• భారతీయ సంస్కృతి మహిళను వంటింటి కుందేలుగా మార్చిందన్న విమర్శతో మీరు ఏకీభవిస్తారా?
 • భారతీయ సంస్కృతిలో స్త్రీలను ఉన్నతంగా చూసే ఆచారాలు లేవా?
 • భారతీయ సంస్కృతిలో ఉన్న కొన్ని లోపాలను భూతద్దంలో చూపి మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేస్తున్నారా?
 • భారతీయ సంస్కృతిలో స్త్రీ కి కల్పించిన పాత్రపై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

 1. ఇది ఒక్క భారతీయ సంస్కృతికే పరిమితమైన విషయంకాదు. ప్రతిమతమూ పురుషాధిక్యతనే నెత్తికెత్తుకుంది.

  గౌరవించబాడాలని కోరుకొనే మహిళలు బురఖా పాటించి తీరాలన్నది ఇస్లాంలో ఒక unwritten rule. భర్త ఎలాంటివాడైనా అతనిపట్ల తన భక్తిని నిరంతరం ప్రకటించుకుంటేనే హిందూ స్త్రీ గౌరవించబడుతుంది. Bible is a mysogynistic book.

  భారతదేశంలో స్త్రీలని పూజిస్తామని చెప్పుకుంటారు. కానీ అలా పూజలంచబడటానికి సమాజం నిర్దేశించిన విధంగా తమతమ వ్యక్తిస్వాతంత్ర్యాలకు తిలోదకాల్సిందిగా 'ప్రొత్సహించబడుతారు' ఇక్కడి మహిళలు. ఉదాహరణకి భర్త చనిపోయిన స్త్రీ అతి శ్రేష్టంగా గౌరవించబడాలంటే భర్త శవంతో సహగమనం చెయ్యాలి. లేదా తెల్లబట్టలు ధరించి తనకు తన భర్తపైనున్న గౌరవాన్ని నిరంతరం ప్రకటిస్తూ ఉండాలి. విడాకులు తీసుకున్న స్త్రీని గౌరవించడం అన్నిమతాలవారికీ దాదాపు అసాధ్యం.

  ReplyDelete
 2. మనిషి బతకడానికి కావలసింది స్వేచ్ఛే కానీ గౌరవం కాదు.

  ReplyDelete
  Replies
  1. Agree with you Praveen! but every religion (and the societies that are based on them) are against the individual freedom.

   Religions are more into minting-out the personalities according to their standards.

   Delete
  2. మతమని కాదు. అసలు ప్రతి వ్యవస్థా వ్యక్తిస్వేచ్ఛని వ్యతిరేకించేదే. ఇందులో అదీ ఇదీ అని, వాళ్ళూ వీళ్ళూ అని తేడా లేదు. కారణం - ఆర్గనైజ్డ్ బాడీస్ వైవిధ్యాన్ని సహించలేవు. వ్యక్తిస్వేచ్ఛ వైవిధ్యానికి దారి తీస్తుంది. ఆ వైవిధ్యాన్ని అంగీకరిస్తే తమ పట్టు బిగవడం కష్టం. అందువల్ల అదంటే ఏ వ్యవస్థకీ గిట్టదు. కానీ ఆ ఆలోచనావైవిధ్యం వల్ల జరిగే నాగరికతా ముందడుగుని మాత్రం వాడేసుకోవడానికి మాత్రం వ్యవస్థలు ఉత్సాహంగా ముందుకు దూకుతాయి. ఉదాహరణకి- వ్యక్తుల సృజనాత్మక ఆలోచనల ద్వారా ఉద్భవించే టెక్నాలజీ. వ్యవస్థలు ఎంత పెద్దవైతే అంత అమానుషంగా దారుణంగా ఉంటుంది వాటి నిరంకుశత్వం.

   ఇహపోతే పాతసంస్కృతిలో ఆడవాళ్ళు మాత్రమే బాధితులనేది వాస్తవం కాదు. మగవాళ్ళు కూడా బాధితులే. అయితే మఱో రకంగా! మగవాళ్ళని డబ్బు సంపాదించే గానుగెద్దులుగా, తమ తమ కుటుంబాల తరఫున మాత్రమే పనిచేస్తూ తక్కిన సమాజం పట్ల, కనీసం తోటి మగవాళ్ళ పట్ల ఏ విధమైన దయాదాక్షిణ్యాలూ చూపించని అవినీతి, కుటుంబ గూండాలుగా తీర్చిదిద్దింది సంప్రదాయం. ఈ ఇమేజి మగవాళ్ళకి చాలా హానిచేస్తోంది. ముఖ్యంగా - ఒక జెండర్ గా తమ హక్కుల్ని ఒకటొకటిగా ప్రభుత్వం లాగేసుకుంటూంటే ఇదేమని ప్రశ్నించలేని పరిస్థితిలో పడ్డారు, తమకున్న ఇమేజి మూలాన తమకు సపోర్ట్ ఇచ్చేవాళ్లెవఱూ లేక! మఱొకటి - తమకున్న ఈ రాంగ్ ఇమేజిని తామే అమాయకంగా నమ్మడం కూడా ఒక కారణం.

   Delete
  3. హ్యూమనిస్ఠ్ గారు. మీరు 'తాడేపల్లి' వాస్తవ్యులేమోనని నాకు ఒక అనుమానం ఉండేది. అందుకే మిమ్మల్ని పెద్దగా చదువలేదు. ఈ వ్యాఖ్యతో మీరు నాకు నచ్చేశారు. మీబ్లాగును చదువుతాను.

   Delete
 3. గౌరవం అనేది విషయగతం, స్వేచ్ఛ అనేది వస్తుగతం. నేను విషయగతాన్ని కంటే వస్తుగతాన్నే బలంగా నమ్ముతాను.

  ReplyDelete
  Replies
  1. ద్రౌపది పాత్ర చూడండి - తనకి అవమానం జరిగితే నోరు మూసుకుని కొర్చోలేదు!తొలిసారి జూదంలో వోదిపోయినప్పుదు తనని సభలోకి లాక్కుని వచ్చినప్పుదూ కీచకుడు తరుముతుంటే విరటుని కొలువులో అక్కడి సభాసదులనీ చెరిగి పారేస్తుంది?ఆ పాత్ర చిత్రణ చేసింది మగవాడైన వేదవ్యాసుడే కదా?తిరగబడి అడగటాన్ని కాకుండా అక్కద యేమి నేర్చుకోవాలని ఆ సన్నివేశాన్ని కల్పించాడు కవి?

   వైదిక సాహిత్యంలో గార్గి,మైత్రేయి లాంటి విదుషీమణులు వున్నారు కదా?శంకరాచార్యుడితో భర్తకి దీతుగా మందనమిశ్రుడి భార్య కూడా వాదించతం చరిత్ర లోనిదే కదా?నాయుదూ నీకు మూతికి మీసముంటే నా మోచేతికి మీసముంది అని ధీమాగా గర్జించిన నాగమాంబ పాత్ర నెవరు సృష్తించారు - స్త్రీయా పురుషుడా?

