హిందూ మతంలో వందేళ్ళ క్రితం భర్త చనిపోయిన స్త్రీకి గుండు గియ్యించడం, భోగం వృత్తి లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. రెండు వందల సంవత్సరాల క్రితమైతే సతీ సహగమనం కూడా ఉండేది. నిజాం పాలిత ప్రాంతాలలో అయితే 1870 వరకు సతీ సహగమనం కొనసాగింది. హిందూ సంప్రదాయాలు ఒక్కో కాలంలోనూ, ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కోలా ఉంటాయి. ఈ విషయం హిందువులని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఇది "హిందూ మతం అనేది నిజంగా ఒక మతం కాదు, అది కేవలం ఒక జీవన విధానం. హిందూ సంప్రదాయాలన్నీ పరిణామ క్రమంలో ఏర్పడినవి, ఖురాన్, హదీస్‌లాగ హిందువులకి ప్రామాణిక గ్రంథాలు లేవు, మత గ్రంథాలు చదవడం హిందువులకి తప్పనిసరి కాదు" అని. నేను "ఇస్లాం మతం కూడా ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం" అని నిరూపించగలను. ఇస్లాం మతం కూడా ఒక పరిణామం ప్రకారం పుట్టినది అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.

ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధమని మనందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు ముస్లింలు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళని ఎంత మందికి తెలుసు? విగ్రహారాధనని అనుమతిస్తూ ముహమ్మద్ ప్రవక్త పలికిన ప్రవచనాలు ఒకప్పుడు ఖురాన్‌లో ఉండేవనీ, వాటిని తరువాత తొలిగించడం జరిగిందనీ ఎంత మందికి తెలుసు? ఆ వచనాలు ఇప్పుడు ఖురాన్‌లో లేకపోయినా ముగ్గురు ముస్లిం చరిత్రకారులు వ్రాసిన గ్రంథాలలో అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ వచనాలని సైతాన్ ప్రవచనాలు (Satanic verses) అంటారు. ఆ ముగ్గురు చరిత్రకారులు వ్రాసిన గ్రంథాలని నిషేధించలేదు కానీ సల్మాన్ రష్దీ వ్రాసిన The Satanic Verses నవలని మాత్రం చాలా దేశాలలో నిషేధించారు.

ముహమ్మద్ ప్రవక్త అరేబియా ఎడారిలోని కురైష్ అనే సంచార జాతిలో జన్మించాడు. అది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ వ్యాపారం చేసే జాతి. ఆ జాతి వాళ్ళ మతం విగ్రహారాధన. హిందువులలాగే ఒకప్పుడు అరబ్బీయులు కూడా విగ్రహారాధన చేసేవారు. అంతే కాదు, వారు బహుదేవతారాధన కూడా చేసేవారు. కురైష్ జాతి వారు ఆరాధించిన దేవతలలో ప్రధానమైన దేవతలు ముగ్గురు. ఆ ముగ్గురూ ఆడ దేవతలు. వారి పేర్లు అల్లాత్, ఉజ్జా, మనాత్. ఇస్లాం పుట్టిన తరువాత కూడా కొంత కాలం పాటు అరబ్ సమాజంలో విగ్రహారాధన, బహుదేవతారాధన కొనసాగాయి. ఇస్లాంపై వ్యతిరేకత కలగకుండా ఉండేందుకు ముహమద్ ప్రవక్తే విగ్రహారాధనని అనుమతించాడు. కురైష్ జాతి వారి ప్రధాన దేవతలైన అల్లాత్, ఉజ్జా, మనాత్‌లని ఆరాధించడానికి తాను అనుమతిస్తున్నట్టు ముహమ్మద్ ప్రవక్తే తన నోటితో చెప్పాడు. ఆ సమయంలో ముహమ్మద్ ప్రవక్త పలికిన వచనాలు మొదట్లో ఖురాన్‌లో ఉండేవి. అవి ముహమ్మద్ తన ఇష్ట ప్రకారం పలికిన వచనాలు కావనీ, అవి సైతాన్ వచనాలనీ చెప్పి వాటిని ఖురాన్ నుంచి తొలిగించారు. అంతే కాకుండా అరబ్ సమాజంలో విగ్రహారాధనని పూర్తిగా నిషేధించారు.

సైతాన్ వచనాలు ఖురాన్‌లోని 53వ భాగమైన సురాత్ అన్-నజ్మ్‌లో ఉండేవి. సురాత్ అన్-నజ్మ్ అంటే Chapter of the Star అని అర్థం. పూర్వం అల్-వాకిదీ, అత్-తబరీ. ఇబ్న్ ఇషాక్ అనే ముగ్గురు చరిత్రకారులు ఉండేవారు. వారు ముహమ్మద్ ప్రవక్త జీవితానికి సంబంధించిన ఘటనలు సేకరించి వ్రాసేవారు. అందులో భాగంగా వారు సైతాన్ వచనాలని కూడా సేకరించి భద్రపరిచారు. ఆ వచనాలే సల్మాన్ రష్దీ వ్రాసిన The Satanic Verses నవలకి స్పూర్తినిచ్చాయి. జనానికి సైతాన్ వచనాల గురించి తెలిస్తే ఇస్లాం మతం కూడా పరిణామంలో భాగంగా ఏర్పడిన మతం అనే విషయం తెలిసిపోతుందనే భయంలో చాలా దేశాలలో ఈ నవలని నిషేధించారు. కానీ ఆ వచనాలని ఎప్పుడో బయట పెట్టిన ముగ్గురు ముస్లిం చరిత్రకారుల రచనలని మాత్రం ఎక్కడా నిషేధించలేదు. 

