నేడు  అల్లూరి సీతా రామ రాజు 118వ జయంతి.  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ( జూలై 4, 1897 - మే 7, 1924) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు......... ఆ మహావీరుని జీవితగాథను తన 100వ చిత్రంగా హీరో కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. అల్లూరి జయంతి సందర్భంగా యూ ట్యూబ్ లోని ఆ సినిమా మీ కోసం ఇక్కడ ఉంచుతున్నాము.

Post a Comment

 1. కాలాపానీ సినిమా చూసినప్పుడు నాకు థ్రిల్ కలిగింది కానీ అల్లూరి సినిమా చూసినప్పుడు అది కలగలేదు. కాలాపానీ సినిమాలో పూర్తిగా తెల్లని ఛాయ గల ఆంగ్లేయులు & ఆంగ్లో-ఇందియన్స్‌ని ఆంగ్లేయుల పాత్రల్లో పెట్టారు. కానీ అల్లూరి సినిమాలో జగ్గయ్య ముఖానికి ఎంత మేకప్ వేసినా అతను ఆంగ్లేయునిలా కనిపించలేదు.

  ReplyDelete
  Replies
  1. అల్లూరి సీతారామరాజు కొట్లాడింది మన్యప్రజల కోసం. వారు హిందువులో కాదో అనుమానమే. వారి భాష ఖచ్చితంగా తెలుగు కాదు. సినిమాలో తెలుగుతనం & హిందూ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండడం కూడా ఎబ్బట్టుగా ఉంది.

   Delete
  2. బొర్రా గుహలు, కరకవలస, సిమిలిగూడ, అరకు చుట్టు పక్కల గ్రామాల్లోని ఆదివాసులు second languageగా తెలుగు మాట్లాడుతారు. వాళ్ళ vernacular language మాత్రం తెలుగు కాదు.

   Delete
  3. ఈ మధ్యనే నేను "మా భూమి" అనే సినిమా చూసాను. ఆ సినిమాలో దొరగారి భార్య దొరకి తెలియకుండా తమ గడీలో పని చేసే రామయ్యని కలుసుకోవాలనుకుంటుంది. కానీ రామయ్య తప్పించుకుంటాడు. ఆ రోజుల్లో, అక్షరం ముక్క రాని పాలేరుకి పరాయి స్త్రీని కలుసుకోకూడదు అనే సంస్కారం ఉండే అవకాశం ఉందా? ఇంకో సన్నివేశంలో రామయ్య భోగం గుడిసెలోకి దూరుతాడు కానీ అతను ఆ భోగం స్త్రీని ఏమీ చెయ్యలేక బయటకి వచ్చేస్తాడు. భోగం స్త్రీని కలుసుకోవడం సంస్కారం కాదని చదువురాని రామయ్యకి ఎలా తెలిసింది? 1955 వరకు మన దేశంలో భోగం వృత్తిపై నిషేధం లేదు కూడా.

   సాధారణ వ్యక్తి కంటే విప్లవకారునికి సామాజిక చైతన్యం ఎక్కువ ఉంటుంది. విప్లవకారుడు భోగం స్త్రీల దగ్గరకి వెళ్ళడు అనే నేను అనుకుంటాను. విప్లవకారుడు భోగం స్త్రీ దగ్గరకి వెళ్తున్నట్టు చూపించకూడదు. భోగం వృత్తిపై నిషేధం లేని రోజుల్లో ఒక చదువు రానివానికి అంత సంస్కారం ఉన్నట్టు చూపించడమే నాకు ఆశ్చర్యం కలిగించింది.

   అది అల్లూరి సీతారామరాజు సినిమాలాగ వాస్తవానికి మరీ దూరంగా అయితే పోలేదు.

   కాలాపానీ సినిమా కూడా బాగానే ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల్లో అనేక మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు కనుక ఆ సినిమాలో కొన్ని బ్రాహ్మణవాద సన్నివేశాలు పెట్టినా అది చూడగలిగాను.

   Delete
  4. జై గారు, అప్పట్లో అక్కడ హిందువులు ఉండేవాళ్ళో, కాదో చెప్పలేము. ఆ ప్రాంతంలో పురాతన హిందూ దేవాలయాలు మాత్రం లేవు.

   Delete
 2. ఆ సినిమా రచయితకి కథ ఎక్కడ దొరికిందో తెలియదు. అందులో రామరాజు రథర్‌ఫర్ద్‌తో మాట్లాదుతున్నట్టు చూపించారు. ఆంగ్లేయుల్లో చాలా మందికి తెలుగు రాదు. వాళ్ళు గుమాస్తాల సహాయంతో జనంతో మాట్లాడేవాళ్ళు. రథర్‌ఫర్ద్‌కి తెలుగు వచ్చో, రాదో అనేది అనుమానమే. రథర్‌ఫర్ద్ రామరాజుని కలవలేదు. అతను ఒక ద్రోహి సహాయంతో రామరాజుని పట్టుకుని చంపించాడు.

  ReplyDelete
  Replies
  1. ఈ సినిమా కథను పరిశోధన తరువాతే కొన్ని మార్పులు చేసి తీసినట్లు ఎక్కడో చదివాను. వాస్తవానికి సీతారామరాజు నిక్కర్ వేసుకునేవాడట. ఆయన రూదర్‌ఫర్డ్ కు ఎదురుపడడం, క్లైమాక్ష్ డైలాగులు కూడా కల్పనే అనుకుంటాను.

   Delete
  2. రామరాజుని పట్టించినది ఒక ద్రోహి. అంతే కానీ రథర్‌ఫర్ద్ దగ్గరకి రామరాజు వెళ్ళలేదు.

   Delete
  3. రామరాజు బ్రిటీష్ వారిపై పోరాడినది తెలుగువారి తరపున కాదా? మన్యం ప్రజలు తెలుగువారు కారా?

   Delete
  4. అరకు ప్రాంతంలోని ఆదివాసులు మాత్రం తెలుగువాళ్ళు కాదు.