   ఇందిరా గాంధి మన ప్రధాను లందరిలోనూ అధికారాన్న్ని అప్రతిహతంగా చెలాయిస్తుంటే కొమ్ములు తిరిగిన మగ్వాళ్ళు కూడా కకావికలై పోయారే తప్ప యెదిరించి నిలబద గలిగారా?వూఒరికే నోటికొచ్చిన కూతల్లా కుయ్యడం తప్ప సమర్ధత వుంతే యెవరినీ యెవరూ అడ్డుకోలేస్రు.తల్లికి చెల్లేల్ని పెళ్ళాడతం తప్పు లేదనే వాళ్ళు కూడా ఆడవాళ్ల మీద జాలి వొలకబొయ్యటమేనా?!

   Delete
  2. This is an 'ad hominem' (personal attack) logical fallacy. One shall weigh the opinion objectively but this is more like rerfusing to accept the opinions based on the source. Thus that argument is not valid.

   ద్రౌపది గురించి ఇంతగా వివరించినమీరు, ద్రౌపది, సీతల్లో ఎవరు మెరుగైన వ్యక్తిత్వంగలవారుగా చెబుతారు? అన్యాయాన్ని ఎదిరించడమే వ్యక్తిత్వానికి గీటురాయైనప్పుడు, స్త్రీలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని కొందరు పతివ్రతల చరిత్రలను extoll చేస్తుంటామే, వాళ్లచరిత్రలన్నీ bad example కాదా? ద్రౌపదికి (ద్రౌపదిని సృస్ఠీంచినాయనకి) అంతటి అభ్యుదయభావాలే ఉన్నట్లైతే ధర్మరాజులాంటి చెడ్డభర్తని దౌపది విడిచిపెట్టినట్లుగా ఎందుకు చిత్రించలేదు? భర్త కోరుకున్న వేశ్యాసంపర్కాన్నికూడా తనపవిత్రవిధిలా భావించిన పతివ్రలకధలలా ఉండగానే, కేవలం మోహించినంతమాత్రాననే కొడుకుతో చంపించబడిన తల్లిపాత్ర సంగతిఏమిటి? ఎక్కడబదితే అక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని గాలికొదిలిన మహర్షులకధ సంగతేమిటి? వాళ్ళతో పోల్చితే రేణుక చేసిన నేరమెట్టిది?

   Delete
  3. @sreenath
   what is 'ad hominem' (personal attack) logical fallacy in my answer?Please be specific about any of the point you want to stress on!
   1.స్త్రీలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని కొందరు పతివ్రతల చరిత్రలను extoll చేస్తుంటామే, వాళ్లచరిత్రలన్నీ bad example కాదా?
   ans:మీకు చెడు అనిపించినది అందరికీ చెడు కావాల్సినదే అని రూలు యేమయినా పెట్తుకుని వాదించబోతున్నారా?లేక అక్కడ ఆ కధలో యేమి చెప్పాలని కధలోని పాత్రని అలా తీర్చిదిద్దారో తెల్సుకోవాలనుకుంటున్నారా?

   2.ద్రౌపదికి (ద్రౌపదిని సృస్ఠీంచినాయనకి) అంతటి అభ్యుదయభావాలే ఉన్నట్లైతే ధర్మరాజులాంటి చెడ్డభర్తని దౌపది విడిచిపెట్టినట్లుగా ఎందుకు చిత్రించలేదు?
   ans:ధర్మరాజు వదిలివెయ్యదగిన చెడ్డ భర్త అని మీకు యెందుకు అనిపించింది?ఒక చోట ఆటలో ఓడిపోయి తనే ద్ర్తరాష్త్రుదు దయ తల్చి బంధవిముక్తుడు చెయ్యకపోతే అసలు కురుక్షేత్రం వరకూ వెళ్ళకుండా యెప్పటికీ దుర్యోధనుడికి దాసుదు అయిపోయిన దుస్థితిలో వుండీ,మరొక చోట ఆ ప్రయత్నంలో తామేవరో బయటపడితే మొత్తం అందరూ మళ్ళీ అరన్యవాసాన్ని మరోమారు చెయ్యాల్సిన పరిస్థితిలో వుండీ అసహాయుడుగా నిలబ్డటం కూడా మీకు ముందే ధర్మరాజు యే చేసినా తప్పు పట్టాల్సిందే అన్న రూలు ప్రకారం వొదిలెయ్యదగిన ధూర్తమయిన పనా?
   షరా:మీరు నేను చెప్పిన ద్రౌపది చెరిగి పారెయ్యటాన్ని కొనసాగింపుగా అంత చెడ్డభర్తని యెందుకు వొదిలెయ్యలేదు అని మీ సందేహం కావచ్చుననై ఈజవాబు+ప్రశ్న వుంచాను!ఇది కాక మీఎ దృష్తిలో మరేదయినా వుందా వొదిలివెయ్యదగిన ధూర్తమయిన పని?
   3.మొదట మీరు పైవాటికి స్పష్తమయిన సమాధానాలతో వస్తే వీటికి సంబంధించిన చర్చ పూర్తయ్యాక "భర్త కోరుకున్న వేశ్యాసంపర్కాన్నికూడా తనపవిత్రవిధిలా భావించిన పతివ్రలకధలలా ఉండగానే, కేవలం మోహించినంతమాత్రాననే కొడుకుతో చంపించబడిన తల్లిపాత్ర సంగతిఏమిటి? ఎక్కడబదితే అక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని గాలికొదిలిన మహర్షులకధ సంగతేమిటి? వాళ్ళతో పోల్చితే రేణుక చేసిన నేరమెట్టిది?" అనే విషయాల గురించి పట్టించుకుంటాను,సరేనా?

   Delete
  4. భర్త తన స్నేహితునితో కలిసి భార్యని మార్చుకునే రకమైతే భార్య అతన్ని వదిలెయ్యొచ్చు. అతను మంచివాడే కానీ పెళ్ళాల్ని మార్చుకునే అలవాటు ఒక్కటే అతనిలోని చెడ్డ లక్షణం అనుకుని భార్య అతనితో కాపురం చెయ్యక్కరలేదు. భార్యని రేప్ చెయ్యడానికి దుశ్శాసనునికి అనుమతి ఇచ్చినవానితో కాపురం చేసిన ద్రౌపది ఏ రకంగా ఆదర్శ నారి అవుతుంది?

   Delete
  5. భార్యని రేప్ చెయ్యడానికి దుశ్శాసనునికి అనుమతి ఇచ్చినవానితో
   ??
   వినేవాడు వుంటే పంది పురాణం చెప్తుందని నువ్వన్న మాత నీకు సరిగ్గా సరిపోతుంది గదూ?పైన చెప్పిన విశ్లేషణ అంతా నీ మట్టిబుర్రకి యెక్కలేదన్న్న మాత!.నీకు తోచింది కీ బోర్డు మీద నొక్కటం,యెదటివాడు చెప్పిన విషయానికి రెలెవెంటుగా రెస్పాండ్ అవటం నీ జన్మకి వుండదా?జూదంలో ఓడిపోయి తనే నౌకరు హోదాకి దిగజారాడురా బాబూ అంటున్నా రేప్ చెయ్యడానికి అనుమతిచ్చినట్టుగా నీకు అర్ధమయిందా?భారతం చదవకుండానే అక్కడ లేనిది కూడా పులిమి తప్పులు పట్టాలనుకుంటే బురద పులమాలనుకుంటే నీ ఇష్తం యెవడి వల్లా కాదు!

