హేళన చేయడం.......,

ఇతరులను కావాలని అవమానించడం ..........,

పైకి నికరం గా నటిస్తూ లోపల కుళ్లు ను కుతంత్రాన్ని కలిగి ఉండడం ( దీనినే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడమంటారు) ...................,

ఇతరుల జ్ఞానం పట్ల ఈర్ష్య పెంచుకోవడం............... ,

మనకర్ధం కాలేదని నిజాన్ని జీర్నించుకోలేక అదే అభిప్రాయంతో మనలాగే ఉన్న మరికొందరు మూర్ఖులను కూడగట్టుకుని రాక్షసానందం పొందడం.........,               

మనం చెప్పినదానిని సమర్ధించుకోవడం కోసం అడ్డమైన అబద్ధాలు ఆడడం, మనకు తోచిందే రైట్ ఇంకొకడు చెపితే వినకూడదనుకోవడం ...............,

పుకార్లు సృషించడం ..........................., 

ఇలా అజ్ఞానం తో ఎన్నో ఎన్నెన్నో చిన్నెల్ని జ్ఞానులు చిద్విలాసం తో భరిస్తారు.

అప్పుడే జ్ఞానం నేర్చుకుందామనుకునేవారు మానసికంగా కృంగి పోతారు.  కొందరు రాలిపోతారు.

అయినా .......................!

ఈ రాక్షసులకు చీమ కుట్టినట్లైనా ఉండదు. వీరికి సిగ్గూ , ఎగ్గూ , చీమూ , నెత్తురు ..... లాంటి పదాలు తెలియవు. వారి డిక్షనరీలో ఆ పదాలను వీరు మింగేశారు.

రాటుదేలిన వారు తిరగబడి రాక్షాసానందం ను పారద్రోలుతారు.

అనగననగ రాగమతిశయ్యిల్లుతుంది. తినగ తినగ వేము తీయనవుతుంది. సాధనమున పనులు సమకూరుతాయి ఈ ధరలోన.

అలావటయితే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమే. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా !

సో నేస్తం ! రాలిపోవద్దు. కృంగిపోవద్దు.

రాటుదేలు!  రాటుదేలు!!  రాటుదేలు!!!
- పల్లా కొండల రావు
Reactions:

Post a Comment

  1. మంచి సందేశాత్మక టపా, థాంక్సండీ!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top