   Delete
  5. ఆదివాసీలకు సొంత మాతృభాష ఉంటుంది. చుట్టూ ఉండే ఆధిపత్య సమాజ ప్రభావం & మాతృభాష బోధనావకాశాలు లేకపోవడం వల్ల గత్యంతరం లేక ఆధిపత్య వర్గాల భాష రెండో భాషగా మాట్లాడుతారు. కాలక్రమేణా కొన్ని జాతుల భాషలు అంతరించుకుపోతాయి.

   గిరిజన జీవనాన్ని ద్వంసంలో చేయడంలో విదేశీ సామ్రాజ్యవాదుల పాత్ర ఎంత ఉందో అంతకంటే "స్వదేశీ" ఆధిపత్య వర్గాల ప్రమేయం ఎంతో ఎక్కువ.

   అల్లూరి తెలుగు వారి తరఫున ఆంగ్లీయులతో పోరాడానడం సత్యదూరం.

   Delete
  6. జై గారు, మీ వ్యాఖ్య ఉద్దేశం నాకు అర్ధం కాలేదు. మరింత వివరంగా చెప్పగలరా? అల్లూరి ఎవరి కోసం, ఎవరి సహాయంతో పోరాటం చేశారు?

   Delete
  7. అల్లూరి పోరాటానికి స్పూర్తి, వెన్నుముక & ప్రయోజనం అన్నీ (తెలుగేతరలయిన) గిరిజనులే.

   Delete
  8. మా పెద్దమ్మ గారి వియ్యంకుడిది బొబ్బిలి దగ్గర నగుళ్ళు గ్రామం. ఆ గ్రామస్తులు మాట్లాడే భాష అరకు ప్రాంతంలో మాట్లాడే భాషని పోలి ఉంటుంది. అరకు, సిమిలిగూడా, కరకవలస, బొర్రా గుహలు రైల్వే స్తేషన్‌లలో ఎక్కి దిగే ఆదివాసులు తమ సొంత భాషే మాట్లాడుతారు. సంతల్లో కోమటోళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళు తెలుగునే ఉపయోగిస్తారు. తెలుగు అనేది వాళ్ళకి lingua franca. Lingua franca అంటే అది మాతృభాష కాకపోయినా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళందరికీ అర్థమయ్యే భాష.

   Delete
  9. జై గారు, భాష అనేది సామాజిక సంపర్కం వల్ల మారుతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర యాసలో కుక్కని బేపి అనేవాళ్ళు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అందరూ కుక్కని కుక్క అనే అంటున్నారు. కుక్క అనేది తెలుగు పదం కూడా కాదు. అది కుక్కుర అనే మాగధి ప్రాకృత పదం నుంచి వచ్చింది. ఆ పదం హిందీలో కుత్త, మరాఠి, కోకణిలలో కుత్రా, ఒడియాలో కుకుర, తెలుగులో కుక్కగా పరిణామం చెందింది. మౌర్యుల వల్ల అనేక మాగధి ప్రాకృత పదాలు, శాతవాహనుల వల్ల అనేక మహరాష్ట్రి ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి.

   ఇప్పుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకప్పుడు కాకతీయులు & తూర్పు చాళుక్యుల పాలనలో ఉండేవి. కాకతీయులు & తూర్పు చాళుక్యులూ తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. ఒరిస్సాలోని గంజాం ప్రాంతం కూడా ఒకప్పుడు కాకతీయుల పాలనలో ఉండేది కానీ గంజామీయుల్లో ఎక్కువ మందికి తెలుగు రాదు. గంజాం ప్రాంతంలో స్థిరపడినవాళ్ళలో ఎక్కువ మంది ఖండాయతులు. ఖండాయతులది ఒడియా మాట్లాడే జాతి. అందు వల్ల బరంపురంలో తెలుగువాళ్ళు తక్కువగా కనిపిస్తారు. ఒరిస్సాలో స్థిరపడిన కాపు, తెలగా, కమ్మ, వెలమ దొర కులస్తులు మాత్రం తెలుగులోనే మాట్లాడుతారు. ఆంగ్లేయుల కాలంలో బరంపురంలో గంజామియా భాష మాట్లాడేవాళ్ళు. అది తెలుగు పదాలు కలిపిన ఒడియా భాషలా ఉండేది. ఇప్పుడు బరంపురంలో ఒడియా భాషే మాట్లాడుతున్నారు, గంజామియా ఒక మృత భాష అయిపోయింది.

   మీ తెలంగాణా విషయానికి వస్తే, ఆదిలాబాద్ ప్రాంతం ఒకప్పుడు గోండులది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో కొంత మంది గోండ్ భాషే మాట్లాడుతారు. ఆదిలాబాద్ జిల్లాలో వెలమ జమీందార్లు కట్టిన కోటలు కూడా కనిపిస్తాయి. కాకతీయులు పంపిన వెలమ సైనికుల వల్లేమో, అక్కడ తెలుగు వ్యాపించి ఉంటుంది.

   Delete
  10. @Marxist Hegelian:

   సామాజిక సంపర్కం వల్ల భాష మారుతుందని నేనూ ఒప్పుకుంటాను. అయితే దీంట్లో సహజసిద్దమయిన మార్పులు ఫరవా లేదు కానీ ఆధిపత్య వర్గాల ప్రత్యెక/పరోక్ష దోపిడితో జరిగిన మార్పు నేను సమర్తించలేను.

   ఇది గొండీకి కూడా వర్తిస్తుంది.

   Delete
  11. బాహ్య ప్రభావం లేకుండా అంతర్గత మార్పులు జరగవు. హిందూ & బౌద్ధ మతాలూ, ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చిన పాలకవర్గాల ప్రభావం వల్ల అనేక మార్పులు చెందిన భాషనే మనం మాట్లాడుతున్నాం.

   Delete
 3. @jai
  చుట్టూ ఉండే ఆధిపత్య సమాజ ప్రభావం & మాతృభాష బోధనావకాశాలు లేకపోవడం
  my question:
  అమెరికా వెళ్ళడానికి ఇంగ్లీషు యెందుకు నేర్చుకుంటున్నారు?

