‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ చరిత్ర సృష్టించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 67 స్థానాలను దక్కించుకుంది. ఢిల్లీలో గద్దెనెక్కి దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ‘మిషన్‌ 44’ సంగతి పక్కనపెడితే... రెండంకెల సీట్లూ దక్కించుకోలేక... మూడంటే మూడు స్థానాలకు పరిమితమైంది. సాంకేతికంగా చూస్తే విపక్ష హోదాకూ అర్హతలేకుండా పోయింది. ఇక... గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మారు గెలిచి, 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు నిండా ‘సున్న’ం పడింది. ఒక్కటంటే ఒక్కసీటూ గెలవలేక... కాంగ్రెస్‌కు శూన్య‘హస్తం’ మిగిలింది. తగిన సత్తా ఉన్న నాయకుడు దొరికితే... ప్రత్యామ్నాయ పార్టీలకు, ప్రత్యామ్నాయ శక్తులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. 
అవును... ‘సామాన్యుడే’ గెలిచాడు. గల్లీగల్లీల్లో ఉన్న సామాన్య ప్రజలంతా ఏకమై ఢిల్లీ ఎన్నికల్లో తమను తాము గెలిపించుకున్నారు. విస్తృత ప్రచారాలను తిప్పికొట్టారు. బెదిరింపుల్ని ఎదిరించారు. అహంకార పూరిత ధోరణి రాజకీయాలను మట్టి కరిపించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు. ‘చీపురు’తో ఢిల్లీ ఎన్నికల బరిని ‘క్లీన్‌ స్వీప్‌’ చేసేశారు. ఏకంగా 95 శాతం సీట్లు సొంతం చేసుకున్నారు. 
శనివారం జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలైంది. ఫలితాల సరళి ఆది నుంచీ ఆప్‌కు అనుకూలంగా వచ్చింది. చూస్తుండగానే ఆప్‌ విజయ పతాక అలా అలా ఎగిరింది. ఆధిక్యంలో ఉన్న స్థానాల సంఖ్య... 20, 30, 40, 50 వరకు దూసుకుపోయింది. అంతా ‘అయ్య బాబోయ్‌’ అనుకుంటుండగానే, ఆప్‌ నేతలే సంభ్రమాశ్చర్యాలకు గురవుతుండగానే... గెలుపు సూచీ 67 వద్ద ఆగింది. 1982లో ‘సిక్కిం సంగ్రామ్‌ పరిషత్‌’ సిక్కింలోని మొత్తం 32 స్థానాలను దక్కించుకుంది. ఇప్పటిదాకా ఇదే ‘చరిత్ర’! మళ్లీ ఇప్పుడు ఆప్‌ది అదేస్థాయి విజయం!
చీపురు సునామీ ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేసేసింది. అత్యధిక మెజారిటీలతో ఘన విజయం సాధించిన ఆప్‌ చరిత్ర సృష్టించింది. గెలిచిన 67మందిలో 50 మంది 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వారిలో 15మంది 40 వేలకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. ఇంతటి భారీ మెజారిటీలు సాధించడం ఢిల్లీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా వికాస్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మహేందర్‌ యాదవ్‌ రికార్డు సృష్టించారు. ఆయన తన బీజేపీ ప్రత్యర్థిపై 77,665 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా ఓడిన మూడు సీట్లలోనూ ఆప్‌ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఒక చోట ఐదు వేలు, మరోచోట 10 వేల ఓట్ల వ్యత్యాసంతో ఆప్‌ అభ్యర్థులు ఓడిపోయారు. మరో స్థానంలో మాత్రం మూడో స్థానంలో నిలిచారు.
 • కాంగ్రెస్ ఓట్లు ఆప్ కు మళ్లాయా?
 • లోక్ సభ ఎన్నికలనాటి స్తితి ఒక్కసారిగా మారడానికి కారణాలేమిటి?
 • మోడీ - అమిత్ షాల గిమ్మిక్కులుకు బ్రేక్ పడిందా? మోడీ వేవ్ తగ్గిందా?
 • ఢిల్లీ ప్రజలెందుకు ఆప్ కు ఇంత ఘనవిజయాన్ని కట్ట బెట్టారు?
 • అహంకారమే BJPని ఓడించిందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?
 • దేశ వ్యాపితంగా కొత్త రాజకీయాలకు ప్రత్యామ్నయాలకు ప్రజలు పట్టం కడతారా? ఢిల్లీకే పరిమితమా?
 • ఆప్ సక్సెస్ ఎవరెవరికి ఏయే పాఠాలు నేర్పుతున్నది?
Reactions:

Post a Comment


 1. ఇదేమన్నా ఈ సి వారి సాఫ్ట్వేర్ లోపమేమో నండీ ! ఒక పార్టీ కే ఇన్ని సీట్లు వచ్చేసేయి ! మోస్ట్లీ ఆ చీపురు చిహ్నం భాజపా సరి కొత్త చిహ్నం అని వేసి వుంటారు స్వచ్చ భారత్ అభియాన్ చూసి ! (కా 'మింటు' కర్టసీ హరేఫలా బాతా ఖానీ వారిది !)

  చీర్స్
  జిలేబి

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top