స్టడీ సర్కిల్ నిర్వహణ విధానాన్ని వివరిస్తున్న పల్లా కొండల రావు.
బోనకల్ లో పల్లె ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ఆదివారం అధ్యయనం కోసం' అనే నినాదంతో స్టడీ సర్కిల్ ని ప్రారంభించారు. దీనిని పల్లా అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ ప్రతి ఆదివారం సాయంత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై అధ్యయనం నిర్వహిస్తామని తెలిపారు. పల్లె ప్రగతి , ప్రకృతి జీవన విధానం , పర్యావరణం, వివిధ వైద్య విధానాలు, వివిధ చట్టాలుపై చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన వారిని మాత్రమే స్టడీ సర్కిల్ కు అనుమతిస్తామని ఆయన తెలిపారు.

తదుపరి ఆదివారం 'సమాచార హక్కు చట్టం' అనే అంశంపై విశ్రాంత ఉపాధ్యాయుడు వజ్రాల పరబ్రహ్మం ప్రసంగించనున్నట్లు తెలిపారు. గతంలో ఇంటింటా గ్రంధాలయం, కోటిమొక్కల పెంపకం , యోగా కార్యక్రమాలను విజయవంతం చేసినట్లుగానే స్టడీ సర్కిల్ ని కూడా విజయవంతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలని కోరారు.

పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ కు కన్వీనర్ గా చలమల అజెయ్ కుమార్ , సహ కన్వీనర్ గా వజ్రాల పరబ్రహ్మం వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, బలగాని నాగరాజు, వేల్పుల రమేష్ , పల్లా అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ క్లిప్పింగ్స్study circle starting members group photo
V. Parabrahmam
Ch Ajay Kumar
B Anjaiah
B Naga Raju
Ramana Appa rao
Velpula Ramesh
Palla Aravind
- Palla Kondala Rao
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top