అరవై ఏళ్ల వయసు వరకు అతనికి రాజకీయం తెలీదు. కానీ ఆ తరువాత ఎందరికో రాజకీయ జీవితం అందించారు. రాజకీయాలలో తలపండినవారిగా,  మహా మహా పండితులనుకుంటున్నవారిగా చెప్పబడుతున్న నేతల అంచనాలను తలదన్నుతూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో ప్రభంజనం సృష్టించగలిగిన సంచలనం ఆయన. ఇప్పటికీ తెలుగునాట మారుమూల పల్లెల్లో సైతం మారుమ్రోగుతున్న పేరు ఆయనది.

రాజకీయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పసివారిని సైతం ఆలోచించేలా చేశారు. రాజకీయానికి కొత్త అర్ధం చెప్పారు. ప్రజారంజకంగా పాలన చేయాలంటే రాజకీయానుభవం లేకున్నా ప్రజలకు ఏదో చేయాలనే తలంపు, పట్టుదల, మొండితనం ఉంటే చాలు అని అనేక వినూత్న పథకాల అమలు ద్వారా నిరూపించారు. పాలన అంటే రూపాయి రాక పోకల లెక్కలు మాత్రమే కాదని సంక్షేమానికి పెద్దపీటవేసి ఆచరణలో ఎలా అమలు సాధ్యమో చూపిన ఆయన బాటను నేటికీ ఆదర్శంగా తీసుకోకతప్పడం లేదంటే అతిశయోక్తి లేదు. పాలనకు పటేల్ పట్వారీలు ఎమ్మెల్సిలు అవసరం లేదనిపిస్తే ఏకబిగిన రద్దు చేయగలిగిన సత్తా ఉన్నవాడు.

ఏ రాజకీయం తెలీదో, ఏ మొండితనం మెండుగున్నదో , ఏ రెండు లక్షణాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చిరస్థాయి కీర్తిని మూట గట్టుకునేలా చేశాయో ఆ రెండు లక్షణాలే ఆయనను చివరి రోజులలో అష్టకష్టాలు పడేలా చేశాయి. రెండో వెన్నుపోటుని ఆయన ఎదుర్కోలేకపోవడానికి, ప్రజల మద్ద్తతు పొందలేకపోవడానికి కారణం కేవలం ఆయనకున్న ఆ రెండు లక్షణాలే అని చెప్పాలి. 

ఆ తరువాత ఆయన పేరును రూపుమాపేందుకు  ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మద్దతు లభించలేదు. ఆయన పెట్టిన పార్టి ఆయనకు దక్కకున్నా ఆయన పుట్టిన రోజునే మహానాడులు జరుపుకుంటున్నదంటే తెలుగు ప్రజలలో ఆయనకున్న మమకారమే తప్ప రాజకీయ కుటిల నీతి బాగా తెలిసిన నేతల కృతజ్ఞతలతో మాత్రం కాదు.

సినిమా నటుడిగా ఆయనకున్న క్రేజ్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇంకెవ్వరికీ ఎప్పటికీ రాదేమో. ఆయన నటన, వాచకం, వివిధ పాత్రలలో ఒదిగిన తీరు అనితర సాధ్యం. ఎప్పటికీ తెలుగువారు గర్వించదగ్గ చరిత్ర నందమూరి తారక రామారావుది. ఈ రోజు ఎన్.టి.ఆర్ జన్మదినం. ఎన్.టి.ఆర్ చరిత్ర తప్పనిసరిగా అనేక విషయాలలో చాలామందికి పాఠం-గుణపాఠం నేర్పుతుంది.
దాన వీర శూర కర్ణ వీడియో పార్ట్ 


Reactions:

Post a Comment

 1. మీరు ఎన్టీఆర్ అభిమాని అనుకుంటా. అంచేతనే ఆయన జోకర్ వేషాలు, అస్తవ్యస్త పాలన, పిచ్చి తుగ్లక్ పతకాలు & ప్రోత్సహించిన మారణ కాండలు ప్రస్తావించలేదు!

  ReplyDelete
  Replies
  1. మీకు మెయిల్ చేస్తుంటే రిటర్న్ వస్తుంది జై గారు. మీ మెయిల్ ఐ.డీ మారిందా?

   Delete
  2. మీకు ఇప్పుడే ఈ కింది మెయిల్ పంపాను సార్:

   కొండలరావు గారూ, మీరు ఎ మెయిల్ ఇడీకి పంపారో మళ్ళీ ఈ ఇడీకి మళ్ళీ పంపిస్తారా థాంక్సండీ. నా ఐడీ ఇదేనండీ మారలేదు.

   Delete
 2. I just tried to use the same logic & reasoning and couldn't resist the question :)

  జై గారు,

  మీరు కేసిఆర్ అభిమానా? అంచేతనే ఆయన లోఫర్ మాటలు, అస్తవ్యస్త పాలన, పిచ్చి తుగ్లక్ పధకాలు, ఆర్భాటపు ప్రకటనలు & ప్రోత్సహించిన ఆత్మహత్యలు ఆయన గురించిన చర్చల్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు!

  ReplyDelete
  Replies
  1. @Edge గారు,

   I think logic is missing in your comment.

   కొండలరావు గారు ఒక NTRపై ఒక వ్యాసం వ్రాశారు, జై గారు దానిలో కొన్ని విషయాలు లేవని అడిగారు.
   జై గారు KCRపై ఎలాంటి వ్యాసం రాయలేదు, మీరు రాయని వ్యాసంలో కొన్ని విషయాలు లేవని అడుగుతున్నారు.

   మీరు కూడా అనేక చర్చల్లో పాల్గొంటారు. మీరు వాటిలో ఫలానా విషయం ఎందుకు ప్రస్తావించలేదు అని అడిగితే ఎలా వుంటుంది? మీరు చర్చల్లో విషయ ప్రాతిపదికన పాల్గొంటారు, అంతే తప్ప పాల్గొన్న చర్చల్లో ప్రతి విషయాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. కాని ఒక విషయయం మీద వ్యాసం రాసినప్పుడు మంచి చెడులు పూర్తిగా ప్రస్తావించినపుడే అది సంపూర్ణమైనదిగా పరిగణించ బడుతుంది.

   Delete
  2. @Edge:

   నేను కెసిఆర్ లేదా మరో వ్యక్తి గురించి గురించి సాధారణంగా రాయను. ఒకవేళ రాస్తే తప్పక మంచి చెడు రెండూ పరిగణలో తీసుకుంటాను.

   PS: "లోఫర్ చేష్టలు" అనాలేమో :)

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top