'పల్లె ప్రపంచం ఫౌండేషన్' ద్వారా ప్రకృతి జీవన విధానం ను ప్రచారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా గత నెల వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయించిన మేరకు బోనకల్ కార్యాలయం ఆవరణలో చెరువు మట్టి తోలించాము. రాయనపేటలో ఒక ఎకరంతో పాటు బోనకల్ లో కూడా మందులు వాడని ఆకుకూరలు పెంచాలని నిర్ణయించాము. ఈ వారంలో పల్లె ప్రపంచం కార్యాలయంలోని ఖాళీ స్థలంలో, బోనకల్ చెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా వస్తున్న చెరువు మట్టిని తోలించాము. ఇక్కడ కూడా ఆకుకూరలతో పాటు నర్సరీని పెంచాలని నిర్ణయం తీసుకున్నాము.
బోనకల్ లో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయం

చెరువు మట్టి తోలకముందు పల్లెప్రపంచం కార్యాలయం ఆవరణ

చెరువు మట్టి తోలాక పల్లెప్రపంచం ఆవరణ

పల్లె ప్రపంచం కార్యాలయం ముందు రోడ్డుపై చెరువు మట్టి కుప్పలు
- పల్లా కొండల రావు.

Post a Comment

  1. ఇంతకాలం ఎవరికీ తట్టని ఆలోచన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత కార్యక్రమం.ఎంతైనా అభినందించదగినది. చెట్టు చుట్టూ వుండే మట్టినికూడా ఎప్పటికఫ్ఫుడు తిరగవేస్తూవుంటే మొక్క పెరుగుదలలో తేడాను మనం గమనించవచ్చు.చాలా ఏపుగా త్వరగా పెరుగుతుంది.ఇంకుడు గుంటలద్వారా నీటిని ఎలా నిలువచేసికోవచ్చో,అలానే చెరువు పూడిక ద్వారా వర్షాకాలంలో నీటి నిలువలు పెంచుకోవటంద్వారా భూగ్ అర్భ జలాలను పెంచవచ్చు. అలానే చెరువు పూడికమట్టి కింద ఏ పంట సాగుచేసినా దిగుబడి బాగుంటుంది.నేను రైతును కాను కానీ ఇరవైరెండు సంవత్సరాలుగా మొక్కలు(క్రోటన్స్,పూల మొక్కలు)రకరకాలవి పెంచుతాను. అలా నేను చేసేదే ఈ పద్దతి.కొండలరావు గారు పల్లె ప్రపంచం ఫౌండషన్ కింద మీరు తలపెట్టిన కార్యక్రమాలు బాగున్నాయ్.అందుకు మీకు అభినందనలు.సఫలీకృతం కావాలని కోరుకుంటాను.ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. అవును స్వరాజ్యలక్ష్మి గారు, మీరన్నట్లు మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమే. అందుకే మేము దానికి మద్దతిచ్చాము. రైతులు కూడా సాంప్రదాయ పద్ధతులకు తిలోదకాలివ్వడం దారుణం. విత్తనాలు కార్పొరేట్ కంపెనీలు తయారుచేయడం దారుణంగా తయారయింది. మళ్ళి రైతు తన సాంప్రదాయ పద్ధతులలో సాగుకు మొగ్గు చూపాలి. పల్లె ప్రపంచం కార్యక్రమాలు సఫలీకృతం కావాలని ఆశీర్వదించినందుకు ధన్యవాదములు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top