  ఒక ప్రాంతంలో అనాదిగా పుట్టి పెరుగుతూ వస్తున్న 80% మంది తెలుగులో మాట్లాడుతున్నారు.మిగతా 5%గానూ 3%గానూ ఉన్న విదివిడి జాతుల కోసం ఈ 80% మందీ ఆయా భాషల్ని నేర్చుకుంటే గానీ మీ ద్ర్ష్తిలో సమాంత్వం అవుతుందా?రోము వెళ్ళాలనుకున్నవాడు రోమను భాష కానీ తన భాషకీ ఆభాషకీ లింకు యేపరచే దుబాసీ సాయం తీసుకోవటం యెంత సహజమఓ అడవుల నుంచి బయతకి వచ్చినప్పుడు అప్పుదు అక్కద వున్నవారియో సంభాషించడం అనే తమ అవస్రం కోసం తెలుగు నేర్చుకుంతే మీ దృష్తిల్లో "చుట్టూ ఉండే ఆధిపత్య సమాజ ప్రభావం" అవుతుందా?

  ఒకరు మరొక భాషను నేర్చుకోవడమే బానిసత్వం అయిపోయినట్టు"గిరిజన జీవనాన్ని ద్వంసంలో చేయడంలో విదేశీ సామ్రాజ్యవాదుల పాత్ర ఎంత ఉందో అంతకంటే "స్వదేశీ" ఆధిపత్య వర్గాల ప్రమేయం ఎంతో ఎక్కువ" అని తీర్మానించేసినప్పుడు తెలంగాన పంచవేణీ సంగమం అయి ఉండేదా?

  యేమి శాస్త్రీయ ధోరణి ఇది?

  ReplyDelete
 4. ఉత్తరాంధ్ర ప్రజలు కుక్కని బేపి అనే రోజుల్లో శ్రీకాకుళం నుంచి విజయవాడకి బస్సులు లేవు. అప్పట్లో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకే బస్సులు ఉండేవి. రవాణా సౌకర్యాలు పెరిగిన తరువాత భాష కూడా మారింది. ఉత్తరాంధ్ర యాసలో ఇప్పటికీ "కాలేదు" అనడానికి "అవ్వలేదు" అంటారు.

  ReplyDelete
 5. జై గారు, పాలకవర్గ భాష పాలితవర్గానికి సంక్రమిస్తుంది కానీ పాలితవర్గ భాష పాలకవర్గానికి సంక్రమించే అవకాశం తక్కువ. మహబూబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్‌లో పది ఉర్దూ పత్రికలూ, రెండు మరాఠీ పత్రికలూ ఉండేవి కానీ తెలుగు పత్రిక ఒక్కటీ లేదు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. >పాలకవర్గ భాష పాలితవర్గానికి సంక్రమిస్తుంది.
   ఈ సంక్రమణం సహజపరిణామం కాకపోవచ్చును తరచుగా. ఉద్యోగాలకు పాలకుల భాష తప్పని సరి కావటం. అంతేకాకుండా తమ భాషాసంస్కృతులను పాలకులు జనం మీద రుద్దటం రెండు అసహజాలే కదా.

   Delete
  2. మాస్టారూ, లాటిన్ అమెరికా చరిత్ర చూస్తె అక్కడి భాషలు ఆధిపత్యంలో ఎలా కనుమరుగయ్యారో తెలుస్తుంది. స్కాట్లాండ్/ఐర్లాండ్, రష్యా/చైనా భాషాపర అల్పసంఖ్యాకులు, భారత దేశంలో ఆదివాసీలు వగైరాలు అందరిదీ ఇదే పరిస్తితి.

   The best way of destroying a people is to eliminate their language & culture.

   ఆధిపత్య భాష తెలుగు, పాలితులది కోయ భాష అయినంత మాత్రాన ఈ చారిత్రిక సూత్రం మారదు.

   మన్యప్రజలు పోడు నిషేధంపై చేసిన తిరుగుబాటుకు అల్లూరి నాయకత్వం వహించారు. ఆంగ్లేయులు విధించిన ఈ నిషేధంతో లాభపడింది తెలుగు మాట్లాడే గిరిజనేతరులే. అంచేత దీన్ని ఇంగ్లీష్ సామ్రాజ్యవాదులు & వారి తెలుగు తొత్తులపై గిరిజనుల పోరాటమే అవుతుంది. ఆంగ్ల పాలనకు తెలుగు ప్రతిఘటనగా ముద్రించడం తెలుగు వారి ఈగో సంతుష్టపరిచినా సత్యానికి అనేక వేల మైళ్ళు దూరం.

   Delete
  3. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది దేశం మొత్తాన్నీ కొల్లగొట్టడానికి కానీ కేవలం ఆదివాసులని కొల్లగొట్టడానికి కాదు. సంతాల్ తిరుగుబాటు, భూమ్‌కాల్ తిరుగుబాటు, భూపాలపట్నం తిరుగుబాటు, హల్బా తిరుగుబాటు వంటివి ఆదివాసులు చేసినవే కానీ అనేక మంది అగ్రకులస్తులు కూడా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారారు.

   కాలాపానీ సినిమాలో ముకుంద్ పాత్ర చూసినపుడు నాకు సామర్లకోటకి చెందిన ప్రతివాద భయంకర వేంకటాచారి గుర్తొచ్చాడు. అతను కాకినాడలో ఒక పోలీస్ ఆఫీసర్‌ని చంపడానికి బాంబులు తయారు చేసాడు కానీ అవి పేలి కొంత మంది మత్స్యకారులు గాయపడ్డారు. వేంకటాచారిని అరెస్త్ చేసి అండమాన్ చెరసాలకి పంపారు. వేంకటాచారి ఒక బ్రాహ్మణుడు, అతను చంపాలనుకున్న పోలీస్ అధికారి ఒక ముస్లిం. ఆ ఇద్దరు భారతీయుల్లో ఒకడు విప్లవకారుడు, ఇంకొకడు ఆంగ్లేయుల మోచేతి నీళ్ళు తాగేవాడు.

