'అవును' లేదా 'లేదు' అనడం నేర్చుకోండి ....... మోడీ !


తెల్లవారి లేచిన దగ్గరనుండి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే అవును లేదా లేదు అని త్వరితంగా నిర్ణయం తీసుకొనవలసిన అవసరం వస్తుంది. రేపు ఉద్యోగానికి లేదా విద్యాలయానికీ వెళ్ళాలా వద్దా అన్నది ముందు రోజు నిర్ణయమైపోయి ఉంటాయి. ఒక హఠాత్ సంఘటన ఏర్పడినపుడు నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఎవరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది ముందుగా ఆలోచించి నిర్ణయించుకోలేం ! అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవలసి రావచ్చు,అవును లేదా కాదు అని నిర్ణయం తీసుకునే వ్యవధి మనకు ఉండదు.అఖిల పక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలూ అడిగి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ యుద్ధ రంగంలో ఉండదు.

కొన్ని తప్పులు చరిత్రలో జరిగిపోయాయి.అవి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కావు.బోఫోర్స్ కుంభకోణం లో ఏమైనా తప్పులు జరిగిఉంటే స్నేహితులు అని నమ్మిన వారివల్ల జరిగి ఉండవచ్చు కాని తరతరాలుగా వంశపారంపర్యంగా సంపద,అధికారం వారసత్వంగా వస్తూ ఉంటే కేవలం 60 కోట్ల అక్రమ సంపాదన కోసం ఆశపడే మనస్థత్వం ముడుపులు తీసుకోవలిసిన అవసరం రాజీవ్ గాంధీకి లేదు.

అద్వానీ రధయాత్రకి పిలుపునిచ్చిన తర్వాత వేల సంఖ్యలో శ్రీరామ సేన ఒక్కసారిగా అయోధ్యలో చేరుకున్నతరువాత మసీదుని పడగొడితే రెచ్చిపోయిన జనాన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు.2000మంది చనిపోయినా లక్షలాది మంది క్షతగాత్రులైనా శ్రీరామసేనలో ఆవేశం చల్లారలేదు.పురాతన శిధిలాలు ఉన్నాయని కోర్టు దృవీకరించే వరకూ ఆగి ఉంటే ఆలయ నిర్మాణం ఆగేది కాదు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని తపించిపోయిన వారిలో వై ఎస్ ఆర్ ముఖ్యులు.ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన చేసినంత అధికార దుర్వినియోగం మరొకరు చేసి ఉండరు. ఎపుడు ఏ రాజకీయ నాయకుడికి కోపం వచ్చినా,ఎవరు ఏ కోరిక తీర్చుకోవాలన్నా హైదరాబాద్ పాతబస్తీ నే వేదిక !పాదయాత్రతో మొదలుపెట్టి ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ,ఋణ మాఫీ వంటి ఆకర్షణీయక పధకాలతో కాంగ్ర్స్ పార్టీ తరుపున అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.

ఉచిత విద్యుత్ వద్దని మన్ మోహన్ సింగ్ గారు వారించినా వై ఎస్ ఆర్ గారు వినలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ అఖండవిజయం సాధిస్తే అది ఉచిత విద్యుత్ వల్లనే విజయం లభించినదన్న సంబరంతో ఋణ మాఫీ కూడా చేసారు.జనాకర్షక పధకాలు ప్రకటించగానే సరికాదు కదా వాటికి ఆర్ధిక వనరులు ఏర్పరచాలంటే అక్రమ సంపాదన కావాలి. అలా మొదలైన వై ఎస్ ఆర్ అకృత్యాలతో కాంగ్రెస్ పార్టీ కి నేరుగా సంబంధం లేకపోయినా తమ పార్టీ తరుపున తరుపున జరిగిన తప్పుని కాదనలేరు.

