పల్లె ప్రపంచంలో 'ఇంటింటా గ్రంధాలయం' ప్రారంభం

గ్రామీణ ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పల్లెప్రపంచం సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండా అన్నారు. ఆదివారం పల్లెప్రపంచం ఫౌండేషన్ తరపున ఇంటింటా గ్రంధాలయం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన సభలో కొండా మాట్లాడుతూ ఇంటింటా గ్రంధాలయం పథకాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు-యువకులు వినియోగించుకోవడం ద్వారా చైతన్యం పొందవచ్చన్నారు. సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ ఒక ఏడాదిపాటు సంస్థలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబానికి రు.10వేల రూపాయలవరకు పుస్థకాలను కొనుగోలు చేయవచ్చన్నారు. వీరందరికీ BPP ద్వారా 100% నగదు తిరిగి లభించేలా పథకం రూపొందించామన్నారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, యోగా, ధ్యానం, ఆక్యుపంచర్, చరిత్ర, మార్క్సిజం వంటి అన్ని అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ఇంటిలో చిన్న పిల్లల చేతిలో సెల్‍ఫోన్‍కు బదులుగా పుస్తకాలు ఉండేలా చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు. ఇంటర్నెట్ వచ్చినా పుస్తకం విలువ పుస్తకానికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాయకమ్మ రచించిన ఇంగ్లీషు కీకారణ్యంలోకి ప్రవేశించండి పుస్తకాన్ని కుమారి రచ్చా సింధుజ ప్రారంభించారు. సంస్థ తరపున ఆన్‍లైన్‍లో వెబ్ పోర్టల్ 'ప్రజ' ను మాజీ ఎం.పి.పి కొమ్ము శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సభలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బి.అంజయ్య, సభ్యులు రచ్చ మధుసూదన్ రావు, చలమల అజయ్ కుమార్, లగడపాటి రామారావు, రామన అప్పారావు, బలగాని నాగరాజు,మండెపుడి శ్రీనివాస రావు, వనవాస రాఫు తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న బోనకల్ జెడ్.పి.టి.సి సభ్యుడు బాణోతు కొండా
ప్రజ పోర్టల్ ని ప్రారంభిస్తున్న బోనకల్ మాజీ ఎం.పి.పి కొమ్ము శ్రీనివాస రావు.

 ఇంటింటా గ్రంధాలయం పథకంలో ఇంగ్లీషు కీకారణ్యం లోకి ప్రవేశించండి బుక్ ని ప్రవేశపెడుతున్న చి. సింధు

ప్రసంగిస్తున్న పల్లా కొండల రావు.

ప్రసంగిస్తున్న బోయనపల్లి అంజయ్య

ప్రసంగిస్తున్న బలగాని బాలరాజు

ప్రసంగిస్తున్న చలమల అజెయ్ కుమార్

ప్రసంగిస్తున్న మండెపుడి శ్రీనివాస రావు


ప్రసంగిస్తున్న రామన అప్పారావు

ప్రసంగిస్తున్న రచ్చా మధుసూదన్ రావు.

ప్రసంగిస్తున్న వనవాస రావు.
న్యూస్ క్లిప్పింగ్స్


సూర్య పత్రిక

- పల్లా కొండల రావు
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి


Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top