతుంది. 

 స్త్రీల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు :
 • ప్రతి ఆడపిల్ల పుట్టుకను హీనంగా, బారంగా పరిగణించే దౌర్బాగ్య పరిస్థితి నుండి సాంప్రదాయక కుటుంబ భావనలు మారాలి. 
 • స్త్రీ శిశువు, మగశిశువులను నిర్ణయించేది మగవాడే తప్ప, స్త్రీ కాదు అనే శాస్త్రీయ బావనతో పాటు , ఆడపిల్ల ఇంటికి అద్రుష్టం అనే బావన సమాజంలో కలిగించాలి. దీనికి "బంగారు తల్లి" లాంటి పదకాలు ద్వారా ఎప్పుడో 20 ఏండ్లకు  లబ్ది వచ్చేలా కాకుండా పాప చదువు మొదలెట్టిన నాటినుండే ఆమె బారం కుటుంబం తో పాటు ప్రభుత్వమూ  తీసుకోవాలి. 
 • ఆడపిల్లలకు డిగ్రీవరకు ఉచిత నిర్బంద విద్య నందించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయలో ఎక్కడైనా సరే వారి ఖర్చులకు  కుటుంబ ఆదాయవనరుల ననుసరించి ప్రబుత్వ సహాయం అందించాలి. ఏ విద్యాలయం ఆర్దిక కారణాలు చూపి స్త్రీలకు విద్యనూ అందించడానికి నిరాకరించకూడదు.అవసరమయితే ముందుగా ప్రభుత్వమే స్త్రీల విద్యా బోదన ఖర్చులు చెల్లించి, ఆ తర్వాత కుటుంబ ఆర్దిక స్థాయి అనుసారం వారి వాటాను నిర్ణయించి, అది వారి నుంచి రాబట్టుకోవాలి. 
 • స్త్రీలకు సాద్యమైనంతవరకు కో ఎడ్యుకేషన్ కాకుండా ప్రత్యేక విద్యాలయాలు లేక సెక్షన్ ల ద్వారానే బోదించాలి. 
 • స్త్రీల వివాహ వయసు 21 కి పెంచాలి. అలాగే వివాహాలకు తల్లితండ్రులు, వారు నిరాకరించిన పక్షంలో కుటుంబ న్యాయస్తానాల అనుమతి తప్పని సరి చేయాలి. ఇదే సూత్రం పురుషులకు వర్తిస్తుంది. 
 • లైంగిక దాడుల విషయంలో సంబందిత నేరస్తులకు ఉరిశిక్షయే గరిష్టంగా ఉండాలి. ఉరిశిక్షను క్షమించే అదికారాన్ని రాష్ట్రపతికి కాకుండా బాదిత స్త్రీలకు మాత్రమే ఉండాలి. 
 • గృహ హింస చట్టాన్ని కుటుంబ పరిరక్షణ చట్టంగా మార్చాలి. స్త్రీలకు కుటుంబంలోనే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉండాలి తప్ప, కుటుంబానికి వ్యతిరేకంగా కాదు. 
 • బ్లాక్మెయిల్ కోసం, పబ్లిసిటి కోసం తప్పుడు కేసులు పెట్టె వారికి కఠిన చట్టాలు ఉండాలి. అవసరమైతే అది యావజ్జీవ శిక్షవరకు ఉండ  వచ్చు. 
 • స్త్రీల శృంగార అనుమతి వయస్సు 25 సంవత్సరాలుగా ఉంచాలి. అదే పెండ్లి చేసుకునే వారి విషయంలో 21 సరిపోతుంది. ప్రతి పురుషుడికి  వివాహం తప్పని సరి చేయాలి. లేకుంటే అందుకు తగిన కారణాలు తెలిపి వివాహం నుండి మినహాయింపు పొందే  వెసులు బాటు కల్పించాలి. ఎట్టి పరిస్తుతుల్లో స్వలింగ వివాహాలు అనుమతించ రాదు. 
 • లైంగిక దాడులు కేసులు విషయంలో తప్పని సరిగా నిందితుల స్టేట్మెంట్ వ్రాత పూర్వకంగా మరియు ఎలక్టానిక్ మాద్యమికాల ద్వారా తీసుకోవాలి. అతను నిర్దోషిత్వాన్ని క్లెయిం చేస్తే కౌంటర్ కేసుగా బావించి ఆ కేసులో దోషులైన వారిని రెట్టింపు శిక్షలతో కఠినంగా శిక్షించాలి. 
 • నిరంతరం స్త్రీల రక్షణ చట్టాలు సమీక్షిస్తూ,యత్న దోష పద్దతిలో వాటిని సరిచేస్తూ ఉంటే తప్పకుండా సత్పలితాలు ఇవ్వవచ్చు.
  Reactions:

