- మెదక్‌ జిల్లాలో బ్యాంకుల నిర్వాకం
-  ఏడాదిగా రాష్ట్రంలో 37 ఆత్మహత్యలు 
-  సిరిసిల్లలో అత్యధికంగా 33 మంది 
-  నేడు జాతీయ చేనేత దినోత్సవం 
- బివిఎన్‌ పద్మరాజు
       అప్పుకట్టని వారి ఇళ్లు, వాకిళ్లు, వాహనాలను జప్తుచేసిన బ్యాంకుల్ని చూసాం. గుమ్మానికున్న తలుపుల్ని, ఇంట్లోని సామాన్లనీ బయటకు విసిరేసిన ఘటనల గురించీ విన్నాం. కానీ ఇప్పుడు మెదక్‌ జిల్లాలోని కొన్ని బ్యాంకులు రుణాన్ని తీర్చలేదనే కారణంతో కొందరు చేనేత కార్మికుల పెన్షన్లనే ఆపేశాయి. దీంతో వృద్ధులైన వీరికి ప్రభుత్వం ఇస్తోన్న ఆసరా పెన్షన్లు అందకుండా పోతున్నాయి. జిల్లాలోని దుబ్బాక పట్టణానికి చెందిన రాయిని చంద్రయ్య, మెట్టు తుకారాం, బల్లా మాణిక్యం, గాజుల రాజేశం, గోరిట పాండరి అనే చేనేత కార్మికులకు పెన్షన్‌ ఇవ్వకుండా ఆపేశారు. పైగా అప్పు తీర్చేంతవరకు పెన్షన్‌ను మినహాయించుకోవాలంటూ రాతపూర్వకంగా రాసివ్వండి... అంటూ బ్యాంకులు హుంకరిస్తున్నాయి. చేనేత కార్మిక సంఘం నాయకులు ఇటీవల దుబ్బాకలో పర్యటించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
              కేంద్ర ప్రభుత్వం ప్రతియేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని చేనేతల స్థితిగతులను పరిశీలిస్తే వారి దుస్థితి ఏ రకంగా ఉందో విదితమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోను, ఆ తర్వాత ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణాలోనూ చేనేతల బతుకులు ఏ మాత్రమూ మారలేదని తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక...ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు చేనేత, మరమగ్గాల కార్మికులు కలిపి 37 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 33 మంది కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందినవారే కావటం గమనార్హం. దీంతోపాటు గతేడాది వరకు కొనసాగించిన ఐసిఐసిఐ లాంబార్డు స్కీమ్‌ (చేనేతల ఆరోగ్య పథకం)ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. ఇప్పటికీ ఏ ఒక్క చేనేత కార్మికుడికీ గుర్తింపు కార్డులు జారీ చేయలేదు. ఆప్కోను రెండుగా విభజించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఛైర్మన్‌ను, పాలకవర్గాన్ని నియమించలేదు. దీంతో సహకార సంఘాల నుండి ఎన్నికైన డైరెక్టర్లు ఉన్నప్పటికీ వారు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేకపోతున్నారు. 
పత్తాలేని 'వస్త్రనగరి'
      ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్‌లో ఖాయిలాపడిన ఆజాంషాహీ వస్త్ర పరిశ్రమను తిరిగి తెరిపిస్తామంటూ హామీనిచ్చారు. ఇది జరిగి తొమ్మిది నెలలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పూలేదు. ఈ మిల్లును పునరుద్ధరించటం ద్వారా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు వలసలెళ్లిన ఐదు లక్షల మంది చేనేత కార్మికులను తిరిగి తెలంగాణకు రప్పిస్తామంటూ సిఎం చెప్పారు. ఆయన వాగ్దానం గురించి పక్కనబెడితే...ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నేతన్నల ఉపాధి భద్రత, రక్షణకు అవసరమైన చర్యలేవీ తీసుకోలేదు. ఫలితంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వరంగల్‌ను 'వస్త్రనగరి'గా మారుస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. ఈ అంశంపై అధ్యయనం కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీ ముంబయి, చెన్నై, సూరత్‌ల్లో పర్యటించింది. ఆ తర్వాత కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించినప్పటికీ వస్త్రనగరి ఏర్పాటుపై ఒక్క అడుగూ ముందుకు పడులేదు. 
