(ఇమేజ్ ను నమస్తే తెలంగాణా పత్రిక నుండి సేకరించడమైనది)

మనిషి కి తెలివితేటలు ఎలా వస్తాయి? భావావేశాలు ఎలా కలుగుతాయి? వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే అంశానికి సంబంధించి ప్రజాశక్తి దినపత్రిక లో వచ్చిన ఈ వ్యాసం అందరికీ ఉపయోగపడుతుంది. విజయం సాధించినపుడు, ఓటమి పొందినపుడు ప్రవర్తించాల్సిన తీరు, అసలు ఈ భావావేశాలు, తెలివితేటలు ఎక్కడనుండి వస్తాయి. భావావేశాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తెలివితేటలను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు సంపూర్ణంగా కాకపోయినా ఈ ఆర్టికల్ ద్వారా ప్రాధమిక లేదా ఓ మేరకు నిర్ధారణకు వచ్చేందుకు, అనవసర ఆందోళన తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఉంచుతున్నాను. విజయమైనా, అపజయమైనా సమిష్టి గా ఎదుర్కోవాలి. అపుడే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. వ్యష్టి కంటే సమిష్టి ఎపుడూ గొప్పది.

జీవితంలో ఆనందం, సంతోషం, విజయం వంటి వాటి సాధనకు భావావేశ తెలివితేటలు ముఖ్యభూమిక నిర్వహిస్తాయి. తన గురించి తను తెలుసుకుంటూ ఇతరులచేత ప్రతిభావంతంగా పనిచేయించగల సమర్థతను భావావేశ తెలివితేటలుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నతి సాధించేందుకు, మానవ సంబంధాలను ఆత్మీయంగా కొనసాగించేందుకు ఈ తెలివితేటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అనిశ్చితి, భయం, నిరాశ, ఒత్తిడి, జీవితంలోనూ, పనిలోనూ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు భావావేశం కల్గుతుంది. ఈ ఆవేశాన్ని అదుపు చేసుకోగల సమర్థత అవసరం. భావావేశిత తెలివితేటలు గలవారు ఫలవంతమైన, ఉత్పత్తిదాయకమైన రీతిలో సంబంధాలు, అనుబంధాలు ఏర్పరచుకోగల్గుతారు.

ఏ విషయాన్నైనా మనం రెండు రకాల దృష్టితో చూస్తాం. ఒకటి భావావేశపూరిత దృష్టి మరొకటి వివేకదృష్టి. ఈ రెండింటిలోనూ ఏది శ్రేష్టమైనదో చెప్పలేం. ఒక దృష్టితో చూసినవారు, తర్వాత రెండో దృష్టితో ఎందుకు చూడలేదని ప్రశ్నించుకుంటారు. భావావేశ దృష్టి మనిషి అదుపులో ఉండదు. అది ప్రమాదాలను తెచ్చి పెట్టడమే కాక, ఆలోచనా సమర్థతను దెబ్బతీస్తుంది. భావావేశదృష్టిని అణచి ప్రతి విషయాన్ని వివేక దృష్టితో చూస్తే మనిషి ఏ విషయాన్నైనా చూసి ఆనందించడం, అనుభూతి పొందడం వంటివి ఉండవు. రంజకత కొరవడుతుంది. వివేక దృష్టికి అందని సంగతులు మాత్రమే భావావేశిత దృష్టికి వస్తాయి. అవగాహన గలవారికి భావావేశిత దృష్టి అదుపులో ఉంటుంది. అవగాహన కరవైతే భావావేశిత దృష్టి డామినేట్‌ చేస్తుంది.

ఎక్కడ నుండి ఎలా?

మెదడునుండి ఉద్భవించే ఈ రెండు దృష్టులు ఎలా ఉత్పన్నమవుతాయంటే వివేకదృష్టి తల నుండి, భావావేశదృష్టి హృదయం నుండి పుడతాయి. వివేకదృష్టికి కేంద్రం మెదడు ఎడమభాగమైతే, భావావేశిత దృష్టికి కేంద్రం మెదడు కుడి భాగం. వివేకదృష్టి సబబుగా ఉంటుంది. భావావేశితదృష్టి ఆవేశంగా ఉంటుంది. ఆలోచనల సముదాయం వివేకదృష్టి. ఫీలింగ్స్‌తో ముడిపడి వుంటుంది భావావేశితదృష్టి. తార్కికత, యదార్థత వివేక దృష్టిలో ఉంటాయి. ఆత్మప్రభోదం, ఆత్మశ్రయ ధోరణి భావావేశిత దృష్టిలో ఉంటాయి. తిరుగుబాటుదనం, కేంద్రీకరణ, క్రమానుసారం వివేకదృష్టిలో ఉంటాయి. లొంగే లక్షణం, వికేంద్రీకరణ, ఏకకాలంలో జరగడం భావావేశిత దృష్టిలో ఉంటాయి.

తేడా ఎలా ఉంటుంది?

