తెలుగుభాషావిశిష్ట కేంద్రం రాష్ట్రానికి కేటాయించి మూడేళ్లు గడచినా అంగుళం కూడా ముందుకు సాగలేదు. 
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోవడంతో విశిష్ట కేంద్రం ఎక్కడ స్థాపించాలనేది మళ్లీ మొదటికి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాచీన భాషా హోదా పొందిన భాషల అభివృధ్ధికి ఏటా వంద కోట్ల రూపాయిలు వరకూ కేటాయించే వీలు కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని , మౌలిక వసతులను కల్పించకపోవడంతో వ్యవహారం కాస్తా అటకెక్కింది.

ఈ హోదాతో దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా విభాగాలను ప్రారంభించేందుకు, రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో , ఉన్నత విద్యాసంస్థల్లో తెలుగు భాషాభివృద్ధి- పరిశోధన పీఠాలను ప్రారంభించేందుకు వీలుంది.

2011 డిసెంబర్‌లో మైసూర్‌లోని సిఐఐఎల్‌లో తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  తెలుగు క్లాసికల్ లాంగ్వేజి సెంటర్‌ని తెలుగు భాషా వ్యవహారిక కేంద్రమైన తెలుగురాష్ట్రంలోనే స్థాపించడం సమంజసంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులను వెళ్ళాక,  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు అప్పటి ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 

ఈ కేంద్రాన్ని దేనికో అనుబంధంగా కాకుండా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలనీ తదనుగుణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ప్రయత్నాలు ప్రారంభించటం కూడా జరిగింది.

తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చిన మూడేళ్లకు ఒడిశా భాషకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. ఒడిశా ప్రభుత్వం అపుడే రెండు అంతర్జాతీయ అవార్డులను కూడా ప్రవేశపెట్టి భాషాభివృద్ధికి, పరిశోధనలకు పీట వేసింది.

మన తెలుగు సంగతే ఎవరికీ‌పట్టకఈసురోమని పడుంది.

ఇప్పుడు తెలుగువాళ్ళ రాష్ట్రం ఒకటి చిరిగి రెండురాష్ట్రాలయ్యింది.  ఇప్పుడు ఈ‌ విశిష్టకేంద్రం విషయం రంగం మీదకు వచ్చే అవకాశం అసలు ఉందా?  ఉన్నా, అది కూడా ఉభయరాష్ట్రాల మధ్యా మరొక చిచ్చు రేపే అవకాశం లేదంటారా?  ఇంట్లోకూడా ఇంగ్లీషే మాట్లాడుకునేంతగా అభివృధ్ధి చెందిన మనతెలుగుసంస్కృతికి ఈ‌ విశిష్టం కేంద్రం ఒరిగించేది ఏమన్నా ఉందా? దీనినీ‌ మనవారు ఒక రాజకీయకేంద్రం చేసేయరన్న భరోసా ఏమన్నా ఉందా? అన్నింటిలోనూ‌ ఒకింత అసమంజసమైన స్పర్థలతో ఢీ అంటె ఢీ అంటున్న తెలుగురాష్రాలు పోటీపడి తెలుగుభాషను అభివృధ్ధి చేసేందుకు అవకాశం ఏమన్నా ఉందా? ఊకదంపుడు వ్యాసాలతో‌ జనం బుర్రలు తినే‌ మన మేథావులు తెలుగుభాషాభివృధ్ధి విషయంలో ఎందుకు కల్పించుకోరు?

-శ్యామలీయం.
*Republished

Post a Comment

  1. ఏమీ లేదు. ఎదో ఒరుగుతుందని హోదా రాక ముందూ అనుకోలేదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top