   Delete
  4. అల్లూరి పోరాటంపై ఆనాటి గిరిజనేతర తెలుగు మేధావులకు ఉన్న అభిప్రాయాలు ఆనాటి పత్రికల వ్యాఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు.

   - కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
   - స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
   - కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.

   (Source: https://te.wikipedia.org/wiki/అల్లూరి_సీతారామరాజు)

   Delete
 6. అల్లూరి ఎలా దొరికిపోయాడు అనే విషయంలో సొంత కల్పన పెట్టడం కూడా క్షమార్హం కాదు.

  ReplyDelete
  Replies
  1. అటువంటివి చాలావిషయాలున్నాయి కృష్ణ హీరోగా వచ్చిన సినిమాలో. అల్లూరి రామరాజు అనే ఆయన అసలు పేరు. అలాగేసంతకం చేసేవాడని విన్నారు. సీతారామరాజు ఎలాగయిందో ప్రచారంలో - కొంచెం ఆశ్చర్యమే అది. ఐతే ఆ పాయింటుని ఆడ్దం పెట్టుకొని సీత అన్న ఒక హీరోయిన్ని రంగంలోకి దించుతారా? నాకైతే తప్పనిపించింది. నేనా సినిమాని అప్పట్లోనూ చూడలేదు. ఇప్పటికీ చూడలేదు. నవయువకుడు రామరాజుగారి పాత్రలో వయసుమళ్ళుతున్న కృష్ణను అంగీకరించుకో లేకపోవటం కూడా మరొక అభ్యంతరం ఐనది నాకు.

   Delete
  2. ఆ సినిమా నిర్మాతలు కృష్ణ కుటుంబ సభ్యులు, అందుకే అందులో కృష్ణని హీరోగా పెట్టారు.

   Delete
 7. వయసుదేముందిలెండి రాముడు నవయవ్వనంలో ఉంటే రావణుడు కొడుకు పెళ్ళి కూడా చేసిన వృద్ధుడు. చరిత్రలో జరగాల్సినవి వద్దనుకున్నా జరిగేవి జరగక ఆగవు !

  విప్లవకారులు భావావేశానికి అతీతులా ? విప్లవకారులు భోగం స్త్రీలదగ్గరకి వెళ్ళకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన స్త్రీని చేపట్టవచ్చు.విప్లవకారులు శారీరిక వాంఛలను బలవంతంగా అణుచుకుంటారేమో గానీ అసలు స్త్రీలనే ముట్టరు అని అనడం సరికాదు.

  విప్లవకారుడిలో భావావేశం తప్పక ఉంటుంది.సన్యాసులు కూడా పౌరుషంగా మాట్లాడుతున్నారు అంటే వారిలో అంతర్గత శక్తులన్నీ ఒక చోటే కేంద్రీకరిస్తున్నారు అని అర్ధం.శారీరిక వాంఛలను అదుపుచేసుకోగలిగినవాడు అన్నిటినీ (ముఖ్యంగా వాక్కుని)అదుపుచేయగలడు.

  తెలుగువారిలో బానిసత్వ భావాలు ఎక్కువ,ఇక్కడ బ్లాగర్లలో కూడా తెలుగులో వాదించి గెలవలేనని భావించినపుడు ఇంగ్లీష్ లో వాదించడం మొదలుపెడ్తారు. తమిళనాడులో బస్సులపై,షాపులపై తమిళ భాష మాత్రమే ఉంటుంది.ఎంటీఆర్ గారు ఉండి ఉంటే తెలుగు భాషకి గుర్తింపు వచ్చి ఉండేదేమో గానీ పార్లమెంట్ లో హిందీ మాట్లాడతారు కనుకనే కె సీ ఆర్ విజయశాంతి బీ జే పీ పై ఆధారపడి పోరాడారు.

  దక్షిణ ప్రాంతం వారు ప్రధానిగా వచ్చినా హిందీ ఇంగ్లీష్ లలో మాట్లాడారు కానీ దుబాసీలను ఉపయోగించి అనువదించుకోండి అని ఖచ్చితంగా కుండబద్దలుగొట్టి మరీ తెలుగులోనే మాట్లాడిన నాయకులెవరూ ఇంతవరకూ రాలేదు.

  మా వియ్యంకులు తెలుగు అధికార భాషా అధ్యక్షులుగా ఉండి తెలుగులోనే వ్రాయండి అని చెప్పేవారు,నాకు ఇంగ్లీష్ లో మెయిల్ పంపారు.మీరే తెలుగులో వ్రాయకపోతే ఎలా అని అడిగాను.నేను తెలుగులో వ్రాయమని అడగడమే తప్పు అయిపోయింది.ఇదీ తెలుగుకి పట్టిన తెగులు !

  ReplyDelete
  Replies
  1. విప్లవకారులు భావావేశాలకు అతీతులు కారు. విప్లవకారులకు శారీరక వాంచలుంటాయి. అసలు విప్లవకారులుగా మారేదే భావావేశంతో. విప్లవం అంటే మౌలికమైన మార్పు . మౌలికమైన మార్పును కోరుకునేవాడు విప్లవకారుడు అనబడతాడు. అది ఏ అంశమైనా కావచ్చు. ఆ లెక్కలో నీహారిక కూడా విప్లవకారిణే కొన్ని విషయాలలో. అలాగే కొన్ని అంశాలలో దురాచారాలలో మార్పుకోసం పోరాడేవారు సంస్కరణవాదులు. విప్లవకారులైనా, సంస్కర్తలౖనా తాము చెప్పేది ఆచరిస్తే వారి వెంట సామాన్యులు ఎక్కువగా నడుస్తారు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి కార్యాచరణలో నాయకుడు నీతిని పాటించడం అనేది కీలకమైనదే.