కాంగ్రెస్ పార్టీిని తట్టుకుని నిలబడాలంటే తాము కూడా ప్రజాకర్షక పధకాలు ఇవ్వాల్సినదేనన్న భావనతో లోకేష్ అనే మహానుభావుడి మదిలో నగదు బదిలీ పధకం రూపుదిద్దుకుంది. నగదు బదిలీ పధకం అంటే ఆర్ధికంగా భారం అని తెలుసుకున్న విద్యావంతులు కొందరు చంద్రబాబు నాయుడుగారికి ఓటు వేయకపోవడం వల్ల రెండవసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

వై ఎస్ ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు. 2009 ఎన్నికలకు ముందు సచివాలయంలో మంటలు చెలరేగి దస్త్రాలు కాలిపోయాయి. గుడెసెలకు నిప్పు పెట్టేవాళ్ళే సచివాలయానికీ నిప్పు పెట్టగలరు.తరువాత వచ్చిన ముఖ్యమంత్రులకు మాజీల గురించి ఆలోచిస్తే మాజీలయిపోతామని భయం ఉంటుంది కదా ?

అధికారానికి 9 సంవత్సరాలు దూరంగా ఉండడంతో ఎలాగైనా గద్దెనెక్కాలన్న అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడుగారు పాదయాత్ర మొదలెట్టి కనపడినవారందరికీ వరాలిచ్చేసారు. ఎటువంటి వరాలు ఇవ్వకపోయినా ఈజీగా గెలిచే పరిస్థితి వచ్చినా పాదయాత్రలో ఇచ్చిన వరాలు ఋణ మాఫీ రూపంలో ఇద్దరి చంద్రులను చుట్టుముట్టాయి.

ప్రతి మనిషిలో స్వార్ధం ఉండాలి. ఆ స్వార్ధం జీవితంలో ఎదగడానికి ఉపయోగిస్తే తప్పులేదు.తన స్వార్ధం కోసం ప్రక్కవాడిని బలి చేయడం మాత్రం క్షమించరాని నేరం.ఒక లక్ష్యం నిర్ణయించుకున్న తరువాత ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి మన అడుగులు పడతాయి.లక్ష్యం ఏదైనా కానివ్వండి అది మన కోరిక కాబట్టి కృషి చేసితీరతాం.లక్ష్యం కోసం పోరాడే క్రమంలో అక్కడికి చేరుకోడానికి దారులు వెతుకుతుంటాం,దారులు మూసుకుపోతూ ఉంటాయి.కొత్తదారి పట్టుకుంటాం,దారితప్పుతుంటాం,పద్మవ్యూహంలో చిక్కుకుంటాం,వెనక్కి వచ్చేద్దమనుకున్నా రాలేని పరిస్థితి,ఏ రాముడో,కృష్ణుడో వస్తారని ఎదురుచూస్తాం, కధ కాదు కదా జీవితం, ఎవరూ రారని తెలుసుకుంటాం,ఎటూ దిక్కుతోచక అడ్డదారులేమయినా ఉన్నాయా అని కూడా వెతుకుతుంటాం.

రాముడులాంటివాళ్ళే తప్పు చేసారు కదా మనం కూడా తప్పు చేసేద్దామా అన్న ఆలోచన వస్తుంది.తప్పు చేయాలా వద్దా అన్న సంగ్దిగ్ధత ఎదరవుతుంది.ఊరిస్తున్న లక్ష్యం ఒకవైపు తప్పుచేస్తే కానీ ఏదీ సాధించలేమన్న భ్రమలు ఒకవైపు నిలుస్తాయి.అవును లేదా కాదు అని నిర్ణయం తీసేసుకోవాలి.ఆలోచించుకునే వ్యవధి కూడా ఉండదు.తప్పటడుగు వేస్తున్నామని తెలుస్తూనే ఉంటుంది,తప్పు చేయకుండా ఉండలేని పరిస్థితి,తప్పు చేసేస్తాం,అవును అని ఎంచుకున్నాం కదా ఫలితం వస్తుంది.మనకు అనుకూలంగా ఫలితం వచ్చింది.సాధించేసాం అన్న గర్వం మన మనసులను తేలికపరుస్తుంది.

మనం తప్పు చేసి వక్రమార్గంలో గెలిచామని మనకు తెలుస్తూనే ఉంటుంది.మన అంతరాత్మ తప్పు చెసావు అని దెప్పుతూనే ఉంటుంది,దాని గొంతునొక్కేయాలని ప్రయత్నిస్తుంటాం.అనవసరంగా హడావిడి చేస్తుంటాం సంబరాలు చేసుకుంటుంటాం,ఆ సంబరాల్లో మనం ఉంటాము కానీ మనసులో సంబరం ఉండదు.గెలిచామని అనుకుంటాం కానీ అది గెలుపుకాదని తెలుస్తూనే ఉంటుంది.

