తనకు తెలిసిన దానిని నిర్భయంగా ప్రకటించే నీహారిక ఒకప్పుడు బ్లాగు ప్రపంచంలో ఫైర్ బ్రాండ్. ఆమె మాటలలోనే చెప్పాలంటే "బ్లాగరుగా ఎన్నో మధుర స్మృతులతోపాటు ఎన్నో చేదు అనుభవాలూ ఎదుర్కొన్న తొలి మహిళ". ఎన్ని విమర్శలు-హేళనలు ఎదుర్కున్నా "నేను వ్రాసే విషయాలు అర్ధం చేసుకోలేక నిజాలను చదివి జీర్ణించుకోలేక పాఠకులు పడే వేదనే గానీ, వారికి నామీదగానీ, నాకు వారిమీదగానీ ప్రత్యేకమైన ద్వేషభావం లేదనే నేను భావిస్తాను. నేను వ్రాసే విషయం మీద ద్వేషమే గానీ నామీద ద్వేషం ఉండదని నేను భావిస్తున్నాను." అని చెప్పే నీహారికను ఈ విషయంలో అభినందించక తప్పదు. తెలుగు బ్లాగు ప్రపంచంలో ఇప్పటికీ భావప్రకటనకు అవాంతరం కలిగించే ఉన్మాదులుండడం మనం గమనిస్తూనే ఉన్నాము. తాను లేదా ఎవరైనా వ్రాసేది అర్ధం కాకుంటే ఇగ్నోర్ చేయాలి లేదా వాదించాలి తప్ప వ్యక్తిగతంగా కించపరచడం మంచిది కాదంటున్న నీహారిక విషయంలో నాకున్న అభిప్రాయం "ఆమె వాదనలు కొన్ని అర్ధం కాకున్నా ..... చెప్పదలచుకున్న దానిలో నటన ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే నీహారిక అర్దం కాని ఓ మంచితనం." చాలామందిలా ఆమెకు నటన తెలీదని చెప్పగలను. కేవలం బాగున్నపుడే కాక ఒకరు పరిచయం అయితే మంచి చెడులపై తన అభిప్రాయాలను పంచుకునే మంచి మనిషి. అనేక సందర్భాలలో విమర్శలను సహనంగానే స్వీకరించారు. ప్రతి విమర్శలు ఘాటుగానే చేశారు. అవసరమైన అనేక సందర్భాలలో సహకరించారు. ప్రోత్సహించారు. అందుకు ఆమెకు 'పల్లెప్రపంచం' తరపున ధన్యవాదములు. రాజకీయంగా ఎదగాలనే సంకల్పంలో ఆటంకాలు ఎదురయినా సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న నీహారిక బ్లాగు ప్రపంచంలోనూ తిరిగి తన భావాలను పంచుకుంటారని ఆశిద్దాం. ఈ ఇంటర్వ్యూ చేసేవరకు నీహారిక అనేది అసలు పేరు కాదని నాకు తెలియదు..... మిగతా వివరాలు ఆమె మాటలలోనే............ చదవండి.


ప్ర 1) మీ పూర్తి పేరు?

జ. నా పేరు నాకు నచ్చదు అందుకే మార్చుకున్నాను. నాకు నచ్చదని తెలిసి నా పేరుతో పిలిచి నన్ను ఆటపట్టించేవాళ్ళకు తెలియకూడదని చెప్పడం లేదు. మీరు అడిగారని చెపుతున్నాను, నా పేరు...నా పేరు... ధన ఉదయ లక్ష్మి ఆకుల.

ప్ర 2) మీ జన్మస్థలం?

జ. రాముడు పుట్టింది కౌసల్యాపురమా? అయోధ్యా? అని అక్బరుద్దీన్ అడిగినట్లుగా నాక్కూడా ఏది చెప్పాలో అర్ధం కాదు. నేను పుట్టింది ఉయ్యూరు హాస్పటల్ లో... మా నాన్నగారి స్వగ్రామం శ్రీ ఆంధ్ర మహా విష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి కొలువైన శ్రీకాకుళం గ్రామం, ఘంటసాల మండలం,కృష్ణా జిల్లా ఆడపడుచుని :))

ప్ర 3) మీ తల్లిదండ్రుల వివరాలు?

జ. నాన్నగారి పేరు తిరుమలశెట్టి గోపాల కృష్ణమూర్తి గారు. అమ్మ పేరు రామలింగేశ్వరి దేవి. మా అమ్మ పేరు మా నాన్న గారికి నచ్చలేదు వివాహం తర్వాత విజయ లక్ష్మి అని మార్చారు. వ్యవసాయం వృత్తి , కాంట్రాక్టరు ప్రవృత్తి. మా తాతగారు తిరుమలశెట్టి కుమారస్వామి నాయుడు గారు దివిసీమలో నిర్మితమైన పులిగడ్డ డాం నిర్మాణంలో భాగస్వామి మరియు కృష్ణా జిల్లాలో ప్రముఖ కాంట్రాక్టరు.

ప్ర  4) ప్రస్తుత నివాసం?

జ. విశాఖపట్టణం

ప్ర  5) మీ వృత్తి? మీ ఉద్యోగ వివరాలు? 

జ. గృహిణిని. తీరిక వేళల్లో సమాజ సేవ.

ప్ర  7) విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?

జ. M.Sc Psychology.

ప్ర  8) మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?

జ. మావారు ఆకుల రామ్మోహన్ రావ్ గారు, DMRL కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నారు. ఒక్కడే కొడుకు సిద్ధార్థ్ శేఖర్ B Tech .

ప్ర  9) మీ బ్లాగు పేరు?

జ. రమ్యంగా కుటీరాన.....   http://ramyamgakutirana.blogspot.com

ప్ర  10) మీ బ్లాగు లక్ష్యం ఏమిటి?

జ. బ్లాగుల ద్వారా రాజకీయంగా ఎదగవచ్చేమో అన్న లక్ష్యం (భ్రమ) ఉండేది. నాకు రచయిత్రిని అని అనిపించుకోవడం కన్నా రాజకీయ నాయకురాలు అని పిలిపించుకోవాలని ఉన్నా, సాధ్యపడక సామాజిక కార్యకర్తగా మిగిలిపోయాను.

ప్ర  11) మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?

జ. అందరూ పెళ్ళి చేసుకుంటున్నారు కదా అని పెళ్ళిచేసుకున్నట్లు అందరూ వ్రాస్తున్నారు కదా అని నేనూ వ్రాయడం మొదలుపెట్టాను. వ్రాస్తూ, వ్రాస్తూ ఉంటే నెమ్మదిగా పొగరు పెరిగిపోయింది. స్వంతంగా మనకు మనం అచ్చువేసుకోవడం వేరు, బయట ప్రింట్ లో మనపేరు చూసుకోవడం వేరు అని తెలిసాక పొగరు దిగిపోయి బ్లాగు నోరు మూసేసాను.

ప్ర  12) మీ బ్లాగు అనుభవాలు?

జ. నా అభిప్రాయాలతో ఈ ప్రపంచం ఏకీభవించదేవిటీ!? అని బాధపడ్తున్న సమయంలో చిన్న వయసులోనే అపారమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన రసజ్ఞ గారు నా బ్లాగ్ ని గుర్తించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం బ్లాగు వ్రాయకపోయినా నన్ను మర్చిపోకుండా నాకు ఈ అవకాశం ఇవ్వడంతో కొండలరావు గారు సరిక్రొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు.

బ్లాగరుగా ఎన్నో మధుర స్మృతులతోపాటు ఎన్నో చేదు అనుభవాలూ ఎదుర్కొన్న తొలి మహిళను అని చెప్పుకుంటాను. నేను వ్రాసే విషయాలు అర్ధం చేసుకోలేక నిజాలను చదివి జీర్ణించుకోలేక పాఠకులు పడే వేదనే గానీ వారికి నామీదగానీ నాకు వారిమీదగానీ ప్రత్యేకమైన ద్వేషభావం లేదనే నేను భావిస్తాను. నేను వ్రాసే విషయం మీద ద్వేషమే గానీ నామీద ద్వేషం ఉండదని నేను భావిస్తున్నాను.