   Delete
  2. @neehaarika
   వయసుదేముందిలెండి రాముడు నవయవ్వనంలో ఉంటే రావణుడు కొడుకు పెళ్ళి కూడా చేసిన వృద్ధుడు. చరిత్రలో జరగాల్సినవి వద్దనుకున్నా జరిగేవి జరగక ఆగవు !
   ans:
   ఇక్కడ కూడా రాముదు-రావణుడు పోలిక తేవడం అవసరమా?సెక్సు కోరికలు మగవాళ్ళకే ఉంటాయా?తంద్రి వయస్సు ఉన్నవారితో సంగమించే స్త్రీలు.తండ్రితో మధురోహలు రచించుకునే ఎలెక్త్రా కాంపెక్సు పీడితులూ లేరా?

   Delete
 8. మనం నాగరీకులం కాబట్టి డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తాం. చలం గారు వ్రాసిన మాదిగ అమ్మాయి కథ చదివారా? కథానాయకుడు మాదిగ అమ్మాయిని కలుసుకోవాలనుకుంటాడు కానీ ఆమె డబ్బులు అడగడంతో ఆమెని అసహ్యించుకుంటాడు. బ్రహ్మ సమాజం సభ్యుడైన చలం గారికి వేశ్యావృత్తిపై అసహ్యం కలగడం సహజమే. మా భూమి సినిమాలో రామయ్య దొరల గడీలో పనిచేసే సమయంలో విప్లవకారుడు కాదు, సంఘ సంస్కర్త కూడా కాదు. నిజాం కాలంలో దొరలు భోగం వృత్తిని పెంచి పోషించేవాళ్ళు కాబట్టి వాళ్ళ పాలేర్లకి భోగం వృత్తిపై వ్యతిరేకత కలిగే అవకాశం లేదు. హైదరాబాద్ రాష్ట్రంలో భోగం కులంలోనే అనేక శాఖలు ఉండేవి, బేదార్ పార్థూర్దోరు లాంటి సంచార జాతులు కూడా వేశ్యావృత్తిలో ఉండేవి. వేశ్యావృత్తి చట్టబద్దంగా జరిగిన ఒక వెనుకబడిన సమాజంలో ఒక అక్షరం ముక్కరాని పాలేరు వేశ్యని కలుసుకోవడానికి భయపడతాడంటే అది నమ్మశక్యంగా లేదు.

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
  Replies
  1. పైన తొలగించిన హరిబాబు గారి కామెంట్ ని ఒక వాక్యం వ్యక్తిగతమైనది తొలగించి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.

   Haribabu SuraneniiJuly 8, 2015 at 12:28:00 PM GMT+5:30

   అసలు టాపిక్కు యేమిటి?ఈ కామెంట్లు యేమిటి?కోయవాళ్ళు అడివి నుంచి బయటికి రాగానె సహజంగా అక్కడ కనపడిన తెలుగువాళ్ళ భాష నేర్చుకుంటే తెలుగు వాళ్ళ అధిపత్య ధోరణియా?దందకారణ్యం మూడు రాష్ట్రాలని కలుపుతుంది,అందులో యెన్న్నో ఆతవిక జాతులు ఉన్నాయి.ఇటు వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకుంటే మరొక వైపు వెల్ళినవాళ్ళు మరాఠీయో,హిందీయో నేర్చుకుని ఉంటారు - దీనికే దోపిడీ,ఆధిపత్యం,జాతుల అంతర్ధానం సంస్కృతుల వినాశనం అని పులుముడు థియరీలు లాగేస్తున్నారు,పైగా నిష్పక్షపాత ధోరణి ప్రకటించుకోవడానికి లాటిను అమెరికా సంగతుల్ని కూడా లాక్కొస్తున్నారు చర్చలోకి,బాగానే ఉంది!

   అల్లూరి సీతారామరాజు కేవలం కొందజాతి వాళ్ళకి మాత్రమే నాయకత్వం వహించాడు గాబట్టి మొత్తం తెలుగువాళ్ళకి నాయకుడు కాదా!మరి పంజాబులో పోరాడిన భగత్సింగును గురించి మనమెందుకు చదువుకుంటున్నామో చెప్పగలరా జై గారూ?ఇంగ్లీషు వాళ్ల మీద తొలి సారిగా తిరగబడింది బిర్సా ముండా.ఇతను మంగళ్ పాందే కంటే ముందే తిరగబడ్డాడు.యెవడో కోయదొర చేస్తే అది చరిత్రకి యెక్కింది మనం అతన్నే ఇంగ్లీషువాళ్ల మీద పేలిన తొలి తూటాగా యెందుకు గుర్తిస్తున్నామో చెప్పగలరా?

   మిగతా విషయాల కన్నా భాష గురించి వాదించేటప్పుదు ప్రవేఎణు నాకు బాగా నచ్చుతాడు!బహుశా లింగ్విస్తిక్స్ పాండిత్యం వల్ల కావచ్చు - అన్ని విషయాల్లోనూ అట్లా పూర్తిగా తెలుసుకుని శాస్త్రీయంగా మాట్లాడితే బాగుంటుంది కదా!

   అల్లూరి సీతారామరాజు ఖచ్చితంగా తెలుగువాళ్లు గర్వించదగ్గ విప్లవ వీరుడే,అందులో యెలాంటి సందేహం అక్కర్లేదు.కానీ కృష్ణ తీసిన ఈ సినిమాలో వాస్తవ విరుధ్ధమైన అంశాలు చాలా ఉన్నాయి.ఒక పిట్టకధలాగ తీసి జనానికి కాస్త దేశభక్తి గురించి చెప్పినట్టు పోజు కొట్టడానికి పనికొచ్చే కాలక్షేపం సినిమా తియాలనుకున్నారే తప్ప పరిశోధించి తీసిన దాఖలాలు యెక్కడా లేవు.

