మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------


అశ్లీల సైట్ లను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా రద్దు చేసింది. ‘అనైతికం... అసభ్యం.. అందుకే అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తున్నాం’ అని కేంద్ర ప్రభుత్వం తెలిపిందంటూ వార్త వచ్చిన ఆంధ్రజ్యోతిలోనే పిల్లలు బూతు సినిమాలు చూస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తూ ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్‍వర్మ ఓ వ్యాసం వ్రాశారు. 

‘అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం స్వేచ్ఛకు వ్యతిరేకం. అది ఆచరణ సాధ్యంకూడా కాదు. దీనిని అమలు చేయలేరు. రాజకీయంగా కూడా సరైన నిర్ణయం కాదు. ప్రజల వ్యక్తిగత జీవితాలను నియంత్రించవద్దు’’ అని చేతన్‌ భగత్‌ పేర్కొన్నారు. పోర్న్‌ సైట్లపై నిషేధం ద్వారా భారత్‌ను తాలిబనీకరించే దిశగా అడుగు వేశారని కేంద్ర ఐటీ మాజీ సహాయమంత్రి మురళీ దేవ్‌రా విమర్శించారు. 

ఈ వివాదం నేపథ్యంలో టెలికం శాఖ వర్గాలు ‘ఇదంతా తాత్కాలికమే’ అని తెలిపాయి. ‘‘2013 నుంచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఐఎస్పీల కు సూచన మాత్రమే ఇచ్చాం. చైల్డ్‌ పోర్న్‌పై చర్య లు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఇందులో భాగంగానే చర్యలు చేపట్టాం’’ అని వివరించాయి. 

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2008లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం వెబ్‌సైట్లను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. అయితే... ఈ అంశానికి సంబంధించి సర్కారు స్పష్టమైన విధి విధానాలు అనుసరించడంలేదని సెంటర్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ(సీఐఎస్‌) ఆక్షేపిస్తోంది. ఏకంగా 857 యూఆర్‌ఎల్‌లను నిషేధించాలని ఆదేశించడం ఇదే మొదటిసారి అని సీఐఎస్‌ పాలసీ డైరెక్టర్‌ ప్రాణేశ్‌ ప్రకాశ్‌ తెలిపారు. 

అశ్లీలత అంటే నిర్వచనమెలా చెప్పాలి? నిషేధానికి ప్రభుత్వానికు ఉన్న హక్కులేమిటి? మనిషి మనసుపై, ఆచరణపై అశ్లీలత ప్రభావం ఎలా ఉంటుంది? అశ్లీలతను ఎలా నియంత్రణలో ఉంచాలి? లైంగిక పరమైన అంశాలలో మనిషికి ప్రక్రుతి నేర్పేదేమిటి? సమాజం నేర్పాల్సిందేమిటి? లైంగిక జ్ఞానాన్ని కట్టుబాట్లు - నియంత్రణ ల మధ్య నేర్పడానికి, వ్యక్తి స్వేచ్చకు మధ్య సమన్వయం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు పంచుకోవాలని విజ్ఞప్తి.
-------------------
Reactions:

Post a Comment

 1. భారతీయ చట్టాల ప్రకారం అశ్లీల CDలు అమ్మడం నేరమే. కానీ అది చూడడం మాత్రం నేరం కాదు. అశ్లీల CDలు అమ్మేవాణ్ణి అరెస్త్ చెయ్యగలరు కానీ అవి చూసేవాళ్ళని మాత్రం అరెస్త్ చెయ్యలేరు. Internet pornography పూర్తిగా చట్ట వ్యతిరేకం. అశ్లీల CDలు అమ్మేవాడు ఓ పది మందికి అవి అమ్మగలడు కానీ internetలో అశ్లీలత పెడితే లక్షల మంది అది చూస్తారు. కనుక internet pornographyని చట్టం అనుమతించదు.

  సెక్స్ అనేది నాలుగు గోడల మధ్య జరగాలి కానీ ఆన్లైన్‌లో నాలుగు లక్షల మంది చూసేలా కాదు. కనుక నేను internet pornographyని వ్యతిరేకిస్తాను.

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయానికి ధన్యవాదములు. నిషేధం సాధ్యమా?

   Delete
  2. అది చట్టాల సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మన దేశంలో ఏమిటంటే, షాప్‌లో అశ్లీల CDలు పెట్టి పది మందికి అమ్మేవానికీ, హోల్‌సేల్ వ్యాపారం చేసి పది షాప్‌లకి వంద అశ్లీల CDలు సప్లై చేసేవానికీ ఒకే శిక్షపడుతుంది. చట్టాలు కఠినంగా లేనప్పుడు ఎక్కువ మంది భయపడరు కదా.

