2014కి ముందు భాజపా అధికారంలో లేకపోవడం వల్లే ఆ పార్తీ తెలంగాణా బిల్‌కి మద్దతు ఇచ్చింది. అప్పట్లో భాజపా అధికారంలో ఉండి ఉంటే అది తెలంగాణా ఇవ్వడానికి ఒప్పుకునేదే కాదు. చంద్రబాబు నాయుడుకి బాధ కలిగించడం ఇష్టం లేక, తెలంగాణా ఏర్పడితే ISI కార్యక్రమాలు పెరిగిపోతాయని చెప్పి భాజపా తప్పించుకునేది. ఈ విషయం సమైక్యవాదులందరికీ తెలుసు. కాంగ్రెస్‌ని వదిలి వెళ్ళినవాళ్ళలో ఎక్కువ మంది తెలుగు దేశం లేదా వైకాపాలలో చేరగా కొంత మంది భాజపాలో చేరారు. ఇక్కడ ఒక్క విషయం సమైక్యవాదులు గమనించాలి. కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్నడూ తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పుకోలేదు. సోనియా గాంధీ తెలంగాణా చచ్చినా ఇవ్వదని కిరణ్ కుమార్ రెడ్డి, ఘంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్‌లు ప్రచారం చేసారు. వాళ్ళు ముగ్గురూ ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు కాదు. చంద్రబాబు నాయుడు, జగన్‌లు కూడా తెలంగాణా చచ్చినా రాదనే నమ్మకంతోనే తెలంగాణాకి అనుకూలంగా కేంద్రానికి లేఖ వ్రాసారు. ఆరు నెలలకి ఒకసారి మాట మార్చే ఆంధ్రా నాయకుల నాటకాలకి తెర దించడానికి వేరే మార్గం దొరక్క కాంగ్రెస్ తెలంగాణా బిల్‌ని ప్రవేశపెట్టిందని సమైక్యవాదులు ఎందుకు అర్థం చేసుకోకూడదు? వీళ్ళు భాజపాని మాత్రమే విశాల హృదయంతో అర్థం చేసుకోగలరు కానీ కాంగ్రెస్‌ని మాత్రం అలా అర్థం చేసుకోలేరా?
- praveen kumar
Reactions:

Post a Comment

 1. అసలు సమైక్యవాదులు అనేవాళ్ళు యెవరయినా వున్నారా ఈ భూమి మీద వాస్తవంగా యెప్పుడయినా?
  విభజన పూర్తయిన తర్వాత సమిక్యవాదులు అనే మాతకే విలువ లేనప్పుదు ఈ చెత్త ప్రశ్న అవసరమా!

  ReplyDelete
 2. ప్రశ్న:

  సమైక్య వాదులు అనగా ఎవరు ? వివరింపుడు !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 3. http://blog.marxistleninist.in/2015/02/blog-post_21.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top