మీరూ వార్త - వ్యాఖ్య లో పాల్గొనదలచుకుంటే వివరాలకు ఇక్కడ నొక్కండి
-----------------------------------------------------------
పార్లమెంట్‌ ఆరెస్సెస్‌ శాఖ కాదు : రాహుల్‌ గాంధీ ఎద్దేవా


న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: పార్లమెంట్‌ను స్తంభింపజేయడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై శుక్రవారం రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌ను ఆరెస్సెస్‌ కార్యక్రమం(శాఖ) మాదిరిగా నడపరాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభు త్వం ప్రతిపక్షాన్ని పూర్తిగా పక్కన పెట్టజాలదని, చర్చలు జరగకుండా ఎలాంటి చర్యలూ అమలు చేయజాలదని చెప్పారు. పార్లమెంట్‌ అనేది చర్చా వేదికని, ప్రతిపక్షం గొంతు నొక్కేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రైతులు, భూ సేకరణ బిల్లు పేరుతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తింది. భూ సేకరణ బిల్లుపై కేంద్రాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా వివాదాస్పద భూ ఒప్పందాలను గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువగా రైతుల భూములు సేకరించారన్నదే వాస్తవమని స్పష్టం చేసింది. హరియాణా, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గాంధీ కుటుంబానికి చెందిన బంధువుకు ఏ విధానంతో భూములు అమ్మేశాయో రాహుల్‌ చెప్పగలరా? అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ప్రశ్నించారు. ( ఆంధ్రజ్యోతి నుండి )
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top