ఒక్కరు లేదా ఇద్దరు'తో పెరిగిన లింగవివక్ష..!

-  పెద్దగా మార్పు లేని జననాల సంఖ్య
- మూడోసంతానం గల కుటుంబాలు తగ్గుముఖం
- 'రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' తాజా నివేదిక
              న్యూఢిల్లీ : ''ఒక్కరు లేదా ఇద్దరు చాలు''అన్న కుటుంబ నియంత్రణ నినాదం 2011 నాటికి సాకారమైనట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ 'ఒక్కరు లేదా ఇద్దరు' అనేది మరో కొత్త సమస్యను సమాజం ముందుకు తీసుకొస్తోందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దంపతులు కొడుకునే కోరుకొంటున్నారని, తద్వారా బాలికల జననాల సంఖ్య దారుణంగా పడిపోతోందని సామాజిక శాస్త్రాల అధ్యయనవేత్త ప్రొఫెసర్‌ డా.పి.అరోకియాసామి తెలియజేస్తున్నారు. నాటి 'ఒక్కరు లేదా ఇద్దరు చాలు' అన్న ప్రభుత్వ నినాదం, నేటి సామాజిక శాస్త్రవేత్తల ఆందోళనలు రెండూ నిజమయ్యాయని 2011నాటి 'రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' తాజా నివేదిక లెక్కలు కూడా తెలుపుతున్నాయి. జననాల సంఖ్య తగ్గిపోయిందని, మూడో సంతానం కనడానికి ఇష్టపడని కుటుంబాలు పెరిగాయని, కొడుకు కనాలన్న తాపత్రయం ఎక్కువమంది దంపతులలో వుందని, తద్వారా లింగ వివక్ష మరింత పెరిగిందని తాజా నివేదిక విశ్లేషించింది. అంతేగాక..భారతదేశంలో జననాల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోందని 'రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' తాజా నివేదిక ప్రకటించింది. నవజాత శిశువులలో లింగ నిష్పత్తిలో కూడా బేధం పెరుగుతోందని, మొదటి బిడ్డ లేదా రెండో బిడ్డతో కుటుంబాలు పరిమితమవుతున్నాయని 2011 సెన్సెస్‌ ప్రకారం తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలో 2001-11 మధ్య జననాల సంఖ్య, ఇందులో లింగపరమైన వివరాలు, పుట్టిన బిడ్డ కుటుంబంలో ఎన్నో సంతానం, జన్మనిచ్చిన తల్లి వివాహ వివరాలు..మొదలైనవి సర్వే పొందుపర్చారు. జననాల సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతోంది, మూడో బిడ్డకు జన్మనిచ్చే కుటుంబాల సంఖ్య బాగా తగ్గిపోయింది, బాల-బాలికల మధ్య లింగబేధం మరింత పెరిగిపోయింది..మొదలైన వాటిపై సర్వే ముఖ్యమైన సమాచారాన్ని నమోదుచేసింది. తాజా నివేదిక 2000 సంవత్సరంలో జరిగిన సర్వేతో పోల్చి పలు అంశాల్ని విశ్లేషించింది. 2000 సంవత్సరంలో కోటీ 98 లక్షల జననాలు నమోదయ్యాయి. 2011లో 2.1 కోట్ల జననాలు నమోదయ్యాయి. జననాల సంఖ్యలో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. బాలుర జననాల సంఖ్య 5.44 శాతం పెరగగా, బాలికల జననాల సంఖ్య 4.69 శాతం పడిపోయింది. ఒకరు లేదా ఇద్దరుతో దంపతులు చిన్న కుటుంబాన్ని మాత్రమే కోరుకుంటున్నారని సర్వే లెక్కలు తెలియజేస్తున్నాయి. కుటుంబాల్లో మూడో సంతానం అనేది చాలా గరిష్టస్థాయిలో పడిపోయింది. 
( ఈ వార్త ప్రజాశక్తి దినపత్రిక లోనిది)
కుటుంబ నియంత్రణ వల్ల లింగ వివక్ష పెరిగిందన్న పై వార్తలోని సర్వే నివేదికతో మీరు ఏకీభవిస్తారా?
Reactions:

Post a Comment

 1. పుత్ర సంతానం ఉన్నవానికే స్వర్గం ప్రాప్తిస్తుందని హిందూ పురాణాలలో వ్రాసి ఉన్నప్పుడు మీరు కుటుంబ నియంత్రణని అనుమానిస్తే ఎలా? కుటుంబ నియంత్రణ లేని రోజుల్లో కూడా ఆడ పిల్ల పుడితే నోట్లో నల్ల మందు (opium) పోసి చంపేవాళ్ళు కదా.