   @కొండల రావు,ఇదివరకే చెప్పాను - చర్చకి కొన్ని నియమాలు పెట్టమని!యే టాపిక్ పడీతే ఆ తాపిక్ పోష్టుగా వేసెయ్యతం,అక్కడ యేముందో తెలుస్కోని గాడిదలు కూడా నోటికొచ్చింది కుయ్యడం సరయిన చర్చా సాంప్రదాయమాఎనా!ఒక పాయింటు గురించి వాదించాలంటే వీళ్లకి అక్కడేముందో కూడా వీళ్ళు కుయ్యాల్సిన కూతలన్నీ అయిపోయాక వీళ్ళతో వాదించే ప్రతికక్షులే విప్పి చెప్పాలా?

   Delete
  6. హరిబాబుగారు, ఆవేశపడి ప్రయోజనం లేదు. ఇక్కడ చర్చల తీరు తెన్నులు మీకు తెలియనివా?

   Delete
  7. భార్యని మార్చుకునేవానికీ, భార్యని పందెంగా పెట్టేవానికీ మధ్య ఉన్న తేడా పైకి చెప్పుకోదగినదే అనుకుంటే అది మీ ఇష్టం.

   Delete
  8. భార్యని మార్చుకునేవానికీ, భార్యని పందెంగా పెట్టేవానికీ మధ్య ఉన్న తేడా పైకి చెప్పుకోదగినదే అనుకుంటే అది మీ ఇష్టం.
   ?
   "తల తాకట్టు - మొల తాకట్టు" గురించి యెప్పుడయినా విన్నావా?
   ఆ మాట మహాభారత కాలం నాటిది కాదు.ఆ తర్వాతైదే ఆంధ్రాలో పుట్టిన మాత!
   ధర్మరాజు ఒక్కడే చెయ్య్యలేదు.నువ్వు తప్పు పట్టే హిందూత్వంలోనే కాదు ఆదిమ జాతుల్లో కూడా ఆ ఆచారం వుంది.అది ఒక పధ్ధతి, దానికి నియమాలు కూడా వున్నాయి.అత్యంత నిక్ర్ష్తమయిన దరిద్రంలో వుండి దాన్ని తప్పించుకోవడానికి అప్పటి వాళ్ళు అందరూ కలిసి యేర్పాటు చేసుకున్న గౌర్వప్రదమయిన పధ్ధతే అది?అట్లా అప్పజెప్పిన స్త్రీనల్లా మానభంగాలు చేస్తారని అనుకోవడానికీ వీలు లేదు.అక్కడ నీఎలాంటి పశువు యెవదయినా వంతే చేస్తాదేమో! నీకు తెలియని వాటి గురించి అతిగా పాండిత్యం వున్నట్టు నటించకు,ముఖ్యంగా రేప్ చెయ్యడానికి పర్మిషన్ ఇచ్చినట్టు వాగమాకు - ఖబడ్దార్?!

   Delete
  9. ఇప్పుడు కూడా ఆడ పిల్ల పుడితే నోట్లో వడ్లు పోసి చంపేసి, మగ పిల్లవాడు పుడితే కొట్టి చదివించి ఆఫీఆర్‌ని చేస్తారు. ఆడదాన్ని గౌరవించేవాడు పందెంలో గెలిచి ఆడదాన్ని కొనడు. పందెంలో గెలిచి కొన్న ఆడదాన్ని రేప్ చెయ్యకూడదు అనే రూల్ మాత్రమే పెట్టుకుంటే అది సంస్కారమైపోతుందా?

   Delete
 4. శ్యామలీయం గారు,

  హరి బాబు గారి ఆవేశం తగ్గించుకోమని చెప్పడం బాగానే ఉంది కానీ , భార్యను జూదంలో ఫణంగా పెట్టేది ఏ విధంగా సంస్కారమో, ఆదర్శమో మీరు సెలవిస్తారా? భర్త చనిపోతే విధవలా తెల్లబట్టలతో, బొట్టులేకుండా, ఎవరికీ ఎదురుపడకుండా ఉక్కుష్టపడుతూ ఆ మహిళ జీవితాంతం ఎత్తిపొడుపులతో జీవించాలా? అలాంటి దుర్మార్గపు పనులు మీలాంటి వారికి మంచి పనులుగా , మంచి చర్చలుగా చెవికి ఇంపుగా కనిపించవచ్చేమో? మాలాంటి వాళ్లకి అలాంటి దుర్మార్గాలు నేటికీ కనిపిస్తున్నప్పుడు వీటిని మార్చాలని అనిపించవచ్చు. అలాంటి చర్చలు మీకు కంటగింపుగా పదే పదే అనిపించవచ్చు. ఇక్కడ చర్చలలో ప్రవీణ్ లాంటి వారు మాత్రమే కాదు, మీతో సహా అనవసరమైన వాదనలు, అనవసర సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉపయోగకరమైన సమాధానం మీరు చెప్పగలరా? సమాధానం చెప్పకుండా ఉచిత సలహాల వల్ల ఉపయోగముంటుందా? ఇలాంటి అనవసర జోక్యం వల్ల ఎవరికి ఏమి ప్రయోజనం సర్? చర్చలంటేనే అసహ్యించుకోవడం తప్పు. చర్చ లేకుండా ప్రగతి లేదు. ప్రశ్నను సహించలేని యథాతధవాదం సమాజాన్ని ముందుకు నడిపించదు. చర్చలలో అపశృతులకీ అసలు ఇలాంటి చర్చలు అంటూ పదే పదే ఎద్దేవా చేయడానికి తేడా ఉంటుంది.

  మీకు నిజంగా భారతీయ సంస్కృతిపై ప్రేమ ఉంటే పై ప్రశ్నకు సమాధానం చెప్పండి. అలాగే మన సంస్కృతిలోని లోపాలను నిర్ధ్వంద్వంగా ఖండించండి. మంచి విషయాలను అవి ఎందుకు ఎలా మంచివో లేదా ప్రపంచానికి ఆదర్శమైనవో చెప్పండి. విమర్శను, విమర్శలోని వాస్తవాలను తట్టుకోలేక, సమాధానం చెప్పే చేవలేని ఫలాయనవాదం + మధ్యే మార్గం వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు కదా?

  ప్రవీణ్ గారు,

  వావి వరుసల విషయంలో మీరు ఏదైనా శాస్త్రీయ ప్రత్యామ్నయం చెప్పగలరా? పాడిందే పాడరా... అన్నట్లు సోది చెప్పకండి. మీకు నచ్చినట్లు విచ్చలవిడిగా సాంప్రదాయాలు ఉండవు. భారతీయ సంస్కృతిలో మాత్రమే తప్పులు ఉన్నట్లు పదే పదే వాదించడం కావాలని విమర్శించడం కాదా? భారతీయ సంస్కృతిలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు పరమ రోతగా ఉన్నట్లే , చాలా మంచి విషయాలూ ఉన్నాయి. భారతీయ సంస్కృతి అంటే కేవలం BJP వారికి సంఘ్ పరివార్ వారికి ధారాదత్తం చేసి వారిపై కోపాన్ని అక్కసును అంతా పదే పదే ఇక్కడ ప్రదర్శించడం అసలు చర్చను పక్క దోవ పట్టించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. భారతీయ సంస్కృతి అంటే BJP మరియు సంఘ్ పరివార్ వారు చెప్పేది మాత్రమే, వారికి చెందినది మాత్రమే అనుకుంటే పొరపాటు. రామాయణం - భారతం - భాగవతం ఈ గ్రంధాలలో ఉన్న మంచినే భారత సమాజం ఎక్కువగా ఆచరణలోకి తీస్కుంది తప్ప రంధ్రాణ్వేషణ చేసి అన్నింటిని యథాతధంగా ఆచరణలోకి తీసుకోలేదు. తండ్రిమాటను విన్న రాముని ఆదర్శాన్ని తీసుకుని పెద్దలను గౌరవించడం నేర్పుతారు తప్ప - భార్యలను అడవులలో వదిలేసి వచ్చే ఆదర్శాలను ఎవరూ తీసుకోరు. అలాగే ఇతర గ్రంధాలలోని మంచిని స్వీకరించవచ్చు. విమర్శించడానికే అయితే మార్క్స్ కేపిటల్ తో సహా అన్నింటా మంచి చెడులు ఉంటాయి. విమర్శ అంటే బాగాలేనిదానిని ప్రత్యామ్నయం చూపి వాదించడం అవ్వాలి. కావాలని విమర్శిస్తే నెగిటివ్ ఫలితాలు వస్తాయి తప్ప ఆశించిన ఫలితాలుండవు.