   "ఆత్మవంచన రూధర్ఫర్డ్ ఆత్మవంచన" అని పొలికేకలు వెయ్యటం రామరాజు స్వభావానికి సరిపడనిది.అతను సౌమ్యుదు,మృదుభాషి!వాస్తవంగా రూధర్ ఫర్డ్ యెక్కడా రాజుకి యెదురుకాలేదు,కానీ తనని పట్ట్టుకున్న ఇంగ్లీషు వాళతో తనూ చదువుకున్నవాదే గనక చక్కని ఇంగ్లీషులో మాట్లాడాదనేతందుకూ ఆధారాలు ఉన్నాయి.దాడుల్లో పట్టుబడిన మనవాళ్ళని భోజనం పెట్టి పక్కన కూర్చోబెట్టుకుని ఇంగ్లీషువాళ్ళ త్రపున మన్వాళ్ళని చంపటం మంచిది కాదని హితబోధలు చేసి పంపించిన సన్నివేశాలు చాలా రికార్డ్ అయి ఉన్నాయి.ఆయా ప్రాంతాల్లో తిరిగి ఇంగ్లీషువాళ్లతో యుధ్ధం చేసిన స్థాలా గురించి కూడా చాలా సమాచారం పోగూపడి ఉంది వాళ్ళు సినిమా మొదలు పెట్టేనాటికే.దేన్నీ ఉపయోగించుకోలేదు!

   నాకు డిగ్రీ చదివేటప్పుదు చూసిన "ఒమర్ ముక్తార్:లయన్ ఆఫ్ ద డిజర్ట్" సినిమా అంటే చాలా ఇష్టం.అందులో విప్లవ నాయకుదు చిన్నపిల్లలకి పాఠాలు చెప్పే ఒక ముసలి బడిపంతులు!తొలి సన్నివేశం కూడా "ఆధారం లేకుండా యేదీ ఉండలేదు" అని చెప్పటానికి తన కళ్లజోడుని వేలు మీద పెట్టి ఆ వేలు లాగెయ్యగానే అది కిందపడిపోవటాన్ని చూపించి నవ్వ్విస్తూనే విషయం అర్ధమయ్యేలాగ చెప్పే మంచి సీనుతో మొదలవుతుంది.

   అదే సినిమాలఓ విలన్ ఇతన్ని లంచమిచ్చి లొనదీసుకోవాలనుకుంటే "సిర్ దియా పర్ మన్ న దియా" తరహా దైలాగు చాలా చక్కగా చెప్తాడు నటుదు ఆంధోనీ గ్విన్!ఇక్కడి లాగ పొలికేకలు వెయ్యడు - చాలా నిదానంగా ఒక వృధ్ధుడు మాట్లాడినంత నెమ్మదిగా చెప్పినా ఒక విప్లవనాయకుడిలో ఆ మాట చెప్పేటప్పుడు ఉండే ధీమాని చాలా సహజంగా చూపిస్తాడు!

   ఆ స్థాయిలో చారిత్రక కదల్ని సినిమాలుగా త్తియ్యటం మనవాళ్లకి యెప్పటికి చాతనయ్యేను?!

   Delete
  2. ముందు నేను అల్లూరి సీతారామరాజు గురించి నెగిటివుగా ఏమీ అనలేదని గమనించండి. దేశం మొత్తం గుర్తించదగ్గ మహావీరులలో బిర్సా ముండా, అల్లూరి, కొమరం భీం ముగ్గురూ ఉంటారు. ముగ్గురికీ చెరో ప్రత్యేకత ఉన్నప్పటికీ ముగ్గురూ పోరాడింది గిరిజన సాంప్రదాయిక హక్కులు కోసమే.

   పోడు గిరిజనుల జీవితంలో అవినాభావ సంబంధం కల అంశం. దీని ఆర్ధిక, ధార్మిక, పర్యావరణ & సాంస్కృతిక కోణాలు వారి దైనందిన జీవనంతో పెనవేసుకొని ఉంటాయి.

   కలప వ్యాపారానికి పోడు సంస్కృతి అడ్డు తగులుతుందని తద్వారా తమకు & తమకు వత్తాసు పలుకుతున్న గిరిజనేతర ప్రయోజనాలకు నష్టమని గుర్తించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనేక చట్టాలను తీసుకొచ్చింది. గిరిజన తిరుగుబాటుకు నేపధ్యం అదే తప్ప వేరొకటి కాదు.

   అప్పటి చట్టాలే (కొద్ది కొద్ది మార్పులతో) ఇంకా అమలులో ఉన్నాయి, నిర్బంధం కూడా తగ్గలేదు అన్న వాస్తవం. ఇవ్వాళ నక్సలైటు ప్రాబల్యం కూడా ఇందువల్లే.

   జన్మతః గిరిజనేతరుడు అయినా మన్యప్రజల కోసం ముందుకు వచ్చి, వారి భాష నేర్చుకొని, వారి పోరాటానికి ఆసరాగా నిలబడిన అల్లూరి నిజంగా ధన్యజీవి. ఇందులో ఎటువంటి సంశయం అక్కరలేదు. ఆ పోరాటానికి భాష రంగు పులమడం, అందునా ఎవరినయితే ఆ పోరాటం వ్యతిరేకించిందో వారి ప్రతినిధిగా అల్లూరిని చిత్రించే ప్రయత్నం చేయడం మాత్రం దురదృష్టం.

   Delete
  3. జై గారు, ప్రపంచమంతా ఒకేలా ఉంటుందనుకునేవాళ్ళు ఉన్నారు. సినిమా నిర్మాతలు కూడా అలాంటివాళ్ళే. భర్త చనిపోయిన స్త్రీకి తెల్ల చీర కట్టే సంప్రదాయం హిందువులలో మాత్రమే ఉంది, అది కూడా మొదట్లో ఉత్తర భారత దేశంలో ఉండి తరువాత దక్షిణాదికి వచ్చిన ఆచారం. ముస్లింల అటువంటి సంప్రదాయం లేదు. వాళ్ళు స్త్రీకి భర్త చనిపోయిన మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. కానీ ఖుదా గవాహ్ సినిమా దర్శకుడు ముస్లిం స్త్రీ తెల్ల దుస్తులు వేసుకుంటున్నట్టు చూపించాడు.

