మనిషి మనుగడ ప్రక్రుతిమీద ఆధారపడి ఉంటుందెపుడైనా. జ్ఞానం పేరుతో మనిషి మితిమీరి కాలుష్యాన్ని పెంచుతుండడంతో పర్యావరణం దెబ్బతింటున్నది. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. రామ చిలుకలు, వడ్రంగి పిట్టలు, పిచుకలు, గిజిగాడు గూడులు, "కూ" అని కోకిల అరుపులు ,..... ఈ పేర్లు మీరీ మద్య కాలంలో విన్నారా ? వాటి రెక్కల చప్పుళ్ళు, అరుపులు, చల్లటి గాలిలో చెట్టు మీద వాలి మనల్ని అలరిస్తూ ఉంటే ఎంతో బావుంటుంది కదా! .  


పక్షులన్నీ పంట పొలాలలో ధాన్యం కోసం గుంపులు గుంపులుగా వస్తుంటాయి. మరీ పక్షులన్నీ ఎక్కడికెళ్ళాయి? ఒక్క పక్షి గూడు కూడా కనబడడం లేదు. మరీ బిజీ లైఫ్ లో మనం వాటిని ఎక్కడ చూస్తున్నాం ? మహా అయితే, ఎక్కడో పార్కుల్లో, బర్డ్ సాంచరీలలో చూస్తుంటాం. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు , కరెంట్ తీగలు. ఉన్న చెట్లన్నింటినీ ఏదో ఒక కారణం చెప్పి కొట్టేస్తున్నాం , అంతే కానీ కొత్త మొక్కలను నాటడం లేదు. సెల్ ఫోన్లు, కంప్యుటర్ టెక్నాలజీ ( వైర్లెస్, బ్లూ టూత్, వై-ఫై ) వల్ల రేడియేషన్ పెరిగి కొన్ని పక్షులు చనిపోతున్నాయి.


మరేం చేయాలి ? పక్షులు చనిపోతున్నాయని టెక్నాలజీని వాడుకోకూడదా? లేదా టెక్నాలజీని వాడుకుని పక్షుల్ని చంపాలా? దీనికి పరిష్కారమేమిటి?  ప్రభుత్వాలు,దేశాధినేతలు చెయాల్సింది వారు చేయాలి. మనవంతుగా మనం కొన్ని అలవాట్లద్వారా పుడమితల్లిని కాపాడుకుందాం. వాటిలో కొన్ని ఈ క్రింద సూచించినవి మీరూ ప్రయత్నించండి. అలవాటుగా మార్చుకోండి.ఇతరులకు ఆదర్శంగా నిలవండి.

గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు వాతావరణంలో సంభవిస్తున్న విపరీతమైన మార్పులకి ప్రధాన కారణం. ముందుగా " గ్లోబల్ వార్మింగ్ " అనే పదానికి సరైన వివరణ చాలా మందికి తెలియకపోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ ఎలా ఏర్పడుతుందంటే... సాధారణంగా సూర్యుడి నుండి వచ్చే వేడిని భూమి 75% గ్రహించి మిగతా 25% వేడిని వాతావరణము లోనికి పంపిస్తుంది. అయితే గ్రీన్‌ హౌస్ వాయువలు( క్లోరో ఫ్లోరోకార్బన్స్,మీథేన్,ఓజోన్,......) భూమి వాతావరణంలోకి పంపిన అదనపు వేడిని కుడా గ్రహించి తిరిగి భూమికి పంపిస్తున్నాయి. అందువల్ల భూమి అధికంగా వేడెక్కడం జరుగుతుంది. ఈ విధంగా భూమి వేడెక్కడాన్నే " గ్లోబల్ వార్మింగ్ " అంటారు. అయితే ఈ గ్రీన్ హౌస్ వాయువులు మనం చేసే వాతావరణ కాలుష్యం వలన పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించడం ఒకేసారి జరిగే పనికాదు. కాబట్టి మనం కొంతమేరకైనా కాలుష్యాన్ని తగ్గించాలంటే కనీసం ఈ క్రింది అంశాలను పాటిస్తే చాలు. కొంతమేరకు పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం.
1 . రెడ్యూస్ ,రీయూస్,రీ సైకిల్ : 
 • రెడ్యూస్, రీయుస్, రీసైకిల్ అనేవి వ్యర్తపదార్దాల నియంత్రణలో ముఖ్యసుత్రాలు.
 • రెడ్యూస్ : మనం ప్రతిరోజూ వాడే వస్తువుల ద్వారా మనకు తెలియకుండానే పర్యావరణానికి హాని చేస్తున్నాం. ఉదాహరణకు ప్లాస్టిక్ బ్యాగ్స్, పాలిథీన్ కవర్స్, ఫ్రిడ్జ్, ఏ.సీ.... వీటి నుండి వెలువడే హానికరమైన వాయువులు పర్యావరణానికి హానిని తలపెడుతున్నాయి. కాబట్టి అవసరంలేని వస్తువల వాడకాన్ని, ఫ్రిడ్జ్, ఏ.సీ. లాంటి వస్తువుల వాడకాన్ని తగ్గించినట్లయితే మనం కొంత మేరకు విద్యుత్  వాడకం మరియు గ్లోబల్ వార్మింగ్ రెండింటినీ తగ్గించినవాల్లమవుతాం. 
 • రీయూస్ : ఒక చోట అనుపయోగాకరంగా అనిపించింది మరొక పనికి ఉపయోగపడొచ్చు. ఉదాహరణకు పంచదార తయారీ పరిశ్రమలలో ' భగస్సే' అనేది పంచదార తయారీకి వ్యర్ధపదార్డం. కానీ ఇది ' పేపర్ ' తయారీలో ఉపయోగపడుతుంది. ఇదే ' రీయూస్ '
 • రీసైకిల్ : ఇక రీసైకిల్ విషయానికొస్తే.." పాలిథీన్ కవర్స్ ". రోజు పలు రకాల పనులకు ప్లాస్టిక్ కవర్స్ ను ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు మనం కూరగాయలు కొనడానికి బయటికెళ్ళినపుడు వాటిని తీసుకుని ఇంటికి రావడానికి కవర్స్ ను ఉపయోగిస్తుంటాం. ఇంటికి వచ్చిన తరువాత వాటిని పారేస్తుంటాం. వీటిని పారేయకుండా అది వ్యర్దాపదార్డంగా మారే వరకు ఉపయోగించి, 'వ్యర్దం' గా మారిన తరువాత అలాంటి పాలితీన్ వస్తువులన్నింటినీ ప్లాస్టిక్ పరిశ్రమలకు పంపిస్తే వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త వస్తువుల తయారీలో ఉపయోగపడుతుంది.  
2 . CFL బల్బుల వాడకము :-
Cfl : close up the energy saving lamp on a white background
మన ఇళ్ళలో సాదారణంగా 60 Candle Bulb's ఉపయోగిస్తుంటాము. అవి చాలా విద్యుత్తుని ఉపయోగించుకోవడమే కాక చాలా వేడిని విడుదల చేస్తాయి. అంతేకాక ఈ బల్బులు ఎక్కువకాలం పనిచేయవు. మనం ఈ బల్బులకు బదులుగా Compact Fluorescent Light ( CFL ) Bulb's ను ఉపయోగిస్తే అవి తక్కువ శక్తిని వినియోగించుకొంటాయి. ఈ బల్బులు సాధారణ బల్బుల కంటే చాలా ఎక్కువ కాంతిని విడుదల చేస్తాయి మరియు ఇవి సాధారణ లైట్లతో  పోలిస్తే 70  % వేడిని  తక్కువ విడుదల చేస్తాయి .అంతేకాక సాధారణ లైట్ల కన్నా పది రెట్లు ఎక్కువ కాలం పని చేస్తాయి .

3 .శక్తి-సమర్ధవంతమైన ఉత్పత్తుల కొనుగోలు:-
Energy Efficient : Windmill, eco energy Stock PhotoEnergy Efficient : Solar panel produces green, enviromentaly friendly energy from the sun.
 • మనం ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేసేటప్పుడు తక్కువ వనరులను ఉపయోగించుకుని ఎక్కువ ఉపయోగకరంగా ఉండేట్లు చూసుకోవడం మంచిది.
 • ఉదాహరణకు మనం ఒక కార్ ను కొనడానికి వెళ్తే అక్కడ ఆ కార్ ఎక్కువ మైలేజ్ ఇచ్చేట్లు చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వనరులను కొంత ఆదా చేయవచ్చు. అంతేకాక డీజిల్, పెట్రోల్ ఖర్చును కుడా తగ్గించుకోవచ్చు.
4 . స్విచ్ ఆఫ్ చేయండి :-