  అలాగే సైన్స్ పేరుతో లేదా సైన్స్ ఉన్మాదంతో సాంప్రదాయాలను అతిగా అనవసరంగా తూలనాడడమూ ఫలితాలనివ్వదు. సైన్స్ కు వావి వరసలతో సంబంధం లేదు. సాంప్రదాయానికి అవసరం. సైన్స్ కు - సాంప్రదాయం కు తేడా ఇటువంటి విషయాలలోనే స్పష్టంగా కనపడుతుంది. మానవ జీవన విధానానికి, మనుగడకు సైన్స్ మాత్రమే ఉపయోగం కాదు. సాంప్రదాయం కూడా అవసరం. ఏది మంచి సాంప్రదాయం కాదో చెప్పడానికి మాత్రమే సైన్స్ ఉపయోగపడుతుంది. శృతిమించిన సైన్స్ వాదం టెక్నికల్ విషయాలలో ఉపయోగపడినంతగా జీవన విధానంలో ఉపయోగపడదు. సైన్స్ ముదిరినా - సాంప్రదాయం ముదిరినా నష్టమే. సైన్స్ అతివాదులు - సమ్రదాయ అతివాదులు ను కాదని సమాజం ఎప్పటికప్పుడు పాత కొత్తల మేలు కలయికతో ముందడుగు వేసుకుంటూ పురోగమిస్తూనే ఉంటుంది. సైన్స్ ఆధారంగా మంచి సాంప్రదాయాలను కొనసాగించడం నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. సైన్స్ నూ - సాంప్రదాయాన్ని సమన్వయపరచుకుంటూ ముందుకు పోవడమే ప్రజలకు సమాజానికి ప్రయోజనం కలిగించే మార్గం.

  హరి బాబు గారు,

  నేను వేసిన ప్రశ్న చాలా క్లియర్ గా ఉన్నది. మీకు - ప్రవీణ్ కు కొంచెం దురద ఎక్కువగా ఉంటే అది మాలాంటివాళ్ల తప్పు కాదు. ఇక్కడ మరోసారి ప్రశ్నలోని అంశాలపై దృష్టి నిలిపి మీరు చెప్పదలచుకున్నది చెపితే సరిపోతుంది. మీకు ప్రశ్నలోని అంశాలకంటే ప్రవీణ్ వాదనలపై దృష్టి ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది.మీకు అభ్యంతరం లేకుంటే గమనించాలని విజ్ఞప్తి.

  ReplyDelete
  Replies
  1. @konDala raao
   ప్రశ్నలోనే దురద వుంటే దానికి దీటుగా జవాబు చెప్తుంటే నాకు దురద అంటగడుతున్నారు.
   ఇక ఇక్కడ చర్చించితే విలువైన విషయాలు బయట పడతాయని నేననుకోవటం లేదు.
   యే రూపంలో నైనా సరే ఇక ఇక్కడి చర్చల్లో నేను కల్పించుకోను!

   ఒక విషయం:వాఇవరూసల గురించి అతని అభిపారాయాల్ని ఖండించకపోతే యేమి జరుతుందో తెలుసా?
   ఒక యదార్ధమయిన విషయాన్నే వుదాహరిస్తాను.పేర్ల మార్పుతో ఒక వ్యక్తి తన అనుభవాన్నే వెళ్ళబోసుకుంది.

   తనకి బావ వరస అయ్యే వ్యక్తి పెళ్ళిలో పరిచయం చేసుకుని చనువు పెంచుకుని మెప్పించి పెళ్ళి చహెసుకున్నాడు.తీరా పెళ్ళయ్యాక ఆత్తామామల వరస వింతగా అనిపించింది - యెంత కలివిడిగ మాట్లాదబోయినా ముభావంగా వుండే వాళ్ళట!కొద్ది కాలానికే ప్రత్యేకించి తగాదాలు యేమీ లేకపోయినా వేరు కాపరం పెట్టాడు?అక్కడి కెళ్ళాక తనని యెందుకు లైన్లో పెట్టాడో అర్ధమయింది!వాడికీ వాడి పిన్ని కూతురుకీ చాలాకాలం నుంచీ వ్యవహారం నడుస్తుంది,వాడి తలిదండ్రులు ఈ అమ్మాయితో ముభావంగా వుండటానికి కారణం అదే.తన పిన్ని కూతురుతో స్వేచ్చగా జీవితాంతం గడాపటానికి అది గుట్టుగా సాగిపోవటానికి ఈ అమ్మాయి అమాయకంగా కనబడటంతో అంత ప్రేమని నటించాడు - అర్ధమయిందా కొందరు యే రకంగా నైనా సరే తమ కోరిక తీరడమే ముఖ్యమని యెంత బరితెగించి ప్రవర్తిస్తున్నారో?!నిర్భయ సంఘతనలోని రేపిష్తుల్ని ఆడిపోసుకుని యేమి ప్రయోజనం,గౌరవప్రదంగా కనబడుతున్న వాళ్లలోనే తమ కోరిక తప్పు అయినా సరే నెరవేర్చుకోవడం పట్ల అంత పట్టుదల వుంటే?!

   ప్రవీణ్ కుమార్ అనబడే ఈ వ్యక్తి మీకు గౌరవనీయుడిగా కనిపిస్తూ కొంచెం దురద మాతరమే వున్నదని అనుకుంటూ నాకు కూడా అతనిలాగే దురదని అంటగడుతున్నారు గానీ ఈ వ్యక్తి ఒక ప్రత్యామ్నాయాన్ని దేన్నీ సూచించకుండా ఇప్పుదున్న వావివరసల్ని వెక్కిరించటం ఆ రకమయిన విచ్చలవిడితనాన్ని గౌఅరవనీయంగా చెయ్యడానికే అనేది తెలుసుకోండి?!