జీవితంలో ప్రతిరోజూ ప్రతి దశలో అవును లేదా కాదు అని నిర్ణయించుకోవలసి వస్తుంది. ఎవరి జీవితంలోనైనా ఈ రెండు ఆప్షన్ లే ఉంటాయి. ఫిఫ్టీ ఫిఫ్టీ, ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్ లాంటి ఆప్షన్స్ ఉండవు. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలే రేపటి మన భవిష్యత్తు. మన భవిష్యత్తు మనకు ముఖ్యం,ఎవరు ఎటుపోతే మనకెందుకు ? మనం గెలిచామా లేదా అని ప్రజలు చూస్తారు కానీ ఎలా గెలిచామో చూడరు కదా ? జీవితం అన్న తరువాత తప్పులు చేయకుండా ఉండలేం కదా ? తప్పు చేసేద్దాం...గెలిచేద్దాం ! అవును లేదా లేదు అని నిర్ణయించుకుందాం పదండి.ఈనాటి తప్పులే రేపటి మన భవిష్యత్తు !
-నీహారిక కృష్ణమూర్తి
--------------------------------------------------

మీరూ 'జనవిజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
*Republished
Reactions:

Post a Comment

 1. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వోత్‌లు ఎక్కువగా పోలవరం, పులిచింతల కాలువల ప్రతిపాదిత ప్రాంతాల్లోనే పడ్డాయి. ఆ రెండు ప్రాజెక్త్‌ల పేర్లు చెప్పుకోకపోయుంటే 2009లో కాంగ్రెస్ గెలిచేది కాదు.

  ReplyDelete
 2. ఇంకో విషయం, రాజశేఖరరెడ్డి సన్నిహితుడైన రామలింగరాజు చేసిన కుంభకోణం కూడా ఎన్నికలకి ముందే బయటపడింది. అందువల్ల కూడా రాజశేఖరరెడ్డి తాను రెండోసారి ముఖ్యమంత్రి అవ్వను అనుకున్నాడు.

  ReplyDelete
 3. మోడీకి ఏ విషయంలో ఏమి సలహా ఇవ్వాలనుకున్నది ఈ పోస్టులో ఏమి చెప్పారో నాఉ అర్ధం కాలేదు నీహారిక గారు.

  ReplyDelete
  Replies
  1. ఈ పోస్టుకి "అవును లేదా లేదు అనడం నిర్ణయించుకోండి" అనే టైటిల్ పెట్టాను. కొండల రావుగారు "తప్పుచేద్దాం...గెలిచేద్దాం" గా మార్చి ప్రచురించారు. ఈ పోస్టు టైటిల్ వల్ల తప్పు చేయమని సలహా ఇచ్చినట్లుగా భావించే అవకాశం ఉంది.మంచి చెడు ఏదైనా ఎంపిక చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి "అవును"లేదా "లేదు"(yes/no) లలో ఏదైనా ఒకటే ఎంచుకునే స్వేచ్చ కలిగిఉండి ఎవరికి వారు నిర్ణయించుకోవాలని చెప్పడమైనది.

   Delete
  2. మోడీ ప్రస్తుతం మౌనమునిలా మన్మోహన్ లా ఉన్నాడనా? ఆ విషయం క్లుప్తంగానైనా చెప్పలేదని అడిగాను. మీరు ఇచ్చిన హెడింగ్ మార్చాను.

   Delete
 4. నా పోస్టుని vasil suresh అనే అతను తన బ్లాగులో వ్రాసుకుని తన పేరు వేసుకున్నారు.అడిగితే సమాధానం లేదు. ఎవరి రచన అయినా కాపీ కొట్టి తన పేరు వేసుకోవచ్చు. ప్రతి రచయత/రచయిత్రి కి ఒక స్టైల్ ఉంటుంది. వారు తమపేరుతో ప్రచురించుకున్నా పాఠకులు గుర్తుపట్టేస్తారు. అనుకరణ మంచిదే కానీ చౌర్యం మంచిది కాదు.

  http://nelloreblogs.blogspot.in/2015/06/blog-post_448.html?showComment=1435500647485#c6374060094986988918

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top