'కోటి మొక్కల పెంపకం పథకం'  ప్రారంభ సభ లో ప్రసంగిస్తున్న 'పల్లె ప్రపంచం ఫౌండేషన్' చైర్మన్ పల్లా కొండల రావు.
కోటిమొక్కల పెంపకం పథకం ప్రారంభ సభకు హాజరైన ఆహ్వానితులలో కొందరు
'కోటి మొక్కల పెంపకం పథకం' ప్రారంభం సందర్భంగా తన పుట్టినరోజు వేడుక అనంతరం మొక్క నాటుతున్న 'పల్లా అరవింద్'
'కోటి మొక్కల పెంపకం పథకం' ప్రారంభం సందర్భంగా మొక్క నాటుతున్న టి.ఆర్.ఎస్ స్థానిక నాయకుడు గుదిమళ్ల వెంకయ్య
'కోటి మొక్కల పెంపకం పథకం' ప్రారంభం సందర్భంగా మొక్క నాటుతున్న విశ్రాంత తెలుగు పండిట్ వజ్రాల పరబ్రహ్మం
'కోటి మొక్కల పెంపకం పథకం' ప్రారంభం సందర్భంగా మొక్క నాటుతున్న స్థానిక మహిళ కంఠసాని లలిత
'కోటి మొక్కల పెంపకం పథకం' ప్రారంభం సందర్భంగా మొక్క నాటుతున్న' పల్లె ప్రపంచం ఫౌండేషన్' కోశాధికారి పల్లా రామకోటయ్య
'పల్లె ప్రపంచం ఫౌండేషన్' చేపట్టిన 'కోటి మొక్కల పథకం' కార్యక్రమాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్న బుడతడు 'సాయి'
మొక్కలు నాటడానికి అడ్డుగా ఉన్నవాటిని తొలగించేందుకు సహకరిస్తున్న ఆహుతులు
కోటి మొక్కలు పథకాన్ని పరిశీలిస్తున్న హాజరైన ఉపాధ్యాయులు
కోటి మొక్కలు పథకాన్ని పరిశీలిస్తున్న స్థానిక పత్రికా విలేఖరులు
కోటిమొక్కల పెంపకం పథకం ఆహుతులకు వంట చేస్తున్న కుక్  కొండలరావు
వంటకు సహాయకురాలిగా పని చేసిన అనసూర్య
'పల్లె ప్రపంచం' లో 'కోటి మొక్కల పథకం' ప్రారంభం!

24-7-2015 పల్లె ప్రపంచం కార్యాలయం ( ఖమ్మం జిల్లా , మధిర నియోజక వర్గం, బోనకల్ మండల కేంద్రం) లో పల్లె ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కోటి మొక్కల పెంపకం పథకం' ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వివరాలను తెలిపేందుకు కొంతమంది ఎంపిక చేసిన వారితో చిన్న సభను నిర్వహించడం జరిగింది. తొలుత ఇప్పటివరకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున జరిగిన కార్యక్రమాలను సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య వివరించారు.

5 ఏప్రిల్ 2015 న ప్రారంభించబడిన పల్లె ప్రపంచం ఫౌండేషన్ సంస్థ తరపున ఒక ఏడాది ఏక్షన్ ప్లాన్ ని 12 ఏప్రిల్ 2015 న బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో నిర్వహించిన సమావేశంలో తయారు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి 10 మందిని ఆహ్వానించగా కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. అయినా పట్టుదలతో ముందడుగు వేయాలని తయారు చేసుకున్న ఏక్షన్ ప్లాన్ ప్రకారం కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. 31 మే 2015 న సమీక్షా సమావేశం నిర్వహించి 110 గ్రామాలలో 'ప్రకృతి జీవన విధానం' ను ఎలా ప్రచారం చేయాలి? అనే దానిని ప్లాన్ చేశాము. 'మంతెన సత్యనారాయణ రాజు' గారు రచించిన దశ పుస్తకమాల ( 10 బుక్స్ సెట్ ) ని పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్ లో నాలుగో ప్రొడక్టుగా విడుదల చేశాము.  మిషన్ కాకతీయ ను ఉపయోగించుకుని రెండు గ్రామాలలో ఆకు కూరలను పెంచాలని నిర్ణయించాము. బోనకల్‍ లోనే గత నెల 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాము. యోగాలో ఉన్న శాస్త్రీయ అంశాలను ప్రచారం చేయాలని నిర్ణయించాము. యోగా శిక్షణలో భాగంగా 14 రకాల ఆసనాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పల్లె ప్రపంచం విజన్  లోని ప్రతి అంశాన్ని విజయవంతంగా కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాము. ఈ రోజు (24-7-2015) సంస్థ చైర్మన్ పల్లా కొండల రావు కుమారుడు పల్లా అరవింద్ జన్మదినం సందర్భంగా పల్లె ప్రపంచం విజన్ లో భాగమైన పర్యావరణ పరిరక్షణ అంశాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు గాను ' కోటి మొక్కల పెంపకం పథకం ' ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

