'పల్లె ప్రపంచం' లో కలాం పేరిట 'అద్యయన కేంద్రం' ఏర్పాటుకు నిర్ణయం!
సభలో ప్రసంగిస్తున్న పల్లా కొండల రావు.
సభలో ప్రసంగిస్తున్న వజ్రాల పరబ్రహ్మం
మండల కేంద్రమైన బోనకల్ లోని 'పల్లె ప్రపంచం ఫౌండేషన్' ఆధ్వర్యంలో దివంగత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సంస్మరణ సభలో మాట్లాడుతూ కలాం పేరిట ఫౌండేషన్ తరపున అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లుగా చైర్మన్ పల్లా కొండల రావు తెలిపారు. అధ్యయన కేంద్రం తరపున యువతకు 'లైఫ్ మేనేజ్ మెంట్' శిక్షణా కార్యక్రమాన్ని, అత్యాచారాలు, లైంగిక వేదింపులు, అసమానతలు, వివక్షతలను ఎదుర్కునేందుకు మహిళలలో చైతన్యం కోసం శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. కలాం ఆధ్యాత్మికత వంటివి తప్ప మిగతా స్పూర్తిదాయకమైన అంశాలను ముందుకు తీసుకుపోతామన్నారు. మండల కేంద్రంలో వారానికో అంశంపై 'సెమినార్' నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అబ్దుల కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15 నాటికి 'వీక్లీ సెమినార్' పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశ్రాంత తెలుగు ఉపాద్యాయులు వజ్రాల పరబ్రహ్మం ప్రసంగిస్తూ కలాం మన రాష్ట్రపతులలో భిన్నమైన వ్యక్తి అని , సామాన్య ప్రజలను సైతం కలాం బాగా ప్రభావితం చేశారన్నారు. ఏ ఇతర భారత ప్రెసిడెంట్ చేయని విధంగా కలాం విద్యార్ధులను, యువతను ప్రభావితం చేశారన్నారు. పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సి.పి.ఎం నాయకుడు రామన అప్పారావు, ఫౌండేషన్ సభ్యులు కొండేటి అప్పారావు, చలమల అజెయ్ కుమార్, టి.ఆర్.ఎస్ జిల్లా నాయకుడు మండెపుడి శ్రీనివాస రావు తదితరులు ప్రసంగించారు. సభ అనంతరం కలాం జీవిత విశేషాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.

న్యూసి క్లిప్పింగ్స్
నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top