  ReplyDelete
  Replies
  1. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడని హిందూ పురాణాలలో చెప్పినట్లు నేను విన్నాను ప్రవీణ్ . అయితే ఆడపిల్లలను నోట్లో నల్లమందు పోసి చంపేయమని హిందూ పురాణాలలో చెప్పినట్లు వినలేదు.

   పుత్రుడుకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం - కూతురికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనే భావజాలం హిందూ పురాణాలలో చెప్పినా , ముస్లిం మతం లో చెప్పినా ఇంకే మతంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా తప్పే. ప్రక్రుతి పరంగా స్త్రీ పురుషులు ఇరువురు ఎవరు దేనికి ఉపయోగపడగలిగే శక్తిని కలిగి ఉన్నారో అందుకు వారిని ఉపయోగించి ప్రగతి సాధించాలి.

   ఆచరణకు అవాంతరంగా ఉన్న సాంప్రదాయాలు - సూక్తులు - నీతులు ఏవైనా కాలపరీక్షలో కొట్టుకుపోక తప్పదు. స్త్రీలను అణచి ఉంచాలనుకునే మనువాదాన్ని , సంఘ్ పరివార్ భావజాలం చేత ప్రభావితుడై పాలన సాగిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మోడీ సర్కారే బేటీ బనావో - బేటీ బచావో అంటున్న విషయం గమనంలో ఉంచుకోవాలి.

   అంటే హిందూ పురాణాలలో ఉన్న చెడులను ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం ఆచరణలో కొనసాగించలేదు. ఎక్కడైనా సరే మంచిని గ్రహించి , చెడుని వదిలేయాల్సి ఉంటుంది. దీనికి అనివార్యంగా భావ సంఘర్షణ జరుగుతుంది. ప్రజల చైతన్యాన్ని బట్టి, ఆచరణలో అనుభవాలను బట్టి నీతులు - సాంప్రదాయాలలో మార్పులు వస్తాయి. వీటిని వేగవంతం చేయడానికి మాత్రమే మేధావులు ఉపయోగపడతారని భావిస్తున్నాను.

   ఇక నేను ఇక్కడ ఇచ్చిన వార్త 'రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' తాజా నివేదిక ప్రజాశక్తిలో పబ్లిష్ అయినది. కేవలం కుటుంబ నియంత్రణ వల్లే ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నదనే ఈ సర్వే నివేదిక నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు.

   ఆడది అబల , పురుషాధిక్యత భావజాలాల్లో అవసరమైన మార్పులు రాకుండా , అదీ గ్రామీణ మహిళలో మార్పు రాకుండా ఈ విషయాలలో ప్రగతి సాధించడం కష్టంగా ఉంటుంది. చాలా విషయాలలో ఆడపిల్లల పట్ల వివక్షను సమర్ధించడంలో ఆడవారి పాత్రే ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలోనే ఆడ వారిని పరిమితులలో పెంచాలని - అబ్బాయిలను ఎంత విచ్చలవిడిగా పెంచినా తప్పు లేదనే వెర్రి భావజాలం ఇంకా కొనసాగుతున్నదని నేను అభిప్రాయపడుతున్నాను.

   అబ్బాయిలనైనా - అమ్మాయిలనైనా పెంపకం విషయంలో మంచి అలవాట్లను ధైర్యాన్ని శాస్త్రీయతను పెంపొందించేలా చూడాలి.

   Delete
 2. హత్యలు చెయ్యమని నేరుగా ఎవరూ చెప్పరు. రోమన్ రిపబ్లిక్‌లో తప్పించుకోవడానికి ప్రయత్నించిన బానిసల్నే సింహం బోనుల్లో పడేసి వాటికి మేపేవాళ్ళు కానీ అణిగి ఉన్న బానిసల్ని మాత్రం చంపేవాళ్ళు కాదు. ఆడ పిల్లని పెంచితే కట్నం ఇవ్వాల్సి వస్తుందనో, తమ కంటే డబ్బున్న సంబంధం దొరక్కపోతే పుట్టింటిలో పోషించాల్సి వస్తుందనో అనుకునేవాళ్ళు ఆడపిల్ల పుడితే నోట్లో గంజాయో, నల్లమందో పోసి చంపుతారు కానీ అందరూ అలా చంపరు. అలా చంపేవాళ్ళు కొంత మంది ఉన్నా అది సామాజిక వెనుకబాటుతనాన్నే సూచిస్తుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top