అయితే మనం ఏదైనా ఒక విషయాన్ని వ్రాసేటపుడు రచనని,  రచయి(త)త్రి ని వేరుగా చూడడం సరికాదు.మనకు నచ్చినట్లుగా రొమాంటిక్ గా నీతులు గుప్పించకూడదు. వాస్తవాన్ని పాఠకులకు చెప్పాలి. మనం వ్రాసే రచనకి మనమే బాధ్యత వహించాలి. ఆ విధంగా ఆలోచిస్తే పాఠకుల ద్వేషం సరి అయినదేనేమో నేను చెప్పదలుచుకున్నది వారికి అర్ధం కాలేదేమో అని భావిస్తాను.

ప్ర  13) బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?

జ. నేను రాముడి గురించి ఎక్కువగా వ్రాస్తుంటాను. రాముడు మీద నాకు ద్వేషం ఉందా? అని అడిగితే లేదనే చెపుతాను కానీ ఆదర్శ పురుషుడు అంటే మాత్రం ఒప్పుకోను.రాముడు భర్తగా విఫలమైనాడు కాబట్టి రాముడు ఆదర్శ పురుషుడు కాడని వాదిస్తుంటాను.ఒక మంచి రాజు ఒక మంచి భర్త అవ్వాలని రూలు లేదు.అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు.

నేను వ్రాసే విషయాన్ని వదిలేసి రాముడిని విమర్శిస్తున్నావని ఇంటా బయటా నా మీద దాడికి దిగేవాళ్ళే కానీ సరి అయిన సమాధానం ఇచ్చేవాళ్ళు నాకు తారసపడనేలేదు. బ్లాగర్ గా రాముడిని విమర్శించినందుకు వ్యక్తిత్వహననానికీ , బెదిరింపులకీ, తారాస్థాయిలో బూతులతో తిట్టడం, నేను బ్రతికి ఉండగానే నా ఫోటోకి దండలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం మరిచిపోలేని సంఘటనలే అయినా వాటిని కూడా ఆశ్వాదించడం అలవాటు చేసుకున్నాను.

ఈ అనుభవాలు నన్ను మరింత దృఢపరచడానికీ, నా పోరాటంలో మరింత కృషిచేయడానికి, నా గమ్యం నిర్దేశించుకోడానికి మార్గాన్ని సుగమం చేసాయి.

ప్ర  14) సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?

జ. బ్లాగర్ గానూ, ప్లస్ లోనూ, ఫేస్ బుక్ లోనూ వందల్లో అభిమానులు లభించారు. బ్లాగు పోస్టు నచ్చితే ఆకాశానికి ఎత్తేసి నచ్చకపోతే అక్కడనుంచి ఎత్తి భూమ్మీదకి విసిరేసిన వాళ్ళూ ఉన్నారు. నా మీద అంత కోపం వచ్చింది అంటే నా రచన అంతగా కదిలించింది అని అర్ధం చేసుకోవాలి.హిందూమతాన్ని ద్వేషిస్తున్నానని భావించడం కన్నా మన తప్పులు మనం సరిదిద్దుకుందాం అని ముందుకు వచ్చిన వారు ఒక్కరు కూడా లేకపోవడం నిరాశను కలుగజేసింది.

ప్ర  15) 'పాఠకులకు అర్ధం అయ్యేలా వ్రాయలేదేమో' అనిపించినపుడు అర్ధమయ్యేలా వ్రాయడానికి ప్రయత్నిస్తారా?

జ. ఒకరికి కలిగిన ఆలోచన ఇతరులకు అర్ధం లేనిదిగా అనిపించించవచ్చు, ఆ ఆలోచనకు అడ్దంకులు ఏర్పడవచ్చు, తప్పులు ఎత్తిచూపేవారు,విమర్శించేవారు,ఎగతాళి చేసేవారు ఉంటారు.వారి మాటలను వినాలి.వారి విమర్శలను స్వీకరించాలి.అయితే వాటికి అవసరం మేరకే స్పందించాలి.

పాఠకులకు అర్ధం కాలేదు అనేకన్నా ఒక నిజాన్ని ఒప్పుకోడానికి ఏ మనిషికీ ధైర్యం సరిపోక ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉంటారు.అందరూ ఒకే వాదన వినిపిస్తే అక్కడ సమస్యే ఉండదు.సమస్య ఉన్నంతకాలం చర్చలూ,పోరాటాలూ తప్పనిసరి. ప్రస్థుతం నేను రామ జన్మ భూమి సమస్య గురించే వాదిస్తున్నాను కనుక సమస్య ఉన్నంత వరకూ ఎవరి వాదన వారిదే. కనుక ఒక్కోసారి పాఠకులతో విభేదిస్తున్నా, ఎంచుకున్న మార్గంలో స్పష్టత కలిగి ముందుకువెళుతున్నాను.

ప్ర  16) తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?

జ. మీరు వ్రాసే ప్రతి కమెంట్ కీ ప్రతి పోస్టుకీ మీరే బాధ్యత వహించాలి. మనం బ్రతికి ఉండకపోయినా మన వ్రాతలు బ్రతికే ఉంటాయి.ఏదైనా తప్పులు వ్రాస్తే బ్లాగర్ గా చెరిపేసి డెలిట్ చేసుకోగలం గానీ రచయత/ రచయిత్రిగా చెరపడం సాధ్యం కాదు. ప్రింట్ మీడియాకీ బ్లాగింగ్ కీ ఉన్న తేడాని అర్ధం చేసుకుని బాధ్యతతో వ్రాయాలని కోరుకుంటున్నాను. వ్యాఖ్యాతలు కూడా సహేతుకంగా విమర్శిస్తే సహృదయంతో స్వీకరించాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకోకూడదని అభ్యర్ధిస్తున్నాను.

ప్ర  17) మీ బ్లాగులో మీ పోస్టులలో మీకు నచ్చినవి?

జ. కొన్ని వందల పోస్ట్ లు వ్రాసాను. అన్నీ నచ్చినవే కానీ వాటిల్లో నాకు బాగా నచ్చిన పోస్ట్ మాత్రం సీతమ్మ అందగత్తె కాదా?, షట్కర్మ యుక్తా కులధర్మ పత్నీం....అని వ్రాసిన పోస్టులు మంచి గుర్తింపునిచ్చాయి కాబట్టి నచ్చాయి.
ప్ర  18 ) ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?

జ. నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో రంగంలో అభిరుచి ఉంటుంది.వారు వారి అభిరుచి మేరకు వ్రాస్తారు. నాకు బహుముఖ రంగాల్లో అభిరుచి ఉండడంతో అన్ని రకాల బ్లాగులూ చదువుతాను.

సామాజికంగా వ్రాసే కృష్ణ ప్రియ డైరీ బ్లాగు నా అభిమాన బ్లాగ్.

రాజకీయ బ్లాగుల్లో భండారు శ్రీనివాసరావు గారి బ్లాగ్,బుద్ధా మురళి గారు,య రమణ గారి పనిలేక బ్లాగ్ , జాతీయ అంతర్జాతీయ వార్తలు, తప్పని సరిగా చదువుతాను.

పుస్తకం.నెట్,మనసులోమాట సుజాత గారు,వేణువు బ్లాగ్,నవతరంగం బ్లాగ్ లు పుస్తకాలు పరిచయం చేస్తారు కాబట్టి అవి తప్పకుండా చదువుతాను.

ఆధ్యాత్మిక విషయాలు వ్రాసే కష్టేఫలే బ్లాగ్,రసజ్ఞ బ్లాగ్,ఎకో గణేష్ గారి బ్లాగ్స్, చరిత్రని ఎంతో లోతుగా విశ్లేషిస్తూ ఆలోచింపజేసే కల్లూరి భాస్కరం గారు వ్రాసేవి తప్పకుండా చదువుతాను.