పరాజితులు యజమానులుగా ఉన్నప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనలేక, ఇతరులమీద చిరాకుపడతారు. వీరి మూడ్స్‌ సులువుగా మారిపోతూ ఉంటాయి. విజేతలు యజమానులుగా ఉంటే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమపై తాము నమ్మకంతో ఉంటారు. పరాజిత యజమానులు అపజయం చవిచూసినప్పుడు దానికి ఇతరులను కారకులుగా చేస్తారు. విజేతలు అపజయాన్ని అంగీకరించి బాధ్యతను స్వీకరిస్తారు. సులువుగా విమర్శలు, క్షమాపణలు చెబుతారు పరాజిత యజమానులు. విజేతలు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జీవితకాలం భావావేశాల తెలివితేటలు అభివృద్ధి చెందించుకోవచ్చు. మేథాపరమైన తెలివితేటలు ఇలా అభివృద్ధి చెందవు. మనిషి మానసికంగా పరిపక్వత చెందుతుంటే ఆలోచనలు, అనుభవాలు, ఫీలింగ్స్‌ వంటివి భావావేశిత తెలివితేటలు అభివృద్ధి చెందడంలో కీలకపాత్ర వహిస్తాయి. భావావేశిత తెలివితేటలు మనిషి జ్ఞానం కామన్‌ సెన్సుకు అనుబంధమై మానసిక పరిపక్వతలో వికసిస్తాయి. వారసత్వంగా ఇవి దిగుమతి కావు. మేథాపూరితమైన తెలివితేటలు నిజానికి మనిషికి గొప్ప ఆస్తి. విద్యార్థి దశ నుండి చదువుతోపాటు ఇతరులతో అనుబంధం పెంచుకోవడం, నాయకత్వ సమర్థత వృద్ధి చేసుకోవడం వల్ల ఆనందం, సంతోషం పొందుతూ విజేతలవుతారు.

నైపుణ్యాలు పెంచుకోవడం

నైపుణ్యాలు పెంచుకోవాలంటే చొరవ కావాలి. 'రిస్కు' తీసుకోగలగాలి. రిస్కు తీసుకునేటప్పుడు విజయావకాశాలపై దృష్టి కేంద్రీకరించాలి. నష్టాలపై దృష్టి సారించకూడదు. ఇతరుల సహకారం తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి. అభివృద్ధిని కనబరిచిన వారికి రివార్డులు ఇవ్వాలి. లాభం వచ్చిందని సంతోషం, నష్టం వచ్చిందని విచారం కూడదు. ప్రతి దానిని భవిష్యత్‌ ప్రణాళికకు మార్గదర్శకంగా తీసుకునే అలవాటు చేసుకోవాలి. మనసును లగ్నం చేసి బాగా వినడం అలవరచుకోవాలి. అప్పుడు ఇతరుల మనసును గెలుచుకుంటారు. ఒత్తిడి లేకుండా చేసుకోవాలి. విజయం సాధించాలని నిర్ణయించుకోవాలి. చర్య తీసుకోవాలని, అలవాట్లు మార్చుకోవాలని, భిన్నంగా ఆలోచించాలని నిర్ణయించుకుంటే ఒత్తిడి లేకుండా ప్రతిభావంతంగా ముందుకు వెళ్లగల్గుతారు. ఎవరికి వారే తమ నైపుణ్యాలను, శక్తులను గుర్తుంచుకుని ఆత్మస్థయిర్యాన్ని పెంచుకోవాలి. ఇతరులు తమను బలపరిచేటట్లు చేసుకోవాలి. కొత్త కొత్త ప్రవర్తనలకు జీవితంలో చోటు ఇవ్వాలి. ఫలితాలు ఎలా ఉంటాయో తెలియపరిచే ఊహాచిత్రం తయారుచేసుకోవాలి. పాత అలవాట్లలో ఉండిపోవాలని మనసు కొత్త వాటిని వ్యతిరేకిస్తుంది. కొత్త ప్రవర్తన వల్ల అసౌకర్యం ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయని గ్యారెంటీ ఉండదు.కొత్త నైపుణ్యాలు, ప్రవర్తనలు ప్రాక్టీసుతో అలవడతాయని మరువకూడదు.

విజయం సాధించినప్పుడు ఉత్సవాలు చేసుకోవాలి. అందరికంటే మనం బలవంతులం కాదు. అందుకే జట్టు కృషి మంచిది. సలహా అవసరమైనప్పుడు, ఒత్తిడికి బాగా లోనయినప్పుడు, యదార్థమైన ఫీడ్‌బ్యాక్‌ కావలసినప్పుడు, అవస్థలో ఉన్నప్పుడు, అర్థం కానప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి. ప్రతి పనికీ అవరోధాలు, రిస్కు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగడంలో నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇతరులు సాధారణంగా ఎవరినీ అంగీకరించరు. నిరంతర కృషి, క్రమశిక్షణ, ప్రణాళికలతో కూడిన ప్రయత్నాలు గలవారిని తప్పక సమాజం గుర్తిస్తుంది. గుర్తింపు మనిషిలో ఉత్సాహాన్ని కలుగజేసి ప్రగతిపథం వైపు అడుగులు వేయిస్తుంది.

రచయిత - సి.వి.సర్వేశ్వరశర్మ, sarma.chavali@gmail.com

సేకరణ : ప్రజాశక్తి డైలీ నుండి  , (ఈ పోష్టు రీ పబ్లిష్ చేయబడింది)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top