ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
                 విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించిన స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్‌ అభినందించారు. విధినిర్వహణలో భాగంగా నారాయణరావు అనే స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ పాస్‌పోర్టు విచారణ కోసం శనివారం నాడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10కి వెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత దరఖాస్తు దారుడి ఇంటి చుట్టుపక్కల వారి నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాత దరఖాస్తు దారుడి తండ్రి సదరు కానిస్టేబుల్‌ను పిలిచి డబ్బును ఆఫర్‌ చేశారు. దీంతో నారాయణరావు డబ్బును సున్నితంగా తిరస్కరించాడు. ఇస్తున్నది తక్కువగా ఉండొచ్చనుకుని దరఖాస్తు దారుడి తండ్రి జేబులోంచి మరికొంత డబ్బును జోడించి ఇవ్వడానికి ప్రయత్నించగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మా జీతాలను పెద్ద మొత్తంలో పెంచారు. కాబట్టి మీరిచ్చే డబ్బులు మాకు అవసరంలేదని తిరస్కరించారు. అయితే ఈ విషయాన్ని దరఖాస్తు దారుడు స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్‌చేసి చెప్పారు. మీ పోలీసులు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు, డబ్బులు తీసుకోవాలని బలవంతం చేసినా తీసుకోలేదని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం కానిస్టేబుల్‌ నారాయణరావును క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ముఖ్యమంత్రితో పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌) నాగిరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ అదనపు డిసిపి గోవర్ధన్‌రెడ్డి, పశ్చిమ మండలం ఎస్బీ ఏసిపి కె.ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ కిరణ్‌ల సమక్షంలో నారాయణరావును ముఖ్యమంత్రి అభినందించారు. నిజాయితీగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు గౌరవం దక్కేలా విధి నిర్వహణ చేశావంటూ అక్కడే ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కూడా అభినందించారు.
జీతాలు పెరగడం వల్ల తెలంగాణాలో అవినీతి తగ్గు ముఖం పడుతుందా?
Reactions:

Post a Comment

  1. ప్రైవేత్ ఉద్యోగుల సంగతి ఏమిటి? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచుతారా?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top