హాస్యం లో రెండు రెండ్లు ఆరు తోటరాముడు,రాజ్ కుమార్, బులుసు సుబ్రహ్మణ్యం గారి బ్లాగ్, శైలజ చందు గారి బ్లాగ్, 

పాటల కోసం సినిమా రివ్యూల కోసం వేణూ శ్రీకాంత్ గారి బ్లాగ్, .ఇష్టపది బ్లాగ్, తృష్ణ గారి బ్లాగ్స్, 

వంటల గురించి జ్యోతి గారు, రుచి బ్లాగ్స్, 

కబుర్ల కోసం మధురవాణి బ్లాగ్, జాజిపూల నేస్తం బ్లాగ్, శ్రావ్య రవీయం, మంచుపల్లకీ బ్లాగ్, వికట కవి , శరత్ కాలం బ్లాగ్, 

కవితల కోసం పద్మార్పిత, నిషిగంధ, కధల కోసం కొత్తావకాయ, మాల గారి సాహితి, మురళి గారి నెమలికన్ను, పడమటి సంధ్యారాగం, 

చర్చల కోసం ప్రజ, రౌడీ రాజ్యం, 

ఇంకా మానస మధుమానసం, గడ్డిపూలు, నిఖిత చంద్రసేన, పర్ణశాల, చదువరి, తేటగీతి, సహచరుడు, ప్రవీణ్, హరికాలం, శాస్త్ర విజ్ఞానం, నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు...... ఒకటేమిటి ఇలా వ్రాసుకుంటూ పోతే తెలుగు బ్లాగర్ల కృషి చెప్పనలవి కాదు.

ప్ర  19) బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు ?

జ. "సీతయ్య ఎవరి మాటా వినడు" అనేది నాకు బ్లాగర్లు ఇచ్చిన బిరుదు. నేను పాఠకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలే కానీ నన్ను ఇబ్బంది పెట్టినవాళ్ళు లేరు.నాకు స్వేచ్చ కావాలి. నేను నా ఇష్టం వచ్చినట్లు వ్రాసుకున్నట్లే ఇతరులు వారి బ్లాగులో నా గురించి వ్రాసుకున్నారు.నేనూ పోటాపోటీగా వ్రాసాను. కొందరు ఆధ్యాత్మికవాదులు రాముడి గురించి అలా వ్రాయవద్దని ప్రాధేయపడ్డారు.కొందరు బెదిరించారు. ఎవరెన్ని చెప్పినా నేను చెప్పదలచుకున్నది మారు మూల గ్రామంలో ఉన్న నిరుపేదకి చేరేవరకూ నా పోరాటం ఆగదు.

ప్ర  20) తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?

జ. అసలు బ్లాగులనేవి రచయత/రచయిత్రిగా ఎదగడానికి ప్రాధమిక విద్య లాంటివి. హైస్కూలు నుండి కాలేజ్ కి వెళ్ళినట్లు,బ్లాగులనుండి ప్రింట్ మీడియాలోకి వెళ్ళగలగాలి.కాలేజీ విద్య నుండి విశ్వవిద్యాలయాలకు వెళ్ళినట్లుగా ప్రింట్ మీడియా నుండి స్వంతంగా పుస్తకాలు అచ్చువేయించుకోగలగాలి.ఇక్కడి వరకూ బాగానే చేరగలుగుతాం కానీ సరి అయిన నెట్ వర్క్ లేకపోతే మన పుస్తకాలు మనమే అచ్చువేసినట్లుగా మన పుస్తకాలు మనమే చదువుకునేటట్లు ఉండకూడదు.ఏ కళకైనా ప్రేక్షకుల కరతాళ ద్వనులు వినపడకపోతే ఆ కళాకారుడికి/కళాకారిణికి మనశ్సాంతి లభించదు.

ప్ర  21) బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?

జ. బ్లాగులవల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. గూగుల్ ద్వారా వెతికితే ఎటువంటి సమాచారమైనా తెలిసిపోతున్నాయి. క్రొత్తగా వ్రాయాలనుకునేవారికి బ్లాగులు ఒక మంచి మాధ్యమం.


ప్ర  22) మీకు నచ్చిన బ్లాగర్లు?

జ. నిజజీవితంలో నిజాయితీ కనపరిచిన ప్రవీణ్ అంటే అభిమానం. వికలాంగురాలు అని తెలిసినా ఒకమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆమెకు ప్రవీణ్ నచ్చక తిరస్కరిస్తే అవిటిదానికి ఇంతపొగరా అని తిట్టకుండా తనకి స్నేహహస్తాన్ని అందించి ఆమె తన జీవితంలో సుఖపడాలని కోరుకున్నాడు. నీతులు చెప్పి ఆచరణలేని వ్రాతలు వ్యర్ధం.

ప్ర  23) మీ హాబీస్  ?

జ. పాటల లిరిక్స్ సేకరించడం,బ్లాగులు వ్రాయడం.


ప్ర  24)  మీరిప్పటివరకు ఎన్ని పాటల లిరిక్స్ సేకరించారు? వాటిలో ఏ పాట మీకు బాగా నచ్చింది?

జ. నాకు నచ్చిన పాటల లిరిక్స్ కి నా స్వంత ఫోటోలు జతచేసి పోస్టు చేయడం నాకు ఒక హాబీ, కొన్ని పాటలకు నేను స్వంతంగా కొరియోగ్రఫీ చేసి ఆ పాటకు తగ్గ సందర్భాన్ని ప్రతిఫలించేలా పోస్టు చేస్తూ ఉంటాను.
కొన్ని వేల పాటల్లో ఇష్టమైన పాట ఏది ? అంటే చెప్పడం కష్టం. ప్రస్థుతానికి "షాక్" సినిమా లోని "మధురం మధురం"అనే పాట నాకు చాల ఇష్టమైన పాట !
వేటూరి సుందర రామ మూర్తి
ప్ర  25) పాటల రచయితలలో మీకు నచ్చినవారు?

జ.  మా ఊరితో ఎంతో అనుబంధం ఉన్న, సంగీత సాహిత్య అర్చన చేసిన వేటూరి సుందరరామమూర్తి గారంటే నాకు అభిమానం.
ఏ.ఆర్.రెహమాన్
ప్ర  26) మీకు నచ్చిన సంగీత దర్శకుడు ఎవరు?

జ.  ఏ.ఆర్.రెహమాన్

ప్ర  27) మీ అభిమాన రచయిత  ?

జ. భగవద్గీత వ్రాసారు కాబట్టి వ్యాసుడు.


ప్ర  28) మీకు నచ్చే రచనలు?

జ. భగవద్గీత, యండమూరి వ్రాసిన అంతర్ముఖం, మైండ్ పవర్, మల్లాది వ్రాసిన మందాకిని, భార్యా గుణవతి శతృ, స్టీఫెన్ కోవే వ్రాసిన సెవెన్ హేబిట్స్, సింపుల్ ఇంగ్లీష్ లో ఉండి అర్ధమవుతాయి కాబట్టి చేతన్ భగత్ పుస్తకాలు.

ప్ర  29) మీకు ఇష్టమైన ఆహారం?

జ. సాత్వికాహారం అని రొమాంటిక్ గా సమాధానం ఇస్తానని భావిస్తున్నారేమో?  నేను మాత్రం నాటు కోడి, రొయ్యలూ, చేపలూ ఇష్టంగా తింటాను.

ప్ర  30) జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?

జ. "మనిషి బ్రతుకు నరకమగును మనసు తనది కానిదే" అన్నట్లు నేను ఉన్నచోట  "మనశ్సాంతి " లేకపోతే అక్కడ నేను ఉండను.

ప్ర  31) మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?

జ. దోపిడీలు,హత్యలూ,వ్యభిచారం లాంటి చెడ్డపనులు చేసినా చనిపోయేలోగా దేశానికి ఒక  మంచి పని చేసి భరతమాత ఋణం తీర్చుకుని చనిపోవాలి. దేశసేవ అంటే యుద్ధాలు చేయనక్కరలేదు మన ఇంటి ముందు మనం శుభ్రం చేసుకుని,మన కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుంటే అదే పెద్ద సామాజిక సేవ !

ప్ర  32) మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?

జ. వేగంగా నిర్ణయాలు తీసుకుని వేగంగా పని చేసేవారెవరైనా నాకు నచ్చుతారు. ఒక పని చేయాలంటే పగలూ రాత్రులూ ఒళ్ళు హూనమయ్యేలా పని చేయడమే కాదు ఇతరులతో కూడా నొప్పించకుండా పనిచేయించుకోగలగడమే తెలివితేటలు, అటువంటి తెలివితేటలు కలవారెవరైనా నాకు నచ్చుతారు.

ఇతరుల తెలివితేటలను గుర్తించకుండా నేను మాత్రమే ఎదగాలి అని అనుకునేవారంటే నచ్చదు.

ప్ర  33) మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?

జ. పొదుపుగా ఉంటాను, నా కంటికి కనపడినంత వరకూ శుభ్రంగా ఉండాలనుకుంటాను.

