ఏపీని బీజేపీ మోసం చేసింది : సీతారామ్‌ ఏచూరి
విజయవాడ, ఫిబ్రవరి 8 : తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే బీజేపీ లాభాలు పొందిందని సీపీఎం సీనియర్‌ నేత సీతారామ్‌ ఏచూరి అన్నారు. కానీ అంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని, ఏపీని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్‌లో కూడా ఇస్తుందన్న నమ్మకం కూడా లేదని ఆయన అన్నారు.

సీపీఎం 24వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారామ్‌ ఏచూరి ఆదివారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఆ విధంగా అభివృద్ధి చేస్తే చాలా మంచిదని... నిజంగా అభివృద్ధి జరుగుతుందా? లేక అంతా భ్రమేనా అని ఆయన అన్నారు.
ఏపీని బీజేపీ మోసం చేసిందన్న సీతారామ్‌ ఏచూరి వాదనతో ఏకీభవిస్తారా?
Reactions:

Post a Comment

 1. కావొచ్చు, కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు అసలు విభజనకు ఎందుకు communist సంస్థలు వత్తాసు పలికాయి?
  నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను, అభివృద్ది వికేంద్రీకరణ జరగడం వలెనే ప్రత్యెక వాదం వచ్చింది తప్ప, ఒకళ్ళు ఇంకొకళ్ళని తోక్కేయడం వల్ల కాదు.
  ఇక ఇంకో విషయం పొలాలు పోతున్నాయి అన్నారు, గతంలో కూడా చెప్పాను అసలు హైదరాబాదు రాజధాని అవ్వడానికి కారణం అది కొండలలో ఉన్నది కాబట్టి, అలాంటి నగరాలు సీమాంధ్ర లో తక్కువ, లేవు అని కూడా చెప్పా వచ్చు!
  నా ఈ ప్రశ్నలు సీతారం గారికి చేరుతాయి అని ఆశిస్తున్నా!

  ReplyDelete
  Replies
  1. ప్రసాదు గారూ, మార్క్సిస్టు పార్టీ తెలంగాణాను వ్యతిరేకించింది. కమ్యూనిస్ట్ పార్టీ, న్యూ డెమాక్రసీల పంధాల గురించి ఏచూరి గారు ఎలా జవాబు చెప్పగలరు?

   ఇకపోతే టీడీపీతో పొత్తు భాజపాకు లాభం అనే మాట సరి కాదు. తెలంగాణా ఉద్యమంలో ఓమోస్తరుగా చురుగ్గానే ఉన్న భాజపా టీడీపీ వల్ల నష్టపోవడమే కాదు ఆంధ్రలో కూడా పెద్దగా ఏమీ సాదించలేదు. భాజపా మద్దతు లేకుంటే చంద్రబాబు గద్దెనెక్కేవారా అన్నది మాత్రం ప్రశ్నార్తకమే.

   Delete
  2. భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఏపీని విభజించవద్దని సీపీఎం పేర్కొంది. రాజధానికి 30వేల ఎకరాలు అవసరమా అనే విమర్శలున్నాయి కదా. రైతుల నుండి భూములు లాక్కోవడం కాకుండా ప్రభుత్వ భూములు, అక్రమ భూములను స్వాధీనం చేసుకోవచ్చు కదా అనే సూచనలున్నాయి.

   Delete
  3. మొదట్లో వ్యతిరేకించాయి తరువాత మద్దతు పలికాయి అనే నాకు గుర్తు, అది ఆయనే సమాధానం చెప్పాలి నా రెండవ ప్రశ్న, నేను సరిగ్గా ప్రశ్నించలేదు
   ఆంద్ర ప్రాంతంలో అతి తక్కువ సమయంలో రాజధానికి అనువైన ప్రదేశం చెప్పమన్నాను!
   ఇక ౩౦ వేల ఎకరాలు అంటున్నారు, చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతంలో భాగంగా చూడాలేమో, ఎందుకంటే రాజధాని కోసం సాగు భూములను బీడు భూములు చేసి తెలంగాణా ప్రాంతంలో బీడు భూములు సాగు భూములు చేస్తాడేమో, దాంతో తెలంగాణా ప్రాతంలో రైతులు చంద్రబాబు వెంట వస్తారు అనే అభిప్రాయం కూడా కావొచ్చు.

   నేను కూడా గతంలో వ్యతిరేకించాను, అసలు రాజధాని వద్దు అనే వ్రాసాను, కానీ నా ఈ పై ప్రశ్నలకు సమాధానం దొరక్క ఇక్కడ వ్రాసాను!

   Delete
 2. రాష్ట్రాన్ని ఏ పద్దతిలో విభజించాలో ఆంధ్రా నాయకులు ఏనాడైనా చెప్పారా? మొన్న ఒక TV చానెల్‌వాళ్ళకి బొత్స సత్యనారాయణ ఒక నిజం చెప్పాడు. తెలంగాణా వస్తుందని తనకి ముందే తెలుసనీ, ఆంధ్రా కోసం పాకేజ్‌లు అడుగుదామని తాను చెపితే కిరణ్ కుమార్ రెడ్డి వినలేదనీ ఆయన అన్నాడు. బొత్స చెప్పినది నిజమేనని నేను నమ్ముతాను. సోనియా చచ్చినా తెలంగాణా ఇవ్వదని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనలు నేను TVలో స్వయంగా చూసాను.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top