   అరకు ప్రాంతంలోని ఆదివాసులు మాట్లాడేది తెలుగు కాదని చాలా మందికి తెలియదు. ఓ రోజు నేను అరకు సమీపంలో ఒక గెడ్డ (వాగుని ఉత్తరాంధ్రలో గెడ్డ అంటారు) దగ్గర తిరుగుతుండగా అక్కడ ఇద్దరు పర్యాటకులు గొఱ్ఱెల కాపరులని మీది ఏ భాష అని అడుగుతుండడం చూసాను. ఆ గొర్ఱ్ఱెక కాపరులకి తమ భాష తెలుగు కాదని తెలుసు కానీ ఆ భాష పేరేమిటో తెలియదు. ఆ పర్యాటకులు అది బంజారా భాష అనుకుని వెళ్ళిపోయారు. నాకు తెలిసి విశాఖపట్నం జిల్లాలో ఆదివాసులు మాట్లాడేది కొఠియా భాష. విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతంలో కూడా ఆదివాసులు అదే భాష మాట్లాడుతారు.

   Delete
  4. కోస్తా ఆంధ్రలో రెల్లి కులస్తులు (మరుగుదొడ్లు కడిగేవాళ్ళు) తెలుగు కాకుండా ఒడియాని పోలి ఉండే భాష మాట్లాడుతారు. వాళ్ళు ఇతర కులాలవాళ్ళతో కలిసి ఉండకపోవడం వల్ల వాళ్ళ సమూహంలో పుట్టిన పిల్లలకి మొదట వాళ్ళ కుల భాషే వినిపిస్తుంది. ఆ పిల్లలు క్రమంగా పెరిగే కొద్దీ తెలుగు నేర్చుకుంటారు కానీ వాళ్ళు తమ ఇళ్ళలో మాట్లాడేది రెల్లి భాషే. అలాగే తెలంగాణలో బంజారాలు రాజస్థానీని పోలి ఉండే భాష మాట్లాడుతారు.

   Delete
  5. "ప్రపంచమంతా ఒకేలా ఉంటుందనుకునేవాళ్ళు ఉన్నారు"

   Pardon him, Theodotus. He is a barbarian and thinks that the customs of his tribe and island are the laws of nature :)

   Delete
  6. అలెక్సాందర్‌కి తూర్పున ఇందియా వరకే భూభాగం గురించి తెలుసు. ఇందియాకి తూర్పున ఇంకా భూభాగం ఉందని అతని గురువు చెపితే అతను నమ్మలేదు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందవు అని ప్రచారం చేసిన చంద్రబాబుకి సింగపూర్ దేశ జనాభా హైదరాబాద్ నగర జనాభా కంటే తక్కువ అని తెలియదు. తమకి తెలిసినదే వేదం అని నమ్మేవాళ్ళు అలాగే ఉంటారు.

   కోస్తా ఆంధ్రలోని ఆదివాసులకి తెలుగు అర్థమవుతుంది. కోస్తా ఆంధ్రలోని ఆదివాసి భాషల్లో సవర తప్ప అన్నీ ద్రావిడ భాషలు. అవి తెలుగుకీ లేదా తమిళానికీ దగ్గర పోలికలతో ఉంటాయి. సవర మాత్రం ముణ్డా భాష. అది ఝార్ఖండ్‌లో మాట్లాడే భాషల్ని పోలి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన సవరలు మాత్రం తెలుగు లేదా ఒడియా మాత్రమే మాట్లాడుతారు తప్ప వాళ్ళకి సవర భాష రాదు.

   Delete
 11. అల్లూరి సీతారామరాజు చదివినది విశాఖపట్నం ఎ.వి.ఎన్. కాలేజ్‌లో. అప్పట్లో కాలేజ్‌లలో తెలుగు మీదియం లేదు కనుక అల్లూరి ఇంగ్లిష్ వచ్చినవాడే అయ్యుండాలి. అల్లూరి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నట్టు చూపించడానికి అతను రథర్‌ఫర్ద్‌ని కలిసినట్టు చూపించడం అవసరమా? రథర్‌ఫర్ద్ అంతకు ముందు గుంటూరు జిల్లాలో పని చేసాడు. అక్కడ కూడా అతను ఉద్యమకారులని అణచివెయ్యించాడు. అల్లూరి కనిపిస్తే అతను చర్చలు జరపకుండానే చంపించగలడు.

  అల్లూరి హిందూ మతాన్ని నమ్మేవాడు. అతని అసలు పేరు శ్రీరామరాజు అయితే అతను సీతారామరాజు అని పేరు మార్చుకున్నాడు. అతను సన్యాసి వేషంలో ఉండేవాడనేది మాత్రం నిజం కాదు.

  ReplyDelete
  Replies
  1. కరెక్ట్!అప్పట్లో ఆంధ్రపత్రికో మరొక దానికో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాదన్ని చదివినట్టు గుర్తు!

   మామూలుగా ప్యాంటూ షర్టూ వేసుకుని గూడా తిరుగుతూ ఉండేవాడు.అతన్ని పట్టుకోలేకపోవటానికి అది కూడా ఒక కారణమే,వాళ్ళు ఒక సన్యాసి కోసం కాషాయ దుస్తుల్లో ఉండే వ్యక్తికోసం వెదుకుతుంటే ఇతను మామూలుగానే తిరిగేవాడు కాబట్టి పట్టుకోవటం కష్తం అయి ఉందవచ్చు.ఒక సన్నివేసం కూడా చదివాను.ఒకసారి అడవుల్లో తిరగడానికి పెద్ద స్థాయిలో ఉండే అధికార్లు మనుషులతో డోలీలు మోయించుకునే వాళ్ళు కదా!ఒకసారి అతనికి యెదురుపడ్డవాళ్లలో ఒకతని భ్హుజం మీద ఉన్న పిల్లవాడు ఆడ్లోలీని మోస్తున్నవాళ్లలో ఉన్న రాజుని గుర్తుపట్టి అమాయకంగా నమస్కారం పెడితే తండ్రి వెంఠనే ఆ నమస్కారాన్ని దొర వైపు తిప్పి అనుమానం రాకుండా చేశాదని చెప్పేఅ సన్నివేసం ఉంది!ఇది కూడా వ్యక్తులు చెప్పగా రికార్డ్ అయిన సన్నివేసమే.