మనలో చాలా  మందికి స్విచ్ ఆన్ చేసిన తరువాత స్విచ్ అఫ్ చేయడం మరచిపోతుంటాం. ఇలా చేయటం వలన విద్యుత్ వాడకం పెరగడమే కాక విద్యుత్ కొరత ఏర్పడుతుంది .అవసరం ఉన్నప్పుడే విద్యుత్ ని వినియోగించటం ద్వారా విద్యుత్ ని  ఆదా చేయటమే కాక గ్లోబల్ వార్మింగ్ ని  కొంతవరకు   తగ్గించవచ్చు 

  5 . మొక్కల్ని పెంచడం :-   
మొక్కలు కార్బన్ డయాక్సైడ్ కు ఒక సింక్ లా పనిచేస్తాయి .అంతే కాదు వాతావరణ సమతుల్యాన్ని నియంత్రిస్తాయి .మొక్కల్ని ఇంట్లో పెంచడం వలన ఇంటికి అందం ,అలంకరణ వస్తుంది .మనసును ఆహ్లాద పరుస్తాయి.
6  .వాహనాల వాడకాన్ని తగ్గించాలి :- 

మన నిత్య జీవితంలో ప్రతి రోజూ మనం వాహనాలు వాడుతూ  ప్రకృతిని కాలుష్యానికి గురిచేస్తూ మన జీవిత కాలాన్ని కూడా మనమే తగ్గించుకొంటున్నాం .మనం ఉపయోగిస్తున్న వాహనాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులను పీల్చడం వల్ల వ్యాదులను కొనితెచ్చుకోవడమే కాక ,ఆ వాయువులు పర్యావరణం లోకి ప్రవేశించి ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాయి. మనం ఈ కాలుష్యాన్ని తగ్గించకపోగా రోజురోజుకు వాహనాలను పెంచుకుంటూ పోతున్నాము. దీనివలన పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి మనవంతు కృషి చేయాలి. మనం రోజులో ఎన్నో పనులకు అవసరం ఉన్నా లేకపోయినా వాహనాలును ఉపయోగిస్తుంటాం. వీటిలో కొన్ని ఉపయోగకరమైన పనులేగాక అనుపయోగకరమైన పనులు కుడా ఉంటాయి. వీటికి మనం మోటార్ వాహనాలను ఉపయోగించకుండా నడక/సైకిల్స్ ను ఉపయోగించడం ద్వారా మనం శరీరానికి వ్యాయామం చేసినట్లు ఉండడమేకాకుండా కాలుష్యాన్ని కుడా కొంతమేరకు తగ్గించినవారమవుతాము.
( నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పోష్టుని రీ పబ్లిష్ చేయడం జరిగింది)
Reactions:

Post a Comment

 1. నా ప్రయత్నం ఎప్పుడో మొదలుపెట్టాను!

  ReplyDelete
 2. మంచి విషయాన్ని ప్రస్తావించారు ముందు ధన్యవాదాలు చైతన్య గారు.ఇది అత్యంత ఆవశ్యకమైనది,మనమంతా దృష్టిపెట్టవలసిన ముఖ్యమైన విషయం. అంతరించిపోతున్న జీవరాశులనన్నిటినీ పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత అందరిపై ఎంతైనావుంది. ఈ సంధర్భంలోనే ప్లాస్టిక్ వాడకం గురించికూడా ప్రస్తావించాల్సింది.అదికూడా పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోయింది.ముందు ముందు పక్షి,జంతుజాలాలకే కాదు మనిషి మనుగడకు కూడా కష్టమయ్యేరోజులు రాబోతున్నాయ్.దానికి సంబందించిన ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి కూడా.అందుకే పర్యావరణ పరిరక్ష్ణకు అందరూ తమవంతు బాద్యతలను నిర్వర్తించవలసిన సమయమొచ్చేసింది.మనవంతుగా చేయవలసిన ది చేద్దాం.ఒకొక్క నీటిబొట్టు సంద్రమైనట్లు ఏమో మార్పు రావచ్చునేమో.అలోచించడి...

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top