శుభ్రంగా లేకపోయినా, పొదుపు పాటించకపోయినా పిచ్చి కోపం వస్తుంది.అక్కడ ఉండకుండా దూరంగా పారిపోతాను.
శ్రీమతి ఇందిరాగాంధి
ప్ర  34) మీ రోల్ మోడల్ ఎవరు?

జ. రాజకీయాల్లో ఇందిరా గాంధీ,ఇంట్లో మావారు.

ప్ర  35) మీకు నచ్చే వృత్తి?

జ. వృత్తి అంటే డబ్బు సంపాదించేదే అయితే ప్రధాని.

సంపాదనతో పనిలేదు అంటే గృహిణిని కూడా ఉద్యోగిగానే నేను భావిస్తాను. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమయిన వృత్తి ఏది అంటే గృహిణి అనే చెపుతాను. నా అభిప్రాయంతో ప్రపంచం ఏకీభవించటం లేదు కాబట్టే నేను పోరాటం చేస్తున్నాను.

ప్ర  36) మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?

జ. పుట్టింటికి పారిపోవడమే !

ప్ర  37) నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?

జ. మనసుకు నచ్చిన చదువు, నచ్చిన ఉద్యోగం, నచ్చిన భాగస్వామి, వంటి విషయాల్లో ఎవరి మాటా వినకండి. ఒకసారి నిర్ణయించుకున్న తరువాత కష్టాలు వచ్చాయని వాటిని వదిలేయకండి. చివరి వరకూ పోరాడుతూనే ఉండండి. పోరాడితే పోయేదేమీలేదు భవబంధాలనే మానస సంకెళ్ళు తప్ప !

ప్ర  38) ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?

జ. నేను పాటించను కానీ ఇతరులకు నచ్చే విధంగా మాట్లాడితే ఎవరూ నొచ్చుకోరు. మనకు నచ్చినట్లు మనం మాట్లాడగలం గానీ ఇతరులకు నచ్చేటట్లు మాట్లాడాలంటే నటించాలి.

ప్ర  39) మీరు సామాజిక కార్యకర్తగా సమాజానికి ఏమి చేశారంటే?

జ. గృహిణిగా సంతృప్తిగా కాలం గడుపుతున్న సమయంలో జీవితంలో నువ్వేమి సాధించావు? అన్న మావారి ప్రశ్నకి సమాధానంగా నావంతుగా దేశానికి ఏదైనా చేయాలనిపించింది. నా ఆలోచనా శక్తికి తగిన పని ఏదైనా చేయాలి అని రామజన్మ భూమి విషయం లో ఆల్టర్నేటివ్ సెటిల్మెంట్ చేయాలని గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాను.నా పని దాదాపుగా అయిపోయింది. బి.జే.పీ అగ్రనాయకుల దగ్గరనుండి సరి అయిన స్పందన కోసం ఎదురుచూస్తున్నాను.
ప్ర 40) రామజన్మభూమి విషయంలో మీరు చెప్పే పరిష్కారం ఏమిటి? బి.జె.పి వారు రాముడికి గుడి కడతారంటారా?

జ.  ఒక సమస్య వచ్చింది అని అంటే అక్కడ విరుద్ధ అభిప్రాయాలూ,వాదనలూ,పోరాటాలూ ఉన్నాయని అర్ధం. రామజన్మ భూమి సమస్య యుగాలుగా ఉన్న సమస్యా? 1527 తర్వాత ఉద్భవించిన సమస్యా? అన్నది మొదట తేలాలి. యుగాలుగా ఉన్న సమస్య అయితే రాముడిదే బాధ్యత, 1527 తరువాత మొదలైన సమస్య అయితే బి జే పీ బాధ్యత తీసుకోవాలి. ఇపుడు రాముడిని పట్టుకొచ్చి శిక్ష వేయాలన్నా జయలలిత లాగా,జగన్మోహన్ లాగా,సల్మాన్ ఖాన్ లాగా,రామలింగరాజు లాగా శిక్ష తప్పించుకునే వీలు ఉంది కాబట్టి రాముడిని వదిలేద్దాం. బి జే పీ కి ఇపుడు రాముడితో పనిలేదు కాబట్టి బాధ్యత తీసుకోదు.

IIMB లో  Indian Women In leadership program చేసాను. ఎవరూ చేయని పనిచేయడం నాకు ధ్రిల్లింగ్ గా ఉంటుంది కాబట్టి రామ జన్మ భూమి సమస్యని నేను నా ప్రాజెక్ట్ క్రింద తీసుకున్నాను. ఒక సంవత్సరం కష్టపడి ఆ సమస్యను పరిశీలించాను. చాలా మంది రాజకీయ నాయకులను, మతాధికారులను,పాత్రికేయులను కలిసాను. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నాకు కావాలి. వాటికి సమాధానం దొరికితే గానీ రామ జన్మ భూమి సమస్యకి పరిష్కారం లభించదు.

రాజ్య సభలో పూర్తి మెజారిటీ లేనందువల్ల రామాలయం నిర్మించడం సాధ్యం కాదని రాజ్ నాథ్ సింగ్ గారు తేల్చి చెప్పారు కనుక బి జే పీ రామాలయం కట్టదు అని నేను భావిస్తున్నాను.బి జే పీ మాత్రమే రామాలయం నిర్మించాలి అనడం సరికాదు. చిత్తశుద్ధి కలవారెవరైనా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించవచ్చు అని నేను భావిస్తున్నాను.

ప్ర  41) మీరు రాజకీయ నాయకురాలు కావాలని ప్రయత్నించి విఫలమయ్యారా?

జ. రాజకీయ నాయకురాలు అంటే ఎం.ఎల్.ఏ లేదా ఎం.పీ లు అవ్వాలి అనే అర్ధం అయితే నేను ఎపుడూ ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా... దేశానికి పనికివచ్చే పని చేయడమే రాజకీయం అని నేను భావిస్తాను. జైకిసాన్ -  జైజవాన్ అనేదే నా నినాదం.

ప్ర  42)  రామాయణం, రాముడిని కావాలని విమర్శిస్తారా?

జ. తమిళ్ సినిమాల్లో క్లైమాక్స్ సీన్స్ విషాదాంతమైనా తమిళులు మెచ్చి ఆదరిస్తారు.మన ఆంధ్రుల హృదయాలు విషాదాలను భరించలేవు. రామాయణం లో శుభం కార్డు పడకపోవడమే రాముడి మీద కోపానికి గల కారణం.


ప్ర  43) రామాయణం లో మీకు నచ్చిన అంశాలేవి? నచ్చని అంశాలేవి?

జ. భార్యా భర్తల అన్యోన్యత నచ్చిన అంశం.

అన్ని సంవత్సరాలు కాపురం చేసి వేరే ఎవరిగురించో 'నాతిచరామి' అన్న మాట తప్పడం నచ్చలేదు.

ప్ర  44) రాముడు ఆదర్శపురుషుడు కాదు సరే. సీత ఎలా ఆదర్శవంతురాలవుతుంది? భర్త చేసే అన్యాయాన్ని నోరు మెదపకుండా అనుభవించడం తప్పు కాదా!? పోరాడని సీత మాత్రం ఎలా ఆదర్శమని చెప్తారంటే......?

జ. భార్యాభర్తలు విడిపోయినా,విడాకులు తీసుకున్నా,అక్రమ సంబంధాలు కలిగిఉన్నా, మోసం చేస్తున్నా వారు ఆదర్శనీయులు కారు. సీతని రాముడు త్యజించాడు కాబట్టి ఆదర్శనీయుడు కాడు.భార్యాభర్తల్లో ఒకరు తప్పు చేస్తే ఇద్దరూ భరించవలసి వస్తుంది.

వివాహ వ్యవస్థలో కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. భార్య తప్పు చేస్తే భర్త భరించవలసి వస్తున్నది,భర్త తప్పు చేస్తే భార్య భరించవలసి వస్తుంది. ఒక తప్పు జరిగినపుడు ఇద్దరూ అంగీకరించి ముందుకుపోవాలి కానీ విడిపోవడం సరికాదు.ధర్మ అర్ధ కామ మోక్షాల్లో ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు అని ప్రమాణం చేసినపుడు "నాతిచరామి" అన్న మాటను రాముడు నిలబెట్టుకోలేకపోయాడు.