   రాజంటే వాళ్ళకి గురి కుదరడానికి అతను సన్యాసి కావడం ఒక కారనం కాగా అతనికి ఆయుర్వేదం,మూలికావైద్యం తెలుసు గనక వైద్యం చేసి ప్రాణాలు కాపాడే వాడు.ఆ చనువుతో వాళ్ళు కష్తసుఖాలు చెప్పుకునే వాళ్ళు.అలా వింటూ రాజు కూడా వాళ్ళకి సలహాలు ఇస్తూ క్రమేణా నాయకు డయ్యాడు!కానీ అతని మార్గంలోని బలహీనత మైదాన ప్రాంతం నుంచి సహాయం తీసుకోకపోవడం ఆ విషయాలు మైదాన ప్రాంతానికి చేరవేసి మద్దతు కూడగట్టటం చెయ్యలేకపోవడం.దానికి సగం కారణం అప్పట్లో అందరూ గాంధీ పధ్ధతి తప్ప ఇంకొకటి స్వతంత్రం తీసుకురావడానికి పనికిరానిదనే మూఢనమ్మకంలో ఉండటమే!

   మరొక వాస్తవంగా సాక్ష్యాధారాలతో రుజువైన సన్నివేసం!రాజు కూడా మొదట్లో కాన్రెసులో ఉంది దేసమంతటా తిరిగిన వాడే.అప్పట్లో మదన మోహాన్ మాలవా అనుకంటాను,ఆయనకి భోజనం సమయానికి యెవరయినా సాధువు వస్తే అతనికి పెట్టి గానీ తినని ఆచారం ఉందేది.ఓక్రోజు అలా నించంతే కాంగ్రెసు పని మీద తిరుగుతున్న రాజు కనబడ్డాదు - ఆరోజు ఆయన అతిధి రాజే!

   ఇలాంటివి చాలా ఉన్నాయి రాజు చుట్టూ,ఆసక్తికరమైన కదహలు!యెన్నో వివరాలు - ఒక్కటీ సినిమాలో లేవు?

   Delete
 12. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని రాఘవెద్రరావు చేత వ్రాయిస్తే అతను నరసిమ్హారెడ్డి ఇద్దరు భార్యలతో సరసాలాడే సన్నివేశాలు పెడతాడు. అల్లూరి కథని రాఘవేంద్రరావు చేత వ్రాయించకపోవడం అదృష్టం.

  ReplyDelete
  Replies
  1. గొప్ప మాటన్నావు,ఇంకా వాళ్లకి తెలుగు ప్రేక్షకుల మీద ఆపాటి జాలయినా ఉంది!

   Delete
  2. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో సినిమా రాబోతోంది. హమారా సౌభాగ్య యే హై కీ రాఘవేంద్రరావ్ ఉస్ కా నిర్దేశక్ నహీఁ హై!

   Delete
 13. ఆంగ్లేయులు అల్లూరినిలాగే నరసింహారెడ్డిని కూడా ఒక ద్రోహి సహాయంతో పట్టుకున్నారనే talk ఉంది. నరసింహారెడ్డి ఒక గుడిలో దాక్కుని ఉండగా ఆంగ్లేయులు అతన్ని పట్టుకుని చంపారు.

  ReplyDelete
 14. పడాల రామారావు గారు ""భారత స్వాతంత్ర్య సాయుధ సమర చరితర 1757-1947" అనే ఒక గొప్ప పుస్తకం రాశారు.యే చిన్న విషయాన్నీ వదల్లేదు.ఇప్పుడే ఒక ఆసక్తికరమయిన సన్నివేశాన్ని చదివాను.మనకి చౌరీచౌరా సంఘటన గురించి ఇప్పటివరకూ తెలిసింది చాలా తక్కువ.చౌరీచౌరాలో అగ్గి రాజుకోవటానికి కారణమైన సంఘటన తెలుగునేల మీద జరిగిన పలనాటి హనుమంతు హత్య!

  ఆయన రాసిన దాని ప్రకారం గాంధీ తన సొంత అభిప్రాయాల్ని జనం మీద రుద్దటానికి యెంత కిరాతకంగా వ్యవహరించగలడో సాక్ష్యాధారాలతో చూపిస్తుంది.

  పడాల రామారావు గారి కధనం ఇది:ఆంధ్రలో ఒక హనుమంతుని ప్రభుత్వం హత్యచేస్తే,ఉత్తరప్రదేశ్ "చౌర్రీ చౌరా"లో ప్రజలు పోలీసు స్టేషన్నే నేలమట్టం చేసి,21 మంది పోలీసుల్ని నేరుగా యమలోకానికి పంపి ప్రతీకారం తీర్చుకున్నారు.అందుకు కినిసి గాంధీజీ ఉద్యమాన్నే ఆపుచేశాడు.జైలులో ఉన్న మోతీలాల్,లజపతి రాయిలాంతి నాయకులీ చర్యకు అసమ్మతి తెలపగా "జైలులో ఉన్నవాళ్ళంతా మృతుల కిందే లెఖ్హ్ఖ" అని గాంధీజీ వారి అసమ్మతిని త్రోసివేశాడు.

  కాని యేమైంది?కాటివద్ద నక్కల్లా కాచుకుని కూర్చున్న బ్రిటిషు దొరలకు వుద్యమాన్ని ఆపు చేయడం కన్నా కావలసింది యేముంది?వాళ్లకు ఆహారం దొరికింది.తక్షణం మార్చి 10న సహాయనిరాకరణోద్యమనియంతయైన గాంధీజీని అరెస్టు చేసి ఆరేంద్లు కఠినశిక్ష విధించి కారాగారంలో పడవేశారు.

  అదండీ గాంధీగారి సహాయనిరాకరణ యొక్క నిజమైన స్వరూపం?!

  ReplyDelete
 15. http://antharlochana.blogspot.in/2014/06/blog-post_6534.html?m=1

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top