  Post a Comment

  1. ఒక వార్తాపత్రికలో వెలిబుచ్చబడిన అభిప్రాయానికి పత్రిక సంపాదకుణ్ణి బాధ్యుడిగా భావిస్తారు (కనీసం చట్టం అలాగే భావిస్తుంది). బ్లాగు/ఫోరం విషయంలో అదే సంపాదకుణ్ణి admin అంటారు. ఆప్రకారంగా మద్దిగుంట నరసిమ్హారావు ఉరఫ్ మనువుతో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఆయనని ఆయన్ తల్లిదండ్రులు పెంచిన విధానం అలా ఉంది. దానికి నిందించవలసింది ఆయననుకాదు.

   "ప్రతి స్త్రీ రక్షణ మర్హతి"
   ఇదసలు సంస్కృత వాక్యమా? ఇలాంటి సంకర వాక్యం ఒక సంస్కృత గ్రంధంలో అందునా ప్రాచీన గ్రంధంలో ఉండే అవకాశముందా? ఉంటే ఎక్కడ ఉంది? లేనప్పుడు ఇలా చదువరులను cheat చెయ్యడం ఎవరికోసం.

   ప్రాశ్చ్యాత్య పద్దతి అయిన "బాయ్ ప్రెండ్" సంస్కృతి కూడా మనదేశంలో 'మను భావన'ను బలపరచేదే.
   అసలు admin గారికి మతుండే దీన్ని ప్రచురించారా? ఇంతలా "బాయ్ఫ్రెండ్" సంస్కృతిని అనవసరమని భావిస్తున్నావారు "గాళ్‌ఫ్రెండ్"/వేశ్య సంస్కృతిని ఎందుకు వ్యతిరేకించరు? స్వంద్వ విలువలే భారతీయ సంస్కృతా? ఒక్క రాముడు, ప్రవరాఖ్యుడు తప్ప ఎవుడైనా ఎంత చెడతిరిగినా పర్వాలేదా? ఇద్దర్ని కట్టుకున్న దేవుళ్ళంతా స్త్రీ సంక్షేమంకోసమేనా పాటుపడింది? వేలమందితో ఒకమ్హానుభావుడు కులికినా ఆయన పవిత్రుడేగానీ ఒకపిల్లకి బాయ్‌ఫ్రెండుంటే ప్రపంచం తల్లక్రిందులవ్వుద్దా? అలాగంటే పంచకన్యల్ని మినహాయిస్తే, పతివ్రతల్ని మినహాయిస్తే మనువుచట్టాలు అంత కట్టుదిట్టంగా అమలయినకాలంలో మనువుగారి చట్టాన్ని పొల్లుబోకుండా పాటించిన ఆడాళ్ళెందరునాయనా?

   "అంటే ప్రతి స్త్రీ తన లైంగికపరమైన అవసరాలు, రక్షణ కొరకు ఎవరో ఒక పురుషుడు మీద ఆదారపడక తప్పదు."
   మరి పురుషుడు ఏమి చేయును నాయనా? పురుషపుంగవుడు తన లైంగిక అవసరాలకొరకు స్త్రీలమీదకాక బర్రెలమీద ఆధారపడునా? అసలు పైని వాక్యం రాసినవారికి బుర్ర పనిచేస్తుందని ఎలా అనగలం?