   మద్దెలకి అటో దెబ్బా ఇటో దెబ్బా అని గొప్ప పాండిత్యమే చూపిస్తున్నారు! "భార్యను జూదంలో ఫణంగా పెట్టేది ఏ విధంగా సంస్కారమో, ఆదర్శమో మీరు సెలవిస్తారా? భర్త చనిపోతే విధవలా తెల్లబట్టలతో, బొట్టులేకుండా, ఎవరికీ ఎదురుపడకుండా ఉక్కుష్టపడుతూ ఆ మహిళ జీవితాంతం ఎత్తిపొడుపులతో జీవించాలా?" అని శ్యామలీయం గారినీ నన్నూ అడుగుతూనే "ఈ గ్రంధాలలో ఉన్న మంచినే భారత సమాజం ఎక్కువగా ఆచరణలోకి తీస్కుంది తప్ప రంధ్రాణ్వేషణ చేసి అన్నింటిని యథాతధంగా ఆచరణలోకి తీసుకోలేదు. తండ్రిమాటను విన్న రాముని ఆదర్శాన్ని తీసుకుని పెద్దలను గౌరవించడం నేర్పుతారు తప్ప - భార్యలను అడవులలో వదిలేసి వచ్చే ఆదర్శాలను ఎవరూ తీసుకోరు" అని ప్రవేఏంకి నీతులు చెప్తున్నారు!మీ ప్రశ్నకి మీరే జవాబు చెప్పి తీర్పు ఇచేశాక వేరేవాళ్ళు ఇంక చర్చించేదేమిటి?జవాబులు చెప్పేతందుకు మీరేమీ మిగల్చ లేదే?

   ఇక ప్రజలో ముందెన్నడూ నా పేరు కంబడదు,స్వస్తి!

   Delete
  2. నావి దాసరి పాటలా, జంగం పాటలా అనేది తరువాత తేలుతుంది. ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ, ఒరిస్సాలోని గజపతి, రాయగడ, కోరాపుట్ జిల్లాలోనూ ఫలానా ఇంటి పేరు గలవారు ఫలానా ఇంటి పేరు గలవారిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధమని రూల్స్ ఉన్నాయి. ఇంటి పేరు ఆధారంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మరదలు అవుతుందా లేదా చెల్లెలు అవుతుందా అని నిర్ణయించే సమాజంలో నేను చెవిటివాళ్ళ ముందు శంఖం ఊదను. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్ళు నా వైపు వస్తారు, అది లేనివాళ్ళు నా వైపు రారు.

   హిందువుల్లోనే రెండు కులాల్లో ఆచారాలు ఒకేలా లేవు. తెలంగాణాలో వెలమల్లో అయిదు శాఖలు ఉన్నాయి. మరాఠా వెలమలు భర్త చనిపోయిన స్త్రీని ఆమె మరిదికి ఇచ్చి పెళ్ళి చేస్తారు కానీ పద్మనాయక వెలమలు భర్త చనిపోయిన స్త్రీకి రెండవ పెళ్ళి చెయ్యకుండా ఆమెకి పిల్లల్ని చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వమని చెపుతారు. రెండు ఉపకులాలలో కూడా ఆచారాలు identicalగా ఉండవు.

   Delete
  3. @ హరి గారు,

   ప్రశ్నలో దురద లేదు.

   నేను భారతీయ సంస్కృతిలో మంచిని సమర్ధిస్తాను. చెడును వ్యతిరేకిస్థాను. ప్రపంచంలో ఏ సంస్కృతిలో మంచి ఉన్నా స్వీకరిస్తాను. ఇది మద్దెల వాయిద్యమనుకుంటే అది మీ ఇష్టం.

   ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరికోసమో నా అభిప్రాయాలను మార్చుకోను.

   ప్రవీణ్ నాకు గౌరవనీయుడిగా కనిపిస్తాడని మీరు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకెవరైనా ఒకటే. విషయాన్ని బట్టే నా విమర్శ ఉంచడానికి ప్రయత్నిస్తాను.

   ప్రజలో ఎవరు పాల్గొనాలి - ఎవరు పాల్గొనకూడదు అనే వారి వ్యక్తిగత స్వేచ్చను నేను ఆటంకపరచను.

   ధన్యవాదములు.

   Delete
 5. కొండలరావు గారూ,
  బ్లాగుచర్చలు విషయప్రధానంగా కాక దూషణభూషణోద్యోగాలూ శాఖాచంక్రంణాలూ ప్రధానంగా సాగుతున్నాయన్న నా అభిప్రాయం మీకు నచ్చకపోవచ్చును. అందుచేత అటువంటి వాతావరణం ఉండే చర్చల్లో అవేశపడటం నిష్ప్రయోజనం అని చెప్పటానికి మాత్రమే హరిబాబుగారిని ఉద్దేశించి నా క్లుప్తవ్యాఖ్య చేసానని ఇచ్చే ఈ వివరణ మీకు సంతృప్తి కలిగిస్తుందనుకోను.

  నాకు వీలున్నప్పుడు మాత్రమే ఏదన్నా వ్రాయగలను. ప్రస్తుతం అది గగనకుసుమంలాగా ఉన్నది కాబట్టి ఈ మధ్యన వ్రాయటం బాగా తగ్గింది. ఇప్పుడు కాని ఇంతకు పూర్వంకాని వ్రాయటమూ‌ మానటమూ అనేది నేను ఎవరి ఛాలెంజ్ కారణంగానూ చేయలేదు. ముందూ అలా జరగదనుకుంటాను. నాకు భారతీయ సంస్కృతిపై ప్రేమ ఉందా లేదా అన్నది నేను ఏవరికైనా ఋజువులు చూపటం ద్వారా అవగాహన అయ్యేలా చేయటం అవసరం అనుకోను.

  మీరన్న కొన్ని మాటలు నాకు ఆలోచనీయాలు గానూ కొన్ని ఆచరణీయాలు గానూ ఉన్నాయి. అందుకు మీకు కృతజ్ఞుడను.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారు, మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. కొందరిని లేదా ఏ ఒక్కరిని మార్చాలని నేను అనుకోవడం లేదు. అవసరమైనవి ఏరుకోవడం మాత్రమే చేయగలననే నిర్ణయానికి వచ్చాను. కనుక నాకు ఇబ్బంది లేదు. వచ్చే ఉగాది నుండి బ్లాగులలో మరిన్ని మార్పులు చేసుకోబోతున్నాను. మీరన్న దూషణభూషణోద్యోగాలూ శాఖాచంక్రంణాలూ మనం ఆపగలిగేవి కావని మాత్రం చెప్పగలను. ప్రతివాడినీ సంతృప్తిపరచేలా నేను ప్రజను నిర్వహించలేను. నాకు నచ్చిన విధంగా అవసరమైన మేరకు మాత్రమే నిర్వహించగలను. మిగతా విషయాలను ఎలా కట్టడి చేయాలి అని ఆలోచించి - ప్రయత్నించి - అనవసరం అనిపించి వదిలేశాను. కామెంటుకు ధన్యవాదములు.

   Delete
  2. కొండల రావు గారూ!
   నేను పూర్తిగా ప్రజ నుంచి తప్పుకుంటున్నానని చెప్పినా ఒక రెండు విషయాలలఓ కొంచెం గందరగోళం వుండటం వల్ల వాటికి నా వైపు నుంచి సమాధానాలు చెప్తాను.కొత్తగా యేవీ నేను ప్రస్తావించను.అంతకు ముందు వాటి నుంచే తీసుకుని జవాబు చెప్తాను.మొదట ప్రశ్నలో దురద వున్నదన్నది మీరు వేసిన ప్రధాన ప్రశ్న గురించి కాదు.ప్రవీణ్ చేస్తున్న వాదనకి సంబంధించినది.ఇంత వరకూ ఇక్కడ ప్రవీణ్ టైప్ చేసి వొదిలిన కామెంట్లలో మనం అడిగిన ప్రశ్నకీ తను చెప్పే జవాబుకీ యేనాదైనా యెవరికయినా సంబంధం కనిపంచిందా?ఆసలు ప్రశ్నకి జవాబు చెప్పకుండా సంబంధం లేని విషయంతో ప్రశ్న వేస్తే అది తన బుర్రలో వున్న దాన్ని ఇక్కడ కక్కాలనే దురద కాక మరేమవుతుంది?మీరు వావివరసలకి సంబంధించిన శాస్త్రీయమైన విధానం యేదయినా మీ దగ్గిర వుందా అని అడిగాక కూడా దానికి జవాబు చెప్పకుండా రాయగడ కోరాపుట్ జిల్లాల గురించి సోది యెత్తుకున్నాడు!కొండల రావుతో సహా అనదరూఅతన్ని అడుగుతున్నది నువ్వు ఈ తప్పుల్ని సవరించగలిగిన శాస్త్రీయమైన దాన్ని యేదయినా ప్రతిపాదించగలవా అని కదా!మనం అడిగిన దానికి సూటిగా అతనితో జవాబు చెప్పించగలరా?