   Delete
  3. చట్టాల వల్ల ఉపయోగం ఉంటుందా? అసలు ఎందుకు పోర్న్ వీడియోలు చూడాలని అనిపిస్తుంది. ఆ మూలాలను ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో తప్ప నిషేధాలవల్ల అంతగా ఫలితం రాకపోవచ్చు. పర్యవేక్షణ పెంచడం, సెక్స్ ఎడ్యుకేషన్ పెంచడం, సినిమాలలో విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసేలా సెన్సార్ బోర్డుని మకిల రాజకీయాలు లేకుండా ఉంచగలగడం వంటివి చేయాల్సి ఉంది. సెక్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దానిని అవసరానికి మించిన రహస్యంగా, దానిని చర్చించడమే నేరంగా ఉంచే నిశ్సబ్ధాన్ని చేధించాలి. సెక్స్ అనేది ఓ ఈగో సింబల్ గా ఉండకూడదు. ఆహారం , నీరు లాంటి సాధారణ అవసరం అది. అవసరానికి మించిన గోప్యత పాటించేలా ఉండడం తగ్గిస్తే పోర్న్ దృశ్యాలను చూడాలనే అవసరం రాదు.

   Delete
  4. చట్టాల వల్ల బాల్య వివాహాలు పోలేదని బాల్య వివాహాల్ని సమర్థించగలమా? వ్యక్తిస్వేచ్ఛ పేరు చెప్పి కూడా బాల్య వివాహాల్ని సమర్థించలేము. ఇద్దరు మైనర్లు తమ ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకుంటే అది child abuse అవ్వదు. వాళ్ళ పెళ్ళి పెద్దలు చేస్తేనే అది child abuse అనుకోవడానికి అవుతుంది. అయినా మైనర్లు తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవడం కూడా నేరమే.

   పెళ్ళికి ముందు సెక్స్ చట్ట ప్రకారం నేరం కాదు. అయినా పెళ్ళికి ముందు సెక్స్ చేసిన స్త్రీని చెడిపోయిందని ఎందుకు అనుకుంటున్నారు? చట్టాలని కూడా తమ అనుకూల భాష్యానికే ఉపయోగించుకుంటున్నారు.

   Delete
 2. ఏదైనా సరే అణిచివేతకి గురైతే మరింతగా పెరుగుతుంది అన్న రాం గోపాల్ వర్మ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.సినిమాల్లో అసభ్య చిత్రాలను ఏం చేస్తారు ?

  ReplyDelete
  Replies
  1. ఏం చేయాలనుకుంటున్నారు?

   Delete
  2. పోర్న్ ఎవరు చూస్తారండీ ? తెలియనివాళ్ళు తెలుసుకోవాలని చూస్తారు.తెలియని విషయాన్ని తెలుసుకోవాలి కదా ? సినిమాల్లో అసభ్యతని చూపించవద్దని అనలేరు కదా ? అశ్లీలాన్ని చూపించేదే ఆడవాళ్ళు,ఆడవాళ్ళని కంట్రోల్ చేయలేని మగవాళ్ళు ఉన్నంతవరకూ అశ్లీలం ఉండాల్సిందే !ఎక్కడ తప్పు జరుగుతుందో ఆడవాళ్ళకి బాగా తెలుసు,ఆడవాళ్ళకి ఏమి కావాలో తెలిసుకున్న రోజున పూనం పాండేలు నడివీధిలో చాలెంజ్ లు చేయలేరు.ముందు ఆడవాళ్ళని కంట్రోల్ చెయ్యండి ఆ తరువాత అశ్లీల చిత్రాలు వాటంతట అవే పోతాయి.

   Delete
  3. ఇరవై ఏళ్ళ క్రితం మాట, అప్పట్లో youtube లేదు, పత్రికల్లో బూతు బొమ్మలు చూసుకునేవాళ్ళు. Modellingలో అవకాశం ఇస్తామని చెప్పి పరువుగల కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకి బూతు photos తీసేవాళ్ళు. వాళ్ళకి modelling అవకాశం ఇవ్వకుండా, ఆ photos గోడల మీద అంటిస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. డబ్బులు వస్తాయనుకుంటే పరువు అవసరం లేదు కానీ డబ్బులు రానప్పుడు మాత్రం పరువు అవసరం అనుకునే భావజాలం వాళ్ళది. ఇలాంటి భావజాలం ఉంటే బూతు సంస్కృతి ఉండదా?