   మిగిలిన వ్యాసమంతా
   బాబూ స్త్రీజనోధ్ధారకా... నువ్వు కేవలం ఒకవైపు నుండి మాత్రమే ఆలోచిస్తున్నాను నాయ్నా! నువ్వుచెప్పిన అదేకారణాలను సాకుగా చూప్0ఇ ఇంకోదేశం నీదేశాన్ని ఆక్రమించుకొంటే, దానికి సమర్ధనగా అదే మనువు రాసిన పుస్తకాన్ని అరువుతెచ్చుకుంటే ఎందినాయనా నువ్వుచేసేది.

   అడ్మినూ... నీ ఇష్టమొచ్చింది అనుమతించి నీ పరువు నువ్వేదీసుకోమాకనాయనా. పంపినోదికి బుర్రలేకున్నా నీకుందని నిరూపించుకో. నీకు 'దమ్ము' ఉంటే ఈ వ్యాసంలో fairగా ఉన్న ఒక్క pointని ఉదహరించు చూదాం.

   ReplyDelete
   Replies
   1. @iconoclast

    మీరు ఆడా? మగా? ఇది మీ పేరా? ముసుగు పేరా? మీ అసలు పేరేమిటి? మీ మెయిల్ ఐ.డీ ఏమిటి? మీరు చీట్ చేయడం గురించి ఇతరులకు చెప్పే ముందు మీరు అసలు పేరుతో ఎందుకు వ్యాఖ్యానించడం లేదు. ముందు ఈ వివరాలు చెప్పండి. ఈ పోస్టు పైనా, నా పరువు పైనా, దమ్ము పైనా నా అభిప్రాయాలు తప్పక చెపుతాను. నేను ఎద్దేవా చేయడానికి అడగడం లేదు. మీ ప్రొఫైల్ లో మీ వివరాలు లేనందున ఇలా అడగవలసి వచ్చింది.

    Delete
   2. @iconoclast
    "ప్రతి స్త్రీ రక్షణ మర్హతి"
    ఇదసలు సంస్కృత వాక్యమా? ఇలాంటి సంకర వాక్యం ఒక సంస్కృత గ్రంధంలో అందునా ప్రాచీన గ్రంధంలో ఉండే అవకాశముందా? ఉంటే ఎక్కడ ఉంది? లేనప్పుడు ఇలా చదువరులను cheat చెయ్యడం ఎవరికోసం.

    Ans:"నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అనే శ్లోకానికి పదాన్ని బట్టి అర్ధం చెప్పిన రచయిత పొరపాటు పడ్డారని నాకనిపిస్తున్నది.ఆ శ్లోకాన్ని నేను చదివాను.సంస్కృత శ్లోకం గుర్తు లేదు కానీ ప్రతిపదార్ధంగా ఆ శ్లోకాన్ని అనువదించి అర్ధం చెప్పిన ఒక రచన చాలాకాలం క్రితం చదివాను."బాల్యంలో తండ్రి,యవ్వనంలో సోదరుడు,వివాహం తర్వాత భర్త,వృధ్ధాప్యంలో కొడుకూ ఆమెకు పోషణ రక్షణ ఇవ్వాలి.ఆమే కోరికల్ని నెరవేర్చటం వారికి విధి." అని మొదటి మూడు పాదాల్లో స్పష్టంగా చెప్పాక నాలుగో పాదంగా ఈ వాక్యం వస్తుంది. కంపు అనే మాటకి ఇవ్వాళ అర్ధం మారినట్టే అప్పుడు స్వాతంత్ర్యం అన్న మాటకి యెవరూ తోడు లేకుండా వొదిలెయ్యటం అనే అర్ధం వస్తుంది.మొదటి మూడు పాదాల్ని చదవకముందు నేనూ అది అన్యాయమనే అనుకున్నాను.

    మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలంకోకుండా రెందు మూడు ముక్కల్ని అవీ వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు నాకు గీత గురించిన చర్చల్లో యెదురయినాయి.అది మంచి పధ్ధతి కాదు.అదే నిజానికి ఒక వైపు నుంచి మాత్రమే చూడటం అవుతుంది,అలోచించండి!

    Delete
   3. This comment has been removed by the author.

    Delete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top