   ఆ బాధ్యతతో ఇక్కడికి రావటం లేదు అని యెన్నిసార్లుఒత్తిడి చేసినా దారికి రాకపోవటం చూస్తే తెలియటం లేదా?అడిగిన విషయానికి తిన్నగా జవాబు చెప్పకుండా నాకు చెవిటితనాన్ని అంతగట్టేటట్టు శంఖమూదను అంటున్నాదు,అందులో మీకేమి అర్ధమయింది?అతను ఇక్కడ కొత్తగా నేర్చుకుందామనే బాధ్యతతో రావడం లేదు!వీళ్ళందరి కన్నా నాకు యెక్కువ తెలుసు ఈ పిచ్చివాళ్ళ దగ్గిర్నుంచి నేను నేర్చుకునేదేమిటి అనే అహంకారం బాగా వుంది!

   1.కాబట్టి ఒకరు యెవరినయినా పేరు పెటి అడిగితే యేద్టి వ్యక్తి తిరిగి కచ్చితంగా దానికి రెలెవెంటుగా జవాబు చెప్పేవరకూ అతని కామెంత్లని పబ్లిష్ చెయ్యకూఒడదు - ఇది ఒక గట్టి నియమంగా ఉండాలి!
   2.ఒకే వ్యక్తి ఇద్దరితో ఇలాంటి ప్రశ్న - జవాబు వరస అండుతుంతే దానికి దానికి విడిగా చూడాలి.మోదరషన్ పెట్టి ప్రతి కామెంటునీ మీరు చదివాకనే పబ్లిష్ చేస్తున్నారు గాబట్టి మీరు అది చెయ్యగలరు!

   ఆలోచించండి,నేను వాదనకి నియమాలు అన్నవి అలాంటివే!
   ఇక్కడ వాదనల్లో నాకు తెలిసింది చెప్పడానికీ నా అభిప్రాయాల్లో తప్పు వుంటే సవరించుకోవడానికే వచ్చాను తప్ప నోటి కొచ్చింది వాగడానికి కాదు.కానేఎ నాకు ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.ఇక రాను.
   మరో ముఖ్యమయిన విషయం:నా ప్రశ్నలో దురద లేదు,జవాబు చెప్పండి అంటున్నారు మీరు.కానీ మీరు శ్యామలీయం గారినీ నన్నూ అడిగిన వాటికీ మీరు జవాబులు ఆశిస్తున్న ఇతర ప్రశ్నలన్నిటికీ "ఈ గ్రంధాలలో ఉన్న మంచినే భారత సమాజం ఎక్కువగా ఆచరణలోకి తీస్కుంది తప్ప రంధ్రాణ్వేషణ చేసి అన్నింటిని యథాతధంగా ఆచరణలోకి తీసుకోలేదు. తండ్రిమాటను విన్న రాముని ఆదర్శాన్ని తీసుకుని పెద్దలను గౌరవించడం నేర్పుతారు తప్ప - భార్యలను అడవులలో వదిలేసి వచ్చే ఆదర్శాలను ఎవరూ తీసుకోరు" అని మీరు ప్రవీణ్ అనే ఆ వ్యక్తికి చేసిన హితబోధయే సరయిన సమాధానం అవుతుంది!
   సెలవు!

   Delete
  3. @ హరి గారు,
   ప్రవీణ్ గురించి ప్రవీణ్ వాదనా పద్ధతి గురించి నేను గతంలో అతనికి చెప్పి చూశాను. వదిలేశాను.

   ఉగాది నుండి పూర్తి స్థాయిలో కామెంట్లను - ప్రశ్నలను నేనే నియంత్రిస్థాను. బాధ్యత వహిస్తాను. కామెంట్ మోడరేషన్ మీరే తీసేయించారనేది మీరోసారి గుర్తించాలి.

   నేను మీకైనా - శ్యామలీయం గారికైనా భారతీయ సంస్కృతిలోని చెడుని వదిలేసి మంచిని తీసుకోవడానికి చర్చలను ప్రోత్సహించడం కోసం అడిగాను తప్ప ప్రవీణ్ వాదనా పద్ధతి గురించి అయితే ప్రస్తుతానికి నేను ఏమీ వ్యాఖ్యానించలేను. నేను చెప్పినా ఎవరు చెప్పినా అలాంటి విషయాలలో ప్రవీణ్ మారతాడని నేను అనుకోను. ప్రవీణ్ మారనంత మాత్రాన విషయాలపై చర్చించకుండా ఉండాలనుకోవడం సరయినది కాదు.

   100% కామెంట్లను నియంత్రించాలంటే పూర్తి స్థాయి మోడరేషన్ వల్ల మాత్రమే సాధ్యం. అదే విధంగా ప్రవీణ్ తో పాటు చాలా మంది చాలా విషయాలలో మారాలి అని అభిప్రాయపడుతున్నాను.
   కామెంట్లుకు మొదటిరోజు మోడరేషన్ లేదు. కామెంట్ల విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన సూచనలను గమనంలోకి తీసుకుంటాను. మోడరేషన్ సరిగా చేయలేకపోతున్నందుకు మాత్రం ఇబ్బంది పడుతున్నవారందరూ ప్రస్తుతానికి ( ఉగాది వరకు) క్షమించాలి.

   Delete
 6. హరిబాబు గారు:

  "మీకు చెడు అనిపించినది అందరికీ చెడు కావాల్సినదే అని రూలు యేమయినా పెట్తుకుని వాదించబోతున్నారా?లేక అక్కడ ఆ కధలో యేమి చెప్పాలని కధలోని పాత్రని అలా తీర్చిదిద్దారో తెల్సుకోవాలనుకుంటున్నారా?"

  I believe in something called common sense and causual morals. మీరు ఆలోచించండి ఈ పాతివ్రత్య ధర్మాన్ని కొంచెం obverse చేద్దాం. ఒక వ్యక్తి(/మీ) భార్య పరపురుషుడితో సంపర్కాన్ని కోరింది, అప్పుడు ఆవ్యక్తి తన భార్యను నెత్తికెత్తుకొని పరపురుషుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. Do you think it's O.K. My friend? ఒకవేళ సుమతి కధలో అంతర్లీనంగా ఏదైనా నీతి ఉండుంటే దాన్ని నాకు తెలిబరచి నన్ను ఉధ్ధరించవలసిందిగా ప్రార్ధన. (మిమ్మల్ని ఇందులోకి లాగినందుకు బేషరతు క్షమాపణలు).

  "ధర్మరాజు వదిలివెయ్యదగిన చెడ్డ భర్త అని మీకు యెందుకు అనిపించింది?"

