న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 26: రూ. లక్షా 11 కోట్లతో 2015-16 రైల్వే బడ్జెట్‌ రూపొందించామని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు వెల్లడించారు. స్వచ్ఛ్‌ రైల్‌-స్వచ్ఛ్‌ భారతే తమ నినాదం అన్నారు. లోక్‌సభలో గురువారం 2015-16 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి ప్రసంగిస్తూ.. రైల్వేలో విద్యుదీకరణ, డబ్లింగ్‌, ట్రిపులింగ్‌ కోసం ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. దీనంతటికి రూ. 96,182 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం రూ. 2,374 కోట్లు, రైలు మార్గాల విద్యుదీకరణ కోసం రూ. 6,608 కోట్లు, 970 ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి రూ. 6,581 కోట్లు ఖర్చవుతుందన్నారు.

9 రైల్వే కారిడార్‌లలో రేళ్ల వేగాన్ని 110-130 నుంచి 160-200 కి.మి.కు పెంచుతామన్నారు. రైల్వేల్లో పీపీసీ సెల్‌ను ఆధునీకరిస్తామన్నారు. వాద్రా-నాగ్‌పూర్‌, కాజీపేట-విజయవాడ, భద్రక్‌-నార్గుండి, భుజ్‌-నలియాగాగ్‌ల మధ్య మూడో లైన్‌ నిర్మిస్తామని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు వెల్లడించారు.


గాడి తప్పిన రైల్వేను పట్టాలెక్కించేలా బడ్జెట్‌ ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌ను రూపొందించినందుకు సురేష్‌ప్రభుకు రాజ్‌నాథ్‌ అభినందనలు తెలిపారు. రైల్వే బడ్జెట్‌ ఆచరణాత్మకంగా.. వాస్తవికంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. బడ్జెట్‌ ప్రజాకర్షకంగా లేకపోయినా, ప్రజోపయోగకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో నాలుగు ‘ఎస్‌’లకు మంత్రి పెద్దపీట వేశారని అవి.. స్పీడ్‌, సేఫ్టీ, సెక్యూరిటీ, శాటిస్‌ఫ్యాక్షన్‌ అని వెంకయ్య వివరించారు. రైల్వే బడ్జెట్‌ను ప్రగతిశీల ఆలోచనలతో కూడినదిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ప్రయాణికులపై ఎలాంటి భారాన్ని మోపకుండా రైల్వేల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై ఈ బడ్జెట్‌ దృష్టి సారించిందన్నారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయని, గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 25 శాతం ప్రణాళికా కేటాయింపు పెరిగిందన్నారు. గత ఏడాది 2200 కోట్లు కేటాయించగా, ఈ సారి 2768 కోట్లు కేటాయించా రన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్‌ని సంస్కరణల బడ్జెట్‌గా పేర్కొన్నారు. రైల్వేల మౌలిక స్వరూపాన్ని పటిష్ఠపర్చేలా బడ్జెట్‌ రూపకల్పన చేశారని ప్రశంసించారు. ఎన్డీయే సర్కార్‌ తొలి రైల్వే బడ్జెట్‌ మోదీ ఆశయాలు.. స్ఫూర్తితో తొణికిసలాడుతోందని బీజేపీ చీఫ్‌ అమిత్‌షా పేర్కొన్నారు. 

2015-16 రైల్వే బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. గురువారం రైల్వే బడ్జెట్‌ ప్రసంగం విరామ సమయంలో పార్లమెంట్‌ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తదనమేమీ లేదని అన్నారు. కొన్ని అంశాల్లో గతంలో ఉన్న వాటినే మళ్లీ తీసుకువచ్చారని ఆమె పెదవివిరిచారు.

రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేస్తున్నామని చెబుతూ వచ్చిన టీడీపీ, బీజేపీ.. రైల్వే బడ్జెట్‌లో రాషా్ట్రనికి జరిగిన అన్యాయంపై ప్రజలకేం సమాధానం చెబుతాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏపీకి ఏ విధమైన కేటాయింపులు, కొత్త లైన్లు, పెండింగ్‌ పనులకు నిధుల ప్రస్తావన లేకుండా కేంద్రం ద్రోహం చేసిందని, అలాంటి వారితో సీఎం చంద్రబాబు చేతులు కలిపారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రైల్వే బడ్జెట్‌పై కాం గ్రెస్‌ పెదవి విరిచింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేబడ్జెట్‌లో అన్యాయమే జరుగుతోందని, ఈ దఫా రాష్ట్రంలో ఆ రైలు పట్టాలు తప్పిందని కాంగ్రె్‌సపార్టీ ఒక ప్రకటనలో ఎద్దేవా చేసింది. గతంలో ఆగ్నేయ రైల్వేగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎన్‌డీఏ హయాంలో ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో కలిపారని, ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ను చెత్త డబ్బాలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాషా్ట్రనికి ఎన్డీయే అన్యాయం చేసిన ప్రతిసారీ సీఎంగా చంద్రబాబు ఉన్నారని, చేష్టలుడిగి చూడడం మినహా కొత్త పథకాలేవీ సాధించలేకపోయారని ఏపీసీసీ ఆరోపించింది. విభజన చట్టం ప్రకారం మంజూరు చేయాల్సిన రైల్వే జోన్‌ ప్రస్తావన లేకపోవడం విచారకమని పేర్కొంది. స్టేషన్ల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యమంటూ తన నైజాన్ని మరోసారి చాటుకుందని విమర్శించారు. బడ్జెట్‌ రూపకల్పనకు ముందుకు బుల్లెట్‌రైలును తీసుకువస్తామని డాంబికాలు పలికిన టీడీపీ ఎంపీలు ఇప్పుడేమంటారని ప్రశ్నించింది. వాణిజ్యపరంగా అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న వాల్తేరు (రూ.4500 కోట్లు), విజయవాడ (రూ.3600 కోట్లు), గుంతకల్లు (రూ.1300 కోట్లు), గుంటూరు (రూ.500 కోట్లు)పై నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.
రైల్వే బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏమిటి?

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top