ప్రజల నిర్ణయాన్ని సీతారాములు అంగీకరించారు.యుద్ధం లో గెలిచినా ప్రజలకోసం వారు జీవితంలో వారు ఓడిపోయారు. భార్యా భర్తలిద్దరూ కలిసి నిర్ణయించుకుంటే బాగుండేది కానీ రాముడు ఏకపక్ష నిర్ణయం తీసుకుని అడవిలో వదిలిరమ్మని అజ్ఞాపించాడు. రాముని ఎదిరించే మనస్థత్వం సీతకు లేదు. ఎదుటిమనిషి నిర్ణయాన్ని అనుసరించడమే సీతకు తెలుసు.అప్పటి ధర్మాలు భర్తను అనుసరించమనే చెప్పాయి.

ప్ర  45)  మీరు రాముడిని మాత్రమే విమర్శిస్తారెందుకు? పురాణ పురుషులలో మిగతా వారి కంటే రాముడిని "ఐకాన్ ఆఫ్ వేల్యూస్" గా ఇప్పటికీ గుర్తిస్తారు కదా?

జ. రాముడిని తప్పుపట్టడం కన్నా అప్పటి ధర్మాలను నేను ప్రశ్నిస్తున్నాను. అవే ధర్మాలను గుడ్డిగా అనుసరించే ప్రజలను నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ధర్మం అనేది ఏమిటి ?  భార్యను/భర్తను విడిచిపెట్టడం ఆదర్శమా? అని అడుగుతున్నాను. నేను రాముని గానీ ప్రజలను గానీ విమర్శించాలని అడగడం లేదు. ఒక యధార్ధాన్ని తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాను.

ప్ర  46)  రామాయణంలో 'సీత' పాత్ర ఎలా ఉంటే ఆదర్శంగా ఉండేదంటారు?

జ. మనం రచనలు చేసేటపుడు అధ్భుతమైన ఊహాలోకంలో విహరిస్తూ మన భాగస్వామి ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఊహించుకుంటూ వ్రాస్తాము. వాల్మీకి మహర్షి కూడా ఆడవాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో ఊహించి వ్రాసారు. సీతలాగా ఉంటే ఎలా ఉంటుందా అని నేను కొద్దిగా ట్రై చేసాను. మరీ అంత మెత్తగా ఉంటే రాముడేవిటీ రావణుడికీ మొత్తబుద్దేస్తుంది.అందుకే  సీత కొంచెం కోపగించుకోవడం నేర్చుకోవాలి అని భావిస్తున్నాను.

రావణుడిని మరీ గడ్డిపోచగా తీసివేయబట్టే రాముడలా అడవికి పంపాడు కదా ? రావణుడితో కాస్త ఫ్రెండ్లీగా ఉంటూ యుద్ధాన్ని నివారించవలసింది కదా అనిపిస్తుంది. రాక్షసుడితో ఫ్రెండ్షిప్ ఏవిటని మీరు బిత్తరపోయి చూస్తున్నారని నాకు అర్ధం అవుతుంది. మీకు మగవాళ్ళ సైకాలజీ అర్ధం కాదు. ఫ్రెండ్షిప్ చేస్తే మన జోలికి రారు.

అదే రాముడు చూడండి శూర్పణక ప్రొపోస్ చేస్తే సీతకు గీసినట్లు గీత గీయకుండా యాసిడ్ దాడి చేసేవాడి లాగా ముక్కూ చెవులూ కోసాడు.రావణుడు సీతను ముట్టుకోకుండా భద్రంగా చూసుకుంటే చంపేసారు. మంచివాళ్ళు చెడ్డవారు కావచ్చు కాబట్టి  రావణుడు చెడ్డవాడైనా మంచివాడుగా మార్చుకోవలసింది అనిపిస్తుంది.

ప్ర  47) ప్రస్త్తుత భారత రాజకీయాలపై మీ అభిప్రాయం?

జ. మా ఇంటిని శుభ్రపరచడానికి ఒక పనిమనిషిని పెట్టాను. ఒకరోజు ఏమేమి పని చేయాలో చూపించి నేను దేశాలు పట్టుకుని తిరిగివస్తే నా ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది ప్రస్థుత భారత దేశం.

మంచం మీద మడత పెట్టని దుప్పట్లు, హాల్లో చిందరవందరగా పేపర్లు,వంటగదిలో పొయ్యి చుట్టూ పాలు పొంగించిన మీగడ తరకలూ, బాత్రూం లో కడగని కమోర్డ్లు. ఇటువంటి పరిస్థితిలో "స్వచ్చ్ భారత్" కల సాధ్యపడేదెలా? ఈ పరిస్థితికి దోషులెవరు? ఇల్లు పట్టకుండా తిరుగుతున్న ఇల్లాలిదా? పని సక్రమంగా చేయని పనిమనిషిదా? ఎవరి బాధ్యత ఏమిటో గుర్తించి నాయకత్వం వహించని యజమానిదా ?
ప్ర  48) "స్వచ్చ భారత్" సాధ్యపడాలంటే ఎవరి భాధ్యత ఏమిటంటారు ?
జ. "ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అని అన్నట్లు మనం ఏ పని అయినా విజయవంతం చేయాలన్నా ప్రతి ఒక్కరూ సహకరించుకోవాలి.వివాహానికీ,గృహప్రవేశానికీ అన్ని ఏర్పాట్లూ చేసుకుని బంధువులు రాకపోయినా "స్వచ్చ భారత్" కార్యక్రమం ప్రకటించి ప్రజలను భాగస్వాములను చేయకపోయినా ఆ కార్యక్రమం విజయవంతం అవడం జరుగదు అని నేను భావిస్తున్నాను.
"స్వచ్చ భారత్ " సాధ్యపడాలంటే సమిష్టి బాధ్యత తప్పనిసరి !

ప్ర  49) 'రాజకీయం' అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

జ. రాజ్యాధినేతకీ జనస్వామ్యానికీ మధ్య క్రియాశీలకమైన యంత్రాంగం ఉండాలి. ఎవరికి ఏ పని నచ్చుతుందో గుర్తించి ప్రోత్సహిస్తూ భిన్నాభిప్రాయాలున్నా ఏకత్వం సాధించడమే రాజకీయం.

ప్ర  50) సూటిగా చెప్పండి- 'నీహారిక' సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలదా? సున్నిత మనస్కురాలా?

జ. మనసు సున్నితమే కానీ సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించను. సమస్యలు ఎదురైతే కొత్తగా ట్రై చేద్దామనుకుంటాను కానీ బాధపడుతూ కూర్చోను. గెలుపు, ఓటమి కన్నా ఆడడమే నాకు ముఖ్యం !

ప్ర  51) అందరూ రాజకీయాలను అసహ్యించుకుంటే వాటిని బాగుచేసేదెవరు?

జ. రాజకీయాలనూ,సినిమాలనూ,ఆటలనూ ఎవరూ అసహ్యించుకోరు,విమర్శిస్తారంతే! రాజకీయాలను బాగు చెయవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలది,నియంతృత్వంలో అయితే నియంతదే! నోటాలూ,లోక్ పాలూ బ్రహ్మానందంలాగా కమెడియన్ పాత్రలే !

ప్ర  52) మీ లక్ష్యం ఏమిటి?

జ. జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను దాటుకుంటూ వెళ్ళాలి. "అఖండ్ భారత్" సాధించడం అనేది నా స్వప్నం. ప్రస్థుతం రామ జన్మ భూమి పరిష్కారమే నా లక్ష్యం.


ప్ర  53) మీ అభిమాన నాయకుడు?

జ. నాయకుడంటే ధైర్య సాహసాలు కలిగినవాడుగా భావిస్తాను. ఎవరి మతం వారికి ముఖ్యం.పర ధర్మంకంటే స్వధర్మాన్నే అనుసరిస్తాను కానీ కత్తులూ,తుపాకులూ పట్టుకుని యుద్ధం చేయడం కన్నా సాహసోపేతమైన నిర్ణయాలు తీసున్న "లాడెన్" అంటే అభిమానం.

ప్ర  54) మీకు నచ్చిన సినిమా  ?

జ. బర్ఫీ, పిల్ల జమిందార్


ప్ర  55) మీ అభిమాన నటీ నటులు ఎవరు?

జ. అందం కన్నా అభినయం ముఖ్యం. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా , తెలుగు లో నాని, అనుష్క.

ప్ర  56) ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?