  ధర్మరాజు జూదరికాదా? అతను తన భార్యను పణంగా పెట్టినప్పుడు తనభార్య యొక్క అంగాంగ వర్ణన (ఫక్తు బ్రోకరులాగే) చెయ్యలేదా? ఇంకొక వ్యక్తిని తాకట్టు పెట్టే హక్కు మరొక వ్యక్తికి ఎలా ఉంటుంది? నేను మిమ్మల్ని తాకట్టుపెట్టెయ్యవచ్చునేం? మీరైతే ధర్మరాజులాగే ప్రవర్తిస్తారా?

  ReplyDelete
  Replies
  1. రాజు ఏది చెపితే అదే చట్టం అనుకునే రాచరిక వ్యవస్థలో భార్యని పందెంగా పెట్టడం తప్పు కాదు అని ఆయన వాదించి ఉంటే దాని అర్థం వేరుగా ఉండేది. కానీ హరిబాబు గారు అలా కూడా అనలేదు, ఆయన ధర్మరాజు వదిలెయ్యదగినంత చెడ్డవాడు కాదని వాదించారు.

   Delete
  2. రాజు చేసినా, ప్రజా స్వామ్యంలో ప్రజలెన్నుకున్న తన్నుకునే నేతలు చేసినా చట్టం ఉన్నంతమాత్రాన అది మంచిదా? కాదా? అనేది ఆచరణలో మాత్రమే ఋజువవుతుంది.

   Delete
  3. @sree nath
   “ధర్మరాజు జూదరికాదా?” అంటున్నారు!

   చతుష్షష్టి కళల్లో ఒకటిగా ద్యూతక్రీడ వుందేది.ఇవ్వాళ పాడతం తెలిసిన ప్రతివాడూ యెవరయినా అడిగితే పాడటానికే చూస్తాడు.ద్యూతంలో కూడా ఒక నియమం వుంది.ఆట తెలిసిన వాడు ఆహ్వానించితే తిరస్కరించకూడదు అని.

   ఆట తెలుసు గాబట్టి పిలిస్తే వచ్చాడు గానీ అతను అందులో అఖండ ప్రజ్ఞా నిధి కాదు. కధలో అది స్పష్టంగానే వుంది.రెండు సార్లూ అతనే ఓడిపోయాడు!శకునికి ఆ ప్రజ్ఞ వుంది.ధర్మరాజు గెలిస్తే యేమయ్యేది అనే సందేహం అక్కర లేదు.ఓడిపొతానని తెలిసినా మధ్యలఓ ఆపకూడదనేది కూడా ఒక నియమం.

   షేక్స్పెయరు హాంలెట్ నాటకంలో "టు బి ఆర్ నాట్ టు బి" అనే ఫేమస్ డయలాగ్ వుందికదా.ఆ నాటకం ఇతివృత్తం యేమిటో తెలుసా?తన తల్లిని బలవంతంగా లొంగదీసుకున్న వాణ్ణి(సవతి తండ్రి అనొచ్చా?!) చంపటం.కానీ తనికి వెనక ముందు ఆడాల్సిన డైలమా వచ్చింది.ఇప్పుడు నేను గానీ మీరు గానీ "యేంటా చెత్త దయలాగు పెట్టి నాటకాన్ని సాగదియ్యటం?యెదవ గోల!క్లైమాక్సు లోనైనా చెయ్యాల్సిందే గదా,రెండు నిమిషాల్లో తేల్చి పారేసేదానికి అంత సాగలాగుడు దేనికి?" అంటే యెట్లా వుంటుందో ద్రౌపది విడాకులు అడిగినట్టు వ్యాసుడు రాయలేదేం? అని అడగటం కూడా అట్లానే వుంటుంది.

   Delete
  4. @sree nath
   నేనిప్పటికి ఈ బ్లాగులోనే పదిసార్లయినా చెప్పి వుంటాను - "ప్రపంచ సాహిత్యంలో కాలాలు దాటి నిలిచిన కళారూపాలు అవి శాశ్వతంగా నిలబడటానికి కారణం ఆ కధలలోని యే పాత్రా నేల విడిచి సాము చెయ్యకుండా పూర్తి వాస్తవికత వుట్టిపడుతూ నిజమైన వ్యక్తులని భ్రమింప జేసే రచయితల ప్రతిభ వల్ల కొన్ని తప్పులూఒ కొన్ని ఒప్ప్పులూ వున్న సంవిధాన(Drametic Excellency) కళ ఆ రచయితలలో వుండటమే" అని!అయినా సరే ఒక్కొక్కొసారి ఒక్కొక్క వ్యక్తి మళ్ళీ అదే పాట పాడిస్తున్నారు నాతో - బోరుగా వుందిం,విసుగ్గా వుంది, చీ!ఉ


   "హంచ్ బాక్ ఆఫ్ నాస్త్రదాం కెధడ్రల్" కధ తెలుసా?తెలుగులో "ఘంటారావం" అనే పేరుతో వచ్చింది.అందులో అందరికీ దయామయుడిగా కనిపించే ఒక చర్చి ఫాదర్ కంజిర పట్టుకుని వీధుల్లో నాట్యం చేసి డబ్బులు సంపాదించే ఒక అమ్మాయి మీద పగబట్టి తను పెంచుతున్న గూనివాడితో కిడ్నాప్ చేయించటం దగ్గిర్నుంచి ఆ అమ్మాయిని ప్రభుత్వం చేత భయంకరమయిన శిక్షకి గురయ్యేలా చేస్తాడు!మెరి విక్టర్ హ్యూగో చర్చి ఫాదర్లందర్నీ బద్నాం చెయ్యడానికే అట్లా రాశాడని అనగలరా?చా,పాపం యెంతయినా చర్చి ఫాదరు గదా పశ్చాత్తాప పడినట్టుగా చూపిస్తే పోయేదిగా అనఓ యెవరో ఒక దొమ్మరి పిల్లకి యేదో కొంచెం అపకారం చేశాడు,మిగతా వాళ్ళందరితో బాగానే వున్నాడుగా అని సమర్ధించడమో చేస్తారా?మీరు మరోలాగా ఆ కధని తిరగ రాయాలని చూస్తారా?

   రెండూ కధలే,రెంటిలోనూ రచయితలు ఆయా పాత్రల్ని తీర్చిదిద్దిన ప్రతిభ వల్ల వాళ్ళు వాస్తవ వ్తక్తులేమో అని భ్రమిస్తున్నాం!బాగా ఆలోచించి చూడండి,అర్ధమవుతుంది?
   మహా భారతంలో జూదం మొత్తం రెండుసార్లు జరిగింది!యెందుకు జరిగింది?దృతరాష్త్రుడు "గుడ్డివాణ్ణీ కావడం వల్ల నేను రాజుని కాలేకపోయాను,నా తర్వాత నువ్వు రాజయ్యేందుకు నీ చేతనయిన ప్రయత్నాలు చేస్తే నేను సహకరిస్తాను" అని పురెక్కించి వొదిలి భీష్ముడూ ద్రోణుడూ వాళ్ళ ముందు మాత్రం వాడు నా మాట వినట్లేదు అని నాటకాలు ఆడేవాడు.ఆ అలుసు చూస్కుని వాడు చేసిన దుర్మార్గాలే కురుక్షత్ర యుధానికి కారణ మయ్యాయి.అసలు యే విధమయిన సందేహమూ లేకుండా దృతరాష్తుడి తర్వాత ధర్మరాజు హస్తినాపుర బవిష్యత్ సమ్రాట్టుగా యువరాజుగా కూడా గుర్తింప బడ్డాడు అప్పటికే.అయినా దృతరాష్త్రుడు మొగమాటం లేకుండా ధర్మరాజుని బతిమిలాడుకుంటే ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళాడు,అర్ధమవుతున్నదా కధలో యేం జరుగుతున్నదో?ఈ ఇంద్రపష్తం పేరుకే ఇంద్రప్రస్థం కానీ రాజ్యంలో కల్లా పరమ దయనీయ స్థితిలో ఉన్నది, తెలిసే ఆ ప్రాంతానికి పంపాడు వాళ్ళ పెదనాన్న గారు!