ఆప్కోకు రూ.81 కోట్లు బకాయి
       ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలకు వస్త్రాలను సరఫరా చేసినందుకుగాను అప్పటి ప్రభుత్వం ఆప్కోకు రూ.179 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పుల పంపకాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా రూ.81 కోట్లు అప్పుకు చెల్లించాల్సి ఉంది. ఆప్కో విభజన జరిగినప్పటికీ టిఆర్‌ఎస్‌ సర్కారు బకాయిలు చెల్లించకపోవటంతో కిందిస్థాయిలోని చేనేత సహకార సంఘాలకు ఆప్కో చెల్లింపులు జరపలేదు. ఫలితంగా మజూరి (కూలి చెల్లింపులు) లేక చేనేత కార్మికులు విలవిల్లాడుతున్నారు. మరోవైపు ఆప్కో నుండి డబ్బులు రాకపోవటంతో గతంలో తీసుకున్న రుణాలు చెల్లించలేక, వడ్డీలు పెరిగిపోయి సహకార సంఘా లు దివాళా తీశాయి.
మగ్గాల సంఖ్యను పెంచాలి 
     ''రాష్ట్రంలో చేనేత మగ్గాల సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉంది. దీనివల్ల కార్మికులకు ఎక్కువ రోజులు పని దొరుకుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. వరంగల్‌లో నిర్మించతలపెట్టిన వస్త్రనగరి కోసం అక్కడున్న 2 వేల ఎకరాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆప్కోకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది'' 
- గడ్డం జగన్నాథం, ఆప్కో డైరెక్టర్‌
        కేటాయింపుల్లేవు, ఖర్చూ లేదు''తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి ఎలాంటి నిధులూ కేటాయించలేదు. అందువల్ల ఆ రంగానికి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. చేనేతరంగాన్ని అభివృద్ధి చేయాలన్న దృష్టికోణం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయం. చేనేతను ప్రోత్సహించేందుకు ఆ రంగంలో ప్రభుత్వం తన పెట్టుబడులను పెంచాలి. కనీసం రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరపాలి. నేత కార్మికులకు అవసరమైన రుణాలను పావలావడ్డీకే బ్యాంకుల ద్వారా అందించాలి. చేనేత కోసమే ఒక ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది''
- డాక్టర్‌ డి.నర్సింహారెడ్డి, చేనేత నిపుణులు 
దినోత్సవాలు ఓకే...కానీ విధానమేది?
          ''ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ దినోత్సవాల వరకే పరిమితమైతే సరిపోదు. అటు కేంద్రంగాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగానీ చేనేత సంక్షేమం, అభివృద్ధి, వృత్తిర క్షణకు అవసరమైన సమగ్ర విధానాన్ని ప్రకటించాలి. ఉత్పత్తి చేసిన వస్త్రాల కు మార్కెట్‌ సౌకర్యాలు కల్పించాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా నేతన్నలకు శిక్షణనిప్పించాలి'' 
- కూరపాటి రమేష్‌, ప్రధాన కార్యదర్శి, చేనేత కార్మిక సంఘం
Reactions:

Post a Comment

  1. "నేత" ల రాతల్ని , కోతల్ని నమ్మడం వదిలి బెట్టి "చేనేత" చేతల్ని నమ్ముకున్నప్పుడు

    జిలేబి

    ReplyDelete
  2. ఆ ఋణాలు ఇప్పించినవాళ్ళదే తప్పు కానీ ఇచ్చినవాళ్ళది కాదు కదా. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఉద్యోగి జీతం నెలకి యాభై వేలు. కమ్యూతర్లూ, సి.సి.కెమెరాలూ, లాకర్లూ, గన్‌మెన్ ఖర్చు గురించి నేను ఇక్కడ చర్చించను. ఋణాలు రికవర్ అవ్వకపోతే బ్యాంకులు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగుల్నే తగ్గించేస్తాయ్ . మా అమ్మగారు కూడా బ్యాంక్ ఉద్యోగే కనుక ఈ ప్రభుత్వ పథకాలంటే నాకు భయం.

    పేదరికం దుర్భరమే కానీ అప్పు ప్రమాదకరం. అందు వల్ల కూడా పేదవాళ్ళకి ఋణాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తాను.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top