మీరూ వార్తా వ్యాఖ్య లో పాల్గొనదలచుకుంటే వివరాలకు ఇక్కడ నొక్కండి
------------------------------------------------------------------------------
  • దారి తప్పుతున్న రిజర్వేషన్లు
  • అవి రాజకీయ ఆయుధమయ్యాయి
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు


హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వివక్ష, అణిచివేతకు గురైన వర్గాలను మిగతా సమాజంతో కలిపేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్లు దారితప్పుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. నేడు రిజర్వేషన్లు ఒక రాజకీయ ఆయుధంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి భారత రాజకీయ వ్యవస్థలోకి కుల, మత, ప్రాంతీయ, భాషా రాజకీయాలు ప్రవేశించాయన్నారు.
  
మతపార్టీ ఎంఐఎంతో స్నేహం చేస్తున్న ప్రాంతీయ పార్టీ జాతీయవాద భారతీయ జనతాపార్టీని విమర్శించడం సరికాదని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ పార్టీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం పార్టీ రాష్ట్రకార్యాలయంలో జరిగిన రాఖీపౌర్ణమి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు కేవలం సంక్షేమాన్నే అమలు చేశాయని, ప్రధాని మోదీ సంక్షేమంతోపాటు సంరక్షణ, సామాజిక భద్రత కోసం అనేక బీమా పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సురక్ష బీమా యోజన పథకాలతో రక్షాబంధన్‌ను సురక్షాబంధన్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో 10వేల మంది మహిళలకు సొంత డబ్బులతో ప్రధాని బీమా యోజన పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కృష్ణానగర్‌ బస్తీ మహిళలకు ప్రధాని సురక్షా బీమా యోజన పాలసీలను అందించారు. హైదరాబాద్‌లో రక్షాబంధన్‌ వేడుకలకు ప్రతి సంవత్సరం హాజరవటం సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు. మరో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయన్నారు.

స్మార్ట్‌కార్డు ద్వారా విద్య, వైద్యం, ఉపాధి తదితర సౌకర్యాలను త్వరలోనే కల్పించనున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మహిళామోర్చా నేతలు వెంకయ్య, దత్తాత్రేయ తదితరులకు రాఖీలు కట్టి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్‌, రాంచంద్రారెడ్డి, నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మహిళా మోర్చా నేతలు ఛాయాదేవి, ఉమారాణి, గీతారాణి, నిశితారెడ్డి, విజయలక్ష్మీ, సరళ తదితరులు పాల్గొన్నారు. ( ఆంధ్రజ్యోతి నుండి)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top