జ. జీవితం లో ప్రతి రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆ నిర్ణయాల వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చలించకుండా ఆనందంతో జీవించడం సాధన చేయాలి. జీవితాన్ని ఆశ్వాదించడమే ఆధ్యాత్మికత !

ప్ర  57) మతం పై మీ అభిప్రాయం?

జ. " ఒక నమ్మకమే విశ్వాసం, ఒక విశ్వాసమే ధర్మం, ఒక ధర్మమే మతం !"

ఒక చల్లని వెన్నెల రాత్రి ప్రియురాలు చెంతనుంటే హిందువు ఒకలాగా, ముస్లిం ఒకలాగా, క్రైస్తవుడు ఒకలాగా వేర్వేరుగా స్పందిస్తారని నిరూపించగలిగితే మతాలన్నీ భిన్నమే అని నేనంటాను.

ప్ర  58) సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?

జ. మన జీవితం సక్రమంగా నడవాలంటే క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఉండాలి అని సనాతన ధర్మం ఏర్పాటయింది. మంచి ఎపుడూ బాగానే ఉంటుంది కానీ కాలం మారుతున్నపుడు ధర్మం కూడా మారిపోయింది.

వ్యక్తిగత స్వార్ధాలకు సనాతన ధర్మం బలి అయిపోయింది. మనిషి తనంతట తాను అభివృద్ధి చెందాలి కానీ కులాలు,మతాలను పట్టుకుని వాటి ద్వారా లబ్ది పొందాలని చూడకూడదు.

హిందువులు తమకు అనుకూలంగా శాస్త్రాలను మార్చుకుంటూ వస్తున్నారు. మార్పు అనేది సహజం. ధర్మం అనేది ఫలానా అని ఇదిమిద్ధంగా చెప్పలేం. ఆయా కాలానుగుణంగా ధర్మాలు మారుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులకనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి.


ప్ర  59) మీరు చెప్పదలచుకున్న ఇతర అంశాలు

జ. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఎవరికి వాళ్ళు విడిపోయి సన్యాసం తీసుకుంటే సమాజ మనుగడ సాగదు. సనాతన ధర్మాన్ని పటిష్టమైన వివాహ వ్యవస్థే కాపాడగలదు. వివాహ వ్యవస్థ ని అడ్డుపెట్టుకుని వ్యభిచారం జరుగుతున్నది. ఒక స్త్రీకి ఒక పురుషుడుండాలని నిర్దేశించుకున్నాం. ఒక వివాహం చేసుకుని అన్ని రకాలుగా లబ్ది పొందిన తర్వాత విడాకులు ఇచ్చి మరల మరొక వివాహం చేసుకుంటున్నారు. రెండవ వివాహం ఏ కారణంతో జరిగినా దానిని వ్యభిచారం గానే పరిగణించాలి.

ఒక్కరితో మాత్రమే జీవితాన్ని పంచుకున్న వారికీ ఇతరులకీ తేడా ఉండాలి. వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని వివాహ వ్యవస్థని అవమానించకూడదు. ఒక వివాహం చేసుకున్న తరువాత నచ్చక విడిపోతే సహజీవనాన్ని ఎంచుకోవచ్చు, వివాహ వ్యవస్థ ని మాత్రం పవిత్రంగానే ఉంచాలన్నదే నా కోరిక !!
-----------------------------------------------------------------------------
బ్లాగరుగా, సామాజిక కార్యకర్తగా నీహారిక పాల్గొన్న కొన్ని కార్యక్రమాల ఫోటో గేలరీ 
ఎస్.సి, ఎస్.టి సబ్ ప్లాన్ పై చర్చా కార్యక్రమంలో
తోటి మహిళా బ్లాగర్లతో నీహారిక

--------------------------------------------------------------------------------------------
మీరు మీకు నచ్చిన బ్లాగరుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మాకు వ్రాయండి. వివరాలకు ఇక్కడ నొక్కండి.
--------------------------------------------------------------------------------------------

 - పల్లా కొండల రావు

Post a Comment

 1. I DONT KNOW WHY YOU ARE NOT QUESTIONING ABOUT HER WILLFUL TAMPERING OF OTHER FELLOWS CONTENT WITHOUT PERMISSION AND WHY ALL THE MORAL LECTURES ONLY FOR ME?

  ReplyDelete
 2. @నీహారిక ఉరఫ్ ఆకుల ధనౌదయలక్ష్మి
  మీరు మొదటి నుంచీ నా పాత ప్రశ్నలకి జవాబు చెప్పకుండా కొత్త ప్రశ్నలు నామీదకి విసిరి జవాబులు మీఉ చెప్పకుండా దాన్ని నాకు అంతగడుతున్నారు,కాబట్టి ఇప్పటి వరకూ మీ ప్రస్తావనల్ని అన్నీనీ తముస్టాంపులతో అహా ఇకడ ప్రస్తావించి కొత్తవీ పాతవీ కలిపి ఇక్కద వేస్తున్నాను.ఇక్కడి నుంచయినా చర్చ ఒక వరసలో జరిగితే మీకూ నాకూ ఈ చర్చని ఫాలో అయ్యేవాళ్లకీ శ్రమ తప్పుతుంది.

  --------------------------------------------------
  Haribabu Suranenii25 May 2015 at 12:27:00 GMT+5:30
  ఈ టైం స్టాంపుతో నేను మూడు పాయింత్లతో కొని ప్రశ్నలు వేశాను.మర్యాద ప్రకారం మీరు మొదట నా ప్రశ్నలకి సమాధానం చెప్పాక కొత్తగా మీరు నాకు వెయ్యదల్చుకున్న ప్రశ్నలు వెయ్యాలి,కానీ
  నీహారిక1 June 2015 at 17:05:00 GMT+5:30
  టైం స్టాంపుతో వచ్చి” రాముడిని సీత నపుంసకుడు అని అనేసిందా ?” అని అమాయకంగా అడిగి వాల్మీకి రామాయణం మొలమే కాకుండా యే నిక్కచ్చి అనువాదాన్నె తమరు చదవలేదనే విషయాన్ని బయట పెట్టేసుకున్నారూది మాకు ఇప్పటికయినా బుర్రకి తోచిందా లేదా?అస్లు మీరు యే కధని ఉతికి ఆరెయ్యాలనుకుంటున్నారో యే కధలోని సన్నివేశాల్ని విమర్శించటం ద్వారా పాప్యులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ కావ్యంలో అక్కడ అసలు యేమి ఉందో ఇదివరకు గానీ ఇప్పుడు గానీ ఇకముందు గానీ తెలుసుకోలనే శ్రధ్ధ మీలో లేదని తెలుస్తున్నది,అవునా కాదా?అసలు అక్కద్ అయేముందో తెలుకోవాలని అనుకోనప్పుడు మోదీకీ రాముడికీ లింకులు పెట్టటంలో చవకబారు వినోదాన్ని సృష్టించటం తప్ప మీరు సాధించగలిగేది యేమయినా ఉందా?

  నీహారిక15 June 2015 at 19:40:00 GMT+5:30
  టైము స్టాంపుతో యోగవాశిష్టం గురించిన ఒక వ్యాసపు ముక్క అదీ రాముడికీమోదీకీ లింకు కలపటానికి పనికొచ్చే ముక్కని మాత్రం సాక్ష్యానికి చూపిస్తున్నారు,కానీ రామాయణంతో పోలిస్తే దానికి సాధికారికత లేదు - దానికే కాదు గట్టిగా మాట్లాడితే రా,అ చరిత మానసానికి కూడా లేదు.రామాయణానికి సంబంధించి ఇప్పటి వరకొ జరిగిన అన్ని చర్చల లోనూఒ సమర్ధించే వాళ్ళూ వ్యతిరేకించే వాళ్ళూ వాల్మీఎకి రామాయణాన్నే ప్రమానం అని ఒప్పుకున్నారు!ఇవ్వాల మీకు కొత్తగా చేద్దామని ఉన్నా నేను సిధ్ధంగా లేను.

