మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------------
ప్ర : 76
అంశం : అధ్యయనం, వికాసం, విద్య
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు
------------------------------------------------

for original link of above image please click HERE

విజన్ ఆంధ్రా సైటులో ఈ వార్త చూసినప్పటి స్పందనతో ఈ ప్రశ్న ఉంచాలనిపించింది. నేను మా ఊళ్లో క్విజ్ నిర్వహించినప్పుడు నేతాజీ అని మన జాతీయ నేతలలో ఎవరికి పేరు? అని ప్రశ్నించినప్పుడు ఇంటర్ ఉత్తెర్ణురాలయిన ఓ విద్యార్ధిని గాంధీ అని సమాధానం చెప్పింది. అక్కడ అవుటర్స్‌తో సహా చాలామంది నవ్వారు. ఇది జరిగి చాలా సంవత్సరాలయినా అప్పటినుండి నా మదిలో పిల్లల చదువులు వారి జనరల్ నాలెడ్ ఎంత తక్కువ స్థాయిలో ఉంటోంది? దేశం గురించి కనీసం ఆలోచించే స్తితిలో విద్యార్ధులలో చైతన్యం పెరగకపోవడం పెంచకపోవడం తప్పు కదా? అనిపిస్తూనే ఉంది. కేవలం విద్యార్ధులే కాదు అనేకమంది ఉపాద్యాఉలు తమ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం లేదు. అయ్యవార్లలా ఉంటే పిల్లలెలా ఉంటారు? ఇలాంటి సంఘటనలు పునరావృత్తమవుతూనే ఉన్నాయి. ఈ వార్తలోని ఒక్క టీచరే కాదు కనీసం తెలుగు అక్షరాలు సరిగా వ్రాయని టీచర్లు అదీ తెలుగు పండితులు సైతం చాలామంది ఉన్నారు. ఉద్యోగాలు కేవలం బట్టీ పట్టి తెచ్చుకున్న జ్ఞానం ఆధారంగా ఇస్తున్న సర్టిఫికెట్లు వల్లనూ, ఉద్యోగ భద్రత ఇతర రాజకీయాల కారణంగానూ మన దేశంలో ఇవి సర్వసాధారణం అయ్యాయి. గతంతో పోలిస్తే ఉపాధ్యాయులకు - విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్ తగ్గుతోందా? విద్యా విధానంలో ఈ విషయమై రావలసిన మార్పులేమిటి? ఇలాంటి పరిస్తితులలో మార్పు రావాలంటే ఏమి చేయాలి? మీ అభిప్రాయం ఏమిటి?
*Re-published
Reactions:

Post a Comment

 1. వి.వి.గిరి ఇంటి పేరు అడిగితే చెప్పలేకపోవడం విచిత్రం కాదు కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరో తెలియకపోవడం మాత్రం విచిత్రమే.

  ReplyDelete
 2. ఒకప్పుడు సిధ్ధార్థ బసు దూరదర్శన్ ఛానెల్ (అప్పుడది ఒక్కటే మనకు) కోసం చేసిన ఒక క్విజ్ ప్రోగ్రాం మంచి ప్రశంశలు పొందింది. ఒకసారి ఆయన కొందరు అభ్యర్థుల జవాబులు అవాక్కయ్యేలా చేస్తున్నాయని వాపోతూ మాట్లాడారు ఆ ఛానెల్‌లో ఒకసారి. ఇందిరాగాంధీ తండ్రి యెవరని అడిగితే కొందరు IAS కోసం తయారవుతున్న యువకులతో సహా అనేకమంది మహాత్మాగాంధీ అని చెప్పారట. ఇది దశాబ్దాల క్రిందటి సంగతి. హారీ పోటర్ వేలపేజీలు చదవగలిగే పిల్లలకి తెలుగులో పది పేజీలైనా చదవాలంటే బోర్. నిన్నో మొన్నో ఒకావిడ, అర్జునుడికి పాశుపతాస్త్రం ఎవరిచ్చారంటే లైఫ్‌లైన్ అడిగింది - ఆర్షసంస్కృతికి సంబంధించి మన వాళ్ళల్లో పరిజ్ఞానం దారుణంగా ఉంటోంది. చాలామంది అటువంటి విషయాలు ఎన్నడు వినలేదు చదవలేదు అంటున్నారు. వాళ్ళుండేది మనమధ్యనే ఐనా. మార్కుల చదువులో మార్కులకు సంబంధించనిది ఏదైనా ట్రాష్ స్థాయిలోనే చూడబడి కొత్తరకం అజ్ఞానులని ఉత్పత్తి చేస్తోంది మన విద్యావ్యవస్థ.

  ReplyDelete
 3. వీధికొక స్కూల్ కట్టి, లైబ్రరీలు మాత్రం పట్టణానికి ఒకటో, రెండో కడితే మనవాళ్ళకి మార్కుల చదువులు తప్ప ఏమొస్తాయి?

  ReplyDelete
 4. ఈ ప్రశ్నలలో కొన్ని రోజూ వార్తా పత్రికలలో వస్తున్నాయి అవి చూడని వాళ్ళు ఉన్నంత కాలం ఇలాగే జరుగుతుంది!

  ReplyDelete
  Replies
  1. సమాజం గురించి ఏమాత్రం ఆలోచించనివాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా 5 రూ... పెట్టి వార్తా పత్రిక చదువుతారా?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top