Pre-Islamic Arab Paganism (ఇస్లాం పూర్వపు అరేబియన్ విగ్రహారాధక మతం)లో చాలా మంది దేవతలు ఉండేవారు కానీ వారిలో ప్రధాన దేవతలు ముగ్గురు. వారి ముగ్గురి గురించి ఇక్కడ వ్రాస్తున్నాను. 


అల్లాత్: అరబ్ భాషలో అల్-లాహ్ అంటే దేవుడు అని అర్థం, అల్-లాత్ అనేది స్త్రీలింగం. అల్లాహ్ మొదటి కుమార్తెని అల్లాత్ అనేవారు. తాఇఫ్ వద్ద అల్లాత్‌కి ఒక దేవాలయం ఉండేది. దాన్ని ముహమ్మద్ ప్రవక్త కూల్చి వెయ్యించాడు. 


ఉజ్జా: ఈమె కూడా అల్లాహ్ కుమార్తెలలో ఒకరు. ఈమెని చరిత్రకారులు రోమన్ దేవత Venus Caelestisతో సమానంగా పరిగణిస్తారు. ఈమెకి ఒక దేవాలయం ఉండేది. దాన్ని ఖలీద్ ఇబ్న్ అల్-వాలీద్ కూల్చివెయ్యించాడు.

మనాత్:ఈమె కూడా అల్లాహ్ కుమార్తె. ఈమెని అరబ్బీయులు అదృష్ట దేవతగా భావించేవారు. ముహమ్మద్ ప్రవక్త బతికి ఉన్న కాలంలో అరబ్బీయులు ఈమెని ఆరాధించారు. ఈమె దేవాలయాన్ని ముహమ్మద్ ప్రవక్త కూల్చివెయ్యించాడు.

ఒకప్పుడు యూదులు కూడా విగ్రహారాధన చేసేవారు. యాకోబ్ భార్య రాఖెల్ లాబన్‌ని చెందిన విగ్రహాలని దొంగిలించింది. యాకోబే ఆ విగ్రహాలని దొంగిలించాడని లాబన్ అనుమానించాడు. ఈ కథ చదివితే యూదులలో కూడా ఒకప్పుడు విగ్రహారాధన ఉండేదని అర్థమైపోతుంది. 

హిందూ మతాన్ని ఒకరు స్థాపించలేదనీ, దానికి ఒక ప్రవక్త లేడనీ, కనుక హిందూ మతం ఒక మతం కాదని కొందరు హిందూత్వవాదులు అంటున్నారు. యూదు మతాన్ని కూడా ఒకరు స్థాపించలేదు. యూదులకి ఉన్న అనేక మంది ప్రవక్తలలో మోషే ఒకడు అంతే కానీ యూదు మతాన్ని మోషే స్థాపించలేదు. అయినా యూదు మతాన్ని ఒక మతంగా ఎందుకు పరిగణిస్తున్నాం? ఏ మతమైనా పరిణామక్రమంలో భాగంగా పుట్టినదే. ఒక వర్గంవాళ్ళ విశ్వాసానికి 'మతం' అనీ, ఇంకో వర్గంవాళ్ళ విశ్వాసానికి 'జీవన విధానం' అనీ పేర్లు పెడితే అందులో తేడా ఏమీ రాదు. 

యూదులు & ముస్లింల సంప్రదాయాలు అన్ని దేశాలలో దాదాపు ఒకేలా ఉంటాయి. హిందూ సంప్రదాయాలే ప్రాంతానికి ఒకలా మారుతాయి. తెలంగాణలో పెళ్ళి భోజనాలలో మాంసాహారం పెడతారు కానీ కోస్తా ఆంధ్రలోని పెళ్ళి భోజనాలలో మాంసాహారం పెట్టరు. మా శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దుల్లో ఉంది కనుక ఇక్కడ కొన్ని గ్రామాలలో శుభకార్యాలలో మాంసం వండితే కొన్ని గ్రామాలలో శుభకార్యాలలో శాకాహారమే పెడతారు. కొంత మందైతే శాకాహారులకీ, మాంసాహారులకీ వేరువేరు ఏర్పాట్లు చేస్తారు. యూదులు & ముస్లింలూ ఏ దేశంలో ఉన్నా పంది, కుక్క లాంటి అపరిశుభ్ర జంతువుల మాంసం ముట్టుకోరు. అమెరికాలోని యూదులు పంది మాంసం తినడం గానీ చైనాలోని యూదులు కుక్క మాంసం తినడం గానీ ఎన్నడూ జరగదు. ఆచార వ్యవహారాలలో కాలప్రాంతీయ బేధాలు ఉన్నా, లేకపోయినా మతం అనేది ఒక విశ్వాసం తప్ప ఇంకొకటి కాదు. 

- Praveen Kumar
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top