  నీహారిక1 June 2015 at 17:37:00 GMT+5:30
  "రాముడు అనుమానించిన నాడే సీత రావణపత్ని అయిపోయింది.సీతకి ఇద్దరు పతులు,అందరు దేవుళ్ళకీ ఇద్దరేసి భార్యలున్నారు,సీతకు ఇద్దరు భర్తలుంటే తప్పులేదులెండి.” అనే తీర్పు ఇవ్వటానికి మీకున్న అధికారమేమిటి?మీకు ఆ స్థాయి ఉండి అంతే భేషుగ్గా ఒప్పుకుంటారు,ఆ తీర్పు ఇచ్చేముందు ఆ స్థాయి మీకుందని నిరూపించుల్కోలేదు గాబట్టి ఇప్పుడు నేను వేసే ప్రశ్నలకి జవాబు చెప్పి నిరూపించుకోననినా నిరూపించుకోవాలి,లేదా ఆ మాతని వెనక్కి తీసుకోవాలి,పైన మీరే రాతలో ఒకసారి రాసేశాక వెనక్కి తీసుకోలేము గాబట్టి బాగా ఆలోచించి రాయాలి అని సెలవిచ్చిన సుభాషితం మీకు కూడా వర్తిన్స్తుంది కదా!
  "యేకం సత్ విప్రాణి బహుధా వదంతి" అన్న పెద్దలే "సత్యమే వేదం(సత్యమే తెలుసుకొనదగినది)" అన్నారు!"ఆలస్యం అమృతం విషం" అన్న పెద్దలే "నిదానమే ప్రధానం" అని కూడా అన్నారు?ఒక్కొక్క విప్రవరుడూ ఒక్కొక్క రకంగా చెప్పిన వాటిల్లోనుంచి మౌలికసత్యాన్ని కనుక్కోవడం యెట్లా?ధర్మం అన్ని కాలాల్లో అన్ని తావుల్లో అందరికీ ఒక్కలాగే ఆచరణీయ మవుతుందా?ధర్మం అనే మాటకి యెవడికి తోచిన అర్ధం వాడు చేప్పుకుని ఇది నా స్వధర్మం అంటే యేమి చెయ్యాలి?స్వధర్మాన నిధనం శ్రేయ మెందు కయింది?పరధర్మం భయావహ మెందు కయింది?
  వీటిపట్ల సాధికారికత లేకుండా సీతాపరిత్యాగం అధర్మమని యెట్లా వాదిస్తున్నారు?అట్లా వాదించహ్టానికి హిందూఒ ధర్మంలో ఉన్ననాల్గు వేదాలు,అష్టాదశ పురాణాలు,అసంఖ్యాకమైన ఉపనిషత్తులు,అరణ్యకాలు,గీత - అన్నింటిలోనూ ఉన్న యేకోన్ముఖత యెట్లా వచ్చిందో చెప్పగలరా? రాముడు చేసింది తప్పని చెప్పడానికి తప్పొప్పుల్ని నిర్ధారించడానికి యే శ్రుతిని యే స్మృతిని యే తర్కాన్ని యే వ్యాఖ్యానాని అనుసరించారో చెప్పగలరా?
  ---------------------------------------------------

  ReplyDelete
 3. నీహారిక1 June 2015 at 17:50:00 GMT+5:30
  టైం స్టాంపులో నా మొదటి ప్రశ్నలకి జవాబులు పూర్తిగా చెప్పకుండనే మీరు యేమి అడిగారో పైనున్న తము స్టాముల్లో స్పష్తంగా లేకపోయినా “మీరు నా సందేహాన్ని తీర్చకుండా మీకిష్టమైనట్లు మాట్లాడితే ఊరుకోడానికి పనిలేని బ్లాగర్ని కాదు.” అంటున్నారు - అంటే యెదటివాళ్లని ప్రశ్నలు అడిగి రాబట్టుకునే దురద తప్ప యెదటివాళ్ళు అడిగినవాటికి సూటిగా జవాబు చెప్పే బాధ్యత మాత్రం మీకు లేదు,మేమేనా ఇక్కడ పనిలేకుండా కూర్చున్నది?!పాత ప్రశ్నలకెమి గానీ ఇప్పుడు అపైన సూటిగా అడిగిన ధార్మిక సంబంధమైన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పకుండా పక్కదారి పటించదల్చుకుంటే మాత్రం మీరు వాదనకి నిలబదలేరని నను ప్రకటించి ఇతర్ల అభిప్రాయాన్ని కోరడం,వారు అదే అంగీకరిస్తే మీరు నా గెలుపుని ఒప్పుకోవడం తప్ప మరో ఆల్తర్నేటివ్ లేదు!
  నీహారిక11 June 2015 at 00:15:00 GMT+5:30
  టైము స్టాంపులో నన్ను నోరుపారేసుకున్న రావణుడు అని సంబోధించే ముందు నా బ్లాగులోని కంటెంటుని వికృతంగా మెలితిప్పి వాడుతూ నామీద అసభ్యకరమైన దాడి చేస్తూ గట్టిగా అడిగితే బ్రహ్మానందం కామెడీ దయలాగులతో పొల్చిన తెమరితనం యెవరిది?>బ్లాగు రాతలకి కాపీరైటు ఉందకపోవచ్చు,శ్రీ శ్రీ కవిత్వాన్ని ఉదహరిస్తున్నాం అంటే వాటిని మనకి వీలుగా మార్చటం లేదు,యధాతధంగా రాసినవాడి కున్న ఆత్మాభిమానాన్ని గాయపరచకుండా మర్యాదకరమైన పధ్ధతిలో వాడుతున్న్నాం.జగదేక వీరుదు అనే సినిమా గురించి సరదాగా రాసిన త్రిషా కృష్నన్ యేడిస్తే ఓదార్చడాన్ని రామాయణాన్ని విమర్శించడానికి వాడటంలో ఔచిత్యం పరిధుల్ని దాటింది మీరు కాదా?జై గొట్టిముక్కల తోనూ శ్రీకాంత్ చారి తోనూ నేనూ ఇలాంటివి చాలా చేశాను,కానీ యెప్పుడు వాద ప్రతివాదాలు పెరిగ్ఫి కొంచేం చనువు పెరిగాక,కానీ అంతకు ముందు మీరెవరో నాకు తెలియదు,తెలిసినా వాదనలో నాతో తొలిసారి సంభాసహనలోనే మీరు అంత అతి చనువు తీసుకున్నారు,యెందుకని?ఇప్పుదు కూడా దొంగనాయకమ్మ బ్లాగులో నేను మీ గురిన్వ్చి చేసిన వూఅఖ్యలకి పశ్చాత్తాపం యేమీ లేదు,కానె ఇక్కడా వాదనలో మీరు నాగురించి యే బ్లాగులో యేమి కూఒసినా నాకు అనవసరం,మీకూ నా గురించి అంతే!ఇక్కడ వాదనలో మన్మ్ యెట్లా వాదిస్తున్నాం అన్నది ముఖ్యం,అవునా కాదా?

  ReplyDelete
 4. ఇన్నాళ్ళు బాబ్రీ మసీదు విషయంలో పరిశోధించి మీరు తెలుసున్న్నది ఇదా,నావాలా యేదవాలా?ఇన్నేళ్ళు మీరు కాలికి బలపం గట్టుకుని తిరిగిన సమయమంతా వృధా?చరిత్రలో బాబరు అనేవాడు ఉన్నా లేకపోయినా వాడే కూల్చి కట్టినా మరొకడు కూల్చి కట్టి బాబరు పేరు పెట్టినా హిందువుల వాదన మొదటి నుంచీ ఒకటే తవ్వకాల ద్వారా బయట పడిన సాక్ష్యాలను బట్టి చూసినా ఆ మసీదు ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి కట్టారు అనేది!దేవుడున్నాడా లేడా?రాముడు దేవుడా కాదా అనే విషయంలో యే కోర్టు అయినా తీర్పు చెప్పగలదా?కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అది రాముది జన్మతో స్సంబంధం ఉన్న భూమి కాబట్టి అక్కడ రామాలయం నిర్మించాలై అనేది హిందువుల వాదన!ఇందులో బాబరు అనే వ్యక్తికి యే సంబంధమూ లేదు,ఆ మసీఉకి ఆ పేరు ఉండటం తప్ప!మీరు ఇన్నేళ్ళుగా రీసెర్చి చేశానంతున్న ముఖ్యమైన విషయంలోనే మీరెంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసుకోండి!రాష్త్ర విబజనకి కారణమైన ఇప్పటి తెలంగాన ఉద్యమానికి ఏసీఆర్ ఆఖరి దశలో వచ్చి దాన్ని సాధించి చూపించిన వ్యక్తియే తప్ప కేవలం అతని వల్లనే వచ్చింది అని చెప్పడానికి వీలు లేకుండా అప్పటికే రగులుతున్న తెలంగాన ఉద్యమం యెంత గట్టి సాక్ష్యాన్ని ఇస్తుందో అద్వానీ ఒక్కడి వల్ల ఆ ఆవేసం పుట్తలేఅని చెప్పటానికి దేసంలో ఆ భావావేసం ఉన్న ప్రతి చోటు నుంచీ రామ నామానితమైఅన శిలలు యెవరు తయారు చేశారు,యెట్లా ఆక్కడికి తీసుకెళ్ళారు అనేవి పరిసోధిస్తే తెలుస్తుంది - చరిత్ర గురించి మాట్లాడేతప్పుడు నోతికొచ్చింది మాట్లాదకుండా సాక్ష్యాధారలతో మాట్లాడే జాగ్రత్తలు తీసుకోవాలి.అసలు సీత రాముద్ని నపుంసకుడు అనిందా అనై దీర్ఘాలు తీసేతంతగా రామాయన కధ గురించి యేమీ తెలియని అజ్ఞామలో ఉండతం దేన్ని సూచిస్తుంది?
  నీహారిక11 June 2015 at 00:15:00 GMT+5:30
  మొదటి నుంచీ ఈ తైము స్టాంపు వరకూ అది తెలిసునా ఇది తెఉసునా అనై అడుగుతున్న మీకు రామాయణంలో యేమి ఉన్నదో రూఢిగా ఒక విషయమయినా తెలుసునా?