   Delete
  5. @sree nath
   యెందుకూ పనికిరాని బూమిలో అణగారి పోతారనుకున్న వాళ్ళు రాజసూయ యాగం చేసి వువ్వెత్తున పైకి లేస్తే ఈ ద్యూత నియమాన్ని కారణంగా తీసుకుని ఆజీవపర్యంతపు దాసత్వానికి దిగజార్చాడు.యే నగరంలో అయితే సాధికారికంగా మూర్ధాభిషిక్తుడై అంగరంగ వైభవంగా తిరగగలడో ఆ నగరంలో కిరీటాలు తీసి నేల మీద పెట్టేశారు అప్పటికే? వాళ్ళప్పుడు దుర్యోధనుడి కట్టుబానిసల కింద లెఖ్ఖ!మయసభలో ద్రౌపది నవ్వినందువల్ల ద్రౌపదిని అవమానించాలనుకున్నాడనేది నమ్మలేం, మూలకధలో యెలా వుందో చదివి చాలా కాలమయింది కొందరు ద్రౌపది నవ్విందనీ,కొందరు ద్రపుపది పరిచారికలు నవ్వారనీ చెప్తున్నారు.పాత కధ యెలా వున్నా,"ద్రౌపది కూడా దాసియే గదా ఇంకా రాణివాసంలో యెందుకు తనని కూడా తీసుకొచ్చ్జి కూర్చోబెట్టండి" అనే అహంకారమే కనబడుతుంది.ఇంతకీ మీరు జూదరి అంటున్న ధర్మరాజు ఆ రెండు సార్లూ పిలిస్తే తిరస్కరించకూడదనే నియమం ప్రకారం ఆడటమే తప్ప మరెక్కడా ఆడినట్టు వ్యాసభారతంలో లేదు బహుశా రంగభారతంలో వుందేమో?!
   యే కావ్యంలో నైనా రచయిత "నాటకీయత" అనేది చూపించాలని కోరుకుంటాడు!డ్రామా,టెంపో,విలనీ ఎస్టాబ్లిష్మెంట్ అని ఇప్పుడు పిలుస్తూ ప్రతి సినిమాలోనూ చూస్తున్న లక్షణమే.దుర్యోధనుడి దుర్మార్గాన్ని చూపించడానికి కల్పించిన సన్నివేశంలో మీకు ధర్మరాజు దుర్మార్గుడిగా కనబడ్డాడు!"యే గతి రచియించిరేని సరికాలము వారు మెత్తురే గద?!" అని ఒక కవి బావురుమన్నాడు యెంతో గొప్పగా రాశాననుకున్న తన కావ్యంలో తన సమకాలికులే అన్యాయంగా తప్పులు పడుతుంటే తట్టుకోలేక.యే కధలోనూ అందరికీ నచ్చే గ్యారెంటీ వుండదు. శత్రువర్గపు భావజాలానికి చెందిన సాహిత్యంలో తప్పులు పట్టటం సహజమే!రాజకీయంగా యెదగాలనుకుంటే వాడు తప్పు నేను ఒప్పు అని చెప్పుకోవడం తప్పనిసరి?

   ఇంతకీ ఈ గోల అంతా విని ధ్ర్తరాష్తుడూ గాంధారీ విదురుడి ద్వారా విషయం కన్నుక్కుని యెంతయినా కులస్త్రీ అందులోనూ కోదలు వరస తన మర్యాదని భంగం చేశారని తెలిసి కొడుకునే ముక్క చివాట్లు పెట్టి ద్రౌపదిని నువ్వు యే వరం కోరుకున్నా ఇస్తాను కోరుకోమంటే "నన్నూ నా భర్తల్నీ ఈ దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యండి" అని అడిగితే మళ్ళీ తమ రాజ్యానికి వెళ్ళారు దాస్త్వాన్ని తప్పించుకుని.

   ఆ సన్నివేసం అలా జరిగితే మీరు ద్రౌపది విడాకులు అడిగినట్టు యెందుకు రాయలేదు అంటున్నారు.ఆ గాడిద మాంచి రేప్ సీను మిస్సయ్యానని యేడుస్తున్నాడు! మీకు కధని కధగా చదవటం తెలియక పోతే వ్యాసుడిదా తప్పు?మీరు జూఒదరి అంతున్న ధర్మరాజు ఆ జూదం వల్ల యెంత నష్తపోయానో తెలుసుకుని "సజ్జనులు యెవ్వరూ ఇక జూదానికి పిలిచినా సరే వెళ్ళకూడదు" అని ఆ నియమాన్ని యెత్తివేసేలా చివర్లో తను గెలిచి రాజయ్యాక నిషేధం పెట్టాడని మీకు తెలుసా?ఆ పార్టు వరకూ చదివి వుండరు!విమర్శించటానికీ వెక్కిరించటాంకీ ఆ గాడిద ధర్మరాజు ద్రౌపదిని రేప్ చెయ్యటానికి పర్మిషన్ ఇచ్చాడు అని వాగటానికీ పనికొచ్చ్చే సన్నివేశాల్ని మాత్రమే సెలెక్టివ్ గా చదివి వుంటారు,అవునా!

   ఈ విశ్లేషనతో పాటూ ప్రవీణ్కి జవాబు ఇస్తూ కొందల రావు గారు చెప్పిన దాన్ని అతికించుకుంటే సూత్రప్రాయంగా మీకూ ఈ చర్చకి మూలమైన ప్రశ్నకీ సరయిన జవాబే అవుతుందని నేననుకుంటున్నాను.

   నేను హిందూ ధర్మ ప్రహేళికలు అని వ్యాసాల పరంపర మొదలు పెట్టాను.రామాయణం గురించి పూర్తయింది.తొందర్లోనే భార్తం గురించి యెత్తుకోవాలి.దానికి చాలా సమయం పట్టవచ్చు.ఆంధ్రాలో వ్యాస్భారతం అనువాదం వుంది.వుషశ్రీ గారిది.ఆయనే చెప్పుకున్నాడు కవిత్రయం లోంచి కాకుండా వ్యాసుడు చెప్పింది ఒక్క అక్షరం వదలకుండా వ్యాసుదు చెప్పనిది ఒక్క అక్షరం చేర్చకుండా రాశాను అని.కాబట్టి ఈసారి అటు వెళ్ళినపుడు తెచ్చి అది దగ్గిర పెట్టుకునే రాస్తాను.మీకు ఆ గాడిదకి లాగా వెకిల్తనం లేకుండా సీరియస్ గా తెలుసుకోవాలనుకుంటే అప్పటి వరకూ యెదురు చూడాల్సిందే.
   స్వస్తి

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top