   Delete
 3. ఇక్కడ నేను వేలు పెడితే కొరికేసిన వాళ్ళే ఉన్నారు!
  అయినా దురద కొద్దీ వేలు పెడుతున్నా,నాకిదో పిచ్చి!

  వాత్స్యాయనుడు స్రీలు కొంచెం లేటుగా ఇగ్నైట్ అవుతారు గాబట్టి ఆమెని కొంచెం సిగ్గు వొదిలేలా చెయ్యడానికి ఇటువంటి చిత్రాలని చూపించి మెల్లమెల్లగా వేడెక్కించమన్నాడు - అప్పట్లో యూట్యూబు లేదు మరి!

  అతను ధర్మబధ్ధమయిన శృంగారమే శ్రేష్టమైనది అని ప్రతిపాదించాడు!అంటే ధర్మబధ్ధంగా ఓకటైన భార్యాభర్తలు!వాళ్ళిద్దరి మధ్యనా అంగీకారం కుదిరితే యేదైనా తప్పు కాదన్నాడు.

  నిజానికి మనవాళ్ళు ధర్మ,అర్ధ,కామ,మోక్షాల్లో దేన్నీ విడిగా చూడలేదని నా నమ్మకం!గీతలో "ధర్మావిరుధ్ధ కామాన్ని నేను" అన్నాడు.చానక్యుడు అర్ధాన్న్న్ని కూడా ధర్మబధ్ధంగానే సాధించమన్నాడు.

  నీహారిక చెప్పిందీ పాయింటే! సన్నీ లియోన్ సంగతేంటి?

  స్వస్తి!

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by a blog administrator.

   Delete
 4. ఇందులో రకరకాల పార్శ్వాలున్నాయి. అందులో వ్యక్తి స్వేఛ్ఛ అన్నది ఒక పార్శ్వం మాత్రమే.

  18 సంవత్సరాలు నిండిన వారికి చూడాలనుకునే స్వేఛ్ఛ వుంటుంది.
  18 వయసు లోని వారి ఏకాగ్రత చెడుతుంది. తద్వారా దేశ భవిత నాశనమవుతుంది.
  చూడ్డం వల్ల కోరికలు వెంటిలేట్ అవుతాయి. తద్వారా రేప్‌లు తగ్గుతాయి.
  చూడ్డం వల్ల కోరికలు పెరుగుతాయి. కొత్తదనం కావాలనుకునే సాడిజం పెరుగుతుంది.

  సమాచార స్వేఛ్ఛ గురించి చాటిచెప్పే గూగుల్ వాడే పోర్న్ వీడియోలు ప్రదర్శించడు. ఏమాత్రం అడల్ట్ కాంటెంట్ ఉన్నా లాగిన్ కమ్మని చెప్పి వయస్సు రూఢి చేసుకుంటాడు. ఒక ప్రైవేట్ కంపెనీ అంత బాధ్యతతో వ్యవహరిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంకెంత బాధ్యతగా వుండాలి?

  ఇల్లు తగలబడుతుంటే కొందరు చలి కాచుకోగలిగినంత మాత్రాన అలా తగలబడ్డం మంచి అని చెప్పలేం. అలా అని దేన్నైనా నియంతృత్వ పద్ధతుల్లో బ్యాన్ చేసినంత మాత్రాన అది ఇంకో రకంగా వెఱ్ఱితలలు వేయదనీ చెప్పలేం. కాబట్టి పై విషయాలన్నీ దృష్టిలో వుంచుకుని, ఒక నిపుణుల కమిటీ ఏర్పరచి, తర్క బద్ధమైన నియంత్రణా విధానాన్ని ఏర్పాటు చేసి, దాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద వుంది.

  ReplyDelete
  Replies
  1. వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు వ్రాయడం అన్ని వేళలా జరగదు. కౌటుంబిక వ్యభిచారం (incest) కూడా వ్యక్తి స్వేచ్ఛ కిందకే వస్తుంది కానీ దాన్ని సమర్థించలేము.

   Delete
 5. అశ్లీల వెబ్‌సైత్‌లు చూసే మగవాళ్ళు ఎవరూ వాళ్ళ అమ్మ గానీ అక్క గానీ అశ్లీల వీదియోలో నటిస్తే హర్షించలేరు. కానీ వాళ్ళ కుటుంబానికి చెందిన స్త్రీలు కట్టుబాట్ల మధ్య పెరిగి ఉంటారు కనుక వాళ్ళు అశ్లీల వీదియోల్లో నటించరు అనే నమ్మకం ఆ మగవాళ్ళకి ఉంటుంది. అందుకే వాళ్ళు ఇంత ధైర్యంగా అశ్లీల వెబ్‌సైత్‌లని సమర్థిస్తున్నారు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top