సభకు విశ్రాంత తెలుగు ఉపాద్యాయులు వజ్రాల పరబ్రహ్మం గారు అధ్యక్షత వహించగా సంస్థ చైర్మన్ పల్లా కొండల రావు ప్రసంగిస్తూ హరితహారం కు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని ఇది నిరంతరంగా కొనసాగే కార్యక్రమమని, పేరుకు మాత్రమే  మొక్కలు నాటి తరువాత వాటి గురించి పట్టించుకోకుండా ఉండేలా కాక దీనికి పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. మొత్తం 110 గ్రామాలలో సెలెక్ట్ చేయబడిన వారికి నిరంతర శిక్షణ ద్వారా భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. 'తులసి' మొదలుకుని ఇంట్లో ఆరోగ్యాన్నిచ్చే పండ్ల మొక్కలతో పాటు ఖాళీగా పడి ఉంటున్న జాగాలలో టేకు, ఎర్ర చందనం, మలబారు వేప వంటి మొక్కలను పెంచడం ద్వారా ఆదాయం రాబట్టుకునే మార్గాలను కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ప్రకృతి జీవన విధానం , 14 రకాల సెలెక్టెడ్ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ఆక్యుపంచర్ వైద్యం , భజనల వల్ల ఉపయోగాలు ఆయా కార్యక్రమాలలోని శాస్త్రీయ అంశాలను ప్రచారం చేస్తూ శిక్షణా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి  రుగ్మతల నుండి  తమను తాము రక్షించుకునేలా చేయనున్నట్లు తెలిపారు. 

ఈ సభలొ పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య , ఉపాధ్యక్షులు యడ్లపల్లి నరసింహారావు , వజ్రాల పరబ్రహ్మం లు ప్రసంగించారు. ఫౌండేషన్ సభ్యులు రచ్చ మధు, కొండేటి అప్పారావు, పల్లా రామకోటయ్య లతో పాటు స్థానిక టి.ఆర్.ఎస్ నాయకుడు గుదిమళ్ల వెంకయ్య, లగడపాటి రామారావు , స్థానిక ఉపాద్యాయులు తోటకూర రామకృష్ణ , తెలకపల్లి రవి, సి.పి.ఎం నాయకుడు రామన అప్పారావు, ఆర్.ఎం.పి వైద్యులు కంఠసాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం కార్యాలయం ఆవరణలో పల్లా అరవింద్ , గుదిమళ్ల వెంకయ్య , వజ్రాల పరబ్రహ్మం , కంఠసాని లలిత , పల్లా రామకోటయ్య లు ఐదు రకాల మొక్కలను నాటారు. వివిధ గ్రామాల నుండి షుమారు 100 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఇక్కడ న్యూస్ క్లిప్పింగ్స్ అన్నింట్లోనూ మేము 'హరిత హారం' ను ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. రిపోర్టర్స్ అందరూ సభ పూర్తయ్యాక మొక్కలు నాటే సమయంలో వచ్చారు. నేను వారికి వివరించే సమయం దొరకలేదు. జనరల్ గా హరిత హారం లో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామనుకున్నారని భావిస్తున్నాను. నిజానికి మూడేండ్ల క్రితమే మేము విజన్ ని ప్లాన్ చేసుకున్నాము. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కు కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన మేరకు వారి సహకారం కూడా తీసుకుంటాము.
- పల్లా కొండల రావు.

News Clippings

25-7-2015 andhrajyothy

25-7-2015 eenadu

25-7-2015 sakshi

25-7-2015 manatelangana

25-7-2015 namaste telangana

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top