  "నీకు అన్న భార్యకి కాప్లా ఉందతం తప్ప వేరే పనేమీ లేదా అనై అరిచింది" అనే భాగానికి మూలంలో ఉన్న శ్లోకం ద్వారా ఆధారాన్ని చూపించగలరా?సీతని "నువ్వు రావణుడి లంకలఓ అంతకాలం ఉన్నావు గనక నేను స్వీకరించటం లేదు,అగ్నిపరీక్షలో ఉత్తీర్ణురాలవై నీ అపవిత్రతని నిరూపించుకుంటేనే స్వీకరిస్తాను" అనై అనే అర్ధంతో ఉన్న శ్లోకాల్ని వాల్మీకి రామాయనం నుంచి చూపించగలరా?యెవరు యెవరికి గీతలౌ గీసారో వాల్మీకంలోని ఆధారాలతో చెప్పగలరా/ఒక చోట కేవలం ఇఒక మనిషి మాటకే అంత విలువ ఇవ్వాలా అనై నన్ను అడుగ్తూ "ప్రజలు కర్ణాకర్ణిగా అనుకుంటున్నారు" అనే విషయం న్మీకు తెలుసా అని నన్ను నిలదెస్తున్నారు,దీనర్ధం యేమితి?నేను నా పర్తైవాదన దేని గురించి చెయ్యాలి?

  పైన యేది రాసినా జాగ్రత్తగా ఆలోచించి రాయాలి అనై సుభాషితాలు చెప్తూనే "శూర్పనఖ లాగా బతకాల్నుకుంటే ముక్కూ చెవులూ కోయించుకోవాల్సి ఉంటుంది" అని శూర్పనఖని విమర్సించటమూ "శూర్పనఖ కేవలం దేటింగు ప్రపోసల్ చేసినందుకే యాసిద్ దాడి చేసినట్టు చెయ్యాలా" అని అదే శూర్పణఖ మీద జాలి పుట్టిస్తుంటే నేను దేన్ని విమర్సించాలి?మీరు శూర్పణ్ఖని విమర్శించడం కరెక్టా,సమర్ధించటం కరెక్టా!

  ReplyDelete
 5. P.S:1.చిన్న పొర్పాటు పైన అన్నీ గుదిగుచ్చిన సారం మాత్రమే తీసుకుంటే చాలని అన్నాను గానీ నేను వేసిన వూహాత్మకమైన ప్రహేళిక మీ భర్తగారినీ తంద్రిగారినీ ప్రస్తావిస్తూ అడిగిన ప్రసన కూడా కలపాలి!
  2.మీరు మీ ఇంటర్వ్యూ లో ఆఖరి భాగంలో చెప్పుకున్నట్టుగా వివాహవ్యవస్థ పవిత్రంగా ఉండాలనీ హిందూ ధర్మమ పట్ల గౌరవం ఉందనీ స్పష్తంగా తేలితేనే నేను వాదనలో ముందుకు వెళతాను.నేను మొదటి నుంచీ స్పష్తం చేస్తున్నట్టు అసలు వాల్మీకి రామాయనంలో యేమి ఉందో పట్టించుకోకుండా మీ సొంత పులుముడులతఓ వాదించదలుచుకుంటే నేను యెట్టి పరిస్థిఉల్లోనూ వాదన కొనసాగించను,కాబట్టి వాదన లో మీరు యే పధ్ధతిని ఫాలో అవుతారు అనేది తేల్చి చెప్పటం తప్పనిసరి!
  3.చర్చ ఈ పధ్ధతిలో సాగి మొదట నేను అడిగిన వాటికి జవాబులు చెప్పుకుంటూ వస్తే మీరు అడిగిన వాటికీ నేను తప్ప్పకుండా జవాబు చెప్తాను,అలా కాకుండా వాల్మీకి రామాయనంలో యేమి ఉందో నాకనవసరం,యెదటివాళ్ళు దిగ్ణ్రమ చెందేలాగ యేదో గాలి పోగేసి ఒకదానికొకటి పొంతన లేకపోయినా పట్టించుకోకుండా నాకిష్తమన పధ్దహ్తిలోనే నేను విమర్శిస్తాను అంతే నాకు యెలాంతి అభ్యంతరమూ లేదని మొదట్లోనే చెప్పాను.ముప్పాల రంగనాయకమ్మ చేసినట్టుగానే మీ సొంత పులునుడుతో మీరు సృష్టించుకున్న రాముణ్ణి మీరు విమర్శించుకుంటే నాకు అభ్యంతరం దేనికి?మీ ముఖం మీద మీరు ఉమ్మ్ముకుంటే సంతోషంగా చూసి ఆనందిస్తాను,పాతవన్నీ గుదిగుచ్చి ఇక్కద పేర్చాను గాబట్టి ఇక్కణ్ణుంచే మొదలెట్టండి.
  వీటికి భిన్నంగా మీరు వాదించతంలో మొండిగా ఉంటే నావైపునుంచి వాదన ఆపెయ్యదం ఖాయం,ఆదవాళ్ల విషయంలో ఓతమి కూడా గెలుపు లాగే మధురంగా ఉంటుంది లెమ్మ్మని సరిపెట్టుకుంటాను.

  ReplyDelete
  Replies
  1. Dont use "Muppala" before Ranganayakamma's name. It is the name of her estranged husband. Her father's surname was Dadanala. She uses neither of those surnames at present.

   Delete
  2. Rama is just a fictional character like Uncle Scrooge. Do we need to mind if someone defames that character?

   Delete
  3. దీనికే నేను ఒకచోట జవాబు చెప్పాను ఇట్లా:ముప్పాళ రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి అనే కధలో జానకి అత్తా భర్తా ఆమేని వ్యంగ్యంగా మాట్లాడటం,కొడుతూ ఉండటం చేస్తూ ఉంటారు వరకట్నం తీసుకు రాకపోవటం దగ్గిర్నుంచి పనుల్లో లోపాలు యెంచటం వరకూ.అయినా జానకి భరిస్తూనే ఉంటుంది ఆ భరించటం యే స్థాయిలో ఉంటుందంటే చదువుతుంటే యే మనిషైనా ఇంత టార్చర్ భరించి విముక్తం కాకుండా ఉంటుందా అనిపిస్తుంది!

   బాగానే ఉందయ్యా,రామాయణం లాగే అది కూడా ఒక కధే గద - ఇప్పుడు నేను,"ఆ జానకి నాకు బాగా తెలుసండీ!మాకు మూడిళ్ళ అబతలే ఉంటారు,ఆ అమ్మాయి క్యారెక్టరు మంచిది కాదు,మదపిచ్చి!అందుకే, తన లోపం ఉంది గనకనే వాళ్ళట్లా హింస పెడుతున్నా చచ్చినట్టు పడి ఉంటుంది" అని కలరు పులిమి కొత్త వెర్షన్ చెప్పాననుకో,నీకెలా ఉంటుంది?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top